small scale industries
-
పీఎం విశ్వకర్మ పథకానికి 1.4 లక్షల దరఖాస్తులు
న్యూఢిల్లీ: పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ ఈ నెల 17న ప్రారంభించగా, పది రోజుల్లోనే 1.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం పథకం విజయానికి నిదర్శనమన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విశ్వకర్మ సోదరులు, సోదరీమణుల సమగ్రాభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కోల్పోయిన వారి గుర్తింపు తిరిగి పూర్వపు స్థతికి చేరుకుంటుందన్నారు. చేతి పనివారి సామర్థ్యాన్ని పెంచడం, వారి ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కు తీసుకెళ్లడం ఈ పథ కం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ పథకం కింద 18 విభాగాల చేతివృత్తుల పనివారు, కళాకారులు ప్రయోజనం పొందుతారని చెప్పారు. వీరికి ఈ పథకం కింద శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణాకాలంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫెండ్ కూడా లభిస్తుందన్నారు. టూల్‌కిట్స్ కొనుగోలుకు రూ. 15,000 అందజేస్తామన్నారు. లబి్ధదారులు హామీ లేని రూ.3 లక్షల రుణానికి అర్హులని చెప్పారు. -
AP: చిన్న పరిశ్రమలకు చికిత్స
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ముఖ్యంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న సంస్థలను గుర్తించి వాటికి తోడ్పాటునందించే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల మూడేళ్ల ఆదాయ వివరాలను పరిశీలించనుంది. వరుసగా ఆదాయం తగ్గుతున్న యూనిట్లను గుర్తించి వాటికి సహకారం అందించాలని భావిస్తోంది. 2019–20 నుంచి 2021–22 వరకు మూడేళ్లలో చెల్లించిన ఎస్జీఎస్టీలను పరిశీలించి తద్వారా ఆదాయం తగ్గిన యూనిట్లను గుర్తిస్తున్నట్లు ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ తెలిపారు. ఇలా గుర్తించిన యూనిట్లలో ఆదాయం తగ్గడానికి గల కారణాలను అన్వేషించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించాలన్న దానిపై జిల్లాల వారీగా వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆదాయం తగ్గడానికి విద్యుత్, ముడి సరుకు, ఆర్థిక ఇబ్బందులు, మార్కెటింగ్, కూలీల కొరత తదితర కారణాలను గుర్తించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. పటిష్టమైన కార్యాచరణ రూపకల్పన ఇక రాష్ట్రంలో 2.50 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు ఉండగా, ఇందులో 88 శాతానికి పైగా సూక్ష్మ తరహా యూనిట్లే ఉన్నాయి. 1,100 మధ్య తరహా.. 10,000కు పైన చిన్న పరిశ్రమలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఏ ఒక్క ఎంఎస్ఎంఈ పరిశ్రమ మూతపడకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కష్టాల్లో ఉన్న యూనిట్లకు జీవితకాలం చేయూతనిచ్చే విధంగా పటిష్టమైన కారా>్యచరణ ప్రణాళికను సిద్ధంచేస్తున్నట్లు రవీంద్రనాథ్ తెలిపారు. ఇప్పటికే దేశంలో మొదటిసారిగా కరోనా కష్టకాలంలో రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఎంఎస్ఎంఈ యూనిట్లకు గత టీడీపీ ప్రభుత్వ బకాయిలతో కలిపి రూ.2,000 కోట్లకు పైగా రాయితీలను ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చింది. ఇలాగే వరుసగా మూడో ఏడాది కూడా వచ్చేనెలలో ఇవ్వడానికి సర్కారు రంగం సిద్ధంచేసింది. అదే విధంగా.. ఇప్పటికే వ్యాపారం చేస్తూ ఎంఎస్ఎంఈగా నమోదు చేసుకోకపోవడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందనటువంటి సంస్థలను సైతం గుర్తించి వాటిని నమోదుచేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ ‘ఉదయం’ పోర్టల్‌లో కనీసం 1.25 లక్షల యూనిట్లను రిజిస్ట్రేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లను నమోదుచేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, కొత్తగా 4,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఈ ఏడాది ప్రారంభమయ్యాయి. ఎన్‌ఎస్‌ఐసీతో ఏపీఎంఎస్ఎంఈడీసీ ఒప్పందం.. రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకేసింది. కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ)తో ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎంఎస్ఎంఈడీసీ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ సమక్షంలో ఎన్ఎస్ఐసీ జోనల్ హెడ్ కె. శ్రీనివాస్, ఏపీఎంఎస్ఎంఈడీసీ సీఈఓ సృజన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంవల్ల రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో ఏర్పాటవుతున్న చిన్న పరిశ్రమలకు సాంకేతిక సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీరేటుతో ఆరు నెలల్లో తీర్చుకునే విధంగా అప్పుపై ముడి సరుకులు పొందే అవకాశం కలుగుతుందన్నారు. అలాగే.. నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్స్లో పాల్గొనే అవకాశం వంటివి లభించనున్నాయన్నారు. -
లక్ష్యం 2047.. పరిశ్రమలు
బ్రిటష్ పాలనలో దారుణంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) రంగం స్వాతంత్య్రానంతరం చెప్పుకోదగినంత పురోగతినే సాధించింది. ఒకప్పుడు గ్రీస్, రోమన్ సామ్రాజ్యాలకు మేలిమి వస్త్రాలను ఎగుమతి చేసిన భారతదేశం వలస పాలనతో తన వైభవాన్ని కోల్పోడానికి కారణం మన జౌళి ఎగుమతులపై బ్రిటిష్ వాళ్లు అపరిమితంగా సుంకాలు విధించడమే. భారతదేశాన్ని కేవలం ముడి సరకుల ఎగుమతిదారు స్థాయికి దిగజార్చి బ్రిటన్‌లో యంత్రాలపై తయారైన వస్తువులను భారతీయులకు అధిక ధరలకు అంటగట్టేవారు. పర్యవసానంగా స్థానిక కుటీర పరిశ్రమలవారు, చేతివృత్తుల వారు ఎన్నటికీ కోలుకోని విధంగా దెబ్బతిన్నారు. మిగతా రంగాలు కూడా ఇదే విధంగా క్షీణించి పోయాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948 లో స్వదేశీ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానం ఏమంత సత్ఫలితాలను ఇవ్వలేదు. తర్వాత 1956 నాటి పారిశ్రామిక విధానం గ్రామీణ, కుటీర, చిన్న పరిశ్రమలకు ఊతం ఇవ్వాలన్న లక్ష్యంతో ఏర్పడింది. 1991 నాటి పారిశ్రామిక విధానం కొన్ని సంస్కరణలను సూచించింది. 1997 పారిశ్రామిక విధానం చిన్న పరిశ్రమలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలుగా వర్గీకరించింది. 2006 నాటి ఎంఎస్ఎంఇ అభివృద్ధి చట్టం నిర్దిష్ట విధానాలను ముందుకు తెచ్చింది. 2020లో ఆత్మనిర్భర్ పథకంలో ఎంఎస్ఎంఇల వర్గీకరణకు కొత్త ప్రమాణాలు ప్రతిపాదనకు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన సుమారు డెబ్బై ఏళ్లకు 2015–16లో ఈ రంగం 10 కోట్ల ఉద్యోగాలను సృష్టించిందని 73 వ జాతీయ నమూనా సర్వే పేర్కొంది. వచ్చే పాతికేళ్లలో కనుక విధానపరంగా ప్రోత్సాహం లభిస్తే ఈ రంగం మరింతగా పురోగమించగలదని అంచనా. -
చిన్నవే దేశ భవితకు పెద్ద దిక్కు
ప్రపంచ వ్యాప్తంగా ‘మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్‌లు’ (ఎంఎస్ఎంఈ లు) ఆర్థికాభివృద్ధిపరంగా మొత్తం పారిశ్రామిక రంగానికి ఇంజన్‌లాగా పని చేస్తున్నాయని ఆర్థికవేత్తలు గుర్తించారు. 140 కోట్ల మంది జనాభా గల మన దేశంలో పేదరికం పోవాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ఆదాయ అసమానతలు తగ్గాలన్నా... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధితోనే సాధ్యం. అంతేగాక భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే ఈ తరహా పరిశ్రమల అభివృద్ధి అత్యంత ఆవశ్యకం. చైనాలో ఇంటింటికీ ఒక కుటీర పరిశ్రమ ఉండటం, చైనా ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా చలామణి అవ్వడంలో అక్కడి ప్రభుత్వ పెద్దల నిబద్ధత ఎంతో ఉంది. అందుకే చైనా నేడు ప్రపంచ కర్మాగారంగా ఉంది. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని మన దేశంలోలాగా చైనా పాలకులు అనుకోవడం లేదు. చైనాలో స్థానికంగా పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి పరిచినందువలన అక్కడి పేదరికం పోయింది. దీనికి గాను ప్రజలకు రుణాల రూపంలో పెట్టుబడులు సమకూర్చడం, వారికి తగిన శిక్షణ ఇవ్వడం, పరిశ్రమలకు కావలసిన సాంకేతిక సామగ్రిని అందించడం, మార్కెట్లను చూపించడం లాంటి పనుల్లో ప్రభుత్వం ఒక వైపు, ప్రైవేట్ పారిశ్రామిక రంగం మరొకవైపు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మన దేశం సంగతికొస్తే... ఈ ఎంఎస్ఎంఈల ద్వారా నేడు పారిశ్రామిక రంగంలో 97 శాతం ఉద్యోగ కల్పన జరుగుతున్నది. భారీ పరిశ్రమల ద్వారా కేవలం 3 శాతం మాత్రమే ఉద్యోగావకాశాలు ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 6.3 కోట్ల సంస్థలు ఎనిమిది వేల రకాల ఉత్పత్తులను చేస్తూ మన స్థూల జాతీయ ఉత్పత్తిలో 30 శాతం వాటా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 33 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నీ అసంఘటిత రంగంలో ఉన్నాయి. వీటిని సంఘటితపరచి ఆర్థికపరమైన, సాంకేతికపరమైన సహాయం అందించి, సబ్సిడీలు కల్పిస్తే ఉపాధి కల్పనలో, ఆదాయాలు పెంపొందించడంలో దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో వీటి అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఏర్పరిచారు. అయితే వీటికి ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహకాలు అందడం లేదనే విమర్శ ఉంది. మన రాష్ట్రంలో 25.96 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటిలో 70.69 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఏపీలో గత ప్రభుత్వం నిరాదరణ వల్ల అనేక ఎంఎస్ఎంఈలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. దీనికి తోడు కోవిడ్ సంక్షోభం వాటిని మరింత కుంగదీసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ మూతపడకూడదన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ‘రీస్టార్ట్ ప్యాకేజీ’ని ప్రకటించింది. దీని కింద ఎంఎస్ఎంఈలకు గత ప్రభుత్వం బకాయి పడిన రాయితీలతో పాటు ప్రస్తుత రాయితీలు కూడా కలిపి రూ. 2,086 కోట్లు విడుదల చేసింది. (చదవండి: శ్రమ విలువ తెలుసు కాబట్టే...) అంతేగాకుండా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దేశంలోనే తొలిసారిగా ‘వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకా’న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 2020–21లో ఎంఎస్ఎమ్ఈలకు చెందిన ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ. 235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22 కాలంలో ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రూ. 111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ. 24.41 కోట్లు రాయితీలను విడుదల చేసింది. ఈ విధంగా దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందిస్తే... దేశం వాయువేగంతో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందనడంలో సందేహం లేదు. (చదవండి: వికేంద్రీకరణ ఫలితాలు ఇప్పటికే షురూ!) - ఎనుగొండ నాగరాజ నాయుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్ -
పారిశ్రామిక ప్రకాశం !
కరువు జిల్లా ప్రకాశం.. పారిశ్రామిక ప్రగతి వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వ్యవసాయం, పశుపోషణ తప్ప పారిశ్రామిక జాడ లేని జిల్లా నుంచి ఉపాధి కోసం ఏటా వేలాది మంది వలస బాట పడుతుంటారు. వలస జీవితాలకు చెక్ పెట్టేందుకు ఏపీఐఐసీ ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రూ.వేల కోట్ల అంచనాలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు 9 ఇండస్ట్రియల్ పార్కులు, 2 ఎంస్ఎంఈ పార్కులు నెలకొల్పనున్నారు. దీంతో వేలాది మంది ఉపాధికి భరోసా లభించనుంది. ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వేలాది కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ నిరంతరం ముఖ్యమంత్రితో మాట్లాడుతూ కృషి చేస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీఐఐసీ ద్వారా 9 ఇండస్ట్రియల్ పార్కులు, 2 ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. 9 ఇండస్ట్రియల్ పార్కులు 1753.11 ఎకరాలు, బీపీ సెజ్‌లకు 262.87 ఎకరాలు, 2 ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)కు 99.27 ఎకరాల అంచనాలతో పనులు ప్రారంభించారు. వీటిలో వివిధ కేటగిరీలకు సంబంధించి 1097 యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్, టింబర్ డిపోలు, సా మిల్, ఆటోమొబైల్, సిమెంట్ బ్రిక్స్, రైస్ మిల్లులు, డాల్ మిల్స్, బిల్డింగ్ ప్రోడక్టŠస్తో పాటు మరికొన్ని యూనిట్లు ఉన్నాయి. ఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు రూ.2962.38 కోట్ల అంచనాలతో 34,989 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నిరుద్యోగులుగా ఉన్న యువతకు వివిధ వృత్తులకు సంబంధించి నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి చూపేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. రామాయపట్నం చుట్టూ.. రామాయపట్నం పోర్టుతో పాటు రామాయపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఏపీఐఐసీ ద్వారా హబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 4 నుంచి 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటిలో ఇప్పటికే 2346.36 ఎకరాలు పట్టా భూమి, 554.92 ఎకరాల అసైన్డ్ భూమి, 879.19 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి రూ.657.59 కోట్లతో భూ సేకరణ ప్రారంభించారు. దొనకొండలో.. జిల్లాలోని దొనకొండ ప్రాంతంలోని 21 గ్రామాల్లో 25,062.84 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానిలో ఇప్పటికే 2395.98 ఎకరాలు గుర్తించి సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు దొనకొండ ప్రాంతంలో 43.79 ఎకరాలను అభివృద్ధి చేశారు. దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం కందుకూరు సబ్ కలెక్టర్ రూ.394.48 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)ను 6366.66 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీ అంచనాలు రూపొందించింది. దానిలో ఇప్పటికే ఆరు గ్రామాలకు సంబంధించి 1839.09 ఎకరాలకు కలెక్టర్ అడ్వాన్స్ పొజిషన్ ఏపీఐఐసీకి అందచేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మాలకొండపురంలో 1137.63 ఎకరాలకు 856.67 ఎకరాలు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేందుకు కలెక్టర్ వద్దకు దస్త్రం చేరింది. జిల్లాలో ఇప్పటికే ఉన్న పలు పారిశ్రామిక వాడల్లో 574 ప్లాట్లలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వాటిలో గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్, ఒంగోలు బీపీ సెజ్, గిద్దలూరు, మార్కాపురం, సింగరాయకొండ ఇండస్ట్రియల్ పార్కులు, నాగరాజుపల్లి ఫుడ్‌పార్కు, ఎంఎస్ఎంఈ మాలకొండాపురం, రాగమక్కపల్లి, చీరాల ఆటోనగర్ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పాలు ప్రాంతాల్లో భూములను గుర్తించారు. వాటిలో కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని చినలాటరపి గ్రామంలో 53.33 ఎకరాలు, కొండపి నియోజకవర్గంలో చినకండ్లగుంటలో 33.41, పెదకండ్లగుంటలో 29.90 ఎకరాలు, కొత్తపట్నం మండలంలో 50 ఎకరాలు, మార్టూరు మండలంలో 74.18 ఎకరాల భూములను ఎంఎస్ఎంఈ పార్కుల కోసం అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. నిరుద్యోగానికి చెక్ వెనుకబడిన జిల్లా అభివృద్ధే ఏకైక అజెండాగా పనిచేస్తున్నాం. జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని కృషి చేస్తున్నాం. పరిశ్రమలు ఏర్పడితే జిల్లాలో నిరుద్యోగంలో ఉన్న యువతకు ఉపాధి చూపవచ్చు. అంతేకాకుండా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పరిశ్రమల ఏర్పాటుతో వలసలను అరికట్టవచ్చు. జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాం. పరిశ్రమలు ఒక ప్రాంతంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ మేరకు ఆచరణలో ప్రారంభించి ముందుకెళ్తున్నాం. ఔత్సాహికులైన యువత సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలి. -– కలెక్టర్ ప్రవీణ్ కుమార్ -
పూతరేకులు, పాలకోవా, హల్వా: రూ.10 లక్షల వరకూ సబ్సిడీ
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో చిరు పరిశ్రమలకు భారీ సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారు తమ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు... తమ ఉత్పత్తులకు ఒక బ్రాండింగ్ కలి్పంచేందుకు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబదీ్ధకరణ పథకం (పీఎం–ఎఫ్ఎంఈ) కింద సహాయం అందించనుంది. ఈ పథకం కింద పూతరేకులు, స్నాక్స్ తయారీ, హల్వా, పాలకోవ వంటివి తయారుచేసే యూనిట్ల యాజమాన్యాలు తమ వ్యాపారాన్ని మరింత ఆధునికీకరించుకునేందుకు ఇది దోహదపడనుంది. ఇప్పటికే ఈ యూనిట్లను నిర్వహిస్తున్న వారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం లేదా 10 లక్షల వరకు గరిష్టంగా సబ్సిడీ కింద ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇక మిగిలిన 65 శాతంలో 10 శాతం మార్జిన్ మనీ కింద లబి్ధదారుడు భరించాల్సి ఉంటుంది. 55 శాతం బ్యాంకు రుణం కింద పొందవచ్చు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా లబి్ధదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త యూనిట్లను స్థాపించే వారు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంది. కేవలం చెరకు పంట ఆధారిత ఉత్పత్తుల తయారీ అంటే చక్కెర, బెల్లం, చాక్లెట్స్ తయారీ వంటి యూనిట్లకు అవకాశం ఉంటుంది. మరోవైపు కొద్ది మంది రైతులు కలిపి గ్రూపుగా ఏర్పడి యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంటే ప్రాజెక్టు వ్యయంలో ఏకంగా 75 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. జిల్లాలో 4 పారిశ్రామిక పార్కులు ఒకవైపు చిరు పరిశ్రమలను ప్రోత్సహించడంతోపాటు మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాఫీ, చిరుధాన్యాలు, చెరకు పంట, గిరిజన హారి్టకల్చర్ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా 4 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం స్థలాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ పార్కుల్లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వమే భూమిని కేటాయించడంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలను (విద్యుత్, నీరు, రోడ్లు వగైరా) కలి్పంచనుంది. ఇక్కడ యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తు (ఈవోఐ)లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఆయా పారిశ్రామిక పార్కుల్లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చిరువ్యాపారులకు మంచి అవకాశం చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత ఆధునికీకరించుకునేందుకు పీఎం–ఎఫ్ఎంఈ కింద మంచి అవకాశం ఉంది. మొత్తం వ్యయంలో 35 శాతం లేదా గరిష్టంగా 10 లక్షల వరకూ సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఏపీఎఫ్పీఎస్ డాట్‌కామ్/పీఎం–ఎఫ్ఎంఈ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను జిల్లా స్థాయిలో నేను పరిశీలించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మంజూరవుతుంది. – కె.గోపికుమార్, ప్రాజెక్టు డైరెక్టర్, ఏపీఎంఐపీ -
వ్యవసాయం, చిన్న పరిశ్రమలకోసం పీఎన్బీ క్యాంపులు
హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఆధ్వర్యంలో వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని బ్యాంకు ఎండీ ఎస్.ఎస్.మల్లికార్జునరావు తెలిపారు. ’గ్రామ్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి అవసరమైన వారికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. గాంధీ జయంతి నాడు ఒకే రోజున దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లో 526 గ్రామాల్లో క్యాంపులు చేపట్టి వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులు, గృహనిర్మాణ దారులకు రుణాలపై అవగాహన కల్పించామన్నారు. 4 వేల గ్రామీణ బ్రాంచీల ద్వారా డిసెంబర్ 31 నాటికి 25 గ్రామాల్లో క్యాంపులు పెట్టాలని నిర్ణయించామన్నారు. కేంద్ర పథకాల సద్వినియోగంపై విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. డిజిటలైజేషన్,క్రెడిట్, సోషల్ సెక్యూరిటి, ఆధార్ సీడింగ్, మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాలపై క్యాంపులో అవగాహన కల్పిస్తామని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో 141, ఆంధ్రప్రదేశ్‌లో 137 పంజాబ్ నేషనల్ శాఖలు ఉన్నాయని తెలిపారు. -
చిన్న పరిశ్రమకు పెద్ద సమస్య
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించడంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేత తర్వాత ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కోలుకునేందుకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. పెద్ద కంపెనీల నుంచి వచ్చే ఆర్డర్లపైనే ఎంఎస్ఎంఈ పరిశ్రమల మనుగడ ఆధారపడి ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కనీసం 25 శాతం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు శాశ్వతంగా మూతపడే అవకాశం ఉందని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలతో పాటు పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు నిర్ణయం తీసుకోవాలంటూ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), భారతీయ వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కి), అసోచామ్ కేంద్రాన్ని కోరాయి. 10 వేలకు పైగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తెలంగాణ పరిశ్రమల సమాఖ్య (టిఫ్) లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10 వేలకు పైగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలున్నాయి. వీటి ద్వారా సుమారు 15 లక్షలకు పైగా మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించిన వేతనాలను సర్దుబాటు చేసిన ఎంఎస్ఎంఈలు తమ ఖాతాల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ఏప్రిల్ వేతనాల చెల్లింపుపై మల్లగుల్లాలు పడుతున్నాయి. లాక్డౌన్ పొడిగింపు తెలివైన నిర్ణయమే అయినా తమ పరిశ్రమల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో తమ వద్ద నగదు నిల్వలు నిండుకుంటే తలెత్తే పరిస్థితిపై ఆందోళన చెందుతున్నాయి. నిబంధనలు సడలించాలని వినతి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి లేనందున నిబంధనలు సడలించేలా ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేయాలని పారిశ్రామిక సంఘాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. నిరర్ధక ఆస్తుల గుర్తింపు నిబంధనలను కనీసం రెండేళ్ల పాటు సడలించాలని ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కోరుతున్నాయి. మరోవైపు రుణాల అసలు, వడ్డీ చెల్లింపుపై ప్రభుత్వం విధించిన మూడు నెలల మారటోరియాన్ని కూడా పొడిగించాలని ఎంఎస్ఎంఈలు డిమాండ్ చేస్తున్నాయి. రుణాల చెల్లింపుపై మారటోరియంతో పాటు వడ్డీ రేట్ల తగ్గింపు, నిర్వహణ పెట్టుబడి, మార్టగేజ్ రుణాల మంజూరులో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలని పారిశ్రామిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీ.. లాక్డౌన్ మూలంగా దేశవ్యాప్తంగా రోజుకు రూ.40 వేల కోట్లు నష్టం వాటిల్లుతుండగా, ఇందులో పారిశ్రామిక రంగం వాటా ఎక్కువగా ఉందని సీఐఐ, ఫిక్కి వంటి సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగాల వారీగా భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఈ సంఘాలు కోరుతున్నాయి. దేశ జీడీపీలో 5 శాతం మేర అనగా సుమారు రూ.10 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని పారిశ్రామిక రంగానికి ప్రకటించాలనేది వీరి ప్రతిపాదన. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ పరిశ్రమలతో పాటు పారిశ్రామిక రంగానికి ఊతం లభిస్తుందని ‘టిఫ్’వర్గాలు వెల్లడించాయి. ఇటు వచ్చే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఎరువులు, విత్తనాలు, ఫుడ్ ప్రాసెసింగ్, బ్రేవరేజెస్ పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునివ్వాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. -
చిన్న పరిశ్రమలకు డబ్బు కొరత రానీయం!
న్యూఢిల్లీ: చిన్న లఘు మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) నిధుల కొరత రాకుండా తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వస్తు, సేవల సరఫరాలకు సంబంధించి వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి ఎంఎస్ఎంఈలకు రూ.40,000 కోట్ల బకాయిలను ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఆర్థికమంత్రి వెల్లడించారు. న్యాయపరమైన అంశాల్లో చిక్కుకోని మిగిలిన బకాయిలను అక్టోబర్ మొదటి వారం లోపు చెల్లించేయడం జరుగుతుందని ఆర్థికమంత్రి స్పష్ట చేశారు. ఎంఎస్ఎంఈలకు చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.60,000 కోట్లనీ ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మూలధన పెట్టుబడులపై 21 కీలక మౌలిక పరిశ్రమ విభాగాల ఉన్నత అధికారులతో సీతారామన్ శుక్రవారం సమావేశమయ్యారు. అనంతర ప్రకటనలో ముఖ్యాంశాలు.. ఆర్థికాభివృద్ధికి తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయాల పెంపుద్వారా వృద్ధికి ఊతం ఇవ్వాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఇందులో భాగంగా వచ్చే నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన సమగ్ర వ్యయ ప్రణాళికలను సమర్పించాలని వివిధ మంత్రిత్వశాఖలు, ఆయా విభాగాలను కోరడం జరిగింది. చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా ఉండాలని ప్రభుత్వం ఎంతమాత్రం కోరుకోదు. వివిధ శాఖలకు చేసిన సేవలు, వస్తు సరఫరాలకు సంబంధించి ఎటువంటి బకాయిలు ఉండకూడదనే ఆర్థికశాఖ భావిస్తోంది. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్ అంచనాల మేర మూలధన వ్యయాలకు కేంద్రం కట్టుబడి ఉంది. అందుకు తగిన బాటలోనే కొనసాగుతోంది. బడ్జెట్ అంచనాలను అందుకుంటామనడంలో ఎటువంటి సందేహాలూ అక్కర్లేదు.వినియోగం పెరగాలి. రుణ వృద్ధీ జరగాలి. తద్వారా గణనీయమైన ఆర్థిక పురోగతి సాధ్యపడుతుంది. పెట్టుబడులకు ప్రాధాన్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకూ చూస్తే, మౌలిక రంగానికి చెందిన పలు మంత్రిత్వశాఖలు తమ మూలధన పెట్టుబడుల ప్రణాళికలు విషయంలో దాదాపు 50 శాతం లక్ష్యా లను సాధించాయని వ్యయ వ్యవహారాల కార్యదర్శి జీసీ ముర్మూ ఈ సందర్భంగా తెలిపారు. 2019–20 బడ్జెట్ ప్రకారం– కేంద్రం వ్యయ లక్ష్యాలు రూ.27.86 లక్షల కోట్లు. ఇందులో ఒక్క మూలధన వ్యయాల మొత్తం రూ.3.38 లక్షల కోట్లు. దీనితోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ (జీఏఐ)గా మంత్రిత్వ శాఖలు, విభాగాలకు మరో రూ.2.07 లక్షల కోట్లను క్యాపిటల్ అసెట్స్ సృష్టికి చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిపై ఎఫ్ఎస్డీసీ సబ్ కమిటీ సమీక్ష ఇదిలావుండగా, ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సబ్ కమిటీ 23వ సమీక్ష సమావేశం జరిపింది. వ్యవస్థలో నిధుల కొరత (లిక్విడిటీ) రానీయకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సమావేశ అంశాల్లో కీలకమైనది. ఆర్థికమంత్రి నేతృత్వం వహిస్తుండగా, ఎఫ్ఎస్డీసీ సబ్ కమిటీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ నేతృత్వం వహిస్తారు. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశం ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వం, ఇందుకు సంబంధించిన చర్యలపై కూడా సమీక్ష జరిపినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఎఫ్ఎస్డీసీలో వివిధ నియంత్రణా సంస్థల ప్రతినిధులు, ఆర్థికశాఖ విభాగాల చీఫ్‌లు ప్రాతినిధ్యం వహిస్తారు. శుక్రవారం నాటి సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై చర్చ జరిగింది. -
చిరు వ్యాపారుల సంక్షేమానికి కృషి
హుజూరాబాద్: చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పట్టణంలోని సాయిరూప గార్డెన్లో హుజూరాబాద్ వరక్త, వాణిజ్య వ్యాపారుల యాజమానులు గురువారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. చిరు వ్యాపారులు సెలవు లేకుండా ప్రతిరోజూ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారని పేర్కొన్నారు. కూరగాయాల, పండ్ల వ్యాపారులు తోపుడు బండ్లపై పెట్టి వ్యాపారం చేస్తుంటారని, అలాంటి వారి కోసం ఇప్పటికే పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించామని తెలిపారు. ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఆదరిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణంలోని పాపరావు బొందలో ప్రభుత్వ ఖర్చుతో కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపడుతామని తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు బర్మావత్ యాదగిరి నాయక్, సీనియర్ నాయకులు చందగాంధీ, తాళ్లపల్లి రమేశ్, శ్రీనివాస్, ఆర్కే రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరిక హుజూరాబాద్: నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పలువురు నాయకులు గురువారం పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మంత్రి ఈటల రాజేందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే టీఆర్ఎస్లోకి చేరుతున్నారన్నారు. ప్రజాసంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి అండగా నిలువాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో పూసల ప్రభావతిరెడ్డి, సుజాత, ధనలక్ష్మిలతోపాటుగా వీణవంక, కందుగుల గ్రామాలకు చెందిన 200 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి బండ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత, నాయకులు గందె శ్రీనివాస్, అపరాజ ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్, పోతుల సంజీవ్, కేసిరెడ్డి లావణ్య, కల్లెపల్లి రమాదేవి, విక్రమ్‌రెడ్డి, దాసరి రమణారెడ్డి, దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
15 నిమిషాల్లో యాప్
సాక్షి, సిటీబ్యూరో : మీ వ్యాపారం.. చిన్నదైనా.. పెద్దదైనా.. డిజిటల్, ఆన్లైన్ మాధ్యమంలో స్మార్ట్‌గా వినియోగదారులను చేరేందుకు ఓ వినూత్న మొబైల్యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆన్‌గో సంస్థ వినూత్న సృష్టితో కేవలం 15 నిమిషాల్లో మీ వ్యాపారానికి చోదకశక్తిని అందించే మొబైల్‌యాప్‌ను ఈ సంస్థ సృష్టిస్తోంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ కోసం యాప్ సిద్ధంచేస్తే రూ.2 వేలు, ఐఓఎస్ మొబైల్స్‌కు సిద్ధం చేస్తే రూ.3 వేలు మాత్రమే చార్జీ చేస్తుండడం విశేషం. హైదరాబాద్ కేంద్రంగా వెలసిన ఈ అంకుర సంస్థ చిన్నవ్యాపారులకు ఓ వరంలా మారింది. ఉపాధి కల్పన.. పెట్టుబడుల ప్రవాహం.. వినియోగదారులకు అవసరమైన వినియోగ వస్తువుల తయారీ, ఎగుమతుల్లో కీలక భూమిక పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ యాప్ చోదకశక్తిని అందిస్తుండడం విశేషం. ఆయా సంస్థలు తయారుచేస్తున్న ఉత్పత్తులను, వాటి విశిష్టతలు, ధరలు, ఉపయోగాలు, ఇతర ఉత్పత్తులకంటే భిన్నంగా లభ్యమవుతున్న సౌకర్యాలు, రాయితీలపై డిజిటల్ మాధ్యమంలో వినియోగదారులకు సమస్త సమాచారాన్ని అందించడమే మొబైల్యాప్ ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు సుమారు వెయ్యి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మొబైల్‌యాప్‌లను సిద్ధం చేయడమే కాదు.. వీటిని గూగుల్ ప్లేస్లోర్లో అందుబాటులో ఉంచారు. యాప్‌లకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుల మొబైల్స్‌కు లింక్ రూపంలో పంపిస్తుండడం విశేషం. యాప్‌ల తయారీ, నిర్వహణ బాధ్యతలను రెండింటినీ ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు సుమారు వెయ్యి చిన్న సంస్థలు, 65 బడా సంస్థలు, 475 సూక్ష్మ పరిశ్రమలు, మరో 25 స్టార్టప్‌లకు సంబంధించిన యాప్స్ సిద్ధం చేసినట్లు సంస్థ సీఈఓ రామకుప్ప తెలిపారు. ప్రత్యేకతలివీ.. 15 నిమిషాల్లో మీ వ్యాపారానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను సృష్టిస్తుంది. కృత్రిమ మేధస్సు అనువర్తనాలను వినియోగించుకొని అన్నిరకాల వ్యాపారాలకు అవసరమైన యాప్‌లను సిద్ధం చేస్తుంది. ఉదా: హోటల్స్, రెస్టారెంట్స్, వస్త్ర దుకాణాలు, ఫుడ్‌కోర్టులు మొదలైనవి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మొబైల్‌తోపాటు వెబ్బేస్డ్ యాప్‌లను తక్కువ ఖర్చుతో తయారు చేసి అందిస్తుంది. మొబైల్ ఫస్ట్,లో కోడ్,నో–కోడ్ ప్రత్యేకతలతో ఈ సంస్థ యాప్‌ను సిద్ధంచేస్తుంది. చిన్నవ్యాపారులు మార్కెట్అవకాశాలను విస్తృతం చేసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. మొబైల్, స్థానిక క్లౌడ్, ఆండ్రాయిడ్ అనువర్తనాలు, వెబ్ ఆధారిత అనువర్తనాలను రూపొందించడం. చిన్నవ్యాపారులు ఎవరైనా తేలికగా డిజిటల్ వినియోగదారులకి చేరుకోవడం, మార్కెట్ అవకాశాలను విస్తృతం చేసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. మీకూ కావాలా.. అయితే సంప్రదించండి.. www.ongoframework.com, 040 - 48532121 -
రాయితీల వెత.. పరిశ్రమల మూసివేత!
సాక్షి, హైదరాబాద్ : సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. రాష్ట్రంలోని 69,120 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో 8,618 పరిశ్రమలు ఇప్పటికే ఖాయిలా పడ్డాయి. మరో వందల సంఖ్యలో పరిశ్రమలూ అదే దారిలో ఉన్నాయి. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి స్థాపించిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. దీంతో పెట్టుబడి రుణాలను తిరిగి చెల్లించలేక యువ పారిశ్రామికవేత్తలు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈ రుణాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటిస్తున్న బ్యాంకులు ఈ పరిశ్రమలను వేలం వేస్తున్నాయి. కొత్తగా స్థాపించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోకుండా తొలి ఐదేళ్లు రాయితీ, పోత్సాహకాలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తోంది. రాయితీ, ప్రోత్సాహకాల కోసం ఈ పరిశ్రమలు మూడు నాలుగేళ్ల కింద పెట్టుకున్న దరఖాస్తులు ఇంకా ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కేటాయిస్తున్న రాయితీ, ప్రోత్సాహకాల నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో పెండింగ్ బకాయిలు ఏటికేటికీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని 5,060 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీ, ప్రోత్సాహకాల బకాయిలు రూ.981.23 కోట్లకు పెరిగిపోయాయి. ఐడియా బాగున్నా.. ఆచరణేదీ! కొత్తగా స్థాపించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలం గాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్’ (టీ–ఐడియా) అనే పథకాన్ని 2014 నవంబర్ 29న ప్రకటించింది. ఈ పథకం కింద జనరల్ కేటగిరీకి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్తగా పరిశ్రమలు నెలకొల్పితే ప్రోత్సాహకంగా రూ.20 లక్షలకు మించకుండా 15 శాతం పెట్టుబడి వ్యయాన్ని రాయితీగా ఇస్తామని పేర్కొంది. అదే జనరల్ కేటగిరీ మహిళలకైతే అదనంగా రూ.10 లక్షలకు మించకుండా మరో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని వెల్లడించింది. ఈ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి 5 ఏళ్ల వరకు సేల్స్ ట్యాక్స్, విద్యుత్ బిల్లులను రీయింబర్స్మెంట్ చేస్తామని, పెట్టుబడి రుణాలు భారం కాకుండా పావలా వడ్డీ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపింది. మొత్తం 11 రకాల ప్రయోజనాలను ప్రకటించింది. ఈ రాయితీ, ప్రోత్సాహకాల కోసం పరిశ్రమల నుంచి వచ్చే దరఖాస్తులను రాష్ట్ర పరిశ్రమల శాఖ నేతృత్వంలోని జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు పరిశీలించి అర్హులైన వాటిని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాయి. అయితే పరిశ్రమల శాఖ సిఫారసు చేసిన మూడు నాలుగేళ్లకు గానీ ఈ ప్రయోజనాలు సదరు పరిశ్రమలకు అందట్లేదు. నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీవ్ర జాప్యమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. -
సేవా పన్నుల మోత
14 శాతానికి సర్వీస్ ట్యాక్స్ పెంపు న్యూఢిల్లీ: వేతన జీవులకు ఆదాయ పన్ను పరంగా పెద్ద ఊరటనివ్వని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. సేవా పన్నుల పెంపు ద్వారా అందరిపైనా మరింత భారం మోపారు. ప్రస్తుతం 12.36 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్, విద్యా సెస్సును కలిపి మొత్తం రౌండ్ ఫిగరు 14 శాతం చేశారు. దీంతో ఇకపై రెస్టారెంట్లలో తిన్నా, హోటళ్లలో ఉన్నా, విమాన ప్రయాణాలు చేసినా, బ్యూటీ పార్లర్లకెళ్లినా మరింత అధికంగా చెల్లించాల్సి రానుంది. ఇక కేబుల్.. డీటీహెచ్ సేవలు, కొరియర్ సర్వీసులు, క్రెడిట్..డెబిట్ కార్డు సంబంధిత సేవలు, దుస్తుల డ్రై క్లీనింగ్ మొదలైనవి కూడా భారం కానున్నాయి. మరోవైపు, స్టాక్ బ్రోకింగ్, అసెట్ మేనేజ్మెంట్, బీమా సేవలతో పాటు ఇతరుల నుంచి పొందే చాలా మటుకు సర్వీసులు ప్రియం కానున్నాయి. అయితే, కొన్ని ఉత్పత్తుల ప్రీ కూలింగ్, రిటైల్ ప్యాకింగ్, లేబులింగ్ మొదలైన వాటిని సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయించడంతో ప్యాకేజ్డ్ ఫ్రూట్స్, కూరగాయల రేట్లు కొంత తగ్గనున్నాయి. పేషెంట్లకు అందించే అంబులెన్స్ సర్వీసులను సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఇక, మ్యూజియాలు, జూ, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు మొదలైన వాటి సందర్శకులకు కూడా సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, అమ్యూజ్మెంట్ పార్కులు.. థీమ్ పార్కులు లాంటి వాటిని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి తేవడంతో వీటిని సందర్శించడం మరికాస్త ఖరీదైన వ్యవహారం కానుంది. లాటరీ టికెట్లను సేవా పన్ను పరిధిలోకి చేర్చడంతో ఇకపై వీటి ధరలు పెరగనున్నాయి. ధూమపాన ప్రియులకు వాత..: ఎప్పటిలాగానే ఈ బడ్జెట్లో కూడా పొగాకు ఉత్పత్తుల వినియోగదారులకు వాత తప్పలేదు. ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు ఆర్థిక మంత్రి. 65 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పొడవుండే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 25 శాతం మేర, మిగతా వాటిపై 15 శాతం మేర పెంచారు. ఇక ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ. 1,000కి పెంచడంతో సిమెంటు రేట్లు మరింత పెరగనున్నాయి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లు మొదలైన వాటిపైనా సుంకాన్ని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. అలాగే ఫ్లేవర్డ్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ వాటర్ సైతం మరింత ప్రియం అవుతాయి. ఫోన్ బిల్లులూ భారం..: సర్వీస్ ట్యాక్స్ పెంపు భారాన్ని టెలికం కంపెనీలు వినియోగదారులకు బదలాయించనుండటంతో ఇకపై ఫోన్ బిల్లులూ భారం కానున్నాయి. దీనివల్ల బిల్లులు అరశాతం మేర పెరగవచ్చని జీఎస్ఎం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ తెలిపారు. కొంత ఊరట..: దేశీయంగా తయారు చేసే మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ/ఎల్సీడీ ప్యానెల్స్, ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ ల్యాంప్స్‌పైనా ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ధరలు తగ్గనున్నాయి. వివిధ పరికరాలపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో రిఫ్రిజిరేటర్లు, సోలార్ వాటర్ హీటర్ల ధరలు తగ్గనున్నాయి. అగర్‌బత్తీలపై సుంకాన్ని ఎత్తేయడంతో చవకగా లభించనున్నాయి. 20 వేల కోట్లతో ముద్ర బ్యాంక్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణసౌకర్యం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను ప్రోత్సహించడానికి ప్రాథమికంగా రూ. 20 వేలకోట్ల కార్పస్ నిధితో ముద్ర బ్యాంక్ (మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ఈ బడ్జెట్లో ప్రకటించింది. ఇందులో రూ.3వేల కోట్ల మేర కార్పస్ నిధిని క్రెడిట్ గ్యారంటీకింద కేటాయిస్తారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఈ ఆర్థిక సంస్థద్వారా మైక్రోఫైనాన్స్ సంస్థలకు రీఫైనాన్స్ చేస్తారు. వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకు రుణసౌకర్యం కల్పిస్తారు. రుణాల మంజూరులో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు నడిపే ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో 5.77 కోట్ల చిన్నతరహా వ్యాపార యూనిట్లు ఉన్నట్లు గుర్తించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వీటిలో సుమారు 62 శాతం మేర ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల చేతిలోనే ఉన్నాయని, అందులోనూ వ్యక్తిగతంగా నడిపేవే ఎక్కువని తెలిపారు. అయితే వీరు తమ వ్యాపార అవసరాలకోసం డబ్బు కొరత ఎదుర్కొంటున్నారని, ఇతర మార్గాలను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరిని ఆదుకునేందుకే ముద్ర బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. -
రోజుకు 232 పరిశ్రమలు.. బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చిన్న పరిశ్రమల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్‌బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. 2013-14 చివరి త్రైమాసికానికి సంబంధించి ఆర్బీఐ కొద్దిరోజుల క్రితం నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం డిసెంబర్ 2013 నాటికి ఖాయిలాపడిన పరిశ్రమల సంఖ్య 14,964 ఉండగా.. మార్చి 2014 నాటికి వీటి సంఖ్య ఏకంగా 35,876కు చేరుకుంది. కేవలం 3 నెలల కాలంలోనే ఏకంగా 20,912 పరిశ్రమలు ఖాయిలాపడ్డాయి. అంటే రోజుకు 232 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పరిశ్రమలశాఖ నివేదిక ప్రకారం ఒక సూక్ష్మ లేదా చిన్నతరహా పరిశ్రమలో సగటున కనీసం 25 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే 232 పరిశ్రమలు రోజుకు మూతపడ్డాయంటే.. రోజుకు 5,800 మంది కార్మికులు వీధి పాలవుతున్నారన్నమాట. అదేవిధంగా ఈ పరిశ్రమలకు చెందిన రూ. కోట్ల పెట్టుబడి నిరర్ధకంగా మారుతోంది. ఇందుకు కారణం నాలుగేళ్లుగా ఎడతెరపి లేకుండా సాగుతున్న విద్యుత్ కోతలు-వాతలే కారణమని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కోతలు- వాతల వల్లే దుస్థితి నాలుగేళ్ల నుంచి పరిశ్రమల పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. వారంలో సగం రోజులు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ప్రస్తుతం కూడా పరిశ్రమలకు వారంలో ఒక రోజుపాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ కోతలతో పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం రోజురోజుకీ తగ్గిపోతోంది. ఫలితంగా వచ్చిన ఆర్డర్లను పరిశ్రమలు పూర్తిచేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఆర్డర్లన్నీ వెనక్కి వెళుతున్నాయి. దీంతో పరిశ్రమలు నిధుల రాక నిలిచిపోయింది. ఈ పరిణామాల వల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను పరిశ్రమలు సకాలంలో చెల్లించలేకపోతున్నాయి. వరుసగా మూడు నెలలు రుణం చెల్లించకపోతే సంబంధిత పరిశ్రమ రుణాలను నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా పరిగణిస్తున్నారు. బ్యాంకులకు రుణాలను సకాలంలో చెల్లించలేకపోతున్న పరిశ్రమల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రాధాన్యత ఇవ్వకపోతే శాశ్విత అంధకారమే ఎఫ్‌ఎస్‌ఎంఈ అధ్యక్షుడు ఏపీకె రెడ్డి విద్యుత్ సరఫరాలో పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే శాశ్వతంగా పారిశ్రామికవేత్తలకు అంధకారం తప్పదు. ఆర్బీఐది అధికారిక నివేదిక. అనేక మంది పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమ ఖాయిలా పడకూడదని వ్యక్తిగతంగా అప్పులు చేసి మరీ బ్యాంకులకు రుణాలు తీరుస్తున్నారు. వీటితో కలుపుకుంటే ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఇరు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏపీ, తెలంగాణలో రోజుకు 232 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఈ లెక్కన రోజుకు సుమారు 5,800 మంది కార్మికులు రోడ్డుపాలవుతున్నారు. -ఆర్బీఐ నివేదిక -
చిన్న పరిశ్రమలను పట్టించుకోని కిరణ్ సర్కార్