సోదరుడే కడతేర్చాడు..
తుర్కపల్లి :తండ్రి చూపిన వివక్ష అతడిని మృగాడిగా మార్చింది.. ఆస్తిమొత్తం పె ద్ద భార్య కుమారులే అనుభవిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు..వారి అడ్డు తొలగించుకుని ఆస్తినంతా కొట్టేయాలనుకున్నాడు..సోదరుడనే కనికరం కూడా లేకుండా దారికాచి తన బంధువుసాయంతో పొడిచిపొడిచి చంపాడు.. తుర్కపల్లి మండలం గొల్లగూడెం సమీపంలో ఈ నెల 11వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీ సులు ఛేదించారు. ఆస్తికోసమే ఈ దారు ణం చోటు చేసుకున్నట్లు పోలీసుల ద ర్యాప్తులో వెల్లడైంది. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సతీష్‌రెడ్డి అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు.. హత్య జరిగిన తీరుతెన్నులను వివరించారు.
మండలంలోని మర్రికుంట తండా కు చెందిన ధారవత్ జాలం అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సుగుణమ్మకు ఇద్దరు సంతానం కలుగగా, చిన్నభార్య లక్ష్మికి ఒక కుమారుడు.అయితే జాలం ఇద్దరు భార్యలను ఒకే విధంగా చూడకుండా లక్ష్మిపై వివక్ష చూపిం చా డు. దీంతో వారు రాంపూర్‌లో నివాసముంటున్నారు. అయితే పెద్ద భార్య కుమారుడు నర్సింహులు నాయకే దీనంతటికీ కారణమని చిన్న భార్య కుమారుడు నరేందర్ నాయక్ కక్ష పెం చుకున్నాడు. దీంతో ఇటీవల వారి మ ధ్య గొడవలు కూడా జరిగాయి. భూమి విషయంలో తగాదాలు జాలంకు గ్రామంలో సుమారు 12 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని పెద్ద భార్య కొడుకు భిక్షపతి, చిన్నకొడుకు నర్సింహ్మనాయక్‌లు మాత్రమే వ్యవసా యం చేసుకుంటున్నారు. రాంపూర్‌లో నివాసం ఉంటున్న నరేంద్రనాయక్ కూలిపనులు చేసుకుంటూ డిగ్రీ పూర్తిచేశాడు. తనకు కొంత భూమి ఇవ్వాలని నరేంద్రనాయక్ తండ్రిని కోరితే గత ంలో నర్సింహులు అడ్డుకున్నాడు.
నాలుగురోజులుగా మాటు వేసి..
ఎలగైనా నర్సింహులును హత్య చేయాలని నరేందర్ నాయక్ నిర్ణయించుకున్నాడు. దీనికి అతడి మేన బావమరిది బానవత్ భగవన్‌నాయక్ ఎలియాస్ రాజుతో కలిసి హత్యపథకానికి పక్కప్లాన్ వేసుకున్నాడు. దీనిలో భాగంగా నాలుగు రోజులుగా నర్సింహులు నా యక్ కోసం మాటు వేశాడు. దీంతో ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్‌పై తన సోదరుడి కుమారుడు రాజుతో కలిసి వస్తున్న నర్సిం హులు నాయక్‌ను గొల్లగూడెం సమీపంలో అడ్డగించాడు. కళ్లలో కారం చల్లి ఆపై కత్తితో దాడిచేసి హత్య చేశా డు. తదనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజు ఇచ్చిన సమాచా రం మేరకు నరేందర్‌నాయక్, భగవత్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు సీఐ వివరిం చా రు. సమావేశంలో ఎస్‌ఐ దాచేపల్లి విజయ్‌కుమార్, ఏఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి, పీసీలు రాంనాయక్,నర్సింహు లు, నాగారాజు పాల్గొన్నారు.