జయ, లాలు బాటలోనే బాబూ నడవాలి | ap cm babu should resign like jaya and lalu says nomula | Sakshi
Sakshi News home page

జయ, లాలు బాటలోనే బాబూ నడవాలి

Published Wed, Jun 17 2015 5:25 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

జయ, లాలు బాటలోనే బాబూ నడవాలి

జయ, లాలు బాటలోనే బాబూ నడవాలి

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే రాజీనామా చేయాలని  టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినపుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత,  బీహార్ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ తమ తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు.  

చంద్రబాబు  కూడా వారి బాటలోనే నడవాలని, పదవి నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బాబు అనేక  ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  ఈ క్రమంలోనే గవర్నర్  నరసింహన్ పై  కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని నోముల విమర్శించారు. గవర్నర్ తప్పుకోవాలంటూ టీ-టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement