సాక్షి, హైదరాబాద్: ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమ ఆస్తులు కూడా బెట్టుకున్నట్లు సమాచారం. పలువురు అధికారులపై ఏసీబీ దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. వారి నుంచి వచ్చిన డబ్బుతో అధికారులు భారీగా సంపాదించారు.
విలాసవంతమైన విల్లాలో అధికారులు నివాసం ఉంటున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ లిస్టులో ఫోన్ ట్యాపింగ్ పోలీసు అధికారులు చిట్టా, వారి ఆర్థిక పరిస్థితిని ఏసీబీ విశ్లేషిస్తోంది. ఆదాయానికికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకకు చెందిన రాజకీయ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం
నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్
ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేశారు. భుజంగరావు, తిరుపతన్న ప్రణీత్ రావు ముగ్గురిని కస్టడీ కొడుతూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో నిందితులు ఉన్నారు. ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. బడా వ్యాపారవేత్తలను, హవాలా దందా చేసే వారిని బెదిరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రణీత్ రావు టీంలో పనిచేసిన అధికారులను నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచి దర్యాప్తు బృందం విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment