'బీజేపీ యూటర్న్‌ తీసుకుంటే విభజన ఆగుతుంది' | Bifurcation process stops if BJP take U-Turn: Killi Krupa Rani | Sakshi
Sakshi News home page

'బీజేపీ యూటర్న్‌ తీసుకుంటే విభజన ఆగుతుంది'

Published Wed, Oct 23 2013 6:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'బీజేపీ యూటర్న్‌ తీసుకుంటే విభజన ఆగుతుంది' - Sakshi

'బీజేపీ యూటర్న్‌ తీసుకుంటే విభజన ఆగుతుంది'

తిరుమల: విభజనపై బీజేపీ తన విధానం మార్చుకుంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఆపే శక్తి కేంద్రంలోని ప్రతిపక్ష బీజేపీకి ఉందని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ యూటర్న్‌ తీసుకుంటే రాష్ట్రం విడిపోదని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు న్యాయం జరగాలంటే యూటీ చేయాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లేవారంతా అధికారం కోసమే వీడుతున్నారని ఆరోపించారు. ప్రజల మనోభావాలు గౌరవవించకుంటే కాంగ్రెస్‌ పార్టీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. మంత్రుల బృందం (జీవోఎం)ను మరోసారి కలిసి తమ అభిప్రాయాలు తెలియజేయనున్నట్టు కృపారాణి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement