జంగారెడ్డిగూడెం రూరల్, న్యూస్‌లైన్: పంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రొట్టెముక్క కాదని.. మట్టి ముద్దని, రాష్ట్ర విభజన ఎవరితరం కాదని గజల్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో రాయప్రోలు సాహితి సత్సంగ పీఠం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరైన సమైక్యాంధ్రపై మాట్లాడారు. ఎప్పటికీ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర అన్నదమ్ములంతా కలిసే ఉంటారన్నారు. కుయుక్తుల చర్యల వల్ల రాష్ట్ర విభజనకు పాల్పడుతున్నారని, గాంధేయవాదంతో రాష్ట్రం సమైక్యంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పోరాడాలని, తెలుగు భాషా సంస్కృతిని విడదీయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, కేసీఆర్ జంగారెడ్డిగూడెం వచ్చి భోజనం చేయడం ఖాయమని ఆయన అన్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో 1035 కిలో మీటర్లు శాంతి కోసం పాదయాత్ర చేసి గజల్స్ గీతాలు ఆలపించినట్లు చెప్పారు.
ఆకట్టుకున్న సమైక్య గీతాలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గజల్ శ్రీనివాస్ ఆలపించిన గీతాలు సమైక్యవాదులను ఆకట్టుకున్నాయి. ఓయి తెలుగువాడా... హైదరాబాద్ ఎవరిది భరతమాతను అడుగవా... బెదిరింపులు చేస్తానంటే నా ఇంటి బువ్వ తినిపిస్తా.. వంటి గీతాలు ఆయన పాడారు.
పంచుకోవడానికి రాష్ట్రం రొట్టెముక్క కాదు : గజల్ శ్రీనివాస్
Published Sat, Dec 21 2013 3:12 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement