
సాక్షి, హైదరాబాద్: యువతిని లైంగికంగా వేధించారన్న కేసులో ప్రముఖ గజల్ గాయకుడు కె.శ్రీనివాస్ జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సేవ్ టెంపుల్స్’సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో శ్రీనివాస్‌ను పోలీసులు ఈ నెల 2న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రిమాండ్ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు 18న విచారణ జరపనుంది. ఈ కేసులో రెండో నిందితురాలు పార్వతి పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment