హామీలను విస్మరించిన సీఎం
హామీలను విస్మరించిన సీఎం
Published Thu, Aug 4 2016 6:03 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
తుర్కపల్లి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రోజుకో రకం మాటలతో ఇటు రైతులను, ప్రజలను మభ్య పెడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. గురువారం తుర్కపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో అయన మాట్లాడారు. పార్లమెంట్‌లో అమలు చేసిన 2013 చట్టాన్ని కాదని, 123 జీఓ విడుదల చేయడంపై హైకోర్టు మొట్టికాయలే యడం ప్రభుత్వ భంగపాటు కాదా అని అన్నారు. రైతుల నుంచి భూసేకరణ ప్రజస్వామ్య పద్ధతిలో జరగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బబ్బూరి రవీంధ్రనా«ద్‌గౌడ్, ధానవత్ శంకర్‌నాయక్, ఎంపీటీసీ సభ్యులు బద్దూనాయక్, రాజయ్య, నాయకులు ఎలగల రాజయ్య, గడ్డమీది సత్యనారాయణ, పత్తిపాటి హన్మంత్‌రావు, బోరెడ్డి హన్మంత్‌రెడ్డి, బోరెడ్డి మహిపాల్‌రెడ్డి, భూక్య రాజారాం పాల్గొన్నారు.
Advertisement
Advertisement