'టీడీపీకి కాదు... వైఎస్ఆర్ సీపీకే గుడివాడ కంచుకోట' | Kodali Nani takes on TDP Chief Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'టీడీపీకి కాదు... వైఎస్ఆర్ సీపీకే గుడివాడ కంచుకోట'

Published Sat, May 17 2014 1:25 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

'టీడీపీకి కాదు... వైఎస్ఆర్ సీపీకే గుడివాడ కంచుకోట' - Sakshi

'టీడీపీకి కాదు... వైఎస్ఆర్ సీపీకే గుడివాడ కంచుకోట'

తనకు తుది శ్వాస ఉన్నంత వరకు గుడివాడ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంచుతానని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కొడాలి నాని స్పష్టం చేశారు. శనివారం గుడివాడలో కొడాలి నాని విలేకర్లతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గం టీడీపీకి ఎంత మాత్రం కంచుకోట కాదని అన్నారు. గుడివాడ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తానే అందుకు ఉదాహరణ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తమకు తీవ్ర అన్యాయం చేస్తుందనే భావన గుడివాడ ప్రజలలో తీవ్రంగా నాటుకుపోయిందని తెలిపారు. ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీని చూసీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెగ మురిసిపోతున్నారని  ఎద్దేవా చేశారు.

 

చంద్రబాబుకు అధికారం వచ్చిందంటే అదంతా గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనంతోనే అన్న విషయాన్ని గమనించాలని కొడాలి నాని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాడ టీడీపీకి కంచుకోట అంటూ ప్రచారం చేశారు. అయితే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని అఖండ విజయం సాధించారు. ఈ  సందర్భంగా కొడాలి నాని శనివారం విలేకర్ల సమావేశంలో టీడీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement