హైదరాబాద్ : సికింద్రాబాద్ తార్నాక, మెట్టుగూడ వద్ద ట్రాఫిక్ అవాంతరాలను తొలగించే దిశగా పోలీసులు జంక్షన్లను ఆదివారం మూసివేశారు. దీంతో ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేందుకు మార్గం ఏర్పడింది. జంక్షన్లను మూసివేసి సమీపంలోనే యూ టర్న్‌లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు సిగ్నల్స్ కోసం ఆగే పని లేకుండా ముందుకు వెళ్లేందుకు వీలు కల్పించారు.