బ్రాహ్మణుల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు
Published Sun, Jan 15 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM
కర్నూలు (అర్బన్): రాష్ట్రంలోని బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ డా.ఎ.చక్రపాణియాదవ్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. శనివారం బ్రాహ్మణ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు, బ్రాహ్మణ సంఘం నాయకులు మండలి చైర్మన్, రాజ్యసభ సభ్యులను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ నగరంలోని బ్రాహ్మణులకు ఎన్‌టీఆర్ గృహాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు మండలి చైర్మన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బ్రాహ్మణులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్‌కు శిక్షణ తీసుకోవాలనే పేద బ్రాహ్మణులకు రూ.ఒక లక్ష వరకు కార్పొరేషన్ ఫీజు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నేతలు హెచ్.కె.మనోహర్‌రావు, రాజశేఖర్‌రావు, మురళి, కల్లె వేణుగోపాలశర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement