చండీయాగంతోనే విస్తారంగా వర్షాలు
తుర్కపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగంతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వ విప్ సునీత అన్నారు. శనివారం తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువులో గంగమ్మతల్లికి, కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 10ఏళ్ల నుంచి నిండని చెరువులు నేడ జలకళ సంతరించుకుందని అన్నారు. మిషన్ కాకతీయను ఎద్ధేవా చేసిన ప్రతిపక్షాలు నేడు నిండిన చెరువులను చూసి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని సుభిక్షం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న మహోన్నత నిర్ణయం వల్లే నేడు చెరువులు పకడ్బంధీగా జలకళ సంతరించుకుంటే రైతులు సంతోషాలు వెలుబుచ్చుతున్నారని అన్నారు. ప్రస్తుతం రైతులు వరినాట్లు వేయకుండా నవంబర్‌లో మెదలు పెడితే పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంటుందని, కంది, మొక్కజొన్న పంటల్లో నీళ్లు నిల్వకుండా రైతుల శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ పలుగుల ఉమారాణి, ఎంపీటీసీ తలారి శ్రీనివాన్, జూపల్లి లక్ష్మీ, కొండం రఘురాములు, మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, సర్పంచ్ అనుమూల వెంకట్‌రెడ్డి, నాయకులు కొమ్మిరిశెట్టి నర్సింహులు, అల్డా డైరెక్టర్ పొగుల ఆంజనేయులు, నాంసాని సత్యనారాయణ, కొమ్మిరిశెట్టి న ర్సింహులు, జక్కుల వెంకటేశం పాల్గొన్నారు.