ఆటో బోల్తా : 12 మంది విద్యార్థులకు గాయాలు | Auto Failure: A total of 12 students and injuries | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : 12 మంది విద్యార్థులకు గాయాలు

Published Thu, Sep 19 2013 1:51 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

Auto Failure: A total of 12 students and injuries

 మల్కాపూర్ (తుర్కపల్లి), న్యూస్‌లైన్ :ఆటో బోల్తా పడి 12 మంది విద్యార్థులు గాయపడిన సంఘటన బుధవారం మండలంలోని మల్కాపూర్ శివారులో చోటు చేసుకుంది. వివరాలు.. మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని భీల్యాతండాకు చెందిన విద్యార్థులు తుర్కపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం అదే తండాకు చెందిన మాడోత్ బాల్య ఆటోలో పాఠశాలకు బయలుదేరారు. మల్కాపూర్ శి వారులో మలుపువద్ద ఆటో అదుపు తప్పి ఫల్టీ కొట్టిం ది. ఈ సంఘటనలో 12మంది విద్యార్థులకు గాయాల య్యాయి. వీరిలో మాదోత్ దీప, మాదోత్ లక్ష్మణ్, మాడోత్ రాజేశ్, మాడోత్ సంతోష్, భూక్య సంతోష్, మాడోత్ మమత, గుగులోత్ లక్ష్మణ్ తీవ్రం గా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుర్కపల్లి ఆ స్పత్రికి తరలించారు. మితిమీరిన వేగం వల్లే ఆటో అ దుపుతప్పి బోల్తాపడిందని విద్యార్థులు ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement