Published
Thu, Sep 29 2016 10:49 PM
| Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం
ఆత్మకూరు(ఎం): ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం రైతుల సంక్షేమ కోసం కృషి చేస్తుందని చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో సంఘం 33వ వార్షిక సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి రైతులు కూడ తమ వంతుగా సహకరించాలని తెలిపారు. తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించినప్పుడే సహకార సంఘం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వ్యవసాయానికి అప్పు తీసుకున్న రూ. 1.46కోట్లకు గానూ 43 మంది రైతులకు నోటీసులు అందజేయగా రూ. 23లక్షలు మాత్రమే వసూలు చేయగలిగామని అన్నారు. కూరెళ్ల, పల్లెర్ల గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు నిర్వహిస్తే సహకార సంఘానికి రూ. 5.50లక్షల లాభం చేకూరిందని పేర్కొన్నారు. స్థానికంగా లాకర్ సౌకర్యం లేక పోవడంతో మోత్కూరులోని సీసీ బ్యాంక్‌లో బంగారంపై పంట రుణాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు. రెండు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమిని మార్టిగేజ్ చేసినట్లయితే రూ. 7లక్షల వరకు వ్యవసాయ రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఈఓ రామస్వామి నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, వైస్ చైర్మన్ ముద్దసాని సిద్ధులు, మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు బొబ్బల ఇంద్రారెడ్డి, డైరక్టర్‌లు సోలిపురం మల్లారెడ్డి, ఎర్ర అమృతారెడ్డి, కందడి దశరథరెడ్డి, పీసరి నర్సిరెడ్డి, నాల్కపెల్లి యాదయ్య సిబ్బంది భిక్షం, సింహాద్రి, కిరణ్, పావని పాల్గొన్నారు.