టీఆర్‌ఎస్ పాలనలో సంక్షేమం శూన్యం | the welfare is zero in trs ruling : ponguleti | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ పాలనలో సంక్షేమం శూన్యం

Published Thu, Nov 13 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

the welfare is zero in trs ruling : ponguleti

ఖమ్మం అర్బన్: బంగారు తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో ప్రజా సంక్షేమం కోసం చేసింది శూన్యమని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ర్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నగరపాలక సంస్థ నిధుల నుంచి మంజూరైన రూ.10 లక్షలతో ఖమ్మంలోని యూపీహెచ్‌కాలనీ, ప్రశాంతి నగర్‌లో నిర్మించనున్న డ్రెయిన్లకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.

అనంతరం మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించి తీరుతామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని రాష్ర్ట ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఈ సామాజిక వర్గాలు నివాసముంటున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లోపించాయన్నారు.  

కార్యక్రమంలో కార్పొరేషన్ డీఈ వెంకటశేషయ్య, ఏఈ రామన్,  వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, డివిజన్ ఇన్‌చార్జ్ వంటికొమ్ము  శ్రీనివాస్‌రెడ్డి, భీమా శ్రీధర్, దొడ్డా సీతారామయ్య, పత్తి శ్రీను, జిల్లేపల్లి సైదులు,  మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, ఉపాధ్యాయ విభాగం నాయకురాలు షర్మిలా సంపత్, సకీనా, మల్లీదు జగన్, జంగాల శ్రీను, కోపెల దానయ్య, ఫెరోజ్, బాణాల లక్ష్మణ్, వి.శ్రీను, గురుమూర్తి, సుబ్బరాజు, లక్ష్మి, నూనే ఆరవింద్, గుంతేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 బిషప్స్ హౌస్ చర్చిని సందర్శించిన ఎంపీ
 ఖమ్మం స్పోర్ట్స్/కల్చరల్ : ఖమ్మంలోని నాయుడుపేటలోని బిషప్స్‌హౌస్ చర్చిని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సందర్శించారు. పాస్టర్ బిషప్ మైపాన్ పాల్  మధ్యాహ్న విందుకు ఆహ్వానించడంతో ఎంపీ ఆతిథ్యాన్ని స్వీకరించారు. చర్చి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాల గురించి తెలుసుకుని అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆకులమూర్తి, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, జిల్లా నాయకులు తుంబూరి దయాకర్‌రెడ్డి, పత్తి శ్రీను, చర్చి ఫాదర్లు జోష్, సుధాకర్ పాల్గొన్నారు.

 విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
  పెనుబల్లి: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పెనుబల్లి మండల పరిధిలోని కుప్పెనకుంట్ల శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు గురికాకుండా ఉత్తములుగా పేరుగడించాలన్నారు. లోతైన పరిజ్ఞాన్ని పెంపొందించుకుని చదువుల్లో రాణించాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టి పేదలకు సైతం కార్పొరేట్ విద్యను అందించారని గుర్తు చేశారు. ఆయన మరణానంతరం ఆ పథకం అమలు కాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఇ.వి.రమేష్, సెక్రటరీ చావా లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్ టి.నరసింహారావు, వైఎస్‌ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, నాయకులు జె.నర్సింహారెడ్డి, కర్నాటి వీరభద్రారెడ్డి, శీలం వెంకటేశ్వరరెడ్డి, కీసర వెంకటేశ్వరరెడ్డి, ఏనుగు సత్యంబాబు, వర్దెబోయిన కాటం రాజు, ఉలాస రామారావు, నల్లపుల్లయ్య  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement