చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది అంబిక. సీనియర్ హీరోయిన్ రాధ సోదరి అయిన ఈ మలయాళ నటి తన సొంత భాషతో పాటు తమిళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ యాక్ట్ చేసింది. దొంగలు బాబోయ్ దొంగలు, మా నాన్నకు పెళ్లి, రాయుడు, నేటి గాంధీ, కొండవీటి సింహాసనం, మనసు పలికే మౌనరాగం.. ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం బుల్లితెరపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈమె రెండు పెళ్లిళ్లు చేసుకుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.
రెండు పెళ్లిళ్లు?
1988లో ఎన్నారై ప్రేమ్‌కుమార్‌ను పెళ్లాడగా వీరికి ఇద్దరు కుమారులు సంతానం. వ్యక్తిగత విభేదాల కారణంగా 1996లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2000వ సంవత్సరంలో నటుడు రవికాంత్‌ను పెళ్లాడగా 2002లో విడాకులు తీసుకున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వికీపీడియాలోనూ ఈ విషయం రాసి ఉండటంతో అందరూ అదే నిజమని భావిస్తున్నారు.
భార్యాభర్తలుగా నటించినంత మాత్రాన..
తాజాగా ఈ ప్రచారంపై నటుడు రవికాంత్ స్పందించాడు. 'నేను అంబిక భర్తనంటూ ప్రచారం చేస్తున్నారు. మేమిద్దరం పలు సినిమాల్లో భార్యాభర్తలుగా నటించినంత మాత్రాన నిజంగానే దంపతులమైపోతామా? మేమిద్దరం పక్క పక్క ఇంట్లోనే నివసిస్తాం. కాబట్టి షూటింగ్ ఉన్నప్పుడు రెండు కార్లు తీయకుండా ఒకే కారులో వెళ్తుంటాం. భార్యాభర్తలు కలిసొస్తున్నారంటూ అందరూ సరదాగా ఆటపట్టిస్తుంటారు.
నేను ఆమె భర్తను కాదు
అంతేకానీ మేము పెళ్లి చేసుకోలేదు. అంబిక.. ప్రేమ్‌కుమార్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో ఉండేది. షూటింగ్స్ కోసం వచ్చి వెళ్తుండేది.. అంతే! నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు. తన భర్తను కానే కాదు' అని క్లారిటీ ఇచ్చాడు. కాగా రవికాంత్ తమిళంలో సరోజ, బిర్యానీ, అభిమన్యు, మానాడు వంటి చిత్రాల్లో అలరించాడు. ప్రస్తుతం మలర్ అనే సీరియల్ చేస్తున్నాడు.
చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు
Comments
Please login to add a commentAdd a comment