బాలీవుడ్ నటి సుష్మితా సేన్ ఎందరితోనో డేటింగ్ చేసింది. కానీ, ఎవరినీ తన జీవిత భాగస్వామిగా అంగీకరించలేకపోయింది. ఆ మధ్య ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్‌లో పడ్డప్పటికీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేకపోయింది. మాజీ బాయ్‌ఫ్రెండ్, మోడల్ రోహ్మన్ షాతోనే తరచూ బయట కనిపిస్తోంది. తన ఇంట్లోని పార్టీలకు, సెలబ్రేషన్స్‌కు రోహ్మన్ ఉండాల్సిందే!
మూడేళ్లుగా సింగిల్‌గా
బయట ఈవెంట్స్, షాపింగ్‌కు వెళ్లినప్పుడు కూడా సుష్మితకు నీడలా తోడుంటున్నాడు. అలా అని వీళ్లిద్దరూ మళ్లీ ప్రేమాయణం నడపడం లేదట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుష్మిత మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఇప్పుడు ఏ పురుషుడూ లేడు. మూడేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నాను. ప్రేమ వెంట పరుగులెత్తాలన్న ఆలోచన, ఆసక్తి కూడా లేదు. అంతకుముందు ఐదేళ్లపాటు ఒకరితో రిలేషన్‌లో ఉన్నాను. దానికి బ్రేకప్ చెప్పి లవ్ లైఫ్‌లో బ్రేక్ తీసుకోవడం బాగుంది.
పెళ్లి వద్దంటున్నారు
ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా నా పిల్లలు అస్సలు ఒప్పుకోరు. ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? అని అడిగితే నా పెద్ద కూతురు.. అతడే కాదు నువ్వు ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు.. అసలు వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని గడిపావు. అలాంటిది పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అని ప్రశ్నిస్తోంది' అని చెప్పుకొచ్చింది.
కెరీర్..
కాగా సుష్మిత సేన్.. 2000వ సంవత్సరంలో రెనీని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. సుష్మిత 2021లో రోహ్మన్ షాకు బ్రేకప్ చెప్పింది. ఆమె చివరగా ఆర్య: అంతిమ్ వార్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.
చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీరియల్ డైరెక్టర్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment