ఖా‘కీచకపర్వం’..!
Published Wed, Jan 1 2014 4:04 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
పచ్చని బతుకులు బుగ్గిపాలవుతాయని, భావితరాల జీవనం అంధకారమవుతుందని..ప్రజా పోరాటం ఓ వైపు.. ముడుపులు..ప్యాకేజీలకు తలొగ్గి..ప్రజా పోరును నీరు గార్చే ప్రయత్నం మరోవైపు.. మధ్యలో ఖాకీల క్రౌర్యం..వెరసి థర్మల్ ఉద్యమ గ్రామాలు అట్టుడికిపోతున్నాయి. పోలీసుల దాష్టీకానికి సమిథలవుతున్నాయి.. బూటు చప్పుళ్లతో నిద్రకు దూరమవుతున్నాయి. తుపాకీ తూటాలు దూసుకుపోయి.. ఉద్యమకారులు నేలకొరిగినా.. ఖాకీల కఠిన హృదయాలు కరగడం లేదు. తాము కూడా మనుషులమేనన్న సంగతే మరిచిపోయారు. మృగాల్లా ప్రవరిస్తూ.. నిశిరాత్రి బీభత్సం సృష్టించారు. ఆదమరిచి నిద్రిస్తున్న వారిపై..దాడులకు తెగబడ్డారు. అడ్డుపడిన మహిళలపై కూడా కనికరం చూపకుండా..బలవంతపు అరెస్టులకు పాల్పడ్డారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: థర్మల్ విద్యుత్ ప్లాం ట్ల నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష టీడీపీ థర్మల్ యాజమాన్యానికి అమ్ముడుపోయింద న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కక్ష సాధింపే ధ్యేయంగా ముందుకు సాగుతు న్నారు. ఇదే అదనుగా పోలీసులు రెచ్చిపోయి..
ఆందోళన కారులను బూట్ల కింద నలిపెయ్యాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి థర్మల్ వ్యతిరేక గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు. రెండు గంటల ప్రాంతంలో హనుమంతనాయుడిపేట, ఆకాశలక్కవరం, పాలనాయుడిపేటల్లో ఏడుగురిని అరెస్ట్ చేశా రు. ఇళ్లల్లో నిద్రిస్తున్న వారిని లేపి, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసి, అరెస్ట్ చే శారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
1231 రోజులుగా ఉద్యమం
థర్మల్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మంగళవారం నాటికి 1231వ రోజుకు చేరుకుంది. 1108 జీవోను రద్దుచేయాలని కోరుతూ ఈ ఉద్యమం సాగుతోంది.
ప్లాంట్‌కు 3333 ఎకరాల కేటాయింపు
కాకరాపల్లి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ప్రభుత్వం 3333 ఎకరాల తంపర భూములను కేటాయించింది. గరీబులగెడ్డ, మాలపాటి గెడ్డ, ఏనుగులగెడ్డ, వంశధార, మహేంద్ర తనయ నదుల నుంచి తుపానులు, భారీ వర్షాలు కురిసినప్పుడు తంపర భూముల్లోకి నీరు చేరుతుంది. ఈ నీరు సముద్రంలోకి ఈ పొలాల్లో మీదుగానే వెళుతుంది. అయితే ఈ భూములను ప్రభుత్వం విద్యుత్ ప్లాంట్‌కు కేటాయించడంతో.. సంబంధిత యాజమాన్యం15 అడుగుల ఎత్తు పెంచింది. దీంతో తంపర భూ ములు మునిగిపోతున్నాయి..
ఆరు వేల మంది మత్స్యకారుల విలవిల
భావనపాడు నుంచి విమలాడ వరకు సముద్రతీరంలో ఒడిశా నుంచి గతంలో వలస వచ్చిన సుమారు ఆరువేల మంది స్వదేశీ మత్స్యకారులు ఉన్నారు. లక్ష మంది వరకు జనం ఈ తీర ప్రాంతంలో నివశిస్తున్నారు. 25వేల ఎకరాల్లో రైతులు, రైతు కూలీలు జీవనం సాగిస్తున్నారు. ఇంతమందికి విఘాతంగా మారిన ప్లాంట్ వద్దంటూ ఐదేళ్లుగా 59 గ్రామాలకు చెందిన ప్రజలు పోరాటం చేస్తున్నారు.
బాధితుల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ
కాకరాపల్లి థర్మల్ బాధితుల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం సాగిస్తోంది. పార్టీ టెక్కలి ని యోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించడం లో ముందున్నారు. దీనిని జీర్ణించుకోలేని అధికార పార్టీ వారు 2011 ఫిబ్రవరి 25న ఆయనను ముందుగా అరెస్ట్ చేయిం చా రు. అనంతరం 28వ తేదీన పోలీ సులు ఉద్యమ కారులపై కాల్పులకు తెగబ డ్డారు. ఈ మారణకాండలో జీరు నా గేశ్వరావు, బత్తిని బారికయ్య, ఎర్రయ్యలు మరణించారు. 1600 మందిపై కేసులు నమోదు చేశారు. 89 ఏళ్ల చంద్ర మ్మ, లక్షిలపై కేసులతో పాటు రౌడీషీట్లు ఓపెన్ చేశారు.
ప్లాంట్ వారితో టీడీపీ కుమ్మక్కు
థర్మల్ విద్యుత్ ప్లాంట్ వారితో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నా యి. ఇటీవల ఎచ్చెర్ల వద్ద కొనసాగుతున్న థర్మల్ వ్యతిరేక పోరాట దీక్షా శిబిరాన్ని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎత్తివేయించారు. ఉద్యమాన్ని నీరుగార్చే విషయంలో భారీగా టీడీపీ వారికి నజరానాలు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అధికార పార్టీ దాష్టీకం
థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిపై అధికార పార్టీ దాష్టీకం ఎక్కువైంది. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తనదైన శైలిలో బాధితులపై పోలీసులతో దాడులు చేయించారణ ఆరోపణలు లేకపోలేదు. అర్ధ రాత్రి అరెస్టులు వెనుక ఆమె హస్తం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
దువ్వాడ నేతృత్వంలో ఆందోళన..
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ నాయకత్వంలో హెచ్‌ఎన్ పేట వద్ద సహాయ నిరాకరణోద్యమ (80 టన్నుల బరువుకు మిం చిన వాహనాలను గ్రామాల్లో నుంచి రాకుండా అడ్డుకోవడం) శిబిరాన్ని 17 రోజుల క్రితం తాజా మాజీ ఎమ్మె ల్యే, శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్‌ఆర్‌సీపీ పరిశీలకుడు పిరియా సాయిరాజ్ ప్రారంభించారు. ఉద్యమాన్ని నీరు గార్చి.. ఆందోళన కారుల్లో భయాందోళనలు వచ్చే విధంగా చేయాలనే ఆలోచనతో అధికార పార్టీ ఆదేశాల మేరకు సోమవారం తెల్లవారు జామున పోలీసులు వందల సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి.. భయోత్పాతం సృష్టించారు.
నిశిరాత్రి బీభత్సం..!
సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: థర్మల్ గ్రామాల్లో పోలీసులు సోమవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇళ్లలోకి దూరి ఉద్యమకారులను అరెస్టు చేశారు. వాహనాలను అడ్డుకుంటున్నారన్న థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు చడీ చప్పుడు లేకుండా..హెచ్.ఎన్.పేట, ఆకాశలక్కవరం, పాలనాయుడుపేట గ్రామాలకు వెళ్లి..ఇళ్లల్లో పడుకున్న ఉద్యమకారులను ఈడ్చుకుంటూ.. తీసుకువెళ్లి..అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సీఐ, ఎస్సైలు, వందలాది మంది సిబ్బంది కీచకపర్వాన్ని కొనసాగించా రు. అడ్డుపడిన మహిళలను సైతం పక్కకు తోసేసి.. ఉద్యమకారులైన సీరపు నర్సింహమూర్తి, దల్లి చిన్నఎర్రయ్య, కొయ్య ప్రసాద్‌రెడ్డి, నీలాపు అప్పలస్వామి, కప్ప గవర్రజు, లింగూడు నాగేశ్వరరావు, బొంగు తేజారావులను తీసుకువెల్లి అరెస్టు చేశారు. ఆ తర్వాత నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుంచి పవర్‌ప్లాంటు మెయిన్ గేటు వరకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అప్పటి వరకు ఈ రూట్‌లో థర్మల్ వాహనాలను నడపడానికి వెనుకంజ వేసిన యాజమాన్యం మంగళవారం వేకువ జాము నుంచి నిర్భయంగా పోలీసుల సహకారంతో నడిపించారు.
విషయం తెలుసుకుని జర్నలిస్టుల బృందం ఆయా గ్రామాల్లో పర్యటించగా.. బాధిత కు టుంబాలు..పోలీసుల దౌర్జన్యాన్ని వివరించా యి. తమ ఆవేదనను వెల్లగక్కాయి. మహిళలని చూడకుండా..పక్కకు తోసేసి..తమ వారిని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని పరపటి రాజేశ్వరి, దల్లి సీత మ్మ, సీరపు జ్యోతితో పాటు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.
Advertisement