విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి | work for challanged peoples welfare | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి

Published Sun, Sep 25 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

work for challanged peoples welfare

– జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సీ హరికిరణ్‌
కర్నూలు(అర్బన్‌): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సి. హరికిరణ్‌ అన్నారు. ఆదివారం ప్రపంచ వినికిడి మెరుగు పరిచే దినోత్సవాన్ని స్థానిక సీ క్యాంప్‌లోని వికలాంగుల ప్రభుత్వ బాలుర వసతి గహంలో ఘనంగా నిర్వహించారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కె. భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జేసీ హరికిరణ్, ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ  విభిన్న ప్రతిభావంతులు ఎందులోను ఎవరికి తీసిపోరని చాలా మంది  నిరూపించారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యలో పోటీ పడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వికలాంగులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలన్నారు. ఏడీ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ శారీరక వికలాంగుల బాలుర వసతి గహానికి, సెన్సరీ పార్కుకు స్థలం కేటాయించాలని కోరారు. అలాగే బధిరులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే 60 మంది బధిరులకు రూ.5.40 లక్షల విలువ చేసే టచ్‌ఫోన్స్, రూ.3 లక్షల విలువ చేసే ట్రై సైకిళ్లు 60 మంది శారీరక వికలాంగులకు, రూ.1.40 లక్షల విలువ చేసే వీల్‌చైర్స్‌ను 20 మంది మానసిక వికలాంగులకు అందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement