విద్యార్థులు వృత్తి నైపుణ్యం పెంపొదించుకోవాలి
విద్యార్థులు వృత్తి నైపుణ్యం పెంపొదించుకోవాలి
Published Mon, Jul 25 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
తుర్కపల్లి
విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొదించుకోవాలని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య సూచించారు. ఉపసర్పంచ్ బోరెడ్డి ఉపేందర్‌రెడ్డి అదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలవిద్యార్థులకు ఆంగ్లం పుస్తకాలను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని ఉపాధ్యాయులు విద్యార్థుల వృత్తి నైపుణ్యం పెంపొదించేందుకు స్వచ్ఛందంగా కృషి చేస్తే ప్రభుత్వం సహకారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఒక పాఠశాలను మోడల్‌గా తీసుకుని వృత్తి నైపుణ్యం పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తే వాటికి సంబంధించిన మెటీరియల్ అందించడానికి ముందుంటామన్నారు. సమాజంలో ఆడపిలల పైన వివక్షతన కొనసాగుతోందని ఆవేదనవ్యక్తం చేశారు. చదువే విద్యార్థుల భవిష్యత్‌ను మార్చే ఆయుధామన్నారు. ప్రతి విద్యార్థి చదువు పై దృష్టిసారించి భవిష్యత్‌ను తీర్చుదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంథ్రనాథ్‌గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ బోరెడ్డి అయోధ్యరెడ్డి, ఎంఈఓ శేషగిరిరావు,టీఆర్‌ఎస్‌నాయకుడు రాపోల్ నర్సింహారెడ్డి,టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి సురేందర్, వార్డు సభ్యులు కట్కూరి రాజుగౌడ్,కోట సురేశ్,బోల్లరం జగదీశ్,నాయకులు కూరెళ్ల బాల్,ఆకుల యాదగిరి,ఆదిమూలం రామచంద్రం పాల్గొన్నారు.
Advertisement
Advertisement