పోలీసుల సంక్షేమానికి చర్యలు
-
హోంమంత్రి రాజప్ప
కాకినాడ క్రైం :
పోలీసుల సంక్షేమం «భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శుక్రవారం కాకినాడ ఎస్పీ కార్యాలయ సమీపంలో రూ.10 లక్షలతో నిర్మించిన పోలీస్ రిటైర్డు ఉద్యోగుల సంక్షేమ భవనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ, రాజమహేంద్రవరంలో ఎస్పీ కార్యాలయ భవనాలు నిర్మాణంలో ఉన్నట్టు, ఆదర్శ పోలీస్‌స్టేషన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సమాజంలో పోలీస్ సేవలు విశిష్టమైనవని శాసనమండలి డిప్యూటీ చైర్మ¯ŒS రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎస్పీ ఎం.రవిప్రకాశ్, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఏఎస్పీ ఏఆర్ దామోదర్, జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బలరామ్, పలువురు రిటైర్డ్ అసోసియేష¯ŒS సభ్యులు పాల్గొన్నారు.
మహాసంకల్పదీక్ష ఏర్పాట్లపై సమావేశం
కాకినాడ సిటీ : నవ నిర్మాణదీక్షలో భాగంగా ఈ నెల 8వ తేదీన కాకినాడలో నిర్వహించబోయే మహాసంకల్ప దీక్ష ఏర్పాట్లపై శుక్రవారం స్ధానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రత్యేకగా సమావేశమయ్యారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మ¯ŒS రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పీ చైర్మ¯ŒS రాంబాబు, శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాట్ల బుచ్చిబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్‌వీఎస్ వర్మ, డీసీసీబీ చైర్మ¯ŒS వరుపుల రాజా పాల్గొన్నారు. మహాసంకల్పం సభ నిర్వహించే ఆనందభారతి గ్రౌండ్స్‌ను చినరాజప్ప పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మిశ్రా, ఎస్‌పీ రవిప్రకాశ్‌ను ఆదేశించారు.