మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్
హుజూరాబాద్: చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పట్టణంలోని సాయిరూప గార్డెన్‌లో హుజూరాబాద్ వరక్త, వాణిజ్య వ్యాపారుల యాజమానులు గురువారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. చిరు వ్యాపారులు సెలవు లేకుండా ప్రతిరోజూ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారని పేర్కొన్నారు. కూరగాయాల, పండ్ల వ్యాపారులు తోపుడు బండ్లపై పెట్టి వ్యాపారం చేస్తుంటారని, అలాంటి వారి కోసం ఇప్పటికే పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించామని తెలిపారు. ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఆదరిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణంలోని పాపరావు బొందలో ప్రభుత్వ ఖర్చుతో కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపడుతామని తెలిపారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు బర్మావత్ యాదగిరి నాయక్, సీనియర్ నాయకులు చందగాంధీ, తాళ్లపల్లి రమేశ్, శ్రీనివాస్, ఆర్‌కే రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిక
హుజూరాబాద్: నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పలువురు నాయకులు గురువారం పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మంత్రి ఈటల రాజేందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారన్నారు. ప్రజాసంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి అండగా నిలువాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో పూసల ప్రభావతిరెడ్డి, సుజాత, ధనలక్ష్మిలతోపాటుగా వీణవంక, కందుగుల గ్రామాలకు చెందిన 200 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి బండ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత, నాయకులు గందె శ్రీనివాస్, అపరాజ ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్, పోతుల సంజీవ్, కేసిరెడ్డి లావణ్య, కల్లెపల్లి రమాదేవి, విక్రమ్‌రెడ్డి, దాసరి రమణారెడ్డి, దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment