సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ వేసింది. 8 రోజులు కస్టడీ కి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
నేడు(శుక్రవారం) కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బినామీ ఆస్తులు, యాపారవేత్తలతో కలిసి పెట్టుబడులపై ఏసీబీ విచారణ చేయనుంది.
ఉమామహేశ్వరరావు ల్యాప్‌టాప్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. దీంతో ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చే పనిలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.
ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్‌లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్‌లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది.
ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment