సాక్షి, పాన్‌గల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ మెనిఫెస్టోను రూపొందించిందని డీసీసీ సభ్యులు రాంమూర్తినాయుడు, బీసీ సెల్ జిల్లా నాయకులు యుగంధర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని రేమద్దుల, గోప్లాపూర్, కిష్టాపూర్, శాగాపూర్ గ్రామాలల్లో మెనిఫెస్టో కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఐదు పర్యాయాలు పనిచేసిన జూపల్లి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్లు పెంపు, రేషన్ ద్వారా సన్నబియ్యం, ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షలు వంటి పథకాలు అమలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వెంకటయ్యనాయుడు, ప్రతాప్‌రెడ్డి, వహీద్, దామోదర్‌రెడ్డి, రాముయాదవ్, రమేష్, వెంకట్, నర్సింహ్మ, కృష్ణతేజ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను గెలిపించండి
చిన్నంబావి: పేదల అభ్యున్నతికి కృషి చేసిన కాంగ్రెస్‌ను గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీరం హర్షవర్దన్‌రెడ్డి సతీమణి విజయమ్మ కోరారు. శుక్రవారం ఆమె మండలంలోని దగడపల్లి, అమ్మాయిపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. నిరుద్యోగభృతి, ఏడాదికి ఆరు సిలిండర్లు, రైతు రుణమాఫీ తదితర కార్యక్రమాలు అమలవుతాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, చిదంబర్‌రెడ్డి, లొంకహర్షవర్ధన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా కిరణ్‌కుమార్, సాయిబాబు. మల్లికార్జున్, ఆంజనేయులు, వేంకటస్వామి, చక్రధర్‌గౌడు. శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment