ప్రజా సంక్షేమమే ధ్యేయం
–కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా
ఆదోని: దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. మూడేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో పేదలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారని చెప్పారు. ఆదోని పట్టణంలోని శ్రీనివాస ఫంక‌్షన్ æహాలులో సోమవారం ఆర్డీఓ ఓబులేసు అధ్యక్షతన సబ్‌కా సాథ్ సబ్‌కా వికాష్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత పాలకులు తమ వ్యక్తిగత సంపాదన, కార్పొరేట్ సంస్థల ఉన్నతి కోసం పాటు పడ్డాయి తప్ప పేదలను ఏ నాడు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేదల అభ్యున్నతి, దేశ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అసంఘటిత కార్మికులు 60 ఏళ్ల తర్వా నెలకు కనీసం రూ.5వేలు పింఛను పొందేందుకు అటల్ పెన్షన్ యోజనను ప్రవేశ పెట్టామని చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని చెపా్పరు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు, జాతీయ మీడియా ప్రతినిధి చెల్లపల్లి నరిసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూల్‌రెడ్డి, ప్రకాష్‌జైన్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు గిరిరాజవర్మ, రమేష్‌బాబు, సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కునిగిరి నాగరాజు, నాయకులు మేధా మురళీధర్, రంగాస్వామి తదితరులు పాల్గొన్నారు.