‘మల్లన్న సాగర్’ను నిర్మించి తీరుతాం
‘మల్లన్న సాగర్’ను నిర్మించి తీరుతాం
Published Tue, Jul 26 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
ఆత్మకూరు(ఎం) : ఏది ఏమైనా మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందనే ఆశతో ప్రజలు రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని, దానిపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులు పారి పోయినట్లు చెప్పారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో భువనగిరి డివిజన్ సస్యశ్యామలం కానుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కాంబోజు భాగ్యశ్రీభానుప్రకాష్, టీఆర్‌ఎస్ మండల అద్యక్షుడు దూదిపాల రవీందర్‌రెడ్డి, ప్రదాన కార్యదర్శి గుర్రాల రవి, సర్పంచ్‌లు మల్లేల పర్వతాలు, గుండు పెంటయ్య గౌడ్, నాయకులు కాంబోజు భాను, ఏనుగు అంజిరెడ్డి, మేడి రామనర్సయ్య, కోరె భిక్షపతి, కర్రె అయిలయ్య, కోరె వెంకన్న, చిక్కిరి రవి ఉన్నారు.
Advertisement
Advertisement