‘గుడివాడ’కు రుణపడి ఉంటా | Jananeta consist of: Kodali Nani | Sakshi
Sakshi News home page

‘గుడివాడ’కు రుణపడి ఉంటా

Published Sat, May 17 2014 2:09 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

‘గుడివాడ’కు రుణపడి ఉంటా - Sakshi

‘గుడివాడ’కు రుణపడి ఉంటా

  • వైఎస్సార్‌సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని
  •  గుడివాడ, న్యూస్‌లైన్: గుడివాడ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని వైఎస్సార్‌సీపీ గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిరావి వెంకటేశ్వరరావుపై  11573 ఓట్ల మెజార్టీతో విజయంసాధించిన అనంతరం విజయవాడలోని కౌంటింగ్ హాలువద్ద విలేకరులతో మాట్లాడారు. తనను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించిన గుడివాడ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.  
     
    ప్రజలిచ్చిన తీర్పు  గౌరవిస్తాం...

     
    సీమాంధ్రలో తమ పార్టీకి ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని ఎమ్మెల్యే కొడాలినాని పేర్కొన్నారు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారని చెప్పారు.  రాష్ట్రంలో ప్రజలకు ఏ అన్యాయం జరిగినా వాళ్ల తరఫున పోరాటం చేస్తామన్నారు.  అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రభావం కారణంగా ఒకటి రెండు శాతం ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యామని తెలిపారు. రాబోయే కాలంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement