దర్శనం చేసుకుంటున్న గజల్ శ్రీనివాస్.
విజయనగరం టౌన్: ఆలయాలను పరిరక్షణకు ప్రజలందరి సహకారం కావాలని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం విజయనగరం సంతపేటలోని జగన్నాథస్వామి ఆలయాన్ని సందర్శించుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ తరఫున ఆలయ ఆధునీకరణకు రూ. లక్ష అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫేస్‌బుక్‌లో ప్రత్యేక పేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ కన్వీనర్ అయిన ఆయన ప్రవాసాంద్రులను సమావేశపరిచి సంస్థ తరపున దేవాలయాల పరిరక్షణకు వారితో కలిసి కృషి చేస్తానని హామినిచ్చారు.