
తోట రాజేష్
బలహీన, దళిత, గిరిజన విద్యార్థులకు సం క్షేమ హాస్టళ్లే విద్యా కేంద్రాలు కాగా, వాటిలోని విద్యార్థులు పలు సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నారు.
బలహీన, దళిత, గిరిజన విద్యార్థులకు సం క్షేమ హాస్టళ్లే విద్యా కేంద్రాలు కాగా, వాటిలోని విద్యార్థులు పలు సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4,821 వరకు బీసీ, ఎస్టీ, ఎస్సీ హాస్టళ్లు న్నాయి. ఈ హాస్టళ్లలో 7,09,541 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇందు లో ఎస్సీ హాస్టళ్లు 2,356 కాగా వీటిలో, 2,99,792 మంది విద్యార్థులు ఉన్నారు. ఎస్టీ వసతి గృహాలు 980 ఉంటే 2,77,406 మంది విద్యార్థులున్నారు. 258 అమ్మాయిల హాస్టళ్లు ఉంటే వీటిలో 40,605 విద్యార్థినులు ఉన్నారు. బీసీ వసతి గృహాలు 1,429 ఉండగా వీటిలో 1,32,749 మంది విద్యార్థు లున్నారు. 319 బీసీ అమ్మాయిల హాస్టళ్లు ఉంటే 89,793 మంది విద్యా ర్థినులు వసతి పొందుతూ చదువుకుంటున్నారు. ఇవి కాకుండా కాలేజీ అటాచ్‌మెంట్ హాస్టళ్లు 172 ఉమ్మడి రాష్ట్రంలో ఉండేవి. ఇలా అంకెల్లో ఘనంగా ఉన్నా, ఆ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను పాలక పక్షాలు బిచ్చగాళ్లతో సమానంగా చూస్తూ అవమానపరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సంక్షేమ హాస్టళ్లు సమస్యల విషవలయంలో విలవిలలాడుతు న్నాయి. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి కాలకృత్యాలతో ప్రారంభ మైన వారి సమస్యలు రాత్రి దోమలతో యుద్ధం చేసి అలసిపోయేదాకా వెంబడిస్తూనే ఉంటాయి. స్నానాలు చేయడానికి నీళ్లు ఉండవు. ఆరుబ యటే స్నానాలు చేయాలి.
ఇక పట్టణాలలో ఉండే హాస్టళ్ల దుస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. బట్టలు ఉతకడానికి, స్నానం చేయడానికి నీళ్లు సరిగ్గా ఉండవు. కాస్మొటిక్ చార్జీలు సకాలంలో రావు. ఉదయం టిఫిన్ చేద్దామనుకుంటే ఉడికీ ఉడకని అన్నం లేదా అన్నం ముద్దలాగా తయా రైన అన్నం, నీళ్ల లాంటి చింత పులుసుతో పొట్ట నింపుకొని స్కూలుకు వెళ్లాలి. స్కూలుకు వెళ్లగానే డ్రస్ లేదని దండన. విద్యా సంవత్సరం ప్రారం భమైన మూడు నెలలు పూర్తయిన తర్వాత హాస్టళ్లకు వస్తాయి. ఇక మధ్యాహ్న భోజనంలో కూరగాయలు, పప్పు, సాంబారు, గుడ్లు, అరటి పండ్లు, మాంసం కూరలు ఇవ్వాలని ఉన్నా, అవి ఎక్కడా అమ లు కాదు. సంబంధిత అధికారితో చెప్పినా ఫలితం ఉండదు. ఎందు కంటే ఆ అధికారి, ఆ వార్డెన్ ఒకే గూటి పక్షులు.
ఇక రాత్రి భోజనం చేయాలంటే బతకాలి కాబట్టి తినాలి. చదువు కుందామంటే బల్బులుండవు, ఉన్నా లో-ఓల్టేజీ, కరెంట్ వైర్లు బట్టలు వేసే దండేలుగా వేలాడుతూ ఉంటాయి. వర్షం వస్తే కరెంట్ షాక్. జైళ్లలో ఖైదీలకు బాత్‌రూంలో, మరుగుదొడ్లలో ఆత్మహత్యలు చేసుకుం టారని సగం తలుపులే ఉంచుతారు. మన సంక్షేమ హాస్లళ్లలో ఆ తలు పులు కూడా ఉండవు. చదువుకు అవసరం అయిన నోట్‌బుక్స్, పెన్ను లు, వస్తువులు దాచుకోవడానికి ట్రంకు పెట్టెలు 3 సంవత్సరాలకు ఒక సారి ఇవ్వాలని ఉన్నా 8 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. పడు కుందామంటే దుప్పట్లు ఉండవు. చలికాలమంతా విద్యార్థులు గజగజ వణుకుతూ ఉంటారు. అత్యవసర సమయంలో కూడా ఆమడ దూరం వెళ్లవలసిందేనా, ప్రతి దినం మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగా ల్సిందేనా అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూన్న ప్రభుత్వాలు వందలా దిమంది విద్యార్థులు ఒకే చోట ఉంటూ మరుగుదొడ్ల సమస్యతో సతమ తమవుతున్న హాస్టళ్లవైపు మాత్రం దృష్టి మరలటం లేదు. ఇక, హాస్టళ్లలో నీటి సమస్య, వైద్య సదుపాయాల లేమి గురించి చెప్పేపనిలేదు.
సంక్షేమ హాస్టళ్లు కేవలం అన్నదాన సత్రాలుగా ప్రభుత్వం భావిస్తు న్నది. అందుకే నామమాత్రంగా మెస్ చార్జీలను పెంచింది. ఇక్కడికి వచ్చే విద్యార్థులకు కేవలం భోజనం పెట్టి పంపించడం కాదు. కేవలం మెస్‌చార్జీలను పెంచితే హాస్టళ్ల నిర్వహణ మెరుగుపడదు. హాస్టళ్ల నిర్వ హణ మెరుగుపడాలంటే చట్టం ప్రకారం విద్యార్థులకు అందవలసిన అన్ని పద్దుల కేటాయింపులు ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలి. చివరగా.. సంక్షేమ హాస్టళ్లు అంటే ప్రభుత్వ భిక్ష కాదు. అవి సామాజిక మార్పునకు చిహ్నాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులందరూ పోరుబాట లో నడవాలి.
(వ్యాసకర్త ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ కార్యకర్త) మొబైల్: 9440195160