
అడ్డాను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అజయ్‌కుమార్
- ఆటో కార్మికుల అడ్డా ప్రారంభంలో ఎమ్మెల్యే అజయ్‌కుమార్
- ఈర్లపుడిలో హరితహారం..
ఖమ్మం అర్బన్: ప్రభుత్వం కార్మికుల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని బల్లేపల్లిలో టీఆర్‌ఎస్ అనుబంధ ఆటో కార్మికుల సంఘం ఏర్పాటు చేసి ఆటో వర్కర్స్ అడ్డాను ప్రారంభించి టీఆర్‌ఎస్ జెండాను ఎగర వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యాక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.ఆనంతరం ఆటో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కొనకంచి ప్రసాద్,ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్యాంసుందర్, కార్యదర్శి సుధాకర్, ప్రధాన కార్యదర్శి మంగ్యా, మల్లూరు, కుమార్,టీఆర్‌ఉస్ జిల్లా నాయకులు కాట్రాల శ్రీరాములు, రమణ, మధన్, మాజీ సర్పంచ్ భూక్యా భాషా, హెచ్. ప్రసాద్,సోమరాజు, రమేష్, సాయిరాం .పాల్గొన్నారు.
రఘునాథపాలెం మండలంలోని ఈర్లపుడి పంచాయతీలోని వివిధ తండాల్లో గురువారం హరితహారంలో ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మొక్కలు నాటారు.పల్లెలు పాడి పంటలతో పచ్చగా ఉండాలన్నా, కాలుష్య రహిత వాతావరణ కావాలన్నా మొక్కలు నాటడమే ప్రధాన లక్ష్యం అన్నారు. కోర్లబోడు తండా, లచ్చిరాం తండా, దోనబండ గ్రామాల్లో మొక్కలు నాటారు.కార్యక్రమంలోఎంపీడీఓ శ్రీనివాసరావు, మండల ఏఈ ఆదిత్య రాజు,సొసైటీ చైర్మన్ తుమ్మల పల్లి మోహన్‌రావు,జెడ్పీటీసీ, ఎంపీపీ,టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాల్గొన్నారు.