Killi Krupa Rani
-
కిల్లి కృపా రాణి చంద్రబాబు నాయుడుఫై వ్యాఖ్యలు
-
అగ్రభాగంలో ఉంచినందుకు అభినందనలు
సాక్షి, శ్రీకాకుళం: బీసీలకు రాజ్యాధికారం కల్పించడంలో దేశంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రథమ స్థానంలో ఉందని శ్రీకాకుళం వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత వెనుకబడిన జిల్లాలో బీసీలకు స్పీకర్, ఉపముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా జిల్లా అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాను రాజకీయ ప్రాధాన్యతలో అగ్రభాగంలో ఉంచినందుకు మరోసారి వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. మత్య్సకారుల పట్ల సీఎం జగన్ కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చాలా గొప్పవంటూ ప్రశంసించారు. ఇక ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీలో జగనన్న పచ్చతోరణం కార్యకర్యమ్రాన్నిజిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, జి.సందీప్ కృపాకర్ మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బీసీల మీద బాబుది సవతి ప్రేమ
-
అచ్చెన్నాయుడుకు కృపారాణి సవాల్
సాక్షి, టెక్కలి: ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయని నిరూపించడానికి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో బహిరంగ చర్చకు సిద్ధమా అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి సవాల్ విసిరారు. శనివారం ఆమె మాట్లాడుతూ కరోనా భయంతో హోమ్ క్వారంటైన్కే పరిమితమైన అచ్చెన్నాయుడు ఈ రోజు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని జూమ్ యాప్‌లో రాజకీయ ఉనికి చాటుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా అందలేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. పథకాల్లో అధికంగా టీడీపీ నాయకుల కుటుంబాలే లబ్ధి పొందుతున్నాయని గుర్తు చేశారు. నిమ్మాడలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు పడలేదని, అదే గ్రామంలో అమ్మఒడి, రైతు భరోసా, విద్యాదీవెన పథకాలు అందలేదని నిరూపించగలరా, దీనిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. సీఎంపై లేనిపోని విమర్శలు చేస్తే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అడ్డంగా దొరికారు..
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే చంద్రబాబు బండారం... అతని వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ జరిపిన దాడులతో బట్టబయలైందని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి విమర్శించారు. రెండు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఉన్నట్లుగా ఆధారాలు లభించడంతో చంద్రబాబు ఆయనను బినామీగా పెట్టుకొని ఎలా అవినీతి జరిపారో తేటతెల్లమైందన్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు రెండు నాలుకల ధోరణితో మా ట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవా రం విలేకరుల సమావేశంలో ఈమె మాట్లాడుతూ తన ప్రభుత్వ హయాంలో అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మండిపడ్డారు. పీఎస్ అక్రమ సంపాదనే ఈ స్థ్ధాయిలో ఉంటే మరి చంద్రబాబు అక్రమార్జన ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలకు అంతుపట్టడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేసి శాశ్వత çప్రాతిపదికన ఒక్క పని కూడా పూర్తి చేయలేదన్నారు. చంద్రబాబు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లేందుకు సమయం ఆసన్నమైందన్నారు. శ్రీనివాస్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు చెబుతుంటే సామాన్య ప్రజలు సైతం నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబుపై 11 కేసులుంటే న్యాయవ్యవస్ధలను మేనేజ్ చేసుకుని స్టేలు తెచ్చుకుని కోర్టులకు హాజరవ్వకుండా ఐదేళ్లు గడిపేశారని ఇప్పుడా పప్పులుడకవన్నారు. చంద్రబాబు నిజంగా ఎటువంటి అవినీతి చేయకుంటే సీబీఐ విచారణను బహిరంగంగా ఆహ్వానించాలని సవాలు విసిరారు. రాజధానిలోఇన్సైడ్ ట్రేడింగ్ చేసి రియల్ వ్యాపారం చేసుకుని వేలాది ఎకరాల భూముల్ని అనవసరంగా తీసుకున్నారన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలన దేశానికే ఆదర్శం ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి కృషి చేస్తున్నారని కృపారాణి అన్నారు. దేశమంతా యువ ముఖ్యమంత్రి జగన్ పాలనకు జేజేలు పలుకుతూ.. ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1.50 కోట్ల కొత్త బియ్యం కార్డులు అందించిందన్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా సంవత్సరాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నారన్నారు. అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాలు, సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు మేలు చేస్తుంటే అభినందించాల్సిందిపోయి ఈర‡్ష్య పడటం సరికాదన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సైకిల్ పటాపంచలవుతుందని జోస్యం చెప్పారు. 23న వైఎస్సార్సీపీ విస్తృతస్ధాయి సమావేశం ఈనెల 23వ తేదీ సాయంత్రం 3 గంటలకు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నట్లు కృపారాణి తెలిపారు. ఈ సమావేశంలో స్ధానిక సంస్థల ఎన్నికలపై భవిష్యత్ కార్యాచరణ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. నవరత్నాల అమలుపై ప్రజల సంతృప్తస్ధాయి ఏ స్ధాయిలో ఉందో తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, చౌదరి సతీష్, కిల్లి రామ్మోహనరావు, పి.సుగుణారెడ్డి, కొంక్యాణ మురళి, తంగుడు నాగేశ్వరరావు, పైడి రవి, పైడి చందు, వీవీఎస్ ప్రకాస్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై విచారణ జరిపించాలి
-
చంద్రబాబుకు మంత్రి కృష్ణదాస్ సవాల్..
సాక్షి, శ్రీకాకుళం: లక్ష కోట్ల రాజధాని ఏపీ అభివృద్ధికి దోహదపడదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అధికార వికేంద్రీకరణ కోరుతూ ఆదివారం శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే రాష్ట్రం శాశ్వతంగా సుభిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. పవన్‌కల్యాణ్ స్థిరత్వం లేని నాయకుడు అని.. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని విమర్శించారు. చంద్రబాబు మద్దతుతో కొంతమంది మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే నరసన్నపేటలో తనపై పోటీ చేసి గెలవాలని కృష్ణదాస్ సవాల్ విసిరారు. .. టీడీపీ బ్రిడ్జి పార్టీలా వ్యవహరిస్తోంది.. టీడీపీ చేస్తోన్న అమరావతి దీక్షలను దొంగ దీక్షలుగా వైఎస్సార్సీపీ నేత కిల్లి కృపారాణి అభివర్ణించారు. అధికార వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. బీజేపీకి టీడీపీ బ్రిడ్జి పార్టీలా వ్యవహరిస్తోందని విమర్శించారు. విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారు.. అమరావతి ఉద్యమం పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ ధ్వజమెత్తారు. విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటే బుద్ధి చెబుతాం.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబుకి తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. చంద్రబాబు పక్షపాత వైఖరి వలనే ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న కృషిని చంద్రబాబు ఓర్వలేక అమరావతి ఉద్యమం ముసుగులో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. -
ఏం దొరక్క చివరికి ఇసుకపై పడ్డారా?..
సాక్షి, శ్రీకాకుళం: గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు ఇసుకపై చేసిందేంటి?, టీడీపీ హయాంలో ఇసుకపై వందసార్లు క్యాబినెట్ సమావేశాలలో చర్చించామని, ఇసుకపై కొత్త పాలసీని ప్రవేశపెట్టామని చెప్పి.. ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ఎలాగోలా బురద జల్లాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని, ఏం దొరక్క చివరికి ఇసుకపై పడ్డారని అమె మండిపడ్డారు. వరదల వలన నదులు ఉధృతంగా ప్రవహించి.. ఇసుక తవ్వకాలకు ఆటంకం ఏర్పడటంతో కొంత ఇసుక కొరత వాస్తవమని తెలిపారు. ఇసుక మూలంగానే అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో ప్రజలు కుర్చోబెట్టారని, చంద్రబాబు ఏం ముఖం పెట్టుకుని ఇప్పుడు దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లాలోని నది భూగర్భాలలో ఇసుక తవ్వేసి.. రాబందుల్లా దోచేయలేదా అని కృపారాణి మండిపడ్డారు. అక్రమ ఇసుక రవాణాని అడ్డుకోవడానికే ఏపీఎన్ఎండీసీ ద్వారా తవ్వకాలు చేసి.. స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఇసుక అందాలని సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆమె వెల్లడించారు. ఇక భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మరికొద్ది రోజులలో స్టాక్ పాయింట్లు పెంచి ఇసుక మరింత అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. కాగా ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మోద్దని, కావాలనే భవన నిర్మాణ కార్మికులను రెచ్చగొట్టె కార్యక్రమాలు చేస్తున్నారని కిల్లి కృపారాణి పేర్కొన్నారు. -
నేడు నగరానికి సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నగరానికి రానున్నారు. నగరంలోని ఎంజీఎం గ్రౌండ్స్‌లో జరగనున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. బుధవారం సాయంత్రం 5.50 గంటలకు సీఎం తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 6.20 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు రాత్రి 7 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రాత్రి 7.10 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి పార్కు హోటల్ సమీపంలోని ఎంజీఎం గ్రౌండ్స్‌కు 7.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 7.50 గంటలకు రోడ్డుమార్గంలో బయలుదేరి 8.10 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. -
టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది
-
చిరుద్యోగుల కుటుంబాల్లో జగన్ ఆనందం నింపారు
సాక్షి, శ్రీకాకుళం : చిరు ఉద్యోగులకు జీతాలు పెంచి లక్షలాది కుటుంబాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం నింపారన్నారు వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ మంత్రివర్గ కూర్పు దేశానికే ఆదర్శం అన్నారు. జగన్ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాల వారికి సమాన ప్రాధాన్యత కల్పించడం హర్షణీయం అన్నారు. చంద్రబాబు తన మంత్రి వర్గంలో మైనార్టీ, గిరిజనులకు స్థానం కల్పించకుండా వాళ్లని అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానం రద్దు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న జగన్ ఆలోచన అభినందనీయం అన్నారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం రైతాంగానికి పెద్ద ఊరట అని ఆమె ప్రశంసించారు. -
అవినీతి రహిత రాష్ట్రమే సీఎం జగన్ లక్ష్యం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): దేశ రాజకీయ చరిత్రలో అవినీతిని అంతమొందించాలనే నిర్ణయం తీసుకున్న సీఎం ఇప్పటివరకు ఎవ్వరూ లేరని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పం చరిత్రాత్మకమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో సోమవారం ఈమె మాట్లాడుతూ సీఎం జగన్ తొమ్మిదేళ్లపాటు నిర్విరామంగా కష్టపడి ప్రజలందరి సమస్యలు తెలుసుకుని అందుకు తగినట్లుగా నవరత్నాలు రూపొందించడంతో వైఎస్సార్సీసీకి పట్టం కట్టారన్నారు. అదేవిధంగా రాజకీయ చరిత్రలో 50శాతానికి పైగా ఓటింగ్ వేయించుకున్న ఘనత జగన్మోహన్రెడ్డికి తప్ప మరెవ్వరికి సాధ్యపడదన్నారు. చంద్రబాబు తాను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆర్భాటం చేస్తూ రూ.30 కోట్లు ఖర్చు చేస్తే, జగన్మోహన్రెడ్డి మాత్రం రూ.15లక్షలతో సాదాసీదాగా చేసుకోవడం ప్రజలందరిని ఆశ్చర్యానికి గురి చేందన్నారు. తొలి సంతకంతోనే వృద్ధులకు అంచెలంచెలుగా రూ.3 వేలు ఇవ్వడం, తొలి దశలోనే వికలాంగులకు రూ.3 వేలు ఇవ్వడం, డయాలసిస్ కిడ్నీ రోగులకు రూ.10 వేలు నిర్ణయంతో ఎంతోమందికి లబ్ధి చేకూరనుందన్నారు. మద్యానికి బానిసై లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రూ.43,800 బెల్టుషాపుల రద్దుకు తీసుకున్న నిర్ణయం ఓ సంచలనమన్నారు. 4 లక్షల మంది వలంటీర్లను ఆగస్టు 15 కల్లా, గ్రామ సచివాలయాల్లో 1.6 లక్షల ఉద్యోగాలు గాంధీ జయంతి కల్లా నియమించి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలన్నదే జగన్ సంకల్ప మన్నారు. చంద్రబాబులా ఓ పెద్ద పుస్తకాన్ని ఎన్నికల మేనిఫెస్టోగా ముద్రించి, దాన్ని కనీసం ప్రజలకు తెలియకుండానే వెబ్సైట్లో తొలగించారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రతిఒక్కరూ తమ జేబుల్లో నిత్యం ఉంచుకునేలా రెండు పేజీల మేనిఫెస్టో ప్రకటించారని, దీనిపై ప్రశ్నించే వెసులుబాటు కల్పిస్తామన్నారు. చంద్రబాబునాయుడు వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడని, అవే సీట్లు ఈ ఎన్నికల్లో టీడీపీకి మిగిలాయని ఎద్దేవా చేశారు. జిల్లాలో అఖండ విజయాన్ని సాధించిన 8 మంది ఎమ్మెల్యేలకు, మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అభినందన సభ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలకు విమానఖర్చులు, ప్రచారాలకు, సభలు, సమావేశాలకు లక్షల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేసి రాష్ట్రాన్ని రూ.2.50లక్షల కోట్లు అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. దీంతో ఆ అప్పు ప్రతీ పౌరుడిపై రూ.60వేలు ఉందన్నారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ జీతంలో దాచుకున్న జీపీఎఫ్ ఖాతా నుంచి రూ.60కోట్లు వాడేయడం దారుణమని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎన్ని ధనుంజయరావు, టీ కామేశ్వరి, శిమ్మ రాజశేఖర్, తంగుడు నాగేశ్వరరావు, కోరాడ రమేష్, పైడి చందు, పైడి రవి, జీ కేశవరావు, గుంట జ్వోతి, పీ సుగుణారెడ్డి, పైడి అమ్మినాయుడు, సురంగి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు చంద్రబాబును నమ్మలేదు
-
టీడీపీలో వలసలే సంకేతాలు..!
సాక్షి, అమరావతి : ఎన్నికల ముందు అధికార పార్టీ టీడీపీ నుంచి నాయకుల వలసలు పెరగడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుంటున్న నేతలంతా పలు సామాజిక వర్గాలతోపాటు ఆయా ప్రాంతాల్లో ప్రజలను ప్రభావితం చేయగలిగిన నేతలే. వీరిలో సర్పంచుల నుంచి సిట్టింగ్ ఎంపీల వరకూ ఉన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్యెల్యేలు వరుసగా వైఎస్సార్సీపీలోకి చేరడం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, వేగంగా మారుతున్న పరిణామాలను కళ్లకు కడుతున్నాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంవైపు నేతలు అడుగులు వేయలేదని విశ్లేషకులు అంటున్నారు. వాడుకుని వదిలేసే చంద్రబాబు వైఖరితో విసుగెత్తిన ప్రజాప్రతినిధులంతా మునిగిపోయే నావ టీడీపీ నుంచి బయటపడుతున్నారని పేర్కొంటున్నారు. అధికార పార్టీలో కలవరం.. తాజా పరిణామాలు టీడీపీ అధినేతకు, అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అనుకూల పవనాలు వీస్తుండడమే నిరంతర చేరికలకు కారణమని టీడీపీ అధినేత తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల విశ్లేషకులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రతో మొదలైన వలసలు ఎన్నికల నామినేషన్లు ముగిసేనాటికి పతాకస్థాయికి చేరుకున్నాయి. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటం, టీడీపీని ప్రముఖ నేతలు వీడుతుండటం రాష్ట్రంలో స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారనేందుకు సంకేతమని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. ‘తూర్పు’లో ప్రకంపనలు... తూర్పు గోదావరి జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలిచిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న నానుడి ఉంది. ఈ జిల్లాలో వైఎస్సార్సీపీలోకి భారీ వలసలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్, మరో ముగ్గురు ప్రముఖ నాయకులు కూడా అధికార పార్టీని వీడటం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీలో చేరిన కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహానికి పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది. కాపు సామాజికవర్గంలో ఆయనకు మంచి ఆదరణ ఉంది. ఆయన భార్య తోట వాణి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమార్తె. టీడీపీని వీడిన మరో సిట్టింగ్ ఎంపీ (అమలాపురం) పండుల రవీంద్రకు అన్ని వర్గాలతో సత్సంబంధాలున్నాయి. మాజీ మంత్రి పర్వత బాపనమ్మకు ప్రత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టుంది. రాజమండ్రికి చెందిన శివరామ సుబ్రహ్మణ్యం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్, కేబుల్ టీవీ అధినేత. వైశ్య సామాజికవర్గానికి చెందిన ఆయన రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లోని 5 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు. పర్వత రాజబాబు, బెజవాడ సత్యనారాయణలు ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ సెగ్మెంట్లలో బలమున్న నేతలు. ‘కొత్తపల్లి’ నిర్ణయంతో మారిన సమీకరణాలు పశ్చిమ గోదావరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ షేక్ నూర్జహాన్ వైఎస్సార్సీపీలో చేరారు. రఘురామ కృష్ణంరాజుకు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పలువురితో బంధుత్వాలు, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రభావం చూపగల నేత. మాజీ ఎమ్మెల్యేలు మద్దాల సునీత, మోచర్ల జవహర్వతిలకు గట్టి వర్గం ఉంది. ఏలూరు మేయరు షేక్ నూర్జహాన్‌కు బలహీనవర్గాల్లో మంచి గుర్తింపుతోపాటు వ్యాపార వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. తాజాగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు బలమైన నాయకుడు, వివాదరహితుడు. కాపు సామాజికవర్గంతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు గట్టి వర్గం ఉంది. సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నవీన్ జనసేనకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన అనకాపల్లి టీడీపీ సిట్టింగ్ ఎంపీ అవంతి శ్రీనివాస్, దాడి వీరభద్రరావుకు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలరు. విశాఖనుంచి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు తాజాగా వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామికి కాళింగి సామాజికవర్గంలో విస్తృత సంబంధాలతోపాటు రాజకీయంగా పట్టు ఉంది. టీడీపికి చెందిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు చేరారు. మోహన్ బాబు చేరికతో.. సినీ నటుడు, నిర్మాత, విద్యా సంస్థల అధికేత మంచు మోహన్‌బాబు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన వెంట హీరో మంచు విష్ణుకూడా ఉన్నారు. తెలుగా రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్, అభిమానులున్న మోహన్‌బాబు చేరికతో చిత్తూరుజిల్లాలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీనుంచి పోటీచేసిన ఇక్బాల్ అహ్మద్, తంబళ్లపల్లినుంచి ’కొండా’ ఫ్యామిలీ గతంలోనే వైఎస్సార్సీపీలో చేరారు. – యర్రా యోగేశ్వరరావు, ఎలక్షన్ డెస్క్ -
వైఎస్సార్ హయాంలోనే మహిళాభ్యున్నతి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మహిళాభ్యుయానికి పాటుపడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని కేంద్ర మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. తన 30ఏళ్ల రాజకీయ చరిత్రలో మహిళల ప్రగతి కోసం అంతగా శ్రమించిన నాయకుడిని మరొకరిని చూడలేదని అన్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవంసందర్భంగా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయిందని మహిళలపై అత్యాచారాలు, దాడులు, హత్యల్లో రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందంటే అది చంద్రబాబు ఘనతేనన్నారు. మహిళలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. రామరాజ్యం జగన్మోహన్రెడ్డితో సాధ్యమన్నారు. మహిళలే శక్తిమంతులు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పురుషులకు దీటుగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఇప్పటివరకు ఎందరో మహోన్నత వ్యక్తులు దేశ ప్రధానులుగా చేసినా శక్తివంతమైన ప్రధాని అంటే ఇందిరాగాంధీనే అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో ఉన్న 81 వార్డులను 100 వార్డులుగా చేస్తామని, అందులో 50 శాతం మహిళలకే ఇస్తామని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎంవీవీ మాట్లాడుతూ ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్సార్సీపీ విజయభేరీని అడ్డుకోలేరన్నారు. జగన్‌తోనే మహిళాభ్యుదయం అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కళ్యాణి మాట్లాడుతూ వైఎస్సార్ ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకే పెద్దపీట వేశారని, మళ్లీ అటువంటి నాయకుడు జగనన్నే అన్నారు. నగర అధ్యక్షురాలు గరికిన గౌరి మాట్లాడుతూ టీడీపీ పాలనలో మహిళలకు భద్రత లేదన్నారు. గత ఎన్నికల్లో మహిళలను మోసం చేసిన చంద్రబాబుని గద్దె దించుదామని, మహిళలు అందరం కలసి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందామని అన్నారు. వివిధ రంగాల్లో మహిళలకు సన్మానం వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన మహిళలను పార్టీ నాయకులు సత్కరించారు. ప్రముఖ న్యాయవాది అరుణకుమారి, నృత్యకారిణి లిపికారెడ్డి, సీనియర్ ఉపాధ్యాయిని ఉషారాణి, సాక్షి దినపత్రిక సబ్ఎడిటర్ రాజేశ్వరిలను శాలువాలతో సన్మానించారు.కార్యక్రమంలో విశాఖ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, అదనపు కార్యదర్శులు దివాకర్ పక్కి, రవిరెడ్డి, నగర యువజన విభాగం అధ్యక్షుడు రాజీవ్, యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ నియోజకవర్గ మహిళా ఇన్చార్జిలు సాది పద్మారెడ్డి, మళ్ల ధనలత, కృప, పల్లా చినతల్లి, సబీరా బేగం, జీవీ రమణి, శ్రీదేవివర్మ అధిక సంఖ్యలో వార్డు అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. -
నారా వారి నయవంచన
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం...రైతు రుణమాఫీ చేస్తాం...డ్వాక్రా మహిళలను రుణ విముక్తులను చేస్తాం.. అంటూ 2014 ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు వాటిని గాలికొదిలేసి ప్రజలను నిలువునా మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఉసురు తప్పకుండా తగులుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఆటలు సాగబోవని, అబద్ధాలు, అరాచకాలను గమనించిన ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు హోటల్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల ఇబ్బందులు గమనించారని, ప్రజలకు ఏమి కావాలో గమనించి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని, తండ్రి రాజశేఖరుడి బాటలో ప్రజాబాంధవుడిలా నిలుస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకొస్తే వారికే కేంద్రంలో వైఎస్సార్సీపీ మద్దతుంటుందని వైఎస్ జగన్ మొదటి నుంచీ చెబుతున్నారనీ.. రాష్ట్రానికి న్యాయం చేసే పార్టీతో ఉండాలనే ఆకాంక్షతో వైఎస్సార్సీపీలో చేరుతున్నానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్రెడ్డి అజెండా సెట్ చేస్తే దానిని కాపీకొట్టి చంద్రబాబు అమలు చేయడం ఆనవాయితీగా మారిందన్నారు. చంద్రబాబు కేసీఆర్‌తో కలిసిపోవచ్చు.. మోడీతో కలిసిపోవచ్చు.. రాహుల్‌గాంధీతో కలిసిపోవచ్చు కాని జగన్మోహన్రెడ్డి ఎవరితోనైనా మాట్లాడితే చాలు తన అనుకూల మీడియాతో ప్రచారం చేసి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బాబు నాటకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు ఇన్నాళ్లూ బీజేపీతో కాపురం చేసి.. ప్రత్యేకహోదా కోసం ఇసుమంత ప్రయత్నం కూడా చేయకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు దొంగదీక్షలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. మమతా బెనర్జీ, మాయావతి తదితర నేతలను యూపీఏలో కలిసిపోవాలని సలహా ఇస్తున్న పెద్ద మనిషి టీడీపీని మాత్రం అలా చేయకుండా గోడ మీద పిల్లివాటంలా ప్రవర్తిస్తున్నారన్నారు. సిద్ధంతాలు, విలువలు లేని చంద్రబాబులాంటి వ్యక్తులు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్న తీరు నచ్చకే పార్టీని వీడానన్నారు. రుణ మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను ఒకసారి మోసగించిన చంద్రబాబు.. పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు చెల్లని చెక్కులిచ్చి మళ్లీ మహిళలను ఏమారుస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్సార్సీపీలో చేరుతున్నానన్నారు. ఎటువంటి పదవీ కాంక్షతో పార్టీలోకి రాలేదని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అందరితో కలిసి పనిచేస్తానన్నారు. ఈనెల 28వ తేదీన లోటస్‌పాండ్‌లో జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కిల్లి రామ్మోహన్రావు, కె.రాజ్యలక్ష్మి, టి.బి.కె.గుప్త, జి.కృష్ణ, కిల్లి మల్లన్న, పైడి రవి, పైడి చందు, కె.డిల్లేశ్వరరావు, ఎస్.ధర్మారావు, డి.శ్రీధర్ పాల్గొన్నారు. -
చంద్రబాబు ఓ మోసకారి
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ఓ మోసకారి అని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై ద్వంద్వ వైఖరి అవలంభించి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశాడని మండిపడ్డారు. నాడు హోదా వద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేందుకు హోదా కోసం పోరాడుతున్నట్లు షో చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కిల్లి కృపారాణి మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. వైఎస్సార్సీపీలో చేరాలన్న తన అభీష్టాన్ని జగన్‌కు తెలియజేశారు. అంతకుముందు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భేటీ అనంతరం కిల్లి కృపారాణి వైఎస్ జగన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈనెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైఎస్సార్సీపీలో చేరుతానని ప్రకటించారు. వైఎస్ జగన్‌పై ప్రజలకున్న అభిమానాన్ని ఎంతిచ్చినా చంద్రబాబు కొనలేడన్నారు. అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలోనూ ఏపీ ముందుండాలన్న జగన్ ఆకాంక్షకు ఆకర్షితురాలినయ్యానని చెప్పారు. దేశ స్వాతంత్య్రానంతరం ఏ నాయకుడు చేసిన పాదయాత్ర కూడా.. ప్రజాసంకల్ప యాత్రలాగా విజయవంతం కాలేదన్నారు. దాదాపు 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్.. నిత్యం ప్రజల మధ్యే ఉండి వారి సమస్యలు తెలుసుకున్నారన్నారు. రాష్ట్రంలో 50 శాతం జనాభాగా ఉన్న బీసీలను చంద్రబాబు ఓట్ల కోసం వాడుకుంటున్నాడని విమర్శించారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కి.. చివరకు వారినే పక్కన బెట్టారన్నారు. బీసీ గర్జన ద్వారా వారి అభివృద్ధికి ఏమేం చేస్తానో జగన్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత, ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తానంటూ జగన్ ఇచ్చిన హామీలు బీసీలకు మనోధైర్యం కలిగించాయన్నారు. ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు ఓ విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడైన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌పై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. బాబు మాటలను ప్రజలు విశ్వసించరు.. గత అయిదేళ్లుగా చంద్రబాబు వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని కృపారాణి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటిస్తే.. దాన్ని చంద్రబాబు తన ఖాతాలోకి వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు అంటకాగిన బీజేపీ పైనా.. ప్రధాని మోదీపైనా చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే బాగుందని, దానివల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందంటూ చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం పెట్టి కేంద్రాన్ని అభినందించడాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. -
వైఎస్సార్సీపీలోకి కేంద్ర మాజీ మంత్రి
-
వైఎస్సార్సీపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. మంగళవారం ఆమె లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఈనెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు తెలిపారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. బీసీ గర్జనలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు. (వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ) చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేస్తారు.. వైఎస్ జగన్ మాట తప్పరు, మడమ తిప్పరని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారని, ఏపీ ప్రజలు ఆయన మాటలు విశ్వసించరని అన్నారు. కాంగ్రెస్, టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకించానని.. రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశానని వెల్లడించారు. బీసీలను, కులవృత్తుల వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. టిక్కెట్ ఆశించి రాలేదని, భేషరతుగా వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు కృపారాణి స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. (వైఎస్సార్సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్) -
కాంగ్రెస్ ఏ పాపం చేసిందో చంద్రబాబు చెప్పాలి?
సాక్షి, పోలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లి కృపారాణి విరుచుకుపడ్డారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఏం పాపం చేసిందో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటూ పాదయాత్ర చేపట్టడం కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఖజానా నుంచి రూ.5130 కోట్లు ఖర్చు చేసి పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని ఈ సందర్భంగా కిల్లి కృపారాణి గుర్తు చేశారు. అలాగే కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి రాజధాని నిర్మాణంపై ఉన్న శ్రద్ధ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై లేదని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, రూ.5130 కోట్లు ఖర్చు చేసి 32శాతం పనులు పూర్తి చేసింది తమ పార్టీయేనని తులసిరెడ్డి అన్నారు. జలయజ్ఞం ద్వారా 56 ప్రాజెక్ట్‌లు ప్రారంభించి 11 ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామని ఆయన అన్నారు. కాగా పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలనే డిమాండుతో కాంగ్రెస్ పార్టీ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో మహా పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. -
కేంద్ర మాజీ మంత్రి పీఏ అరెస్ట్
హైదరాబాద్: విశాఖ షిప్పింగ్ పోర్టులో సభ్యునిగా చేర్పిస్తాని నమ్మించి మోసం చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పీఏను అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా సర్క్యూట్ హౌస్ ప్రాంతానికి చెందిన తమ్మినేని సత్యనారాయణ(41) శ్రీనగర్ కాలనీ నివాసి. కిల్లి కృపారాణి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆమె వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అతడిపై ఆరోపణలు రావడంతో సత్యనారాయణను బాధ్యతల నుంచి తొలగించారు. ఈ క్రమంలో వాసవి కాలనీ కొత్తపేట్‌లో నివాసం ఉండే వ్యాపార వేత్త జి.రమేష్‌ను విశాఖ పోర్టు సభ్యునిగా అవకాశం కల్పిస్తానని, రూ.60 లక్షలు ఇవ్వాలని అతడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు 2015లో రమేష్ రూ.40 లక్షలు, 2016లో రూ.20 లక్షలు సత్యనారాయణకు ఇచ్చాడు. దీంతో విశాఖ పోర్టు సభ్యునిగా నియమించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరిట ఫోర్జరీ అపాయింట్మెంట్ లెటర్‌ను సృష్టించి రమేష్‌కు ఇచ్చాడు. అది తీసుకుని రమేష్ ఢిల్లీకి వెళ్లి విచారించగా ఆ లెటర్ నకిలీదని తేలింది. ఈ మోసంపై బాధితుడు రమేశ్ ఈనెల 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి నుంచి రూ.7.60 లక్షలు నగదు, హోండా సిటీ కారు, రెండు ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఐపీసీ 420, 419, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
రైతులను విస్మరించిన ప్రభుత్వాలు
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, వ్యవసాయ రంగాన్ని విస్మరించాయని కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను సైతం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షడు రాహుల్‌గాంధీ నెల 24వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నందున.. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అత్యధికంగా అనంతపురం జిల్లాలో అన్నదాత బలవన్మరణాలకు పాల్పడడం విచారకరమన్నారు. రైతు కుటుంబాలను పరామర్శించడంతోపాటు.. ఇతర రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించేందుకే రాహుల్ పర్యటిస్తున్నట్టు వివరించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అడ్డగోలు హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు ఊసే లేదన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి కూడా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు సెక్షన్-8 తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. గోదావరి పుష్కరాల్లో 27 మంది చనిపోయారంటే అది చంద్రబాబు చేసిన హత్యలేనని విమర్శించారు. బాధ్యతగల వ్యక్తిగా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిల్లి రామ్మోహనరావు, చౌదరి సతీష్, పుట్టా అంజనీకుమార్, ఎం.ఎ.బేగ్, గంజి ఎజ్రా, పైడి రవి, నంబాళ్ల రాజశేఖర్, ఈశ్వరి పాల్గొన్నారు. -
కంగు తిన్న కేంద్రమంత్రులు
* సీమాంధ్రలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులంతా ఓటమిపాలు *ఓడిపోయిన వారిలో పలువురు కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు *ఒక్క స్థానంలోనూ గెలవని కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: రెండుసార్లు కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన సీమాంధ్ర ప్రజలు ఈసారి ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన, కేంద్ర అప్రజాస్వామిక విధానాలతో ఆ పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకతను చవిచూసింది. సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటి కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇక్కడ పోటీ చేసిన కేంద్ర మంత్రులు సహా సిట్టింగ్ ఎంపీలంతా ఘోర పరాజయం పాలయ్యారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి 2004లో 22 స్థానాలు, 2009లో 21 స్థానాలను ప్రజలందించారు. ఇక్కడి మెజార్టీతోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అలాంటి ప్రాంతంలో ఈ సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ కనీస పోటీలో కూడా కనిపించకుండా పోయింది. కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, ఎం.ఎం.పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. మరో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మిగతా ఎంపీలలో విజయనగరంలో బొత్స ఝాన్సీ, నర్సాపురంలో కనుమూరి బాపిరాజు, తిరుపతిలో చింతామోహన్ ఓటమిపాలయ్యారు. కేంద్ర మాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించినా నామినేషన్లకు ముందు తిరిగి పార్టీలోకి రప్పించి హస్తం గుర్తుపై పోటీచేయించారు. ఆయన కూడా ఓటమిచెందారు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోనిల్చిన కొత్త అభ్యర్థుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. బొలిశెట్టి సత్యనారాయణ (విశాఖ), తోట విజయలక్ష్మి (అనకాపల్లి), బుచ్చి మహేశ్వరరావు (అమలాపురం), ముసునూరు నాగేశ్వరరావు (ఏలూరు), శిష్ట్లా రమేష్ (మచిలీపట్నం), దేవినేని అవినాష్ (విజయవాడ), వహీద్ (గుంటూరు), దర్శి పవన్‌కుమార్ (ఒంగోలు), కొండపల్లి వెంకటేశ్వర్లు (గుంటూరు), వాకాటి నారాయణరెడ్డి (నెల్లూరు), బీవై రామయ్య (నంద్యాల), పీవీ అనిల్‌చౌదరి (అనంతపురం), చిన్న వెంకట్రాముడు (హిందూపురం), వి.అజయ్‌కుమార్ (కడప), బి.రాజగోపాల్ (చిత్తూరు)లు ఘోరంగా పరాజయం పాలయ్యారు. పరిటాల రవి అనుచ రుడు, చిన్నవెంకట్రాముడిని హిందూపురం ఎంపీ అభ్యర్థిగా తెచ్చుకుంటే పెనుకొండలో తనకూ కలసి వస్తుందని ఆశించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆశ ఫలించలేదు. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది. -
ఏరికోరి ‘కిల్లి’కజ్జాలు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: అసలే క్యాడర్ కోల్పోయి అవసాన దశలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కునని చెప్పుకొంటున్న కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి చర్యలు పరిస్థితిని మరింత దిగజార్చేలా ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి నాయకులు, కార్యకర్తల మనోభావాలతో పనిలేకుండా అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేయించేసినట్లు తెలియడంతో పార్టీలో అసమ్మతి అగ్గి అంటుకుంటోంది. జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లకు అధిష్ఠానం ఆమోద ముద్ర వేయించుకుని, ఆ జాబితాతో కృపారాణి జిల్లాకు చేరుకున్నారు. వీటిని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఆమె తనకు అనుకూలమైన రెండు పేర్లను మాత్రం అనుచరవర్గం ద్వారా లీక్ చేయించడంతో పాటు గురువారం ప్రచారం కూడా ప్రారంభించారు. శ్రీకాకుళం నుంచి చౌదరి సతీష్, టెక్కలి నుంచి కేంద్రమంత్రి భర్త డాక్టర్ కిల్లి రామ్మోహన్‌రావులు బరిలో దిగనున్నారు. మిగిలిన 8 నియోజకవర్గాలకు కూడా స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అభ్యర్థులను ఖరారు చేయించినట్లు సమాచారం. ఏఐసీసీ పరిశీలకులు, పీసీసీ అధ్యక్షుడు జిల్లాకు వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్నవారికి కాకుండా వేరే వారికి టిక్కెట్లు ఇప్పించడంపై పార్టీలో మిగిలిన ఉన్న సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. మంత్రి ఇష్టానుసారం ఖరారు చేయించాలనుకున్నప్పుడు తమతో దరఖాస్తు చేయించడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. కష్ట కాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నా గుర్తింపు లేకపోతే కొనసాగడం దేనికని నిలదీస్తున్నారు. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని వారు యోచిస్తున్నారు. స్థానికేతర అభ్యర్థి ఎంపికపై ఆగ్రహం కాగా శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి స్థానికేతర అభ్యర్థికి కృపారాణి అవకాశం ఇవ్వడంపై స్థానిక పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసుకున్న వారిని కాదని, ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన చౌదరి సతీష్ పేరు ఖరారు చేయించినట్లు తెలుసుకున్న సీనియర్ నాయకులు కృపారాణి తీరును తప్పు పడుతున్నారు. శ్రీకాకుళం టిక్కెట్ కోసం శిమ్మ రాజశేఖర్, సుంకరి కృష్ణ, అంబటి కృష్ణలు దరఖాస్తు చేశారు. శిమ్మ రాజశేఖర్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిపోగా, అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తానని సుంకరి కృష్ణ తొలి నుంచి చెబుతూ వచ్చారు. సుంకరికి అవకాశం కల్పించని పక్షంలో తనకు ఇవ్వాలని అంబటి కృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. వీరిని కాదని అసలు దరఖాస్తే చేయని సతీష్‌కు టిక్కెట్ ఇవ్వడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ప్రచారం ప్రారంభం పార్టీలో వెల్లువెత్తుతున్న అసంతృప్తిని పట్టించుకోకుండా ప్రచారం కూడా ప్రారంభించారు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కిల్లి కృపారాణి పేరునే ఏఐసీసీ ఖరారు చేసినట్లు సమాచారం. ఆ మేరకు ఆమెతోపాటు శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారైనట్లు చెబుతున్న చౌదరి సతీష్‌లు గురువారం నుంచి ప్రచారం ప్రారంభించారు. వారిద్దరూ గురువారం శ్రీకాకుళం పట్టణంలో పలువురు ప్రముఖులను కలసి మద్దతు కోరారు. -
‘తుస్సు’మన్న బస్సుయాత్ర
కాకినాడ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ‘మామిడి పండు తిన్న నోటితోనే మేడిపండును చవి చూడాల్సి వచ్చినట్టు’ అయింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు పీసీసీ కొత్త సారథి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి తలపెట్టిన బస్సుయాత్ర శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పేలవంగా సాగింది. తునిలో ప్రారంభమై అన్నవరం, కత్తిపూడి, గొల్లప్రోలు, పిఠాపురంల మీదుగా జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకున్న యాత్రకు ఆశించిన స్పందన కానరాక పోగా పిఠాపురంలో చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. తునిలో పార్టీ శ్రేణులు స్వాగత సన్నాహాలు చేసినా అక్కడి నుంచి జరిగిన పర్యటనలో ప్రజా స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. ముఖ్యంగా పిఠాపురం వద్ద కె.బాబ్జి అనే ఓ కార్యకర్త ‘ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి నట్టేట ముంచేశావు’ అంటూ బస్సుయాత్ర వద్ద ఒకప్పటి పీఆర్పీ కరపత్రాలను నేలకేసి కొట్టి నిరసన తెలియజేశాడు. చిరు అభిమానుల సందడే.. కాకినాడ సూర్యకళామందిరంలో జరిగిన డీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చిరంజీవి అభిమానులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారే తప్ప నిజమైన పారీశ్రేణులు లేక సభ వెలవెలపోయింది. రఘువీరా, చిరంజీవిలతో పాటు కేంద్రమంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, పంతం గాంధీమోహన్, వంగా గీత మాత్రమే హాజరయ్యారు. రఘువీరా తొలిసారిగా హాజరైన డీసీసీ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, పొన్నాడ సతీష్, ఎన్.శేషారెడ్డి, రాజా అశోక్‌బాబు, పాముల రాజేశ్వరీదేవి రాలేదు. రంపచోడవరం ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్ మాత్రం హాజరయ్యారు. విభజనకు కారణమైన పార్టీలు కాంగ్రెస్‌ను నిందిస్తున్న తీరుపై ప్రతి కార్యకర్తా మరో ముగ్గురికి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి.. అలా ప్రచారం చేయాలంటూ చిరంజీవి తాను నటించిన ఁస్టాలిన్* సినిమాలోని చైన్‌లింక్ విధానాన్ని ఊదరగొట్టారు. కిరణ్ సమైక్య చాంపియన్ కావాలని చేసిన రాజకీయంలో ఆయన హీరోగా, తాము జీరోలుగా ప్రజల్లో చులకన కావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన జరిగాక కూడా చివరి బంతి మిగిలే ఉందంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి మానసిక పరిస్థితిపై సందేహం కలుగుతోందన్నారు. కిరణ్ నిర్వాకమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబుది అధికార దాహం.. ఒక ఓటు, రెండు రాష్ట్రాల నినాదంతో 18 ఏళ్ల క్రితం కాకినాడ సమావేశంలో రాష్ట్ర విభజనకు బీజం వేసిన మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు అధికార దాహం తేటతెల్లమవుతోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సారథి, కేంద్రమంత్రి చిరంజీవి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్థానిక సూర్యకళామందిరంలో డీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. నాయకులు మాట్లాడుతూ అనేక పార్టీలు విభజనను కోరుకున్నాక కాంగ్రెస్ చివరిపార్టీగా నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ శ్రేణులు స్తబ్దతను వీడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని కోరారు. కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ ప్రజారంజక పాలన కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. కేంద్రమంత్రి కృపారాణి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాలకు కృషి చేసింది కాంగ్రెసేనన్నారు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, వంగా గీత, పంతం గాంధీమోహన్, ఎమ్మెల్సీలు రత్నాబాయి, లక్ష్మీశివకుమారి, మండలిలో విప్ రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి కొండ్రు మురళి, నాయకులు బుచ్చి మహేశ్వరరావు, కొప్పన మోహనరావు, పి.వి.రాఘవులు, పంతం నానాజీ, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఫణీశ్వరరావు పాల్గొన్నారు. -
హస్త విధీ!
జయజయ ధ్వనాలు.. నేతల అడుగులకు మడుగులొత్తే అనుచరగణంతో నిన్నటివరకు అధికార భోగం అనుభవించిన కాంగ్రెస్ నేడు పిలిచినా పలికే నాథుడు లేని దీనావస్థలోకి జారుకుంది. ఎన్నికల్లో అవకాశం కోసం నిన్నటి వరకు వెంపర్లాడిన కాంగ్రెస్ శ్రేణులు నేడు ఆ ఊసెత్తితేనే ఆమడ దూరం పారిపోతున్నారు. కనిపిస్తే.. ఎక్కడ బలవంతంగా పోటీలోకి దింపుతారోనన్న భయంతో ముఖం చాటేశారు. అనేక మంది వేరే దారులు వెతుక్కుంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం జిల్లాలో కాంగ్రెస్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకత వార్డుస్థాయి ఎన్నికల్లో సైతం నిలబడేందుకు వెనుకంజ వేసేలా చేసింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో చాలా వార్డులకు ఆ పార్టీ అభ్యర్థులు లేకపోవడమే దీనికి నిదర్శనం. శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో పలు వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. ఏకంగా మూడు చోట్ల అత్యధిక వార్డుల్లో నామినేషన్లు వేయలేని దుస్థితిలో పడిపోయింది. ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండ మున్సిపాలిటీల్లో మొత్తం 91 వార్డులుండగా, వాటిలోని 31 వార్డుల్లో ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డుల్లో దొరకని అభ్యర్థులు..! కనీసం వార్డు బరిలో దిగేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణు లు ముందుకు రాకపోవడంతో జిల్లా కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసిపోగా.. చివరి క్షణం వరకు అభ్యర్థుల కోసం ఈ పార్టీ నేతలు ప్రయత్నాలు సాగించినా ఫలితం లేకపోయింది. ఇచ్ఛాపురంలో 1, 2, 3, 19, 21, 22.. మొత్తం ఆరు వార్డుల్లో, పలాస-కాశీబుగ్గలో 1, 2, 6, 8, 12, 15, 17, 19, 20.. మొత్తం 9 వార్డుల్లోనూ, పాలకొండ నగర పంచాయతీలో అత్యధికంగా 1, 2, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17.. మొత్తం 13 వార్డుల్లోనూ, ఆమదాలవలసలో 3, 7, 23.. మొత్తం మూడు వార్డుల్లోను కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు. వీటిలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మున్సిపాలిటీలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోవే కావడం విశేషం. గతంలో ఎన్నడూ లేనివిధంగా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల కొరత, కాంగ్రెస్ పతనావస్థను స్పష్టం చేస్తోంది. గతంలో ఇదే కాంగ్రెస్ తరపున వార్డు స్థానాల కోసం పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో వివాదాలు, గొడవలు జరిగిన విషయం విదితమే. తాజా పరిణామల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందుగానే నామినేషన్ల దశలోనే కాడి దించేసినట్లేనని ఆ నేతలే అంగీకరిస్తునారు. రాష్ట్ర విభజన అంశమే తమ కొంప ముంచిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మద్దతిచ్చేందుకు సిద్ధం కావడంతో రాన్ను మున్సిపల్‌తో పాటు సాధారణ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గడ్డు పరిస్థితులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అమ్మో!... ఆయనకు టిక్కెట్టు రాకపోతేనా!?
- ఇదీ కేంద్ర మంత్రి కృపారాణి ఆందోళన కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఇంట పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ టిక్కెట్టు ఆమెకే దక్కనుంది. కానీ కృపారాణి అంతటితో సంతృప్తి చెందలేకపోతున్నారు. టెక్కలి ఎమ్మెల్యే టిక్కెట్టు తన భర్త రామ్మోహనరావుకే ఇప్పించుకోవడం ఆమెకు సవాల్‌గా పరిణమించింది. ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం టిక్కెట్లు ఖరారు చేస్తామని రాహుల్‌గాంధీ చెబుతుండటమే ఇందుకు కారణం. దానికితోడు ఒకే ఇంటికి రెండు టిక్కెట్లు ఇవ్వకూడదని రాహుల్ భావిస్తున్నారన్న సమాచారం కృపారాణిని కలవరపరుస్తోంది. ఎందుకంటే రామ్మోహన్రావు వ్యవహారం శైలి గత కొన్నేళ్లుగా తీవ్ర వివాదాస్పదమైంది. నియోజకవర్గంలోని అధికారులను ఆయన వేధిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఆయన వేధింపులను తాళలేక పలువురు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ఇక ఇతరాత్రా వ్యవహా రాల్లో కూడా రామ్మోహన్రావు తీవ్ర వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు. ఇక కాలేజీలోనూ, బయటా దుందుడుకు చర్యలు, సహచర విద్యార్థుల పట్ల వేధింపులకు పాల్పడ్డ కుమారుడిని రామ్మోహన్రావు వెనకేసుకువచ్చిన తీరు వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో రామ్మోహన్‌రావుకు టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంపై సందేహాలు ముసురుకున్నాయి. రామ్మోహన్రావు టిక్కెట్టు కోసం అధిష్టానం వద్ద కృపారాణి చేసిన ప్రయత్నాలకు సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. వేరే అభ్యర్థిని సూచించమని అధిష్టానం ప్రతినిధులు సూచించడంతో ఆమెలో కలవరం మొదలైంది. టిక్కెట్టు రాకపోతే రామ్మోహన్‌నరావు ఎలా స్పందిస్తారోనని ఆమె ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఎలాగైనాసరే ఆయనకు టిక్కెట్టు వచ్చేలా చేయడం కోసం కృపారాణి ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. ఇలా.. టిక్కెట్ రాజకీయాలు ఇటు గుండ కుటుంబంలోను, అటు కిల్లి కుటుంబంలోనూ అలజడి సృష్టిస్తున్నాయి. అదండీ సంగతి. -
రాణిగారు తలచుకుంటే..!
అధికారంలో ఉన్న నాయకులు తమకు కేటాయించిన ప్రభుత్వ నిధులతో ప్రజ లకు ఉపయోగపడే పనులు చేస్తే ఓకే. అలా కాకుండా తమ ఆస్తులకు, బంధువుల ఇళ్లకు వెళ్లే రోడ్ల కు ఖర్చు చేస్తే అది స్వప్రయోజనమే అవుతుంది. డివిజన్ కేంద్రమైన టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి కేటాయించిన నిధులతో చేపడుతున్న పలు పనుల తీరును గమనిస్తే మాత్రం స్వప్రయోజనాల కోసమే అన్నట్టు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. టెక్కలి, న్యూస్‌లైన్: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి స్వగ్రామమైన టెక్కలిలో అనేక చోట్ల సరైన రోడ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాటిపై దృష్టి సారించాల్సిన ఆమె కనీసం అటువైపు చూడకుండా కేవలం తమకు చెందిన వారి ఇళ్లకు, తమ ఆస్తులు కలిగిన రోడ్లకు సుమారు రూ. 13.80 లక్షలు వెచ్చించి సీసీరోడ్లు వేయిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. టెక్కలి నుంచి తెంబూరు రోడ్డుకు వెళ్లే దారిలో మంత్రి బంధువులకు చెందిన ఇళ్లు ఉండగా, వాటికి అనుకూలంగా ఉండేందుకుగాను ఎంపీ నిధుల నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయలు కేటాయించడంతోపాటు ఆగమేఘాలపై సీసీ రోడ్లను వేసేశారు. అడిగిందే తడవుగా ఇంత త్వరగా రోడ్లు వేయడానికి ఆ మార్గంలో ఉన్న మరికొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అధిక ధరలు పలుకుతాయనే ఉద్దేమేనని స్థానికులంటున్నారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ జంక్షన్ నుంచి శ్మశాన వాటికను ఆనుకుని మదర్‌థెరిసా కళాశాలకు ఎదురుగా ఉన్న కేంద్రమంత్రి స్థలంలో ఇటీవల ఓ బ్యాంకు కోసం త్వరితగతిన భారీ కట్టడాలు జరుగుతున్నాయి. జంక్షన్ నుంచి బ్యాంకు వరకు సీసీ రోడ్లు, మురుగు కాలువల కోసం ఎంపీ నిధుల నుంచి 9 లక్షల 80 వేల రూపాయల నిధులను మంజూరు చేయడంతో, ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాంతంలో కొన్ని నివాస గృహాలు ఉన్నప్పటికీ, హఠాత్తుగా ఈ రోడ్లు నిర్మాణానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంపై మొదట్లో ఆ ప్రాంత వాసులకు అర్థం కాలేదు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. టెక్కలిలో అనేక వీధుల్లో సరైన రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని ప్రజలంతా పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించని అధికారులు మంత్రి ఆదేశాలతో లక్షలాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు వేసుకుంటున్నారనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాణి గారు త లుచుకుంటే జరగని పని ఉంటుందా అని మరికొందరు గుసగుసలాడుతున్నారు. -
సత్యసాయి పేరిట పోస్టల్ కవరు విడుదల
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: సత్యసాయిబాబాపై భారత తపాలా శాఖ రూపొందించిన కవరును కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భగవాన్ సత్యసాయిబాబా సేవాతత్పరుడన్నారు. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని కొనియాడారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎంతో చొరవ చూపారని, ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడన్నారు. దైవగుణాలతో అందరికీ చేరువై చక్కని మార్గాన్ని నిర్దేశిం చిన మహనీయుడని చెప్పారు. సత్యసాయి సేవామార్గాన్ని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదం కావాలనే ఉద్దేశంతో తపాలాశాఖ ప్రత్యేకంగా కవరును రూపొందించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టెలికాం సలహామండలి సభ్యుడు వీవీఎస్ ప్రకాష్, ఏపీ సర్కిల్ ప్రధాన పోస్టుమాస్టర్ జనరల్ బీవీ సుధాకర్, విశాఖపట్నం పోస్టుమాస్టర్ ఎం.సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల ఎత్తులు డోలాయమానం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల రాజకీయాల్లో కేంద్రమంత్రి కృపారాణి దూకుడు పెంచారు. తన వర్గ ప్రాబల్యం పెంచుకునేందుకు ఉపకరించేలా టిక్కెట్ల కేటాయింపు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా నరసన్నపేట నియోజకవర్గంలో తన మాట నెగ్గితే చాలు.. జిల్లా అంతా దారిలోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు. అందుకే కోండ్రు మురళీ వర్గీయుడిగా ఉన్న డోల జగన్‌కు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే శిమ్మ ప్రభాకరరావు కుటుంబంతో మంతనాలు సాగించిన ఆమె, తదుపరి వ్యూహాన్ని చకచకా అమలు చేస్తున్నారు. డోల జగన్‌ను నరసన్నపేట నుంచి తప్పించడం ద్వారా శిమ్మ కుటుంబానికి మార్గం సుగమం చేయాలన్నది ఆమె వ్యూహం. అందులో భాగంగా జగన్‌ను పాతపట్నం అభ్యర్థిగా ఖరారు చేయాలని ప్రతిపాదించారు. ఆమె తాజా ఎత్తుగడ కోండ్రు వర్గాన్ని విస్మయానికి గురిచేసింది. డోల జగన్‌ను ఆత్మరక్షణలో పడేసింది. జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృపారాణి ద్విముఖ వ్యూహం ద్విముఖ వ్యూహంతోనే డోల జగన్‌ను పాతపట్నం పంపించాలని కేంద్రమంత్రి ప్రతిపాదించారు. ఒకటి నరసన్నపేటలో ఆయన్ను అడ్డు తొలగించుకోవడం.. రెండు తనకు ఏమాత్రం పట్టులేని పాతపట్నంలో కొంతవరకైనా ఓట్లు సాధించడం. ఆ మేరకు అధిష్టానం ప్రతినిధుల వద్ద గట్టిగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన జగన్‌కు పాతపట్నం సరైన నియోజకవర్గమని, మరోవైపు నరసన్నపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అక్కడ వెలమ సామాజికవర్గమే గెలుస్తోందని వారికి చెప్పుకొచ్చారు. అందువల్ల డోలను నరసన్నపేటలో నిలబెట్టడం వల్ల పార్టీకి ప్రయోజనం ఉండదని చెప్పారు. అదే సమయంలో వర్గ రాజకీయాల వల్లే అతన్ని వ్యతిరేకిస్తున్నాననే ముద్ర పడకుండా జాగ్రత్తపడ్డారు. తూర్పుకాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాతపట్నానికి అదే వర్గానికి చెందిన జగన్ సరైన అభ్యర్థి అవుతారని చెప్పుకొచ్చారు. అలా చేస్తే నరసన్నపేటలో వెలమ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శిమ్మ ప్రభాకరరావు కుటుంబానికి టిక్కెట్ కేటాయించవచ్చన్నది ఆమె ఉద్దేశం. శిమ్మ ప్రభాకరరావు సతీమణి, మాజీ ఎంపీపీ ఉషారాణి పేరును కూడా కృపారాణి అధిష్టానానికి సూచించారు. తద్వారా కాంగ్రెస్ దాదాపుగా తుడుచుకుపెట్టుకుపోయిన నరసన్నపేటలో కొంతమేర ఓట్లు సాధించగలనని ఆమె విశ్వసిస్తున్నారు. అదే సమయంలో పాతపట్నంలోనూ కొంతవరకైనా కలసివస్తుందని భావిస్తున్నారు. అక్కడ డోల జగన్ గెలవకపోయినా ఎంపీగా తనకు కొన్ని ఓట్లు తెచ్చిపెడతారని ఆశిస్తున్నారు. అధిష్టానం సానుకూలత సామాజికవర్గాల కోణంలో కృపారాణి చేసిన ప్రతిపాదన పట్ల కాంగ్రెస్ అధిష్టానం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డోల జగన్‌కు సూచనప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. దాంతో ఆయనలో గుబులు మొదలైంది. ఎందుకంటే నరసన్నపేట నియోజకవర్గంలో ఆయనకు భారీ బంధుగణం ఉంది. కానీ పాతపట్నం పూర్తిగా కొత్త. కనీసం పరిచయాలు కూడా లేవు. తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికే కృపారాణి ఈ ఎత్తుగడ వేశారని ఆయన తన సన్నిహితుల వద్ద ఆగ్రహంగా వ్యాఖ్యానిస్తున్నారు. తాను నమ్ముకున్న కోండ్రు మురళి కూడా ఈ విషయంలో సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవిలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. నరసన్నపేట విషయంలో కృపారాణి వ్యూహం జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరును సరికొత్త మలుపు తిప్పుతోంది. -
జీవోఎం... ఇంకావుంది!
-
జీవోఎం... ఇంకావుంది!
* సీమాంధ్ర కేంద్రమంత్రులతో భేటీ * వారు కోరిన 9 సవరణలను పరిశీలిస్తామని హామీ * ఇక భేటీలుండవన్న మర్నాడే మళ్లీ సమావేశమైన జీవోఎం * అసంపూర్తిగా ముగింపు.. నేడు మళ్లీ మంత్రుల బృందం భేటీ * నేడు కేబినెట్‌కు బిల్లు వెళ్లడం అనుమానమే * ఇప్పుడే చెప్పలేమన్న షిండే, చూడాలన్న జైరాం రమేశ్ * హైదరాబాద్ ఆదాయం పంపకం, సీమాంధ్రకే భద్రాచలం! * కొత్త రాజధాని, రాయలసీమ ప్యాకేజీకీ సానుకూలం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంకం దేశ రాజధానిలో రకరకాల మలుపులు తిరుగుతూ అందరిలోనూ ఉత్కంఠ పెంచుతోంది. ‘ఇదే చివరి భేటీ. ఇక మా పని ముగిసింది’ అని మంగళవారం ప్రకటించిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం), ఆ మర్నాడే మరోసారి సమావేశమై విభజన కసరత్తును కొనసాగించింది! బుధవారం సాయంత్రం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పలు ప్రతిపాదనలతో జీవోఎం సభ్యులతో సమావేశమయ్యారు. ఇక్కడి హోం శాఖ కార్యాలయంలో దాదాపు 2 గంటలపాటు జరిగిన ప్రత్యేక భేటీలో మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిశోర్‌చంద్రదేవ్, చిరంజీవి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రెండు నెలల క్రితమే చేసిన ప్రతిపాదనలనే జీవోఎం వారి నుంచి మరోసారి తీసుకుంది. చివరికి భేటీ అసంపూర్తిగా ముగిసింది. గురువారం మరోసారి సమావేశం కావాలని జీవోఎం నిర్ణయించింది. ‘మంత్రులు ఎనిమిది, తొమ్మిది కీలకమైన సవరణలు చేశారు. నేడు మరోసారి జీవోఎం సమావేశం ఉంటుంది. వాటిని మరోసారి పరిశీలించాల్సి ఉంది’ అని భేటీ తర్వాత జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు. ముందుగా ప్రకటించిన విధంగా విభజన బిల్లు గురువారం కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందా అని ప్రశ్నించగా, ‘చూడాలి. ప్రయత్నించాలి’ అని బదులిచ్చారు. ఈ విషయమై తానేమీ చెప్పలేనని జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూడా భేటీ అనంతరం అభిప్రాయపడ్డారు. ‘‘అందుకే, సమయం పడుతుందని నేనెప్పటి నుంచో చెబుతున్నా’ అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5.30కు జరిగే కేబినెట్ భేటీ ఎజెండాలో విభజన బిల్లు ఉండటం అనుమానంగానే మారింది. ఎందుకంటే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జీవోఎం భేటీ కానుంది. దానికీ, కేబినెట్ భేటీకీ మధ్య సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఒకవేళ కేబినెట్ భేటీలో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినా, దానికి ఆమోదముద్ర పడటం కష్టమేనని తెలుస్తోంది. అయితే కేవలం ఆర్థికాంశాలకు సంబంధించిన సవరణలను మాత్రమే జీవోఎం ప్రతిపాదించి కేబినెట్లో పెడితే మాత్రం అవి ఆమోదం పొందే అవకాశాలున్నాయి. అంతకు మించిన సవరణలైతే బిల్లు గురువారం కేబినెట్‌కు రావడం కష్టమేనంటున్నారు. మీరు సిద్ధమైతే మేమూ ఓకే జీవోఎంతో భేటీ అనంతరం చిరంజీవి, శీలం మీడియాతో మాట్లాడారు. తాము సవరణ ప్రతిపాదనలను వివరించామని, వాటిని బిల్లులో చేరిస్తే తమ ప్రాంత ప్రజలను ఊర డించే శక్తి తమకొస్తుందని చెప్పారు. ‘నిన్న (మంగళవారం) సాయంత్రం అధిష్టానం మాతో వార్ రూమ్‌లో సంప్రదింపులు జరిపింది. మేం విభజన వద్దన్నాం. రెండు నెలల క్రితం ఇచ్చిన మా ప్రతిపాదనలను పట్టించుకోనందున ససేమిరా అన్నాం. అయితే ఇప్పుడు అధిష్టానం స్పందించింది. పునరాలోచనలో పడింది. మా ప్రజల ఆవేదన, వ్యథ, ఆవేశం అర్థం చే సుకుంది. అప్పటి మా ప్రతిపాదనలను పరిశీలిస్తోం ది. వాటిని అమలు చేస్తే చివరకు తెలుగు వారందరినీ విజయం వరిస్తుంది’ అని శీలం అన్నారు. వారే పిలిచారు: చిరంజీవి ఈ సమావేశం తాము కోరితే జరగలేదని, వారే పిలిచారని చిరంజీవి చెప్పారు. ‘‘భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను సీమాంధ్రలో కలపడం, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం, హైదరాబాద్ ఆదాయాన్ని పంచడం, ఆస్తులు- అప్పులను తేటతెల్లం చేయడం, విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా.. పదేళ్లు అనే నిబంధన కాకుండా అసలు కాలపరిమితినే తీసేయడం వంటి అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాం. ఇవన్నీ పట్టించుకోనందుకే బిల్లు తిరస్కరణకు గురయ్యే పరిస్థితికి వెళ్లింది. దాంతో వారిప్పుడు ఆలోచనలో పడ్డారు. పునఃసమీక్షిస్తున్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో ఇవన్నీ ఉంటాయని భావిస్తున్నాం. మాకు 100 శాతం నమ్మకముంది. ఏం జరుగుతుందనే దాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఏ సవరణలకు అంగీకరించారన్న ప్రశ్నకు, అవన్నీ చెప్పలేమని శీలం బదులిచ్చారు. ‘‘సమస్య పరిష్కారం కావాలి. ఇది సున్నితమైన, మనోభావాలకు చెందిన అంశం. తెలుగు వారంతా బాగుండాలి’ అన్నారు. విశాఖను కొత్త రాజధానిగా చే యాలని, ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కూడా కోరినట్టు కిశోర్ చంద్రదేవ్ తెలిపారు. సవరణ అంశాలివే...! ముఖ్యంగా భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ నుంచి సీమాంధ్రలో కలపాలన్న డిమాండ్‌ను కచ్చితంగా అమలు చేయాలని జీవోఎంకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. ఇది బిల్లులో ఉండాల్సిందేనన్నారు హైదరాబాద్‌పై పెట్టిన ప్రతి పైసా రాష్ట్రం మొత్తం ఆదాయంలోంచేనని, ఇప్పుడు ఆ ఆదాయాన్ని పంచడంలో ఉన్న అభ్యంతరమేమిటని పట్టుబట్టారు మిగతా అంశాలెలా ఉన్నా భద్రాచలం, హైదరాబాద్ ఆదాయం పంపకం డిమాండ్లపై తెలంగాణ ప్రజల నుంచి కూడా ఎలాంటి అడ్డంకులూ ఉండబోవన్నారు. ‘హైదరాబాద్‌ను యూటీ చేయడం వంటి డిమాండ్లను జీవోఎం తీర్చేలా కన్పించడం లేదు. యూటీని పోలిన అధికారాలనైనా వర్తింపజేయాలని కోరాం గానీ అదీ చేసేలా లేరు. కనీసం మాకు కొత్త రాజధాని ఏర్పడేదాకానైనా హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరాం గానీ దానికీ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం సమ్మతంగానే ఉంది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశముంది. అలాగే సీమాంధ్రలో ఏర్పాటు చేయబోయే విద్యాసంస్థలన్నింటికీ ఖర్చును కేంద్రమే భరిస్తానంది’ అని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు. -
పంతాల పేటముడి!
ఒకరు కేంద్ర మంత్రి.. ఇంకొకరు రాష్ట్ర మంత్రి.. ఇద్దరిదీ ఒకటే పంతం.. తమ మాటే నెగ్గాలి.. తాము చెప్పిన వారికే టిక్కెట్ దక్కాలి. నరసన్నపేట కేంద్రంగా ఈ పీటముడి బిగుసుకుంటోంది. కోండ్రు ఒకరికి దన్నుగా నిలిస్తే.. కృపారాణి ఇంకొకరికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. జిల్లాపై ఆధిపత్యమే లక్ష్యంగా అమాత్యులు వేస్తున్న ఈ ఎత్తులు పైఎత్తులు ఎన్నికల్లో పార్టీని ఎటూ తీసుకుపోతాయోనని కాంగ్రెస్ శ్రేణులు కంగారు పడుతున్నాయి. పంతాలు వీడకపోతే.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టకపోతే ఎన్నికల్లో పార్టీ మట్టికొట్టుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర మంత్రులు కృపారాణి, కోండ్రు మురళీల చెలగాటం జిల్లా కాంగ్రెస్‌కు ప్రాణసంకటంగా పరిణమిస్తోంది. పార్టీలో మిగిలిన కొద్దిమంది నేతలు వీరిద్దరి ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారు. ఆధిపత్యం ఎవరిదో తెలీదు గానీ.. ఇద్దరూ పంతానికి పోతున్నారు. దీనికి నరసన్నపేట నియోజకవర్గ టిక్కెట్ వ్యవహారమే తాజా తార్కాణం. జిల్లా పార్టీపై పట్టు సాధించేందుకు దీన్నే సాధనంగా చేసుకున్నారు. ఇక్కడి టిక్కెట్ ఇప్పిస్తానని డోల జగన్‌కు మంత్రి కోండ్రు అభయహస్తం ఇవ్వగా.. ఆయనెవరు ఇవ్వడానికి.. మీదే ఆ టిక్కెట్టు అంటూ కేంద్ర మంత్రి కృపారాణి శిమ్మ కుటుంబానికి వెన్ను తడుతున్నారు. దాంతో వ్యవహారం తెగే వరకు సాగేలా ఉందని కాంగ్రెస్‌వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కోండ్రు తహతహ మంత్రి అయినప్పటికీ జిల్లాలో ఎక్కడా పట్టు లేకపోవడంతో మంత్రి కోండ్రు మురళీ కొంతకాలంగా అసహనంగా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇతర నియోజకవర్గాల్లోకి చొచ్చుకుపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు డీసీసీబీ అధ్యక్షుడు డోల జగన్‌తో కలిసి ముందుగానే వ్యూహరచన చేశారు. నరసన్నపేట టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పారు. ఆ నియోజకవర్గంలో సంప్రదాయంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న సామాజికవర్గానికి వ్యతిరేకంగా డోలను తెరపైకి తెచ్చారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, కేంద్ర మంత్రి చిరంజీవిలతో కూడా మాట్లాడి మార్గం సుగమం చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కృపారాణిని మాటమాత్రంగానైనా సంప్రదించ లేదు. డోల జగన్ పూర్తిగా తమ సన్నిహితుడిగానే ఉండాలన్నది మంత్రి మురళీ ఉద్దేశం. తద్వారా కృపారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కూడా తన వర్గాన్ని పెంచుకోవాలన్నది ఆయన లక్ష్యం. అంతా తాను అనుకున్నట్లే సాగుతోందని ఆయన ధీమాగా ఉన్న తరుణంలో కృపారాణి ప్రతిదాడికి దిగారు. తెర పైకి శిమ్మ కుటుంబం తన నియోజకవర్గ పరిధిలో కోండ్రు జోక్యాన్ని కేంద్ర మంత్రి కృపారాణి ఏమాత్రం సహించలేకపోయారు. తొలి దశలోనే ఆయన్ను అడ్డుకోవాలని నిర్ణయించారు. డోల జగన్ అవకాశాలకు గండి కొట్టేందుకు వ్యూహాత్మకంగా శిమ్మ కుటుంబాన్ని తెరపైకి తెచ్చారు. నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే శిమ్మ ప్రభాకర్‌రావు దంపతులను ఇటీవల సంప్రదించారు. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గానికి కాకుండా ఇతరులకు అవకాశం ఇవ్వాలని మంత్రి మురళీ ప్రయత్నిస్తున్నారని వారితో చెప్పారు. అలా కాకుండా సంప్రదాయంగా ఆధిపత్యం సాగిస్తున్న సామాజికవర్గానికే టిక్కెట్టు ఇచ్చేలా పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తానని చెప్పారు. శిమ్మ ప్రభాకర్‌రావు భార్య ఉషారాణిని అభ్యర్థిగా నిలుపుతామని కూడా హామీ ఇచ్చేశారు. అలా అయితే తన లోక్‌సభ నియోజకవర్గంలో సామాజికవర్గ సమీకరణల సమతూకం సాధ్యమవుతుందని కూడా అధిష్టానానికి వివరిస్తానని చెప్పారు. ఈ ప్రతిపాదనపై శిమ్మ దంపతులు తమ తుది నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ పరిణామాలు మాత్రం కోండ్రు, కిల్లిల మధ్య ఆధిపత్య పోరు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. కృపారాణి అనూహ్యంగా చేసిన ప్రతిదాడితో మంత్రి మురళీ ఆత్మరక్షణలో పడిపోయారు. జిల్లా పార్టీపై పట్టు సాధించాలన్న తన వ్యూహానికి కృపారాణి గండికొడతారని ఆయన ఊహించలేదు. నరసన్నపేట కేంద్రంగా మొదలైన ఆధిపత్య పోరు జిల్లా అంతటా వ్యాపించి పార్టీకి ఉన్న కొనఊపిరినీ కూడా తీసేసేలా ఉందని కాంగ్రెస్ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. -
రాజధానికి రూ. 500 కోట్లా!
చాలాకాలం తర్వాత బాల సాయిబాబా తెరమీదకు వచ్చారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన ఆలోచనలో పడ్డట్టున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుందనో, మరోమిటో తెలియదు గానీ... ప్రత్యేక గుర్తింపు కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. ఎంత ఖర్చయినా వెరవకుండా తనను తాను మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తించారు. పుట్టినరోజు సాకుతో కేంద్ర, రాష్ట్ర మంత్రులను, విదేశీయులను కూడా భక్తులుగా పిలిపించుకొని మరీ ఉపన్యాసాలు ఇప్పించారు. బాల సాయిబాబా శ్రీనిలయంలో జరిగిన తన 54వ పుట్టినరోజుతో పాటు సంక్రాంతి వేడుకలను అత్యంత కోలాహలంగా చేసుకున్నారు. ఈ స్వాములోరు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్రమంత్రలు టీజీ వెంకటేష్, బస్వరాజు సారయ్య రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్టా లాంటి ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించి ప్రత్యేకత కోసం పరితపించారు. లోగుట్టు ఏంటో తెలియదు కానీ... ప్రజాప్రతినిధులు సైతం బాలసాయిబాబాను పొగడ్తలతో ముంచెత్తారు. విదేశీ భక్తులు సైతం బాబా భజనలో తరించారు. ఇక ఎప్పుడూ శాంతి వచనాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే బాలసాయి తాజాగా రాష్ట్ర విభజన గురించి మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున పడ్డ సమయంలో పల్లెత్తు మాటకూడా మాట్లాడని బాబా ఇపుడు కర్నూలును రాజధాని చేయాలంటున్నారు. అంతేకాదు, సీమాంధ్రకు కర్నూలును రాజధానిగా చేస్తానంటే తనకున్న ఆస్తిలో 500 కోట్ల రూపాయలు ఇస్తానని కూడా ఉదారంగా ప్రకటన చేసి పారేశారు. బాల సాయిబాబాకు ఇంతకు ముందే ప్రజల్లో ఒకరకమైన ఇమేజ్ ఉంది. అసలు బాల సాయిబాబా అనగానే... ఆరోపణలు, కేసులు, అక్రమాలే గుర్తొస్తాయి. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వందల కోట్ల ఆస్తులకు ఎదిగారని కొందరు అంటారు. బాల సాయిబాబా ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నారు. మరెన్నో ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కేసులో... న్యాయస్థానం ఈ బాబాను భూ కబ్జాదారునిగా నిర్థారించింది. ఇలాంటి పరిణామాలే బాబాకు ఇబ్బంది మారాయి. ప్రజల్లో చెప్పలేనంత వ్యతిరేకత వచ్చింది. ఎన్ని విన్యాసాలు.. సారీ మహిమలు ప్రదర్శించినా నమ్మేవారు కరువయయ్యారు. అందుకే ముందుగా తన మీదున్న మచ్చల్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో భాగంగానే ప్రజాప్రతినిధులను బుట్టలో వేసుకున్నారు. ఇక బాబాలు తమ ప్రచారం తామే చేసుకునే రోజుల నుంచి ఇప్పుడు మెగా ఈవెంట్స్‌గా జరిపే స్థితికి వచ్చారంటే వారు ఏ రేంజికి ఎదిగారో చెప్పనవసరం లేదు. -
బాల సాయిబాబాకు పాదాభివందనం
కర్నూలు: కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వివాదంలో చిక్కుకున్నారు. వివాదస్పద బాల సాయిబాబా పాదాలకు ఆమె పాదాభివందనం చేయడం విమర్శలకు దారి తీసింది. కృపారాణి అజ్ఞానంతో ప్రవర్తించారని జన విజ్ఞాన వేదిక(జేవీవీ) విమర్శించింది. కేంద్ర మంత్రిగా ఉంటూ దొంగస్వాముల కాళ్లు పట్టుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఏ ప్రయోజనాల కోసం బురిడీ బాబాను ఆశ్రయించారో బయటపెట్టాలని జేవీవీ ప్రతినిధి టీవీ రావు డిమాండ్ చేశారు. ఐటీ మంత్రిగా ఉండి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్న కృపారాణిని బర్తరఫ్ చేయాలన్నారు. బాబాల కాళ్లు పట్టుకుని రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్న మంత్రులు, నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామన్నారు. ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించాలని, పార్టీలు టిక్కెట్లు ఇవ్వకూడదన్నారు.డబ్బులు తీసుకుని బాబాల చుట్టూ తిరిగే నేతలను సంఘ బహిష్కరణ చేయాలన్నారు. మేజిక్లతో మోసాలు చేసే బాబాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీవీ రావు హెచ్చరించారు. బాలసాయిబాబా శ్రీనిలయంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు కృపారాణితో పాటు రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, బస్వరాజు సారయ్య, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ హాజరయ్యారు. -
కిళ్లి కృపారాణిని అడ్డుకున్న సమైక్యవాదులు
-
కిళ్లి కృపారాణిని అడ్డుకున్న సమైక్యవాదులు
కర్నూలు: కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. ఆమె బస చేసిన స్టేట్ గెస్ట్‌హౌస్‌ను సమైక్యవాదులు ముట్టడించారు. అతిథి గృహంనుంచి బయటకు రాకుండా ఆమెను అడ్డుకున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. బాలసాయిబాబా పుట్టినరోజుకు హాజరయేందుకు మంత్రి ఇక్కడకు వచ్చారు. -
ఖా‘కీచకపర్వం’..!
పచ్చని బతుకులు బుగ్గిపాలవుతాయని, భావితరాల జీవనం అంధకారమవుతుందని..ప్రజా పోరాటం ఓ వైపు.. ముడుపులు..ప్యాకేజీలకు తలొగ్గి..ప్రజా పోరును నీరు గార్చే ప్రయత్నం మరోవైపు.. మధ్యలో ఖాకీల క్రౌర్యం..వెరసి థర్మల్ ఉద్యమ గ్రామాలు అట్టుడికిపోతున్నాయి. పోలీసుల దాష్టీకానికి సమిథలవుతున్నాయి.. బూటు చప్పుళ్లతో నిద్రకు దూరమవుతున్నాయి. తుపాకీ తూటాలు దూసుకుపోయి.. ఉద్యమకారులు నేలకొరిగినా.. ఖాకీల కఠిన హృదయాలు కరగడం లేదు. తాము కూడా మనుషులమేనన్న సంగతే మరిచిపోయారు. మృగాల్లా ప్రవరిస్తూ.. నిశిరాత్రి బీభత్సం సృష్టించారు. ఆదమరిచి నిద్రిస్తున్న వారిపై..దాడులకు తెగబడ్డారు. అడ్డుపడిన మహిళలపై కూడా కనికరం చూపకుండా..బలవంతపు అరెస్టులకు పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: థర్మల్ విద్యుత్ ప్లాం ట్ల నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష టీడీపీ థర్మల్ యాజమాన్యానికి అమ్ముడుపోయింద న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కక్ష సాధింపే ధ్యేయంగా ముందుకు సాగుతు న్నారు. ఇదే అదనుగా పోలీసులు రెచ్చిపోయి.. ఆందోళన కారులను బూట్ల కింద నలిపెయ్యాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి థర్మల్ వ్యతిరేక గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు. రెండు గంటల ప్రాంతంలో హనుమంతనాయుడిపేట, ఆకాశలక్కవరం, పాలనాయుడిపేటల్లో ఏడుగురిని అరెస్ట్ చేశా రు. ఇళ్లల్లో నిద్రిస్తున్న వారిని లేపి, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసి, అరెస్ట్ చే శారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 1231 రోజులుగా ఉద్యమం థర్మల్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మంగళవారం నాటికి 1231వ రోజుకు చేరుకుంది. 1108 జీవోను రద్దుచేయాలని కోరుతూ ఈ ఉద్యమం సాగుతోంది. ప్లాంట్‌కు 3333 ఎకరాల కేటాయింపు కాకరాపల్లి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ప్రభుత్వం 3333 ఎకరాల తంపర భూములను కేటాయించింది. గరీబులగెడ్డ, మాలపాటి గెడ్డ, ఏనుగులగెడ్డ, వంశధార, మహేంద్ర తనయ నదుల నుంచి తుపానులు, భారీ వర్షాలు కురిసినప్పుడు తంపర భూముల్లోకి నీరు చేరుతుంది. ఈ నీరు సముద్రంలోకి ఈ పొలాల్లో మీదుగానే వెళుతుంది. అయితే ఈ భూములను ప్రభుత్వం విద్యుత్ ప్లాంట్‌కు కేటాయించడంతో.. సంబంధిత యాజమాన్యం15 అడుగుల ఎత్తు పెంచింది. దీంతో తంపర భూ ములు మునిగిపోతున్నాయి.. ఆరు వేల మంది మత్స్యకారుల విలవిల భావనపాడు నుంచి విమలాడ వరకు సముద్రతీరంలో ఒడిశా నుంచి గతంలో వలస వచ్చిన సుమారు ఆరువేల మంది స్వదేశీ మత్స్యకారులు ఉన్నారు. లక్ష మంది వరకు జనం ఈ తీర ప్రాంతంలో నివశిస్తున్నారు. 25వేల ఎకరాల్లో రైతులు, రైతు కూలీలు జీవనం సాగిస్తున్నారు. ఇంతమందికి విఘాతంగా మారిన ప్లాంట్ వద్దంటూ ఐదేళ్లుగా 59 గ్రామాలకు చెందిన ప్రజలు పోరాటం చేస్తున్నారు. బాధితుల పక్షాన వైఎస్ఆర్సీపీ కాకరాపల్లి థర్మల్ బాధితుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం సాగిస్తోంది. పార్టీ టెక్కలి ని యోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించడం లో ముందున్నారు. దీనిని జీర్ణించుకోలేని అధికార పార్టీ వారు 2011 ఫిబ్రవరి 25న ఆయనను ముందుగా అరెస్ట్ చేయిం చా రు. అనంతరం 28వ తేదీన పోలీ సులు ఉద్యమ కారులపై కాల్పులకు తెగబ డ్డారు. ఈ మారణకాండలో జీరు నా గేశ్వరావు, బత్తిని బారికయ్య, ఎర్రయ్యలు మరణించారు. 1600 మందిపై కేసులు నమోదు చేశారు. 89 ఏళ్ల చంద్ర మ్మ, లక్షిలపై కేసులతో పాటు రౌడీషీట్లు ఓపెన్ చేశారు. ప్లాంట్ వారితో టీడీపీ కుమ్మక్కు థర్మల్ విద్యుత్ ప్లాంట్ వారితో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నా యి. ఇటీవల ఎచ్చెర్ల వద్ద కొనసాగుతున్న థర్మల్ వ్యతిరేక పోరాట దీక్షా శిబిరాన్ని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎత్తివేయించారు. ఉద్యమాన్ని నీరుగార్చే విషయంలో భారీగా టీడీపీ వారికి నజరానాలు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ దాష్టీకం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిపై అధికార పార్టీ దాష్టీకం ఎక్కువైంది. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తనదైన శైలిలో బాధితులపై పోలీసులతో దాడులు చేయించారణ ఆరోపణలు లేకపోలేదు. అర్ధ రాత్రి అరెస్టులు వెనుక ఆమె హస్తం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దువ్వాడ నేతృత్వంలో ఆందోళన.. వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ నాయకత్వంలో హెచ్ఎన్ పేట వద్ద సహాయ నిరాకరణోద్యమ (80 టన్నుల బరువుకు మిం చిన వాహనాలను గ్రామాల్లో నుంచి రాకుండా అడ్డుకోవడం) శిబిరాన్ని 17 రోజుల క్రితం తాజా మాజీ ఎమ్మె ల్యే, శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు పిరియా సాయిరాజ్ ప్రారంభించారు. ఉద్యమాన్ని నీరు గార్చి.. ఆందోళన కారుల్లో భయాందోళనలు వచ్చే విధంగా చేయాలనే ఆలోచనతో అధికార పార్టీ ఆదేశాల మేరకు సోమవారం తెల్లవారు జామున పోలీసులు వందల సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి.. భయోత్పాతం సృష్టించారు. నిశిరాత్రి బీభత్సం..! సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: థర్మల్ గ్రామాల్లో పోలీసులు సోమవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇళ్లలోకి దూరి ఉద్యమకారులను అరెస్టు చేశారు. వాహనాలను అడ్డుకుంటున్నారన్న థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు చడీ చప్పుడు లేకుండా..హెచ్.ఎన్.పేట, ఆకాశలక్కవరం, పాలనాయుడుపేట గ్రామాలకు వెళ్లి..ఇళ్లల్లో పడుకున్న ఉద్యమకారులను ఈడ్చుకుంటూ.. తీసుకువెళ్లి..అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సీఐ, ఎస్సైలు, వందలాది మంది సిబ్బంది కీచకపర్వాన్ని కొనసాగించా రు. అడ్డుపడిన మహిళలను సైతం పక్కకు తోసేసి.. ఉద్యమకారులైన సీరపు నర్సింహమూర్తి, దల్లి చిన్నఎర్రయ్య, కొయ్య ప్రసాద్‌రెడ్డి, నీలాపు అప్పలస్వామి, కప్ప గవర్రజు, లింగూడు నాగేశ్వరరావు, బొంగు తేజారావులను తీసుకువెల్లి అరెస్టు చేశారు. ఆ తర్వాత నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుంచి పవర్‌ప్లాంటు మెయిన్ గేటు వరకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అప్పటి వరకు ఈ రూట్లో థర్మల్ వాహనాలను నడపడానికి వెనుకంజ వేసిన యాజమాన్యం మంగళవారం వేకువ జాము నుంచి నిర్భయంగా పోలీసుల సహకారంతో నడిపించారు. విషయం తెలుసుకుని జర్నలిస్టుల బృందం ఆయా గ్రామాల్లో పర్యటించగా.. బాధిత కు టుంబాలు..పోలీసుల దౌర్జన్యాన్ని వివరించా యి. తమ ఆవేదనను వెల్లగక్కాయి. మహిళలని చూడకుండా..పక్కకు తోసేసి..తమ వారిని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని పరపటి రాజేశ్వరి, దల్లి సీత మ్మ, సీరపు జ్యోతితో పాటు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. -
‘థర్మల్’ జీవో రద్దుకు హామీ
కంచిలి/కవిటి, న్యూస్‌లైన్: సోంపేట మండలం బీల ప్రాంతంలో తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్ జీవో 1107ను రద్దు చేయిస్తామని కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి హామీ ఇచ్చారు. ఆమె సోమవారం సాయంత్రం కంచిలిలో గల మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా నివాసంలో తనను కలిసిన సోంపేట పర్యావరణ పరిరక్షణ సమితి ప్రతినిధులతో చర్చించారు. థర్మల్ ప్లాంట్ రద్దుకు సీఎం సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఉదయం కవిటి మండలంలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాజీవ్ ఇందిరా నగర్ కాలనీకి చెంది తొమ్మిది మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. కవిటిలో శాఖాగ్రంథాలయం ప్రారంభించారు. మేస్త్రీల సంఘం, మత్స్యకార ఐక్యవేదిక సంఘం, ఆటో యూనియన్ సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభివృద్ధి పనులను వివరించారు. సోంపేట బీలలో 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణానికి అవసరమైన నిధులకు ప్రతిపాదనలు రూపొందుతున్నాయన్నారు. ట్రైమెక్స్ పరిశ్రమ వల్ల మత్స్యకారులకు ఎటువంటి నష్టమూ జరగదని మత్స్యకార నాయకుడు మడ్డు రాజారావు అడిగిక ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎంపీల్యాడ్స్ కేటాయింపులో వివక్ష చూపారంటూ సోంపేట మండలానికి చెందిన నేతలు డాక్టర్ ఎన్.దాసు, కంచిలి ఏఎంసీ చైర్మన్ పి.వి.రమణ నేతృత్వంలో పలు పంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశానికి దూరంగా ఉన్నారు. పరిస్థితిని గమనించిన కృపారాణి వారి వద్దకు వెళ్లి సముదాయించడంతో వెనుక సీట్లలో కూర్చున్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా, మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద, కె.రామ్మోహనరావు, ఏఎంసీ చెర్మైన్లు శ్యాంపురియా, పి.వి.రమణ, గ్రంథలయ సంస్థ చెర్మైన్ డీఎస్కే ప్రసాద్, ముస్తాక్ అహ్మద్, శ్రీదేవమ్మ, బర్ల నాగభూషణం, పాండవ చంద్రశేఖర్, మధు, నీలాచలం, దేవ్ తదితరులు పాల్గొన్నారు. -
అధిష్టానం మా మొర వినలేదు : కావూరి
హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రుల వాయిస్ పూర్తిగా మారిపోయింది. కొంతమంది విభజనకు సిద్ధపడి ప్యాకేజీల విషయం మాట్లాడుతుంటే, మరికొంతమంది విభజనను అడ్డుకోగలం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చెన్నైలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ తామెంత మొరపెట్టినా అధిష్టానం వినలేదని చెప్పారు. విభజన తప్పదన్న దృఢనిశ్చయంతో అధిష్టానం ఉందన్నారు. కానీ, విభజనను అడ్డుకోగలమనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యలను పరిష్కరించకుంటే విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తుందన్నారు. విభజన అనివార్యమని తెలియటంతో తాము సీమాంధ్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టామన్నారు. మరో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళంలో మాట్లాడుతూ విభజన అనివార్యం అన్నారు. సీమాంధ్ర ప్యాకేజి కోసం డిమాండ్ చేస్తామని చెప్పారు. -
పార్టీని వీడొద్దు : కృపారాణి
కంచిలి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీని వీడి బయటకెళ్లవద్దని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో మంగళవారం సాయంత్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. స్వలాభానికి, రాజకీయ లబ్ధికోసం పార్టీ మారుతున్నవారి నైజాన్ని గుర్తించాలని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కొందరు వ్యక్తులు బయటికెళ్ళి పోయినంతమాత్రాన పార్టీకి ఏం నష్టం జరిగిపోదని, కార్యకర్తలంతా పార్టీలోనే ఉంటున్నారని సమావేశానికి హాజరైనవారినిచూస్తే అర్థమవుతుందన్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని స్పష్టమైందన్నారు. మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద మట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న ఇచ్ఛాపురం నియోజవర్గ కార్యకర్తలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఉత్సాహంగా పనిచేసి మళ్ళీ పార్టీని అధికారంలోకి తెస్తారన్నారు. సోంపేట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్. దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శించేవారు ముందు పార్టీకి, పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ డాక్టర్స్‌సెల్ ప్రతినిధి కిల్లి రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా(లల్లూ), మాజీ మున్సిపల్ చైర్పర్సన్ లాభాల స్వర్ణమణి, పిలక పద్మావతి, శ్యామ్‌పురియా, పి.వి. రమణ, పి. చిన్నబాబు, పి. నీలాచలం, పి.దేవ్, బి. శోభన్‌బాబు, డి. ధర్మారావు, బి. మోహన్‌దాస్, రెడ్డి రాజశేఖర్, బి. శ్యామ్, ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. -
తొలి ఎత్తులోనే చిత్తు
కంచిలి, న్యూస్‌లైన్:ఎవరు ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగత అభిమానాన్ని చంపుకోలేం. దాన్నే తప్పుపడితే ఏం చేయలేం..గత ఎన్నికల్లో 4వేల ఓట్ల తేడాతో పార్టీని ఓడించిన వారినే ఈ రోజు నమ్ముతున్నారు.. వేదిక మీదకు ఆహ్వానించలేదని కొందరి అలకలు.. చాలా మంది ముఖ్యనేతల గైర్హాజరు వంటి పరిణామాలు కేంద్రమంత్రి కిల్లి కృపారాణిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు స్పష్టమైన నేపథ్యంలో జిల్లాపై ఆయన ముద్రను చెరిపేసే కార్యక్రమాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభించిన ఆమెకు తొలి ప్రయత్నంలోనే పార్టీ శ్రేణులు షాక్ ఇచ్చాయి. కంచిలిలో మంగళవారం సాయంత్రం జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఒక్క కవిటి మండలం నుంచే.. అది కూడా నరేష్కుమార్ అగర్వాలా(లల్లూ) వర్గీయులే హాజరయ్యారు. కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలతోపాటు ఇచ్ఛాపురం మున్సిపాలిటీ నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు అరకొరగానే వచ్చారు. కంచిలి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ధర్మాన వర్గంగా ముద్రపడిన క్యాడర్ అంతా గైర్హాజరయ్యారు. ఈ నియోజకర్గానికే చెందిన డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నర్తు రామారావు, సోంపేట మాజీ ఎంపీపీ మంగి గణపతి తదితరులతోపాటు సర్పంచ్‌లు, ఇతర గ్రామస్థాయి నేతల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. నియోజకవర్గంలో కాం గ్రెస్ వారిగా ముద్రపడిన సర్పంచ్‌లు 60 మంది వరకు ఉన్నప్పటికీ వారిలో చాలా మంది ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. వచ్చిన కొద్దిమంది కూడా అక్కడ ఏం జరుగుతుందన్నది గమనించడానికే ఆసక్తి చూపారు. మాటల తూటాలు లల్లూ వర్గీయులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని ఆర్భాటం చేయగా, మిగతా నాయకులు అసంతృప్తితో మాటల తూటాలు సంధించారు. ప్రొటోకాల్ ప్రకారం తమను వేదిక పైకి ఆహ్వానించనందుకు కంచిలి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పి.వి.రమణ, సోంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంగారు గోవింద్‌లు కొంతసేపు అలకబూనారు. తర్వాత వేదికపైకి వచ్చిన పి.వి.రమణ ఉద్వేగంగా మాట్లాడారు. పార్టీలో ఎవరు ఉన్నా.. లేకపోయినా వ్యక్తిగత అభిమానాలు ఉంటాయని, దాన్ని తప్పుపడితే తానేం చేయలేనని అన్నారు. ఈ క్షణం ఏఎంసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయమంటే చేసేస్తానని స్పష్టం చేశారు. సీనియర్ నేత సత్యనారాయణ పాఢి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పార్టీని 4వేల ఓట్ల తేడాతో ఓడించిన వారినే ఈ రోజు నమ్ముతున్నారని ఆరోపించారు. మరి పార్టీని నమ్ముకున్నవారికి ఇచ్చే గౌరవమేమిటని ప్రశ్నించారు. దీనిపై ఇచ్ఛాపురం నేత ఉలాల బాలయ్య మాట్లాడుతూ ఎవరికి వారు తమ గొప్పలు చెప్పుకోరాదని, ప్రజలు చెప్పాలని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ కృపారాణి ఆశలపై నీళ్లు చల్లాయి. కేంద్రమంత్రి స్థాయిలో తాను సమావేశం పెట్టడం వల్ల వ్యక్తుల ప్రాబల్యానికి లొంగకుండా కాంగ్రెస్వాదులందరూ హాజరవుతారని భావించిన ఆమెకు నిరాశే మిగిలింది. జిల్లాపై పట్టుకు చేసిన తొలి ప్రయత్నమే తిప్పికొట్టింది. -
సత్యసాయి 88వ జయంతి వేడుకలు
సత్యసాయి బాబా 88వ జయంతి సందర్భంగా శనివారం అశేష భక్త జనుల సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది. ఉదయం 8.30 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థుల వేదపఠనంతో జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళ సంప్రదాయరీతిలో మంగళ వాద్యాలతో సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు ఆత్మ స్వరూపుడైన సత్యసాయికి ఆత్మ నివేదనను అర్పించారు.ఆదర్శనీయుడు సత్యసాయిజ్యోతి ప్రజ్వలనతో సత్యసాయిబాబా 88వ జయంతి వేడుకలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిహాజరైన మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుబాబా సమాధి వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పిస్తున్న విద్యార్థులుసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానందవార్షిక నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రఘువీరారెడ్డి, గీతారెడ్డి, కేంద్ర మంత్రి కిల్లికృపారాణిబ్యాండ్ వాయిస్తున్న సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినులువిలేకరులతో మాట్లాడుతున్న కోడి రామకృష్ణసత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినులువేడుకలకు హాజరైన మంత్రి గీతారెడ్డి సాయి కుల్వంత్ హాలు వద్ద సత్యసాయికి ఆత్మ నివేదన అర్పిస్తున్న విద్యార్థులు -
పార్లమెంట్లో తెలంగాణ బిల్లు వీగిపోదు: కృపారాణి
విశాఖపట్నం, న్యూస్‌లైన్: చిన్నరాష్ట్రాలకు కమలనాథులు అనుకూలం కావడంతో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు వీగిపోదని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అతిథిగృహంలో బుధవారం ఉదయం తనను కలసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతిపక్షాలైన బీజేపీ, టీడీపీలు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని సీడబ్ల్యూసీకి, అఖిలపక్షపెద్దలకు లేఖలిచ్చారని ఈ పరిస్థితుల్లో తామెలా కాదంటామని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకుని సమైక్యాంధ్రకోసం పోరాడితే తాము తప్పకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రధానిని నిలదీసేవారమన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయడానికే సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. రెండుసార్లు ప్రధాని అవకాశం వచ్చినా పదవీ బాధ్యతలు చేపట్టని సోనియా తన కొడుకును ప్రధానిని చేయడానికి కుళ్లు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి ఓ ఐటీ ప్రాజెక్టు ఉండాలన్న ఉద్దేశంతోనే హైదరాబాద్‌కు 2.20 లక్షల కోట్లతో ఐటీ ప్రాజెక్టు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే ఇలాంటిప్రాజెక్టును విశాఖకు కేటాయించాలని ప్రధానిని కోరినట్టు ఆమె చెప్పారు. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పరిశ్రమలు కేటాయించాలని పీఎంను కోరానన్నారు. ఈనెల 24న విశాఖ కేంద్రంగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్‌మ్యాచ్‌ను అడ్డుకుంటామనడం మంచి పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. -
ఎవరి గోల వారిది!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మనం అడ్డుకుంటే తెలంగాణ ఆగుతుందా?.. పైగా రాష్ట్రాన్ని విభజిస్తున్నది మన పార్టీయే. అధిష్టానాన్ని కాదని నిలబడగలమా?.. అందువల్ల పార్టీ చెప్పినట్లే నడుచుకుందాం.. ఇదీ ప్రస్తుతం జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల భావన. కేంద్ర మంత్రులు కిశోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు కోండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజులు ఎవరి వారు తాము సమైక్యవాదులమేనని ప్రకటించుకుంటున్నా.. పదవులను వదులుకునేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. సమైక్య సెగ కారణంగా పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్న తమ అనుచరులను నిలువరించడం, జిల్లాపైనా.. పార్టీపైనా ఆధిపత్యం సాధించడం.. అన్న లక్ష్యంతోనే పని చేస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు ‘ఎన్నడూ లేని విధంగా శ్రీకాకుళంలో నాపై వ్యతిరేకత వచ్చింది. సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్‌కు సీమాంధ్రలో నూకలు చెల్లాయి. ఇప్పుడేం చేద్దాం’.. ఇదీ మాజీ మంత్రికి వచ్చిన ధర్మ సందేహం. ఒక దశలో రాజకీయ సన్యాయం తీసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినా అభిమానులు ఒత్తిడి పేరుతో పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా అంటూనే గత నెల 20న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినప్పుడు ఆయనకు లంచ్ ఏర్పాటు చేసి తన భక్తిని చాటుకున్నారు. ఇక డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్ర యాదవ్ కాంగ్రెస్ జెండాపై నల్లగుడ్డ కప్పారు. కాంగ్రెస్ భూస్థాపితమైందని ప్రకటించేశారు. ఇటువంటి పార్టీలో ఉండేకంటే వెళ్లిపోవడమే మంచిదన్నారు. డీసీసీ కార్యాలయంలో కేంద్రమంత్రి కృపారాణి ఉండగానే తమ నేత ధర్మాన ప్రసాదరావు చేత ఇందిరకు పూలమాల వేయించేశారు. ఇలా పార్టీలో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం మంత్రులకు ఇరకాటంగా మారింది. అటువంటి వారిని కంట్రోల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు జిల్లా కాంగ్రెస్‌లో అన్నీ తానై వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఆయన స్థానాన్ని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఆమె పరోక్షంగా ధర్మానపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తన ఆధిపత్యాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె వెంట అధికార గణం తప్ప పార్టీ ముఖ్య నాయకులు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. మరో కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ఢిల్లీ తప్ప తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇక రాష్ట్ర మంత్రి కోండ్రు మురళీ ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగిన సమావేశంలోనే సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుపై నోరు పారేసుకుని చీవాట్లు తిన్నారు. ఇంకో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సహనం కోల్పోయి జనంలో పలుచన అవుతున్నారు. సమైక్య నినాదంతో అడ్డుకుంటున్న జనాన్ని దూషణలతో మరింత కిర్రెక్కిస్తున్నారు. తనకు తానే వ్యతిరేకత పెంచుకుంటున్నారు. మంత్రుల పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లివాటంగా వ్యవహరిస్తున్నారు. అవకాశం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నా.. వారు చేర్చుకుంటారో లేదోననే సందేహంతో సతమతమవుతున్నారు. ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని తమను తిరిగి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారా? అనే సందేహం వారిని వేధిస్తోంది. ఓటర్లు మాత్రం వారిని ఎప్పుడో వదిలేశారు. ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా రకరకాల ధోరణులు, సమస్యలతో జిల్లా కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. పార్టీ జెండా కాకుండా సొంత ఎజెండాతో ఎవరికి వారు ముందుకు సాగుతున్నారు. -
'బీజేపీ యూటర్న్ తీసుకుంటే విభజన ఆగుతుంది'
తిరుమల: విభజనపై బీజేపీ తన విధానం మార్చుకుంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఆపే శక్తి కేంద్రంలోని ప్రతిపక్ష బీజేపీకి ఉందని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ యూటర్న్ తీసుకుంటే రాష్ట్రం విడిపోదని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు న్యాయం జరగాలంటే యూటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లేవారంతా అధికారం కోసమే వీడుతున్నారని ఆరోపించారు. ప్రజల మనోభావాలు గౌరవవించకుంటే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. మంత్రుల బృందం (జీవోఎం)ను మరోసారి కలిసి తమ అభిప్రాయాలు తెలియజేయనున్నట్టు కృపారాణి వెల్లడించారు. -
తుపాను నష్టం ఆపారం
ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను సృష్టించిన విలయంతో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలు విలవిల్లాడుతున్నాయి. వందల కోట్ల పంట, ఆస్తి నష్టం వాటిల్లింది. ఉద్దానం జీవనాధారమైన కొబ్బరి, జీడి తోటలు ధ్వంసమయ్యాయి. రైతులు, మత్స్యకారులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు.. ఇలా అన్ని వర్గాలవారు తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయారు. మంత్రులు రఘువీరారెడ్డి, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీమోహన్, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తదితరులు తుపాను ప్రాంతాల్లో నామమాత్రంగా పర్యటించి, మొసలి కన్నీరు కార్చి వెళ్లిపోయారే తప్ప సహాయ చర్యలు ఎలా అమలవుతున్నాయన్న విషయాన్ని అసలు పట్టించుకోలేదు. సహాయం గురించి ముఖ్యమంత్రి వైపు నుంచి ఇంతవరకు కనీస ప్రకటన లేకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుదేలైన కొబ్బరి రైతు రెండు నియోజకవర్గాల్లో విస్తరించిన ఉద్దానం ప్రాంతంలో 9 వేల హెక్టార్లకు పైగా కొబ్బరి పంట ఉండగా 3,500కు పైగా హెక్టార్లల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా. కొబ్బరి రైతులు రూ.450 కోట్ల మేర నష్టపోయారు. పదేళ్లయినా కొబ్బరి రైతు తేరుకోలేడని, నష్టం అంత తీవ్రంగా ఉందని కొబ్బరి బోర్డు సీనియర్ కన్సల్టెంట్ జోహార్‌ఖాన్ చెప్పారు. కొబ్బరితోపాటు అంతర పంటలైన జీడి, మామిడి, అరటి తోటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వీటి నష్టం మరో రూ.100 కోట్ల వరకు ఉంటుంది. 400 హెక్టార్లలో కాయగూరలు, వందల హెక్టార్లలో వేసిన పనస, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వరి, ఇతర పంటలు సాగు చేస్తున్న సుమారు 15 వేల ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. దాదాపు వంద ఎకరాల్లో వేసిన టేకు చెట్లు కూడా కూలిపోయాయి. కోట్ల విలువైన బోట్లు, వలల ధ్వంసం వందల సంఖ్యలో విలువైన బోట్లు, వలలు కొట్టుకుపోవడమో, పాడైపోవడమో జరిగి, మత్స్యకారులు పది కోట్ల రూపాయలకుపైనే నష్టపోయివుంటారని అంచనా. దాచుకున్న చేపలను సైతం సముద్రం లాగేసుకోవడంతో మరో కోటి రూపాయలకు పైగానే నష్టం వాటిల్లింది. సుమారు 20 రొయ్యల చెరువులు కూడా ధ్వంసమయ్యాయి. సుమారు 3వేలకు పైగా ఇళ్లు పూర్తిగానో, పాక్షికంగానో దెబ్బతినగా 400 ఇళ్ల లెక్కే చూపిస్తున్నారు. జల దిగ్బంధంలో 3 గ్రామాలు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇప్పటికీ మూడు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇచ్ఛాపురం మండలంలోని ఇన్నీసుపేట, బొడ్డబడ, కవిటి మండలంలోని ఒంటూరు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. బాహుదా నది వరద కారణంగా బొడ్డబడ గ్రామానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఒంటూరు గ్రామస్తులు సరైన ఆహారం, పారిశుద్ధ్యం లేక అనారోగ్యం పాలవుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలు ముమ్మరం విశాఖపట్నం: పై-లీన్ తుపాను నష్ట నివారణకు ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఈపీడీసీఎల్) చర్యలు చేపట్టింది. ఉత్తరాంధ్ర జిల్లా పరిధిలోని 33/11 కేవీ సామర్థ్యమున్న 81 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. 1010 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్టు లెక్కతేల్చారు. అయితే నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న దానిపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, పలాస, వజ్రపుకొత్తూరు పరిధిలో బాగా నష్టం వాటిల్లినట్టు అధికారులు చెప్తున్నారు. టెక్కలి డివిజన్లో ప్రస్తుతం 33/11 కేవీ సామర్థ్యమున్న 34 సబ్స్టేషన్లను ప్రస్తుతం పునరుద్ధరించారు. 11 కేవీ ఫీడర్లు, ఎల్టీ లైన్ల పునరుద్ధరణకు మరో రెండు రోజులు పడుతుందని చెప్తున్నారు. దీంతో సుమారు 270 గ్రామాలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ చేస్తామని చెప్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్స్ విభాగంలో అనుభవమున్న సీనియర్ ఇంజనీరు, ఈపీడీసీఎల్ జనరల్ మేనేజర్(ప్రాజెక్ట్సు) పి.వి.వి.సత్యనారాయణను పర్యవేక్షక ఇంజనీరు(ఎస్ఈ)గా సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్తు పునరుద్ధరణకు ఆదేశాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణ, ఇతర సహాయ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాను వల్ల నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ, మంచినీటి సరఫరా పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపానులో దెబ్బతిన్న 112 (33/11) సబ్స్టేషన్లలో 111 సబ్స్టేషన్లకు మరమ్మతులు పూర్తి చేశామని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. 11 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 323 దెబ్బతినగా 295 మరమ్మతులు చేశామని వివరించారు. 2,061 గ్రామాలకు విద్యుత్తు సరఫరా దెబ్బతినగా 1,811 గ్రామాలకు పునరుద్ధరించామని తెలిపారు. రహదారులు పునరుద్ధరించామని, బావుల్లో కలుషితమైన నీటిని శుద్ధి చేశామని సంబంధిత శాఖల అధికారులు తెలియజేశారు. పొంచి ఉన్న మరో ముప్పు? సాక్షి, విశాఖపట్నం: పై-లీన్ తుపాను తీరం దాటిపోవడంతో అన్నివర్గాలూ ఊపిరిపీల్చుకున్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్ ప్రాంతంలో అల్పపీడన ం ఏర్పడడం, ఇది కాస్త బలపడే అవకాశం ఉండడంతో మరో తుపాను ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. అండమాన్ నికోబార్ ప్రాంతం నుంచి బంగ్లాదేశ్/థాయ్‌లాండ్ ప్రాంతాల మీదుగా బంగాళాఖాతం వైపు గాలులు వీస్తుండడంతో నాలుగైదు రోజుల్లో ప్రభావం కనిపించవచ్చనే ప్రచారం ఊపందుకుంది. తూర్పు తీరంపై తుపాను ప్రభావం ఉంటుందనే విషయమై.. ఇది వాస్తవం కాదని, ప్రస్తుత వాతావరణం.. కొన్ని చోట్ల వర్షాలు పడేందుకే కారణమవుతోంది తప్పితే తుపాను అవకాశాలేవీ లేవని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అయితే ఇది కాస్త బలహీనంగానే ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పై-లీన్ తుపాను జార్ఖండ్ ప్రాంతంలో పూర్తిస్థాయిలో బలహీనపడిపోయిందని, దీని ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టేనని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రంలోపు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. -
కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి సమైక్యసెగ
శ్రీకాకుళం : కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. టెక్కిలిలో కృపారాణి నివాసాన్ని సమైక్యవాదులు శనివారం ముట్టడించారు. స్పీకర్ ఫార్మెట్లో కృపారాణి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆమె ఇంటి ఎదుట బైఠాయించిన సుమారు వందమంది సమైక్యవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మంత్రి కొండ్రు మురళి ఇంటిని కూడా సమైక్యవాదులు ముట్టడించి, నిరసన తెలిపారు. అలాగే తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా సమైక్యవాదులు పాతపట్నం వద్ద రైల్ రోకో నిర్వహించారు. పూరీ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. మరోవైపు తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా సింహద్వారం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వరదు కళ్యాణి ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో రెండరోజు కూడా స్వచ్చందంగా బంద్ కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. కాగా జగన్ దీక్షకు మద్దతుగా ఆముదాలవలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు. -
కృపారాణిపై కోపాగ్ని
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సదనంపైకి ప్రజా సమూహం దండెత్తింది. కేంద్ర మంత్రి పదవీ కాంక్షను ఎం డగట్టింది. సమైక్యాంధ్ర ఆకాంక్షను ఎందుకు పట్టించుకోరంటూ నిగ్గదీసింది. సముదాయించడానికి రెండుసార్లు యత్నించినా ఏమాత్రం కృప చూపలేదు.. ఆందోళనపథం వీడకపోగా.. ఆగ్రహాగ్నితో కృపారాణి దిష్టిబొమ్మను దహనం చేసింది. సుమారు మూడుగంటల సేపు కేంద్రమంత్రికి ముచ్చెమటలు పట్టిం చింది. ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయమైన ప్రజా సదనం భవనాన్ని మంగళవారం సమైక్యవాదులు ముట్టడించి నినాదాలు, బైఠాయింపులు, శవయాత్రతో హల్చల్ చేశారు. ఈ సంఘటనలతో మంత్రి కార్యాలయం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత అలుముకుంది. పోలీసులు భారీ ఎత్తున మోహరించినా సమైక్యవాదులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ కమిటీ, జిల్లా జేఏసీ నేతల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు ఎన్జీవో హోం నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటల సమయంలో మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి, ఎంపీ పదవులకు రాజీనామా చే సి ఉద్యమంలోకి రావాలని నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించడం ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటికి కృపారాణి భవనం పైఅంతస్తు బాల్కనీలోకి వచ్చి సమైకవాదులను సమూదాయించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరంలేదన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పలుమార్లు కాంగ్రెస్ ఆధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడానికి మంత్రి పదవి అవసరమని అన్నారు. తను కూడా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. మంత్రి స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేసిన సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ చైర్మన్ హనుమంతు సాయిరాం, కన్వీనర్లు జామి భీమశంకర్, దుప్పల వెంకట్రావు, కొంక్యాన వేణుగోపాలరావు, ఎం.అప్పలనాయుడు, ఇతర ప్రతినిధులు కిలారి నారాయణరావు, కె.వి. అప్పలనాయుడు, దుప్పల శివరాంప్రసాద్ తదితరుల నాయకత్వంలో ఉద్యమకారులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. కార్యాలయం ముందు బైఠాయించారు. కొందరు రోడ్డుపైనే పడుకున్నారు. ఇంకొందరు చొక్కాలు విప్పేసి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మంత్రి కృపారాణి డౌన్‌డౌన్, సోనియా డౌన్‌డౌన్ అని నినాదాలతో హోరెత్తించారు. దీంతో కృపారాణి బయటకు వచ్చి మరోసారి వారిని సముదాయించడానికి ప్రయత్నించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను ఎందుకు గౌరవించరని నిలదీశారు. 60 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా రాజకీయ లబ్ధి కోసం పదవులను అంటిపెట్టుకొని ఉన్నారని ఆరోపించారు. శ్రీకాకళం నుంచి అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు పంపిన ప్రజలకే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కట్టుకథలు, పిట్టకథలు చెప్పకుండా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఇలాగే కొససాగితే సమైక్య ద్రోహులుగా మిగిలిపోతారని, రాజకీయ భవిషత్తు ఉండదని హెచ్చరించారు. ఐటీ శాఖ మంత్రి ఉండి లక్షల కోట్ల భారీ ప్రాజెక్టు అయిన ఐటీఐఆర్‌ను సీమాంధ్ర ప్రాంతానికి తెచ్చుకోలేని మీరు రాష్ర్ట విభజనను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. ఆధిష్ఠానం వద్ద మాట్లడే ధైర్యం లేని మీరు విభజనను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రాజకీయ సంక్షోభంతోనే విభజనను అడ్డుకోగలమని, వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్కదానికీ సమాధానం చెప్పకుండా మౌనం వహించిన కృపారాణి, అలాగే లోనికి వెళ్లిపోయారు. దీంతో ఉద్యమకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కార్యాలయం బయట మంత్రి ఫొటోతో ఉన్న గ్లోసైన్ బోర్డును చించేశారు. వాటి కర్రలతోనే పాడె, దిష్టిబొమ్మ తయారు చేసి పీఎస్ఎన్ఎం పాఠశాల వరకు శవయాత్రను నిర్వహించి, దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బమ్మిడి నర్సింగరావు, గీతాశ్రీకాంత్, గురుగుబెల్లి రాజులు, ఎం.కాళీ ప్రసాద్, బి.శ్రీహరి, వి.హరిశ్చంద్రుడు, పద్మావతి, సుబ్బలక్ష్మి, బి.సూర్యనారాయణ, ప్రభావతి, శోభారాణి, ఎస్.వి.ఎస్.ప్రకాష్, వై.ఉమామహేశ్వరరావు, శేషగిరిరావు, జయరాం, డిఆర్కె దాస్, ఎం.వి.రమణ, పైడి అప్పారావు, నానాజీ, పప్పల రాధాకృష్ణ, కె.వి.అప్పలనాయుడు, బి.రుషి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కేబినెట్ నోట్ సిద్దం కాలేదని షిండే చెప్పారు
-
విమానాశ్రయంలో అడ్డుకున్న సమైక్యవాదులు
-
విభజనపై కాంగ్రెస్ ఎంపీల డబుల్ గేమ్