మండల స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
మండల స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
Published Fri, Aug 26 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
తుర్కపల్లి : మండల స్థాయి క్రీడోత్సవాలను మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఎంఈఓ శేషగిరిరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వచ్చే నెలలో డివిజన్ స్థాయి క్రీడలు ప్రారంభమవుతున్నాయని, ఆ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను రెండు రోజుల పాటు నిర్వహించి ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు.
Advertisement
Advertisement