మాదాపూర్‌లో ‘మిషన్‌ భగీరథ’ ట్రయల్‌రన్‌ | mission bhageeratha trial run in madapur | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో ‘మిషన్‌ భగీరథ’ ట్రయల్‌రన్‌

Published Thu, Jul 28 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

మాదాపూర్‌లో ‘మిషన్‌ భగీరథ’ ట్రయల్‌రన్‌

మాదాపూర్‌లో ‘మిషన్‌ భగీరథ’ ట్రయల్‌రన్‌

తుర్కపల్లి : ఆలేరు నియోజకవర్గానికి తాగునీరు తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. గురువారం మండలంలోని మాదాపూర్‌లో వాటర్‌ గ్రిడ్‌ (మిషన్‌ భగీరథ) పథకం ద్వారా గోదావరి జలాల ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏ మహిళ మంచినీటి సమస్యతో రోడ్ల మీద బిందెలతో కనపడకూడదని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని ప్రారంభించార న్నారు. ఆ పథకం ద్వారా మొదటి ఫేజ్‌లోనే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. డిసెంబర్‌ వరకు ఈ వాటర్‌గ్రిడ్‌ పథకం పనులు పూర్తవుతాయని తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement