దిగ్విజయ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నర్సంపేట ఎమ్మెల్యే
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. పార్టీ బలోపేతానికే మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను ఆయన ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కండువాకప్పి దొంతిని కాంగ్రెస్‌లోకి దిగ్విజయ్ ఆహ్వానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీలు బలరాంనాయక్, వివేక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యతో కలిసి దొంతి మాధవరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేలకు తగినన్ని నిధులు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని సీఎం కేసీఆర్‌ని కోరారు.
సొంతగూటికి దొంతి మాధవరెడ్డి
Published Wed, Nov 5 2014 2:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement