Turkapalli
-
Artist Vijaya Lakshmi: సంకల్పానికి చిత్రరూపం
ఆమె చిత్రలేఖనంలో మనకు కనిపించేది ఒక రూపం కాదు... అనేకం. బుద్ధుడి బొమ్మలో కేవలం బుద్ధుడు మాత్రమే కాదు... బ్రష్ పట్టుకుని... తదేక దీక్షతో బుద్ధుడి బొమ్మ వేస్తున్న ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంటుంది. రవివర్మ కుంచెకు అందిన అందం... విజయలక్ష్మి చిత్రాల్లో ద్యోతకమవుతుంది. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా, శామిర్ పేట మండలంలో ఉంది తుర్కపల్లి. ఆ ఊరిలో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చిత్రలేఖనంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. కళారత్న, అబ్దుల్ కలామ్ అవార్డులతోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు, ప్రశంసలు ఆమె సొంతమయ్యాయి. తన రంగుల ప్రస్థానాన్ని, ఒక చిత్రంలో లెక్కకు మించిన వివరాలను పొందుపరచడంలో తన అభిరుచిని, బొమ్మల పట్ల తన ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారు విజయలక్ష్మి. అసాధారణమైన ప్రతిభ ‘‘నా జీవితంలో బొమ్మలు ఎప్పుడు ప్రవేశించాయో స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నా దృష్టిని ఆకర్షించిన దృశ్యాలకు చిత్రరూపం ఇవ్వడం నా బాల్యంలోనే మొదలైంది. నన్ను స్కూల్‌కి మా అన్న తీసుకు వెళ్లి, తీసుకువచ్చేవాడు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పుస్తకాలే నా లోకం. అందులోని బొమ్మలే నా స్నేహితులు. అందరి పిల్లల్లా ఆడుకోవడం నాకు కుదరదు కదా. అందుకే చదువుకుంటూ, బొమ్మలేసుకుంటూ పెరిగాను. టెన్త్‌క్లాస్ తర్వాత కాలేజ్కెళ్లడం కష్టమైంది. కొన్నేళ్ల విరామంలో సైకాలజీ, ప్రముఖుల బయోగ్రఫీలు, భగవద్గీత... అదీ ఇదీ అనే తేడా లేకుండా నాకు దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేశాను. చదివేకొద్దీ నా ఆలోచన పరిధి విస్తృతం కాసాగింది. నా గురించి నేను ఆలోచించడమూ ఎక్కువైంది. ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యాలను సాధించినప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రత్యేకతలతోనే గుర్తిస్తారు. ఇతర లోపాలున్నా సరే అవి తొలుత గుర్తుకురావు. నాకు ఎడమ చెయ్యి మాత్రమే మామూలుగా పని చేస్తుంది. రెండు కాళ్లు, కుడి చెయ్యి చిన్నప్పుడే పోలియో భూతం బారిన పడ్డాయి. నా పేరు విన్న వెంటనే కాన్వాస్ మీద అద్భుతాలు సృష్టించగలిగిన ఒక చిత్రకారిణి గుర్తుకురావాలి. సమాజం ఒక సాధారణ వ్యక్తిని సాధారణంగానే గుర్తిస్తుంది. ఒక నైపుణ్యమో, వైకల్యమో ఉన్నప్పుడు వ్యక్తిగా గుర్తించడానికంటే ముందు నైపుణ్యం, వైకల్యాలతోనే పరిగణనలోకి తీసుకుంటుంది. పోలియో బాధితురాలిగా ఐడెంటిఫై కావడం కంటే విజయలక్ష్మి అంటే చిత్రలేఖనం గుర్తుకు వచ్చేటంతగా రాణించాలనుకున్నాను. అందుకోసమే అహర్నిశలూ శ్రమించాను. నేను చూసిన దృశ్యాల నుంచి నా బొమ్మల పరిధిని విస్తరించాను. నేను చదివిన పుస్తకాల నుంచి ఇతివృత్తాలను రూపుదిద్దుకున్నాను. అన్నింటికీ మించి రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందాను. రవీంద్రభారతిలో పురస్కారాలు చిత్రకారిణిగా గుర్తింపు రావడమే కాదు, పురస్కారాలను రవీంద్రభారతిలో అందుకోగలిగాను. రవీంద్రభారతిలో అందుకోవడం కూడా ఒక పురస్కారంగానే భావిస్తాను. 2019లో నా చిత్రాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది. అలాగే హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, సాలార్జంగ్ మ్యూజియంతోపాటు ఢిల్లీలోనూ ప్రదర్శితమయ్యాయి. మనలో ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, సంకల్పబలం ఉంటే భగవంతుడు అవకాశం ఇచ్చి తీరుతాడని నమ్ముతాను. ఓ సంస్థ నా అవసరాన్ని గుర్తించి డెబ్బై వేల విలువ చేసే ఎలక్ట్రానిక్ వీల్‌చైర్ విరాళంగా ఇచ్చింది. అది కూడా భగవంతుడు పంపినట్లే. స్ఫూర్తిప్రదాతగా... నేను రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందితే, నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్న కొత్తతరం ఉండడం నాకు సంతోషంగా ఉంది. నేను చదువుకున్న స్కూల్లో నా బొమ్మలను ప్రదర్శించినప్పుడు నాకా సంగతి తెలిసింది. జీవితాన్ని నిస్సారంగా గడిపేయకూడదు, స్ఫూర్తిమంతంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్ మీడియాను నూటికి నూరుశాతం వినియోగించుకున్నాననే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగానే ఇన్‌ఫ్లూయెన్సర్‌ని కాగలిగాను. తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తం కోసం ఏడాదికి మూడుసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాను. మా ఊరి కుర్రాళ్లు ‘ఏం చేయాలో చెప్పక్కా, మేము చేసి పెడతాం’ అని ఉత్సాహంగా సహాయం చేస్తున్నారు. ‘వీల్‌చైర్ నుంచి నేను ఇన్ని చేస్తుంటే హాయిగా నడవగలిగిన వాళ్లు ఎందుకు చేయలేరు. స్థిరచిత్తం ఉంటే ఏదైనా సాధ్యమే’నని వీడియోల్లో చెబుతుంటాను’’ అని సంతోషంగా తన బొమ్మలలోకాన్ని వివరించింది విజయలక్ష్మి. బుద్ధుడి వెనుక యువతి విజయలక్ష్మి చిత్రలేఖనంలో ఉన్న అమ్మాయి అచ్చమైన తెలుగుదనంతో ఒత్తైన జడ వేసుకుని ఉంటుంది. ఆ జడను అలంకరించి పూలు కూడా అచ్చం పూలను పోలినట్లే తెల్లటి పువ్వులో పసుపువర్ణంలో పువ్వు మధ్యభాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చెవి జుంకీలకున్న నగిషీలు కూడా. అలాగే మరో చిత్రలేఖనం ఇంకా అద్భుతం... మన దృష్టి అభయ ముద్రలో ఉన్న బుద్ధుడి మీద కేంద్రీకృతమవుతుంది. బుద్ధుని పాదాల వద్దనున్న కమలం మీద, బుద్ధుడి శిఖ, శిఖ వెనుకనున్న కాంతివలయాన్ని కూడా చూస్తాం. ఆ తర్వాత మన దృష్టికి వస్తుందో అద్భుతం. ఆ బుద్ధుడి బొమ్మ ఉన్నది కేవలం కాన్వాస్ మీద కాదు. ఒక యువతి వీపు మీద. అటువైపు తిరిగి కూర్చుని ఉన్న యువతిని చిత్రీకరించిన తర్వాత ఆమె వీపు మీద చూపరులకు అభిముఖంగా ఉన్న బుద్ధుడిని చిత్రించింది విజయలక్ష్మి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఈ సీఎం కేసీఆర్ మీ చేతిలో ఉన్నాడు
వాసాలమర్రిలో ప్రతి కుటుంబానికి అవసరమైన లాభం ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు నుంచి ఊరుమొత్తం నా కుటుంబం. ఇల్లు లేనోళ్లకు ఇల్లు కడదాం. ఆటోలు, డీసీఎంలు, ట్రాక్టర్లు ఇప్పిద్దాం. ప్రతి ఇంటికి ఒక పాడి పశువును ఇప్పిద్దాం. కమ్యూనిటీ హాల్ నిర్మిద్దాం. రోడ్డు వేసుకుందాం. జబ్బుపడిన వారికి హైదరాబాద్‌లో వైద్యం అందిద్దాం. రేషన్ కార్డులు ఇప్పిద్దాం. గ్రామ నిధిని ఏర్పాటు చేద్దాం. సీఎం మీ చేతిలో ఉన్నడు.. గ్రామం అభివృద్ధి చేయడానికి నేనున్న. సీఎం మీ చేతిలో ఉంటే ఇంకేం బాధ. రాష్ట్రాధినేత, ప్రభుత్వం మీ ఊరి పట్టున ఉంది. నిశ్చింతగా ఉండొచ్చు. అయితే గ్రామం ఐకమత్యం, పట్టుదలతో ఉండాలి. అవుననిపించుకోవాలి. చుట్టూ 10 గ్రామాలు వాసాలమర్రికి వచ్చి నేర్చుకోవాలి. ప్రేమతో మెలగాలి. అంతా దోస్తులు కావాలి. పిల్లలు మంచిగ చదువుకోవాలె. చదువుకునేందుకు ఎన్నో పథకాలు ఉన్నాయి. కొందరికి తెలియదు. స్తోమత లేక ఊళ్లో ఎవరూ చదువుకు దూరం కావద్దు. అలాంటి వాళ్లందరినీ చదివించాలి. సాక్షి, యాదాద్రి: ‘‘ఇక్కడ (వాసాలమర్రిలో) ఏదో ప్రత్యేకమైనది జరగాలి. మాటలతో కాదు. గొప్ప పట్టుదలతో జరగాలి. ఇవాళే దానికి పునాది రాయి పడాలి. జట్టుగట్టి.. పట్టుబట్టి ఊరిని బాగు చేసుకుందాం.. ఏడాదితిరిగే సరికి బి.వాసాలమర్రి అంటే బంగారు వాసాలమర్రి కావాలె..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్.. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తర్వాత నిర్వహించిన గ్రామసభలో ప్రసంగించారు. ‘అంతా అంతే బాగానే ఉంది కదా’ అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం.. ఊరిని బాగుచేసుకోవడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. అందరూ కలసికట్టుగా పట్టుదలతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఇంకో 20 మాట్ల వస్తా.. గ్రామాన్ని బంగారు వాసాలమర్రి చేద్దాం. అందరూ కలిసికట్టుగా పట్టుదలతో ఉంటరు గదా.. అందరిలో ప్రేమభావం రావాలి. ఒకరిని చూస్తే ఒకరికి ప్రేమ రావాలి. ముఖంలో చిరునవ్వులు రావాలి. ఊర్లో పోలీస్ కేసులు ఉండకూడదు. పక్కింటోడితో మంచిగా ఉండాలె. అంతా దోస్తులు కావాలె. గ్రామంలో నాకు ఈ రోజు నలుగురు పరిచయమైండ్రు. ఇంకో 20 మాట్ల వస్త. వచ్చినప్పుడు మీతో గింత దూరంలో ఉండి సభ నడువదు. దగ్గరగా కూర్చొని మాట్లాడుకుందాం. తినేటప్పుడు ఆగమ్మ, లక్ష్మి, సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ నవీన్ మాత్రమే పరిచయం అయ్యారు. మిగతా వారంతా దోస్తులు కావాలి. నేను వస్తున్నానని అన్ని చేసిండ్రు గ్రామానికి నేను వస్తున్నానని అధికారులు ఆగమేఘాల మీద ధనాధన్ అన్ని తయారు చేసిండ్రు. గ్రామంలో ట్రాక్టర్లు ఇవ్వాలంటే కేసీఆర్ వచ్చుడెందుకు? గివన్నెందుకు? అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చుడెందుకు? గిన్ని కార్లు వచ్చినయా? ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం జరగాలి. మీ అదృష్టం మంచిదని వేరే ఊర్ల వాళ్లు అంటున్నారు. మొదలుపెడితే వెనక్కి మర్రి చూడొద్దు కులమతాలకు అతీతంగా.. అందరికీ దండం పెట్టి చెప్తున్నా.. ఊరి అభివృద్ధి కోసం యజ్ఞంలాంటి పని పెట్టుకున్నం. ఇందులో కులం, మతం, ఆడ, మగ, రాజకీయ తేడా ఉండదు. అంతా ఊరు కోసం పనిచేయాలె. యశోద ఆస్పత్రివారు ఆరోగ్య శిబిరం పెట్టారు. జిల్లా కలెక్టర్ 270 మంది రైతులను అంకాపూర్‌కు తీసుకెళ్లి వచ్చారు. అక్కడ ఉన్నట్టే ఇక్కడా భూమి ఉంది. మనలాగే వడ్లు, కూరగాయలు పండిస్తరు. కానీ అక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ ఉంది. తప్పుచేస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లరు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులే ఫైన్ వేస్తరు. 45 ఏళ్లుగా అంకాపూర్‌కు పోలీస్ అధికారి రాలేదు. చిన్న సమస్య వచ్చినా అభివృద్ధి కమిటీనే చూసుకుంటది. గ్రామంలో మహిళలు, చదువుకున్న వారు భాగస్వాములు కావాలి. గట్టిగా ఆలోచించాలి. పట్టుబట్టి తప్పును తప్పని చెప్పాలి. గ్రామాభివృద్ధి కోసం కమిటీలు వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ను నియమిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని కులాల వారితో గ్రామాభివృద్ధి కమిటీ వేయా లని సూచించారు. ‘‘వారానికి రెండు గంటలు గ్రామంలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు శ్రమదాన కమిటీ, పరిశుభ్రత కమిటీ, తాగునీటి కమిటీ, హరితహారం, వ్యవసాయ కమిటీలు వేసి అంకాపూర్ మాదిరిగా వాసాలమర్రి పనిచేయాలి. ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులను కమిటీల్లో నియమించాలి. నా నియోజకవర్గంలో ఎర్రవల్లిని చూడండి. అక్కడ ఇళ్లు కూలగొట్టాం. కొత్త ఇళ్లు కట్టాం. 24 గంటలు మిషన్ భగీరథ నీళ్లు వస్తాయి. ఇక్కడ కూడా రెండు మూడు రోజుల్లో కమిటీలు వేసుకుని చెరువులు, చెక్‌డ్యాంలు, కాలువలు బాగు చేసుకుందాం. సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, మంత్రి అందరూ ఉంటరు. వందకు వందశాతం బంగారు తెలంగాణ చేద్దాం’’ అని చెప్పారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మండలి మాజీ చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, లింగయ్య, బొల్లం మల్లయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యమం నాటినుంచి చూస్తున్నా ఈ ఊరు మంచిగ లేదు. ఈ ఊరి మీదుగా చాలాసార్లు వెళ్లాను. బాగు చెయ్యొచ్చుగా అనుకున్నా. కొడకండ్ల రైతుబంధు భవనం ప్రారంభించి ఎర్రవల్లికి పోతుండగా ఊరిలో ఆగి కొందరితో మాట్లాడిన. ఎమ్మెల్యే గొంగిడి సునీత అప్పుడు అందుబాటులో లేదు. సర్పంచ్ అంజయ్య మరో 40మంది గ్రామస్తులు వచ్చి మాట్లాడారు. పట్టుబట్టి బాగు చేద్దాం అనుకున్నా. ఈలోపు కరోనా వచ్చింది. లాక్డౌన్ ఎత్తివేయగానే ఎమ్మెల్యే సునీతకు ఫోన్‌చేసి చెప్పిన. ఇప్పుడు మంచిగా కలుసుకున్నం. బాగు చేయించే బాధ్యత నాది వాసాలమర్రి బాగుపడితే చుట్టూ పది ఊర్లు నేర్చుకోవాలి. బాగు చేయించే బాధ్యత నాది. నెల రోజుల తర్వాత చెట్టు కింద, గుడికాడ కూర్చొని మాట్లాడుకుందాం. ఊర్లో మూడు దళితవాడలకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తా. గ్రామంలోని 1,500 మందికి చెందిన 3 వేల చేతులు కలిపితే ఊరి సమస్య బద్ధలై పోతుంది. వేలితో కొడితే దెబ్బతగలదు. పిడికిలి ఎత్తి సమష్టిగా గ్రామాభివృద్ధిని సాధిద్దాం. వ్యవసాయ, వృత్తిపనులు బాగు పడతాయి. మంచి పద్ధతిలో ముందుకుపోదాం. పెళ్లిళ్లు చేసే కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలి. మనోడు అనుకుంటే అన్నీ చేయవచ్చు. వాసాలమర్రి గ్రామస్తులతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్, కలెక్టర్లు -
యాదాద్రి జిల్లాలో మరో దారుణం
సాక్షి, వెంకటాపూర్: యాదాద్రి జిల్లాలో హాజీపూర్ ఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌లో ఒంటరి మహిళను దుండగులు పాశవికంగా హతమార్చారు. కర్రే అనురాధ అనే మహిళ స్థానికంగా బెల్టు షాప్ నిర్వహిస్తోంది. అర్థరాత్రి వేళ దుండగులు అనురాధ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హతమార్చారు. ఇంట్లోని నగలు, నగదు దోచుకు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ...ఆధారాలు సేకరిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
తుర్కపల్లి : రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయలైన సంఘటన తుర్కపల్లి మండలం రాంపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. తుర్కపల్లి మండలానికి చెందిన యేడవల్లి ప్రశాంత్, షేక్ షాదుల్లా, తుర్కపల్లి నుంచి భువగిరికి వైపు వెళ్తుండగా పల్లెపహాడ్‌కు చెందిన ఇంద్రపాల బాల్‌రాజు తుర్కపల్లి వైపు వస్తున్న క్రమంలో ఎదురెదురుగా వచ్చిన బైకులు ఢీకొన్నాయి. దీంతో ప్రశాంత్, బాల్‌రాజుకు తీవ్ర గాయాలుకాగా, షాదుల్లాకు స్వల్ప గాయాలైయ్యాయి. వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం భువగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
చండీయాగంతోనే విస్తారంగా వర్షాలు
తుర్కపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగంతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వ విప్ సునీత అన్నారు. శనివారం తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువులో గంగమ్మతల్లికి, కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 10ఏళ్ల నుంచి నిండని చెరువులు నేడ జలకళ సంతరించుకుందని అన్నారు. మిషన్ కాకతీయను ఎద్ధేవా చేసిన ప్రతిపక్షాలు నేడు నిండిన చెరువులను చూసి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని సుభిక్షం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న మహోన్నత నిర్ణయం వల్లే నేడు చెరువులు పకడ్బంధీగా జలకళ సంతరించుకుంటే రైతులు సంతోషాలు వెలుబుచ్చుతున్నారని అన్నారు. ప్రస్తుతం రైతులు వరినాట్లు వేయకుండా నవంబర్‌లో మెదలు పెడితే పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంటుందని, కంది, మొక్కజొన్న పంటల్లో నీళ్లు నిల్వకుండా రైతుల శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ పలుగుల ఉమారాణి, ఎంపీటీసీ తలారి శ్రీనివాన్, జూపల్లి లక్ష్మీ, కొండం రఘురాములు, మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, సర్పంచ్ అనుమూల వెంకట్‌రెడ్డి, నాయకులు కొమ్మిరిశెట్టి నర్సింహులు, అల్డా డైరెక్టర్ పొగుల ఆంజనేయులు, నాంసాని సత్యనారాయణ, కొమ్మిరిశెట్టి న ర్సింహులు, జక్కుల వెంకటేశం పాల్గొన్నారు. -
పథకాల అమల్లో నిర్లక్ష్యం వద్దు
తుర్కపల్లి : ప్రభుత్వ పథకాల అమల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ వహించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. తెలంగాణను అన్ని రంగాలల్లో అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేయాలనే ఉద్దేశంతోనే మిషన్ కాకతీయను ప్రభుత్వం చేపట్టినట్లు వివరించారు. నేడు కురుస్తున్న వర్షాలతో చెరువుల్లో జలకళ సంతరించిదన్నారు. నేడు ప్రాజెక్ట్‌లు, వాటర్ గ్రిడ్ వంటి పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే ప్రతిపక్షనాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. మిషన్ కాకతీయ పథకంలో తూములు బిగించకుండా పనులు నిర్వహించిన చెరువుల కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులకు సూచించారు. యాద్రాది జిల్లాలో పనిచేసే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. కొత్త అంగన్వాడీ కేంద్రాలతో పాటుగా ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్, జెడ్పీటీసీ బోరెడ్డి జ్యోతి, వైస్‌ఎంపీపీ పలుగుల ఉమారాణి, డీసీసీబీ డైరక్టర్ పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు తలారి శ్రీనివాస్, బద్దూ నాయక్, రాజయ్య, రఘురాములు, అరుణభాస్కర్, లక్ష్మీ, హరినాయక్, చైతన్యమహేందర్‌రెడ్డి, ప్రకాశ్, తహసీల్దార్ నాగలక్ష్మీ, ఎంపీడీఓ జలంధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ
తుర్కపల్లి (రామన్నపేట) : మండలంలోని సూరారం గ్రామపంచాయతీ ఆవాసగ్రామాల్లో రెండునెలల్లోగా ఇంటింటికీ మిషన్‌భగీరథ పథకం కింద కృష్ణాజలాలు అందిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం సూరారం పరిధిలోని బి.తుర్కపల్లి ప్రాథమికపాఠశాల విద్యార్థులకు అరుంధతీ మేధావుల సంఘంవారు సమకూర్చిన నోట్‌పుస్తకాలను పంపిణీచేసి మాట్లాడారు. ప్రభుత్వపాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు, స్వచ్ఛందసంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, ఎంపీటీసీ చల్లా వెంకట్‌రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ బొక్క పురుషోత్తంరెడ్డి, అరుంధతీ సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి నరహరి, కార్యదర్శి ఎన్.కృష్ణ, కోశాధికారి బి.చంద్రకాంత్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ బి.సుదర్శన్, జినుకల ప్రభాకర్, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
రైతులపై నయీం ముఠా జులుం
తుర్కపల్లి : నయీం అకృత్యాలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బడాబాబులనే బెదిరించి డబ్బుల వసూళ్లు, ఆక్రమణకు పాల్పడిన అతడి ముఠా పేద రైతులపై కూడా జులూం ప్రదర్శించినట్టు వెలుగులోకి వచ్చింది. ‘‘ మేం నయీం భాయ్ మనుషులం.. ఈ భూమిని రిజిస్ట్రేషన చేయించుకున్నాం.. మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్లి పోతారా.. లేకుంటే చస్తారా..? అంటూ బెదిరించారు. దీంతో తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న కన్నతల్లి లాంటి భూమిని వదిలి మిన్నకుండిపోయామని తుర్కపల్లి మండలం పరిధి పెద్దతండా గ్రామపంచాయతీ పరిధిలోని సుక్యతండాకు చెందిన భానోత్ వాల్య, భానోత్ రాములు, భానోత్ రవి వాపోయారు. నÄæూమ్ బాధితులు న్యాయం కోసం ఫిర్యాదు చేయమని సిట్ అధికారులు పిలుపునివ్వడంతో శనివారం వారు తుర్కపల్లి తహసీల్దార్‌తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంబంధిత ఫిర్యాదు పత్రాన్ని జిల్లా ఎస్పీకి అందించనున్నట్లు తెలిపారు. వివరాలు వారి మాటల్లోనే.. సుక్యతండాలోని 302 సర్వే నంబర్లో 11.12 గుంటల ఖుష్కి భూమిని మా తాత సోమ్లనాయక్ పల్లెపహాడ్‌కు చెందిన పిన్నోజు చంద్రయ్య వద్ద ఖరీదు చేసుకున్నాడు. 90 సంవత్సరాల నుంచి మా తాత వారుసులు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. అప్పట్లో అవగాహనలేక రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. సాదా దస్తావేజు మీద రాసుకుని భూమి కొనుగోలు చేశారు. నాటి నుంచి రికార్డులో మా తాత వారుసులమే కాస్తుగా ఉంటున్నాం. పది సంవత్సరాల క్రితం మాకు తెలియకుండా భూమికి సంబంధించిన (రికార్డులో) వారసులు పిన్నోజు ప్రేమ్‌రాజ్,పిన్నోజ్ సింహచారిలను తీసుకొని వెళ్లి 13–10–2006లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నయీమ్ అనుచరులమని చెప్పి భువనగిరికి చెందిన మహ్మద్ ఆరీఫ్, అబ్దుల్ నాసర్, మహ్మద్ మక్సూద్, మహ్మద్ యూనస్ మమ్ములను భయభ్రాంతులకు గురిచేసి మా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చే సుకున్న తరువాత వారంతా అదే రాజు అర్ధరాత్రి మా భూమి వద్దకు వచ్చి కడీలు నాటారు. మా పై దౌర్జన్యం చేసి భూమిని వదిలేస్తారా.. చస్తారా అంటూ బెదిరించారు. భూమిలోకి ప్రవేశిస్తే చంపుతామన్నారు. మా తాత గారి ఆస్తి వల్ల వారి వారసులుమైన 8 కుటుంబాలు జీవిస్తున్నాయి. పది సంవత్సరాల నుంచి న యీమ్ అనుచరులమని చెప్పి మా ఇళ్లపై దాడిచేసి భయానక వాతావరణం సృష్టించారు. ఈభూమిలోని బోరు, బావి, పొలం అన్ని విడిచి పెట్టి పోవాలని హెచ్చరికలు చేశారు. భూమి కోల్పోయిన తరువాత అప్పులు భారం పెరిగి పోయి 2014 సంవత్సరంలో మా చిన్నాన్న భానోత్ పడిత్యా ఉరేసుకుని చనిపోయాడు. మా భూమిని అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి మాకు పట్టదారు పాస్‌పుస్తకాలు అందించాలి. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మండల స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
తుర్కపల్లి : మండల స్థాయి క్రీడోత్సవాలను మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎంఈఓ శేషగిరిరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వచ్చే నెలలో డివిజన్ స్థాయి క్రీడలు ప్రారంభమవుతున్నాయని, ఆ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను రెండు రోజుల పాటు నిర్వహించి ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. -
హామీలను విస్మరించిన సీఎం
తుర్కపల్లి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రోజుకో రకం మాటలతో ఇటు రైతులను, ప్రజలను మభ్య పెడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. గురువారం తుర్కపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో అయన మాట్లాడారు. పార్లమెంట్లో అమలు చేసిన 2013 చట్టాన్ని కాదని, 123 జీఓ విడుదల చేయడంపై హైకోర్టు మొట్టికాయలే యడం ప్రభుత్వ భంగపాటు కాదా అని అన్నారు. రైతుల నుంచి భూసేకరణ ప్రజస్వామ్య పద్ధతిలో జరగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంధ్రనా«ద్గౌడ్, ధానవత్ శంకర్‌నాయక్, ఎంపీటీసీ సభ్యులు బద్దూనాయక్, రాజయ్య, నాయకులు ఎలగల రాజయ్య, గడ్డమీది సత్యనారాయణ, పత్తిపాటి హన్మంత్‌రావు, బోరెడ్డి హన్మంత్‌రెడ్డి, బోరెడ్డి మహిపాల్‌రెడ్డి, భూక్య రాజారాం పాల్గొన్నారు. -
మాదాపూర్‌లో ‘మిషన్ భగీరథ’ ట్రయల్‌రన్
తుర్కపల్లి : ఆలేరు నియోజకవర్గానికి తాగునీరు తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. గురువారం మండలంలోని మాదాపూర్‌లో వాటర్ గ్రిడ్ (మిషన్ భగీరథ) పథకం ద్వారా గోదావరి జలాల ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏ మహిళ మంచినీటి సమస్యతో రోడ్ల మీద బిందెలతో కనపడకూడదని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రారంభించార న్నారు. ఆ పథకం ద్వారా మొదటి ఫేజ్‌లోనే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. డిసెంబర్ వరకు ఈ వాటర్‌గ్రిడ్ పథకం పనులు పూర్తవుతాయని తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందన్నారు. -
టీఆర్ఎస్ది నిరంకుశ పాలన
తుర్కపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తూ రైతులపైన లాఠీచార్జి, కాల్పులు జరిపిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని మాజీమంత్రి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ నిర్వాసితులను పరామర్శించడానికి వెళ్లిన ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి నల్లగొండ జిల్లా తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. 4 గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 చట్టానికి మద్దతు తెలిపి పార్లమెంట్లో ఓటేసిన కేసీఆర్ నేడు 123 జీఓ పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. మల్లన్నసాగర్‌పై అసెంబ్లీ చర్చచకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కోరినా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 2013 చట్టం ప్రకారం రైతులను ఆదుకోవాల్సి ప్రభుత్వం.. వారి జీవితాలతో చలగాటమాడుతోందని ఆరోపించారు. రైతులకు న్యాయం చేస్తే వరకు కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన నిలిచి పోరాడుతుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వకుంట్ల రమ్యరావు, బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, తంగెళ్ల రవికుమార్, పొత్నక్ ప్రమోద్‌కుమార్, ఉదయ్‌చందర్‌రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
దత్తాయపల్లిలో డీఎల్పీఓ విచారణ
తుర్కపల్లి : మండలంలోని దత్తాయపల్లి గ్రామపంచాయితీ సర్పంచ్ ధ్యానబోయిన సరిత నిధులు దుర్వినియోగం చేశారని ఉపసర్పంచ్ ఎరకల వెంకటేశ్‌గౌడ్ కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఎల్పీఓ సత్యనారాయణరెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా ఇరుపక్షాల నుంచి రాత పూర్వకంగా వాగ్ములాలను స్వీకరించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధ్యానబోయిన సరిత, ఈఓపీఆర్డీ చంద్రమౌళి, వార్డుసభ్యులు, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మొన్న కావ్య.. నిన్న లోకేశ్..
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఇష్టారాజ్యం..అధికారుల ఉదాసీన వైఖరి వెరసి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. నిబంధనలు పాటించడాకుండానే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్సులను తిప్పుతూ చిరుప్రాయాల ప్రాణాలను బలిగొంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే మొన్న కావ్య.. నిన్న లోకేశ్ స్కూల్ వాహన చక్రాల కింద నలిగిపోయారన్నది కఠోర వాస్తవం. తుర్కపల్లి/సూర్యాపేట మున్సిపాలిటీ: తుర్కపల్లి మండలం నాగపల్లి తండాకు చెందిన ధారవత్ నర్సింహ, శారద దంపతులకు ఐదుగురు సంతానం. కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తెలు సుమిత్ర (రెండో తరగతి), సంధ్య (ఒకటవ తరగతి) నిఖిత (నర్సరీ)లు మండల కేంద్రంలోని పడాల మెమోరియల్ స్కూల్లో చదువుతున్నారు. వీరిని ప్రతి రోజు పాఠశాలకు చెందిన బస్సే వచ్చి తీసుకెళ్లి విడిచిపెడుతుంది. కూతుళ్లను బస్సు ఎక్కించేందుకు వచ్చి.. పడాల మెమోరియల్ స్కూల్లో నాగపల్లి తండాకు చెందిన విద్యార్థులే కాకుండా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు కూడా చదువుకుంటున్నారు. ఈ పాఠశాలకు మొత్తంగా మూడు బస్సులు, ఒక ఆటో ద్వారా విద్యార్థులను పాఠశాలకు చేరవేస్తుంటారు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం 7:30 గంటలకు అదే గ్రామానికి చెందిన డ్రైవర్ బన్సీలాల్ స్కూల్‌బస్సును తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. అదే క్రమంలో తన కూతుళ్లను బస్సులో ఎక్కించేందుకు నర్సింహ కుమారుడు లోకేశ్(2)ను ఎత్తుకుని అక్కడికి వచ్చాడు. డ్రైవర్ గమనించకుండానే.. నిత్యం నిలిపే చోటు వద్దకు స్కూల్ బస్సు రాగానే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఒక్కొక్కరుగా అందులోకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలో నర్సింహ కూడా సంకలోని కుమారుడిని కిందకు దించి కూతుళ్లను అందులోకి ఎక్కిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్న కూతురు నిఖిత ఎక్కకుండానే బస్సు డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని ముందుకు కదిలించాడు. గమనించిన తండ్రి నర్సింహ అరుస్తుండగా వాహనం ముందుకు కదులుతుండగా లోకేశ్‌కు వాహనం తగిలి చక్కాలు అతడి తలపైకి ఎక్కింది. దీంతో తలపగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కళ్లముందే ఘోరాన్ని చూసి.. అప్పటి వరకు తన సంకలో ఉన్న బాలుడు కళ్లముందే చక్రాల కింద నలిగిపోవడాన్ని చూసిన ఆ తండ్రి గుండెలవిసేలా రోదించి అక్కడే స్పృహకోల్పోయాడు. విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అక్కడికి వచ్చి స్కూల్ బస్సు వాహనాలను ధ్వంసం చేశారు. కొద్దిసేపట్లోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదానికి కారణమైన బస్సుడ్రైవర్ బన్సీలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మసీయోద్దీన్ తెలిపారు. హెల్పర్ లేకుండానే.. తుర్కపల్లి మండలం నాగపల్లితండాల్లో, మేళ్లచెరువు మండలం కందిబడలో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనల్లో లోకేశ్, కావ్యల మృతికి స్కూల్ బస్సుడ్రైవర్ల నిర్లక్ష్యం, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని మెజార్టీ పాఠశాలలు హెల్పర్లు లేకుండానే విద్యార్థులను తమ బస్సులు, వాహనాలలో చేరవేస్తున్నారు. రెండు ఘటనలను నిశితంగా పరిశీలిస్తే కందిబండలో విద్యార్థులు సక్రమంగా సీట్లలో కూర్చున్నారో లేదో అని డ్రైవర్ వెనుకకు చూస్తూ వాహనాన్ని డ్రైవ్ చేయడంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కావ్యను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఇక నాగపల్లి తండాలో సైతం పిల్లలు అందరూ ఎక్కారో లేదో చూసుకోకుండా డ్రైవర్ బస్సును ముందుకు కదిలించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే సంబంధిత పాఠశాల యాజమన్యాలు ఆ వాహనాల్లో డ్రైవర్లతో పాటు హెల్పర్లను కూడా నియమిస్తే ఈ ఘటనలు చోటు చేసుకునేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల ప్రారంభంలో హడావుడి చేసే సంబంధిత అధికార యంత్రాంగం నిత్యం కాసింత దృష్టిపెడితే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం: ఎం. చంద్రశేఖర్‌గౌడ్, డీటీసీ విద్యాసంస్థల బస్సుల కారణంగా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. హెల్పర్ లేకుండా బస్సులు నడపడానికి వీల్లేదు. ఫిట్¯ð స్ సర్టిఫికెట్ పొందని బస్సులు రోడ్డు మీద రాకపోకలు సాగించినట్లయితే చట్ట పరంగా మరింత శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ప్రతి బస్సులో హెల్పర్ తప్పనిసరి ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. -
విద్యార్థులు వృత్తి నైపుణ్యం పెంపొదించుకోవాలి
తుర్కపల్లి విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొదించుకోవాలని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య సూచించారు. ఉపసర్పంచ్ బోరెడ్డి ఉపేందర్‌రెడ్డి అదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలవిద్యార్థులకు ఆంగ్లం పుస్తకాలను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని ఉపాధ్యాయులు విద్యార్థుల వృత్తి నైపుణ్యం పెంపొదించేందుకు స్వచ్ఛందంగా కృషి చేస్తే ప్రభుత్వం సహకారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఒక పాఠశాలను మోడల్‌గా తీసుకుని వృత్తి నైపుణ్యం పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తే వాటికి సంబంధించిన మెటీరియల్ అందించడానికి ముందుంటామన్నారు. సమాజంలో ఆడపిలల పైన వివక్షతన కొనసాగుతోందని ఆవేదనవ్యక్తం చేశారు. చదువే విద్యార్థుల భవిష్యత్‌ను మార్చే ఆయుధామన్నారు. ప్రతి విద్యార్థి చదువు పై దృష్టిసారించి భవిష్యత్‌ను తీర్చుదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంథ్రనాథ్గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ బోరెడ్డి అయోధ్యరెడ్డి, ఎంఈఓ శేషగిరిరావు,టీఆర్ఎస్నాయకుడు రాపోల్ నర్సింహారెడ్డి,టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి సురేందర్, వార్డు సభ్యులు కట్కూరి రాజుగౌడ్,కోట సురేశ్,బోల్లరం జగదీశ్,నాయకులు కూరెళ్ల బాల్,ఆకుల యాదగిరి,ఆదిమూలం రామచంద్రం పాల్గొన్నారు. -
బైపాస్ రోడ్డు నిర్మించొద్దు
తుర్కపల్లి : బైపాస్‌రోడ్డు పేరుతో రైతుల పొట్టకొట్టొద్దని జాతీయ కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బైపాస్ వద్ద ఉన్న రోడ్డు వెంటనే నాలుగు లైన్ల రోడ్డు విస్తరించాలని తెలంగాణపరిరక్షణ సమితి ఆధ్యర్యంలో మంగళవారం మండలంలోని జేఎం ఫంక్షన్‌హాలులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్న ప్రభుత్వం ఉన్న భూములు ఆక్రమించుకున్న ప్రజాప్రతినిధులకు, రియల్టర్లకు వత్తాసు పలుకుతుందన్నారు. యాదాద్రి నుంచి కీసర వరకు ప్రభుత్వం తలపెట్టిన బైపాస్ రోడ్డులో 350 ఎకరాల వరకు రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు అన్నింటికి అనువుగా ఉండి, ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు రైతులు భూములు ఆక్రమించుకొని రోడ్డు వేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి సరాసరి యాదాద్రికి వెళ్లడానికే రోడ్డు వేసుకొని ఇటు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధుల జేబులు నింపడానికి జరుగుతున్న ప్రయత్నమేనన్నారు. 2013 చట్టం ప్రకారం భూముల కోల్పోతున్న రైతులు ఉన్న మార్కెట్ రేట్‌కు నాలుగింతల పరిహారం అందజేయాలని అన్నారు. ఇప్పటి వరకు బైపాస్ రోడ్డు విషయంలో ఎటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా అమాయక రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. వెంటనే బైపాస్ రోడ్డు విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెండాలు పక్కన పెట్టి భూనిర్వాసితుల ఎజెండానే ముందుకు తీసుకొని పోరాటం చేయాలని అన్నారు. అనంతరం భూనిర్వాసితులు కమిటీని ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా కొక్కొండ లింగయ్య, గౌరవసలహాదారుగా కల్లూరి రామచంద్రారెడ్డి, బబ్బూరి రవీంధ్రనాథ్‌గౌyŠ , 20 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముల్కలపల్లి రాములు, కొండమడుగు నర్సింహ, బండ శ్రీశైలం, మటూరి బాల్‌రాజు, మాటూరి బాల్‌రాజు, మంగ నర్సింహులు, నాయకులు రంగ శంకరయ్య, బబ్బూరి పోశెట్టి, ఎలుగల రాజయ్య, పిడుగు అయిలయ్య, సిల్ల్వేరు దుర్గయ్య, కొక్కొండ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలం తుర్కపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. -
ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పనులు
తుర్కపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌కాకతీయ పనులు చేపట్టిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. సోమవారం తుర్కపల్లి మండలంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తె లంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ముందుగా వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేయాలని మిషన్ కాకతీయ పనులను చేపట్టిందని తెలిపారు. నియోజకవర్గంలో మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేశామని తెలిపారు. పనులు పారదర్శకంగా చేయడానికి అధికారులు కృషి చేయాలని కోరారు. చెరువు మట్టిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.వర్షాలు కురవక ముందే పనులు పూర్తి చేయాలన్నారు. గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మారుస్తాం గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆయన సానుకూలంగా స్పందిం చారని తెలిపారు. ఫీడర్‌చానల్ ద్వారా చెరువుకు నీళ్లు వచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని పేర్కొన్నారు. గంధమల్ల చెరువుకు పైనున్న శామీర్‌పేట, పాములపార్తి చెరువులను కూడా రిజర్వాయర్‌గా మార్చనున్నట్లు వివరించారు. ప్రాణహిత చేవెళ్ల పనులు 2 సంవత్సరాల్లో పూర్తయితే ఆ కాలువల ద్వారానైనా నీళ్లు తీసుకురావొచ్చని అన్నారు. ఎండాకాలంలో గ్రామాల్లో నీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, వైస్‌ఎంపీపీ పలుగుల ఉమారాణి, ఎంపీటీసీ సభ్యులు కొండం రఘురాములు, తలారి శ్రీనివాస్, బద్దూనాయక్, రాజయ్య, భూక్య అరుణ, కావడి భాగ్యమ్మ, జూపల్లి లక్ష్మీ, భీమార్రి లక్ష్మీ, సర్పంచ్‌లు దారావత్ హరినాయక్, గోనె ప్రకాశ్, అనుమూల వెంకట్‌రెడ్డి, దాసరి ఎర్ర నర్సింహులు, ఐనాల చైతన్య, మారగోని రమాదేవి, సొక్కుల యేశమ్మ, బబ్బూరి శ్రీనివాస్‌గౌడ్, అరుణ, భాగ్యలక్ష్మి, సరిత, ఎల్లేశ్, అనిత, సర్వూప, ఎంపీడీఓ కృష్ణారెడ్డి, ఈఓపీఆర్డీ చంద్రమౌళి, ఆర్ఐ చంద్రశేఖర్, కార్యదర్శులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
తుర్కపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన తుర్కపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కోట కిరణ్(23) రోజూ వారీగా వ్యవసాయ బావి వద్ద గడ్డి తీసుకువచ్చేందుకు తన స్కూటర్‌పై బయలుదేరాడు. యాదగిరిగుట్ట రోడ్డు వద్ద ప్రధాన చౌరస్తా దాటుతుండగా జగదేవ్‌పూర్ నుంచి భువ నగిరి వైపు వెళుతున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. వాహనం డీసీఎం వె నక టైర్లు కిరణ్ చాతీ మీది నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూటర్ ప్రమాదంలో నుజ్జు నుజ్జైంది. కిరణ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. మృతుడికి ఇద్దరు తమ్ములు,తల్లి,దండ్రి ఉన్నారు. విషయం తెలుసుకుని ఎస్ఐ దాచేపల్లి విజయ్‌కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీసీఎంను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదే హాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ద్విచక్రవాహనాల ఢీ
ఇద్దరికి తీవ్రగాయాలు పరిస్థితి విషమం తుర్కపల్లి : ఎదురెదురుగా వచ్చిన రెం డు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌లో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన ఇప్ప ప్రశాంత్, ఇప్ప శ్రీకాంత్ బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తున్నారు. అదే విధంగా మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం లింగరెడ్డిపల్లి నుంచి జాపా గోపి, జాపాకిష్టయ్య, జాపా బుచ్చమ్మ, లత ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒకే బైక్‌పై యాదగిరిగుట్టకు బయలుదేరారు. వీరి వాహనాలు వెంకటాపూర్ శివారులో మలుపు వద్దకు రా గానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పా శ్రీకాంత్, జాపా గోపి కి తీవ్రంగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను తుర్కపల్లిలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయ పడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
సోదరుడే కడతేర్చాడు..
తుర్కపల్లి :తండ్రి చూపిన వివక్ష అతడిని మృగాడిగా మార్చింది.. ఆస్తిమొత్తం పె ద్ద భార్య కుమారులే అనుభవిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు..వారి అడ్డు తొలగించుకుని ఆస్తినంతా కొట్టేయాలనుకున్నాడు..సోదరుడనే కనికరం కూడా లేకుండా దారికాచి తన బంధువుసాయంతో పొడిచిపొడిచి చంపాడు.. తుర్కపల్లి మండలం గొల్లగూడెం సమీపంలో ఈ నెల 11వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీ సులు ఛేదించారు. ఆస్తికోసమే ఈ దారు ణం చోటు చేసుకున్నట్లు పోలీసుల ద ర్యాప్తులో వెల్లడైంది. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సతీష్‌రెడ్డి అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు.. హత్య జరిగిన తీరుతెన్నులను వివరించారు. మండలంలోని మర్రికుంట తండా కు చెందిన ధారవత్ జాలం అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సుగుణమ్మకు ఇద్దరు సంతానం కలుగగా, చిన్నభార్య లక్ష్మికి ఒక కుమారుడు.అయితే జాలం ఇద్దరు భార్యలను ఒకే విధంగా చూడకుండా లక్ష్మిపై వివక్ష చూపిం చా డు. దీంతో వారు రాంపూర్‌లో నివాసముంటున్నారు. అయితే పెద్ద భార్య కుమారుడు నర్సింహులు నాయకే దీనంతటికీ కారణమని చిన్న భార్య కుమారుడు నరేందర్ నాయక్ కక్ష పెం చుకున్నాడు. దీంతో ఇటీవల వారి మ ధ్య గొడవలు కూడా జరిగాయి. భూమి విషయంలో తగాదాలు జాలంకు గ్రామంలో సుమారు 12 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని పెద్ద భార్య కొడుకు భిక్షపతి, చిన్నకొడుకు నర్సింహ్మనాయక్లు మాత్రమే వ్యవసా యం చేసుకుంటున్నారు. రాంపూర్‌లో నివాసం ఉంటున్న నరేంద్రనాయక్ కూలిపనులు చేసుకుంటూ డిగ్రీ పూర్తిచేశాడు. తనకు కొంత భూమి ఇవ్వాలని నరేంద్రనాయక్ తండ్రిని కోరితే గత ంలో నర్సింహులు అడ్డుకున్నాడు. నాలుగురోజులుగా మాటు వేసి.. ఎలగైనా నర్సింహులును హత్య చేయాలని నరేందర్ నాయక్ నిర్ణయించుకున్నాడు. దీనికి అతడి మేన బావమరిది బానవత్ భగవన్నాయక్ ఎలియాస్ రాజుతో కలిసి హత్యపథకానికి పక్కప్లాన్ వేసుకున్నాడు. దీనిలో భాగంగా నాలుగు రోజులుగా నర్సింహులు నా యక్ కోసం మాటు వేశాడు. దీంతో ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్‌పై తన సోదరుడి కుమారుడు రాజుతో కలిసి వస్తున్న నర్సిం హులు నాయక్‌ను గొల్లగూడెం సమీపంలో అడ్డగించాడు. కళ్లలో కారం చల్లి ఆపై కత్తితో దాడిచేసి హత్య చేశా డు. తదనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజు ఇచ్చిన సమాచా రం మేరకు నరేందర్‌నాయక్, భగవత్నాయక్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు సీఐ వివరిం చా రు. సమావేశంలో ఎస్ఐ దాచేపల్లి విజయ్‌కుమార్, ఏఎస్ఐ మధుసూధన్‌రెడ్డి, పీసీలు రాంనాయక్,నర్సింహు లు, నాగారాజు పాల్గొన్నారు. -
హత్య చేశారు...ఆపై కాల్చేశారు
తుర్కపల్లి :ఆస్తి తగాదాలో... ఆర్థిక లావాదేవీలో కారణం ఏదో తెలియదు గానీ ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి...ఆపై కాల్చేశారు. వివరాల్లోకి వెళితే...నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్‌లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు వీఆర్వో ఫిర్యాదు మేరకు బుధవారం పంచనామా నిర్వహించారు. అయి తే మృతదేహం పక్కనే దొరికిన సెల్ఫోన్లో ఉన్న నంబర్లకు ఫోన్ చేయగా మృ తుడి వివరాలు తెలిశాయి. కేతావత్ రెడ్యానాయక్(32) సెక్యూరిటీ గార్డుగా నాచారం ఇండస్ట్రీయల్ ఏరియాలో పనిచేస్తున్నాడు. ఇతడిది బీబీనగర్ మండలం జంపల్లితండా. భార్య విజయలక్షి్ష్మతో కలిసి ఐదు సంవత్సరాలుగా నాచారంలో నివసిస్తున్నాడు. మృతుడి సోదరుడు జాహంగీర్ (38) మూసాపేటలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. పెళ్లి సంబంధం చూసేందుకు వెళ్లి.. చెల్లికి పెళ్లి సంబంధం చూడాలని జహ ంగీర్ మే 26వ తేదీన తమ్ముడు రెడ్యానాయక్‌ను వెంటబెట్టుకుని కారులో వెళ్లాడు. మల్లాపూర్ నుంచి తుర్కపల్లికి చేరుకున్నారు. భార్య విజయలక్ష్మి రాత్రి 7:30 గంటలకు రెడ్యాకు ఫోన్ చేయగా, వస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నుంచి రెడ్యానాయక్ ఫోన్ పనిచేయలేదు. దీంతో అనుమానం వచ్చిన విజయలక్షి్ష్మ బావ జాహంగీర్‌కు ఫోన్ చేసింది. ఆయనా లిఫ్ట్ చేయలేదు. మరుసటి రోజు ఉదయం విజయలక్షి తన బంధువులతో కలిసి బావ జహంగీర్ ఇంటికి వెళ్లి తన భర్త ఆచూకీ కోసం నిలదీసింది. ‘నాకు తెలియదు.....నావెంట రాలేదు 7 సంవత్సరాల నుంచి నాకు నా తమ్ముడికి మాటలు లేవంటూ’’ జహంగీర్ చెప్పాడు. దీంతో విజయలక్ష్మి నాచారం పోలీసులను ఆశ్రయించింది. వెంకటాపూర్ వద్ద లభ్యమైన శవం వద్ద ఉన్న సెల్‌ఫోన్ వివరాల ఆధారంగా నాచారం పోలీసులతో కలిసి ఆమె ఇక్కడకు వచ్చింది. శవం మెడలో ఉన్న ఆంజనేయస్వామి దండ, చేతికున్న తాడు, బట్టల ఆధారంగా మృతుడు తన భర్తేనని భార్య విజయలక్ష్మి గుర్తించింది. హత్య చేసి 40 రోజులు కావడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి ఉంది, ఒక కాలు శవం నుంచి ఉండిపోయి ఉంది. చుట్టూ బీరుసీసాలు, మద్యం బాటిళ్లు ఉన్నాయి. కేసును నాచారం సీఐ అశోక్‌కుమార్, తుర్కపల్లి ఎస్ఐ దాచేపల్లి విజయ్‌కుమార్ దర్యాప్తు చేసి విచారిస్తున్నారు. ఆస్తికోసమే అంతమొందించాడు : మృతుడి భార్య రెడ్యానాయక్, జహంగీర్‌కు జంపల్లి గ్రామంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. జహంగీర్‌కు గ్రామం లో అప్పులు ఎక్కువ కావడంతో ఆ భూమిని విక్రయించాలని తమ్ముడితో ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యం లోనే తన భర్తను జహంగీర్, ఇతర కుటుంబ సభ్యులు కలిసి హత్య చేసి ఉంటాడని మృతుడి భార్య విజయలక్ష్మి ఆరోపించింది. -
ప్రాణహిత, చేవెళ్ల సొరంగ మార్గం
పనులు ప్రారంభం తుర్కపల్లి, న్యూస్‌లైన్ : ప్రాణహిత, చేవెళ్ల సొరంగమార్గం పనులను సోమవా రం తుర్కపల్లి గ్రామ శివారులో ప్రాజెక్టు ఈఈ హైదర్‌ఖాన్ ప్రారంభించారు. పనులు ప్రారంభించడానికి ముందు ఆయన పనుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ వారం రోజుల్లో సొరంగ మార్గం పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సుమారు 2 కిలోమీటర్ల మేర సొరంగమార్గం ఉంటుందని తెలిపారు. పనులు పూర్తికావడానికి రెండేళ్లు పడుతుందని తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 వరకు ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తి కావొచ్చునని వివరించారు. చాలా చోట్ల రైతుల నుంచి భూమి తీసుకునేటప్పుడు సమస్యలొచ్చాయని, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అధునాతన పద్ధతుల్లో సొరంగా మార్గం పనులు చేపడుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఆర్ ఏజెన్సీ నిర్వాహకులు సుదర్శన్‌రెడ్డి, అమిత్‌రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్లు, సైట్ ఇంజనీర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
తుర్కపల్లిలో మహిళ హత్య..!
శామీర్‌పేట్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని తుర్కపల్లిలో ఓ మహిళ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే దారుణం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన గురువారం జరిగింది. పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, శామీర్‌పేట్ పోలీసులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. నిజమాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెకు చెందిన సూరి నర్సమ్మ(43), రాజయ్య దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం నర్సమ్మ భర్త మృతిచెందాడు. ఈక్రమంలో ఆమె బతుకుదెరువు కోసం పిల్లలను తీసుకొని శామీర్‌పేట్ మండలంలోని తుర్కపల్లికి వలస వచ్చింది. ఓ అద్దె ఇంట్లో ఉంటూ సీజన్‌పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. మూడేళ్ల క్రితం తుర్కపల్లికి చెందిన జీడిపల్లి గురుస్వామితో ఆమెకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం గురుస్వామి ఇంట్లో తెలిసింది. పలుమార్లు పంచాయితీ పెట్టి తీరు మార్చుకోవాలని ఇద్దరినీ హెచ్చరించిన ఫలితం లేకుండా పోయింది. ఈక్రమంలో బుధవారం రాత్రి నర్సమ్మ, గురుస్వామి తుర్కపల్లి శివారులోని ఓ దాబా వెనక ఉన్నారు. ఈవిషయం తెలుసుకున్న గురుస్వామి భార్య తులసమ్మ, కుమారుడు శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నారు. తులసమ్మ, శ్రీకాంత్ నర్సమ్మను తీవ్రంగా చితకబాదారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో వారు నర్సమ్మను ఓ ఆటోలో తీసుకొచ్చి ఆమె ఇంటి దగ్గర వదిలేసి వెళ్లారు. నర్సమ్మ కుమారుడు రాజశేఖర్ గమనించి తల్లిని ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. కొద్దిసేపటికే నర్సమ్మ మృతిచెందింది. శామీర్‌పేట్ పోలీసులు, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు గురుస్వామి, ఆయన భార్య తులసమ్మతో పాటు కుమారుడు శ్రీకాంత్‌లను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
రాజన్నా.. నీకు సలాం
వైఎస్సార్‌ను స్మరించుకుంటున్న ముస్లింలు సాక్షి, నల్లగొండ,వైఎస్సార్.. ఈ పేరు అంటేనే ముస్లింలకు ఎనలేని గౌరవం. ప్రతి నిరుపేద ముస్లిం.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ఆర్థికంగా వెనకబడిన ముస్లింలు పెళ్లి చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచారు. గతంలో రూ. 15 వేలు ఉన్న మొత్తాన్ని.. రూ. 25 వేలకు పెంచి బీద కుటుంబీకులకు ఆసరా అయ్యారు. ఇలా ఎన్నో కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. అంతేగాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వారి బతుకుల్లో వెలుగులు నింపింది. పూట గడవడమే గగనంగా ఉన్న కుటుంబం నుంచి వైద్యుడిగా ఎదిగేందుకు తోడ్పాటునందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది. ఇలా ఈ ఒక్క కుటుంబమే కాదు.. జిల్లాలో వందల కుటుంబాలు జీవితంలో స్థిరపడ్డాయి. వేల సంఖ్యలో ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించారు. వీరంతా చదువుల దేవుడిగా వైఎస్సార్‌ను కొలుస్తున్నారు. అంతేగాక 4శాతం రిజర్వేషన్లు కల్పించి జీవితాలను నిలబెట్టారు. ఇలా రిజర్వేషన్లు కేటాయించడం వల్ల వేల మంది విద్యార్థులు ఆయా వర్సిటీల్లో సీట్లు సాధించగలిగారు. ఇలా వైఎస్సార్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న పథకాల ద్వారా లబ్ధి పొందిన కొందరి మనోగతం.... నిరుపేద ముస్లింలను ఆదుకున్న జననేత ముస్లింలను గతంలో ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుపేదలను ఆదుకున్న తీరు అమోఘం. గతంలో ముస్లిం నిరుపేదలు పెళ్లిళ్లు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. అటువంటి వారిని గుర్తించింది రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం. నిరుపేద ముస్లింలు పెళ్లిళ్లు చేసుకుంటే రూ. 25 వేలు అందించే పథకాన్ని పునరుద్ధరించారు. చాలామంది ముస్లింల పిల్లులు ఆర్థిక పరిస్థితులు బాగాలేక మధ్యలోనే చదువు మానేసేవారు. అటువంటి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎంతోమంది నిరుపేద ముస్లిం పిల్లలు కార్పొరేట్ కళాశాలల్లో చదువుకుంటున్నారు. కేవలం ఉన్నత చదువులు చదవడమే కాదు.. ఆయన ముస్లింలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్ల చాలామంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. దీంతో వారి కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. ముస్లింల జీవితాలు ఇలా బాగుపడతాయని నేను ఎన్నడూ అనుకోలేదు. పరిస్థితిని చూస్తుంటే ఇది నిజమేనా.. మా బతుకులకు ఇంత ఆసరా దొరికిందా అనిపిస్తున్నది. ముస్లింల జీవితాల్లో ఇంతటి మార్పు రావడం అంతా వైఎస్ చలవే. ఆ మహానేత చేసిన మేలును సమాజం ఎప్పటికీ మరచిపోదు. - మహ్మద్ రహమాన్‌సాబ్, తుర్కపల్లి