రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691గా ఉన్నారు. నిన్న టిడిపి నేతలు, ఎల్లో మీడియా హడావిడి చూస్తే.. ఈ రోజు కోర్టు ప్రారంభం కాకముందే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని అంతా భావించారు, కానీ చంద్రబాబు తరపు లాయర్లు ఎలాంటి బెయిల్ పిటిషన్ కోర్టులో వేయలేదు.
చంద్రబాబును జైల్లో వద్దు, గృహ నిర్భంధంలో ఉంచండి అంటూ బాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు
7.10PM - కేసు విచారణ రేపటికి వాయిదా
► ఏసీబీ కోర్టులో ఇవ్వాళ్టికి ముగిసిన వాదనలు
6.30pm - ఏసీబీ కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభం
► చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్ పై మళ్లీ వాదనలు ప్రారంభం
► ఏసిబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్న సిఐడీ తరపు న్యాయవాది
► చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత ఉందని చెప్పిన CID లాయర్
5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం
5.50pm - వాదనలకు విరామం ప్రకటించిన న్యాయమూర్తి
5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం
► కోర్టులో ఎన్నో అంశాలుంటాయి
► ఒక పిటిషన్ వాదనలు పూర్తి కాకముందే మరో పిటిషనా?
► దేనికయినా ఒక ప్రొసీజర్ ఉంటుంది
► మిగతా కేసులు జాప్యం కావా?
► ఏ పిటిషన్ అయినా మధ్యాహ్నం 12లోపు వేయాలి
► నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినాలనడం సరికాదు
5.06pm - బాబుకు మినహాయింపులేమీ వద్దు : పొన్నవోలు
► చంద్రబాబును హౌజ్ అరెస్ట్‌కు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే ప్రమాదం
► CRPCలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు
► మరో 2 కేసుల్లోనూ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు
5.05pm - చంద్రబాబుకు వెసులుబాటు ఇవ్వాలి : లూథ్రా
► చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉంది
► జైలులో కరుడుగట్టిన నేరగాళ్లు ఉంటారు
► చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది
4.50pm - కేసు డాక్యుమెంట్లు కావాలి : లుథ్రా
► స్కిల్ కుంభకోణం కేసుకి సంబంధించి పూర్తి వివరాలు కావాలి
►సిట్ కార్యాలయంలో డాక్యుమెంట్లని పరిశీలించడానికి అనుమతించండి
►సెక్షన్ 207 ప్రకారం అనుమతి ఇవ్వాలి
►పిటిషన్ వేసిన లాయర్ సిద్దార్ద లూథ్రా
4.45pm - చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై క్లారిఫికేషన్ కోరిన ఏసీబీ కోర్టు
►సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను ఉదహరించిన బాబు తరపు న్యాయవాదులు
►కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగిన న్యాయమూర్తి
►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు
►త్వరలోనే ఆదేశాలు వెలువడే అవకాశం
4.15pmచంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లుథ్రా
►చంద్రబాబు ఇప్పటివరకు ఎన్ఎస్‌జీ భద్రతలో ఉన్నారు
►చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది
►హౌజ్ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది
►గౌతం నవార్కర్ కేసు పరిశీలించండి
►హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయి
►చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలి
3.30pm : AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి
►రాజమండ్రి సబ్ జైల్ 50 అడుగుల గోడ, అక్కడికి ఎవరు రాలేరు
►రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యూరిటీ ఎక్కడా ఉండదు
►అలాగే డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారు
►కాబట్టి చంద్రబాబుకు హౌజ్ అరెస్ట్ అవసరం లేదు
►చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుంది
►చంద్రబాబు ఆరోగ్యం బాగుంది
►చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.
3.20pm : అడ్వకేట్ జనరల్ శ్రీరామ్
►చంద్రబాబు భద్రతకి ఎటువంటి ఇబ్బంధులు లేవు
►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు కి గట్టిభద్రత కల్పించాం
►జైలులో చంద్రబాబుకి ప్రత్యేక గదితో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది
►చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డిజి ఆదేశాల లేఖని మీ ముందు ఉంచుతున్నా
►జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడి భధ్రతా బాధ్యత ప్రభుత్వానిదే
►చంద్రబాబు కోరిన విధంగా కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు అందుతున్నాయి
►చంద్రబాబుకి భద్రత కొనసాగుతోంది
►గృహ నిర్బందం పిటిషన్ డిస్మిస్ చేయాలి
►ఈ పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు
►చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది
3:00pm
3గంటల తర్వాత చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ సిద్ధం చేసినట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం జరిగింది. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారని, 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ పిటిషన్ వేస్తారని, రెండు పిటిషన్లను న్యాయవాదులు ఒకేసారి దాఖలు చేయనున్నట్టు సమాచారం.
మరో వైపుచంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు అయినట్టు టిడిపి వర్గాల సమాచారం. చంద్రబాబును కుటుంబ సభ్యులు రేపు కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటు రాజమండ్రిలోనే ఉన్న లోకేష్ బస్సులోనే ముఖ్య నేతలతో సమావేశం జరిపినట్టు సమాచారం. చంద్రబాబు అరెస్టు తర్వాతి పరిణామాలపై చర్చించిన టిడిపి నేతలు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో బయటపడ్డ ఆధారాలపై మంతనాలు జరిపారు. కొందరు సీనియర్లు లోకేష్‌తో కేసు బలంగా ఉందని చెప్పినట్టు సమాచారం.
ACB Court Live Updates
►చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు
►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు వాదనలు
►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్‌ను తిరస్కరించాలన్న సీఐడీ కౌంటర్ పిటిషన్
►రాజమండ్రి జైలులో పూర్తి భద్రత మధ్య చంద్రబాబు ఉన్నారు
►బాబును హౌజ్ అరెస్టులో ఉంచాల్సిన అవసరం లేదు
►ఆర్థిక నేరాల్లో ఉన్న నిందితుడికి హౌజ్ అరెస్ట్ అనేది అవసరం లేదు
► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. సీఆర్‌పీసీలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు. బెయిల్ ఇవ్వలేదు కాబట్టే హౌజ్ రిమాండ్ కోరుతున్నారు. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్ కాపీలో పేర్కొంది.
► చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో అరెస్ట్ కోరుతూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ ( ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్) వేశారు సిట్ తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో.. కోర్టుకి 6 వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించినట్లు తెలుస్తోంది.
మరో కేసులో చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్?
విజయవాడ ఏసీబీ కోర్టులో.. సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్(పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరింది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొంది సీఐడీ.
► చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30కి వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు.. చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. అదే సమయంలో.. భద్రతా కారణాల రీత్యా చంద్రబాబు రిమాండ్‌ను.. హౌజ్ అరెస్ట్‌గా పరిగణించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఏసీబీ న్యాయమూర్తి వాదనలు వినే అవకాశం ఉంది.
► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత విచారణ జరగనుంది.
► చంద్రబాబు హౌజ్ అరెస్టుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఏఏజీ అందుబాటులో లేరని.. సమయం ఇవ్వాలని సిట్ స్పెషల్ జీపి న్యాయమూర్తిని కోరారు. దీంతో.. హౌజ్ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశిస్తూ.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరమే ఆదేశాలేవైనా ఇస్తామని న్యాయమూర్తి చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేశారు.
► ఏఏజీ స్పందన
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు తరపున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదు. ఏసీబీ కోర్టు తీర్పు కాపీ ఇవాళ అందుతుంది. చంద్రబాబుని ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశాం. చంద్రబాబు భద్రతా పరంగా చూసుకుంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచి చోటు ఉండదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. హౌజ్ అరెస్ట్ పిటిషన్ పరిణామంపై స్పందించారు.
ఎఫ్ఐఆర్ లో పేరులేకపోయినా దర్యాప్తు తర్వాత పేర్లు చేర్చొచ్చు. FIR అనేది దర్యాప్తునకు మొట్టమొదటి అడుగు. దర్యాప్తులో ఎవరి ప్రమేయం బయటపడినా , వాళ్ల పేర్లు చేర్చొచ్చు. FIR లో లేదు కాబట్టి ముద్దాయి కాదంటే , న్యాయసూత్రాలకు విరుద్ధం - ఈ కేసు ఏపీ ప్రభుత్వం పెట్టింది కాదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు.
► చంద్రబాబును జైల్లో ఉంచడం ప్రమాదకరం - హౌస్ అరెస్ట్ పిటిషన్ పై మా వాదనలు వినిపిస్తాం - గతంలో వెస్ట్ బెంగాల్ మంత్రుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తాం - బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నాం : అడ్వకేట్ కౌన్సిల్ సిద్ధార్ద్ లూద్రా
► విజయవాడ కోర్టులో మరోసారి హౌజ్ అరెస్ట్ పిటిషన్ వేయనున్న లూథ్రా!. ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ వీవీఐపీగా ఉన్న చంద్రబాబు నాయుడను హౌజ్ అరెస్ట్ చేయాలని, భద్రతా కారణాల వల్ల ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోర్టును కోరే ఛాన్స్ కనిపిస్తోంది.
► ఏసీబీ కోర్టు తీర్పు కాపీ కోసం చంద్రబాబు లాయర్ల ఎదురుచూపులు. తీర్పులోని అంశాల ఆధారంగానే.. బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలా? హైకోర్టులో వేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్.
ఏసీబీ కోర్టుకు వచ్చిన చంద్రబాబు తరపు లాయర్లు
విజయవాడ కోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ లూథ్రా , ఇతర లాయర్లు. సీఐడీ కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరపున తన వాదనలు వినిపించనున్న లూథ్రా. అలాగే బెయిల్ పిటిషన్ ఎక్కడ వేయాలన్నదానిపైనా లీగల్ టీంతో చర్చలు.
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి.. విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు పిటిషన్లు విచారణకు రానున్నాయి. స్కిల్ స్కాంలో ప్రధాన ముద్దాయి అయిన చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని, తద్వారా మరిన్ని వివరాలు రాబట్టగలిగే అవకాశం కల్పించాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును కోరనుంది.
స్కిల్ స్కామ్ కేసుపై ఇవాళ మొత్తం మూడు పిటిషన్లు విచారణకు రానున్నాయి. ముందుగా విచారణకు రానుంది చంద్రబాబు కస్టడీ పిటిషన్. ఐదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరనున్నాయి. అలాగే.. ఏ 1 ముద్దాయి చంద్రబాబుని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు విచారణలో చంద్రబాబు తమకు సహకరించలేదని కోర్టుకు విన్నవించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దీనికి కౌంటర్‌గా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు.
ఇక.. కస్టడీ పిటీషన్ పై విచారణ తర్వాత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
మరోవైపు హైకోర్టుని ఆశ్రయించే ఆలోచనలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయాలని హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కానీ, జైలుకు తరలించడం తో హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణకు తీసుకోరని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో ఏసీబీ కోర్టులోనే బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయొచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment