
సాక్షి, హైదరాబాద్: ‘సేవ్ టెంపుల్స్’ సంస్థలో పనిచేస్తున్న సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో నిందితుడు గజల్ శ్రీనివాస్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మరోవైపు తనపై అన్యాయంగా కేసు పెట్టారని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్నారు.