thermal power plants
-
76 శాతం థర్మల్ ప్లాంట్ల నుంచే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం విద్యుత్ అవసరాల్లో దాదాపు 76 శాతం అవసరాలను థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచే సమకూర్చుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,750 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభలో విద్యుత్, పునరుత్పాదక ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ఉద్దేశంతో నిర్మిస్తున్న భిన్నరకాల విద్యుత్ ప్లాంట్ల వివరాలనూ మంత్రి వెల్లడించారు. ‘మొత్తంగా 25వేలకుపైగా మెగావాట్ల సామర్థ్యంతో 18 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి గ్యాస్ ఆధారిత థర్మల్ ప్లాంట్ ఉంది. మొత్తంగా 18వేల మెగావాట్ల సామర్థ్యంతో 42 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. 8వేల మెగావాట్ల సామర్థ్యంతో అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సామర్థ్యం దేశం సొంతం. 3.6 శాతం మిగులును సాధించాం. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడూ 0.7 శాతం మిగులును సాధించాం’ అని మంత్రి వెల్లడించారు. అయితే 2023 ఏప్రిల్–జూన్ కాలంలో మాత్రం 0.2 శాతం లోటు కనిపించిందని మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి వెల్లడించడం గమనార్హం. -
బయోమాస్‌పెల్లెట్లతో పవర్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో బొగ్గు సంక్షోభం తీవ్రమవడంతో ప్రత్యామ్నాయాలపై నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బయోమాస్ పెల్లెట్లను బొగ్గుతో కలిపి విద్యుదుత్పత్తికి వాడాలని నిర్ణయించింది. టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్ల ఉత్పత్తికి భారతీయ స్టార్టప్ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించింది. సరఫరాదారులతో ఏడేళ్ల కాలవ్యవధితో ఒప్పందాలు చేసుకోనుంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గుతో పాటు 5–10 శాతం బయోమాస్‌ను ఇంధనంగా వాడాలని కేంద్రం ఆదేశించడంతో ఎన్టీపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరత, ధరలు పెరిగి దేశ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు తీవ్రమై ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కేంద్రం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి బొగ్గు రవాణా పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. దీనికి తోడు బయోమాస్ పెల్లెట్ల వాడకానికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తప్పనిసరి కొత్త బయోమాస్ వినియోగ పాలసీ ప్రకారం.. బాల్ మిల్, ట్యూబ్ మిల్ తరహావి మినహా మిగతా అన్ని థర్మల్ ప్లాంట్లు బొగ్గులో 5–10 శాతం బయోమాస్‌ను కలిపి వాడాలి. బాల్ మిల్ తరహా విద్యుత్ కేంద్రాలు రెండేళ్లపాటు 5 శాతం, తర్వాతి నుంచి 7 శాతం బయోమాస్‌ను వాడాలి. బాల్ అండ్ రేస్ మిల్ తరహావి 5 శాతం బ్లెండ్ చేసిన బయోమాస్ పెల్లెట్లను.. బాల్ అండ్ ట్యూబ్ మిల్ తరహా ప్లాంట్లు 5 శాతం టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లను తప్పనిసరిగా వాడాలి. ఇప్పటినుంచి 25 ఏళ్లు, లేదా విద్యుత్ కేంద్రాల జీవితకాలం పాటు ఈ విధానం అమలు చేయాలి. బయోమాస్.. టొర్రిఫైడ్ పెల్లెట్లు జంతువుల అవశేషాలు, విసర్జితాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. అన్నింటిని పొడిచేసి యంత్రాల సాయంతో స్తూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వీటినే సాధారణ బయోమాస్ పెల్లెట్స్ అంటారు. ఇప్పటివరకు సాధారణ బాయోమాస్ పెల్లెట్ల వాడకంపై దృష్టి సారించిన ఎన్టీపీసీ.. ఇకపై భారీ మొత్తంలో బయోమాస్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు గాను టొర్రిఫైడ్ పెల్లెట్లను వాడాలని నిర్ణయించింది. సాధారణ బయోమాస్‌లో తేమను పూర్తిగా తొలగించి తీవ్ర ఉష్ణోగ్రతలో ఒత్తిడికి గురిచేసి గట్టిగా ఉండే పెల్లెట్లను తయారు చేస్తారు. బాగా మండేందుకు వీలుగా కొన్ని రసాయనాలు కలుపుతారు. వీటినే టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లు అంటారు. ఈ తరహా పెల్లెట్ల నుంచి ఎక్కువ మంట, ఉష్ణోగ్రత వెలువడతాయి. -
‘వెదురు’తో విద్యుత్! 50 ఏళ్లపాటు ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: అసలే కొన్నేళ్లుగా తీవ్రంగా బొగ్గు కొరత.. ధరలు కూడా చుక్కలను తాకుతూ విద్యుదుత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుతోపాటు వెదురునూ కలిపి విద్యుదుత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యానశాఖ వినూత్న ప్రతిపాదనలను తెర పైకి తెచ్చింది. వెదురును నేరుగా కాకుండా పెల్లెట్ల రూపంలోకి మార్చి వినియోగిస్తారు. ఇప్పటికే చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా సహా పలు దేశాల్లో వెదురు, బయోమాస్ పెల్లెట్లను థర్మల్ కేంద్రాల్లో ఇంధనంగా వినియోగిస్తున్నారు. మన దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలోనే దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తొలి రెండేళ్లపాటు 5శాతం, ఆ తర్వాత 7 శాతం బయోమాస్ పెల్లెట్లను బొగ్గుతో కలిసి ఇంధనంగా వినియోగించాలని కేంద్రం ఇటీవలే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వెదురుతో పెల్లెట్లను రూపొందించి థర్మల్ కేంద్రాల్లో వినియోగించేందుకు ఉద్యానశాఖ రంగం సిద్ధం చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద భైంసా వద్ద 15 ఎకరాల్లో వెదురుసాగును చేపట్టింది. వెదురును పెల్లెట్స్‌గా మార్చే యంత్రాలనూ సిద్ధం చేసింది. కొంతమేర పెల్లెట్స్‌ను తయారుచేసి ఎన్టీపీసీకి పరిశీలన నిమిత్తం పంపించింది. మొత్తంగా రాష్ట్రంలో 2.80 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. 67 లక్షల టన్నుల పెల్లెట్స్ అవసరం.. రాష్ట్రంలో 8,703 మెగావాట్ల ఐదు జెన్కో ప్లాంట్లు, 1,200 మెగావాట్ల సింగరేణి ప్లాంట్, ఎన్టీపీసీకి చెందిన 4,200 మెగావాట్ల ప్లాంట్లు కలిపి మొత్తం 14,102 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 870 కిలోల బొగ్గును వినియోగిస్తారు. కేంద్రం నిర్దేశించినట్టుగా ఏడు శాతం బయోమాస్ పెల్లెట్లు వినియోగించాలంటే.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తికి 67 లక్షల టన్నుల పెల్లెట్లు అవసరమని ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఎకరానికి 30 టన్నుల వెదురు వస్తే.. దాని నుంచి 20 టన్నుల పెల్లెట్స్ వస్తాయని వెల్లడించాయి. ఎకరాకు రూ. 2 లక్షల ఆదాయం రాష్ట్రంలో సాధారణ వెదురు కాకుండా భీమా రకం వెదురుతో పెల్లెట్స్ తయారు చేయాలని నిర్ణయించారు. ఈ రకం వెదురు ఎలాంటి నేలల్లోనైనా, సరిగా నీళ్లు లేకున్నా పెరుగుతుందని.. దానిని రెండేళ్లలోనే నరికి పెల్లెట్స్ తయారు చేయవచ్చని ఉద్యానశాఖ వర్గాలు చెప్తున్నాయి. చేలల్లో, గట్లమీద, బీడు భూముల్లో ఎక్కడైనా వేయొచ్చని అంటున్నాయి. మొదట్లో ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేసి నాటితే.. తర్వాత దాదాపు 50 ఏళ్లపాటు ఏటా ఆదాయం వస్తుందని అంటున్నాయి. వేసిన రెండేళ్ల నుంచే ఏటా ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం సమకూరుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం హరితహారం కింద కోట్ల మొక్కలు నాటుతున్నారని.. ఆ స్థానంలో వెదురు వేస్తే అన్నివిధాలా ఉపయోగమని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్తున్నారు. భవిష్యత్తులో మరింత డిమాండ్.. ప్రస్తుతం ఏడు శాతం పెల్లెట్స్‌ను బొగ్గుతో కలిపి వినియోగించాలని కేంద్రం ఆదేశించినా.. 2030 నాటికి 20 శాతం కలపాలన్నది లక్ష్యమని అధికారులు చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో వీటికి డిమాండ్ మరింతగా పెరుగుతుందని అంటున్నారు. పైగా వెదురు పెల్లెట్స్‌తో విద్యుత్ ధర కాస్త తగ్గుతుందని, కాలుష్యాన్నీ కొంత నివారించవచ్చని పేర్కొంటున్నారు. వెదురు చెట్లతో సాధారణ చెట్ల కంటే 33 శాతం మేర ఎక్కువ ఆక్సిజన్ వస్తుందని చెప్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం దేశంలోనే మొదటిసారిగా వెదురు పెల్లెట్స్ పైలెట్ ప్రాజెక్టును చేపట్టాం. ఇప్పటికే పెల్లెట్స్‌ను తయారుచేసి ఎన్టీపీసీ పరిశీలనకు పంపాం. వెదురు సాగుతో రైతుకు నిర్వహణ భారం లేకుండా ఏటా ఎకరానికి రూ. 2 లక్షల దాకా అదనపు ఆదాయం సమకూరుతుంది. రాష్ట్రంలో భవిష్యత్తులో ఒకవైపు ఆయిల్‌పాం, మరోవైపు వెదురు సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తాం. – వెంకట్రామ్రెడ్డి, ఉద్యానశాఖ సంచాలకుడు ఏమిటీ పెల్లెట్లు? వృక్ష, జంతు పదార్థాలనే బయో మాస్‌గా పరిగణిస్తారు. జంతువుల అవశేషాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. వాటన్నిం టిని పొడిచేసి.. మండే రసాయనాలు కలుపుతారు. తర్వాత అత్యంత వేడి, ఒత్తిడిని కలిగించే యంత్రాల సాయంతో స్థూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వాటినే బయోమాస్ పెల్లెట్స్ అంటారు. రకరకాల వ్యర్థాలతో రూపొందిన బయోమాస్ పెల్లెట్లను వివిధ ఇంధనాలుగా వినియోగించవచ్చు. అయితే రాష్ట్రంలో పూర్తి వెదురుతో పెల్లెట్లను తయారు చేయాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. -
233 మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుత్ డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డి చెప్పారు. ఈ నెల ప్రారంభంలో విద్యుత్ వినియోగం రోజుకు 207 మిలియన్ యూనిట్లుండగా.. ప్రస్తుతం 233 మిలియన్ యూనిట్లకు చేరిందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టన్ను బొగ్గు ధర రూ.40 వేలకు పైగా ఉండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఆశించినంతగా లేదని చెప్పారు. బహిరంగ మార్కెట్ నుంచి పీక్ అవర్స్‌లో విద్యుత్ కొనుగోలు చేయడానికి యూనిట్‌కు రూ.20 ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. దీనివల్ల.. ట్రూ అప్ చార్జీల రూపంలో వినియోగదారులపై అదనపు భారం పడటమే కాకుండా విద్యుత్ సంస్థలకూ కష్టంగా మారుతుందన్నారు. వేసవి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని గృహ, పరిశ్రమలు, మాల్స్, వాణిజ్య భవనాల వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని కోరారు. ఉ.6 నుంచి 9 వరకు, సా.6 నుంచి 10 వరకు వినియోగాన్ని తగ్గించుకోవాలని, పరిశ్రమల్లో పని వేళలను పీక్ అవర్స్‌లో కాకుండా మిగతా సమయాలకు సర్దుబాటు చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు. -
కొందామన్నా బొగ్గు ఇవ్వని కేంద్రం
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయానికి ఎటువంటి కొరత రాకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడటం లేదు. పాత, కొత్త బకాయిలు చెల్లిస్తూ ఎప్పటికప్పుడు ఎంత ధర అయినా చెల్లించి బొగ్గును, బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. భవిష్యత్‌లోనూ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును కొనేందుకు సిద్ధంగా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం మేరకు బొగ్గు అందించకపోగా, కొరత రాకుండా నిల్వలు పెంచుకోవాలంటూ ఉచిత సలహా ఇస్తోంది. సరిపడా బొగ్గు ఇవ్వాల్సిన కేంద్రమే ఇవ్వడం తగ్గించేసి, ఇలా చెప్పడమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. నిల్వలు పెంచుకోండి.. బయటకు అమ్మకండి దేశ విద్యుత్ అవసరాల్లో సుమారు 60 శాతం వరకు థర్మల్ విద్యుత్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని కేంద్రం తాజాగా రాష్ట్రాలకు తెలిపింది. ఈ అవసరాలు తీర్చడానికి థర్మల్ పవర్ స్టేషన్లలో 9 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడం ద్వారా నిల్వలు పెంచుకోవాలని దేశంలోని దాదాపు 135 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కేంద్రం సూచించింది. అదేవిధంగా ఉత్పత్తి సంస్థలు తాము చేసుకున్న ఒప్పందాల ప్రకారం కొనుగోలుదారుల అనుమతి లేకుండా బయటివారికి విద్యుత్‌ను విక్రయిస్తే పవర్ ఎక్స్చేంజ్లో మూడు నెలలపాటు పాల్గొనకుండా డిబార్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, జరిమానా విధిస్తామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. దీనికోసం విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 63 మార్గదర్శకాల్లో క్లాజ్ 6.4లో కొత్తగా ‘జి’ నిబంధన తెచ్చింది. అడిగినా ఇవ్వని కేంద్రం ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం బొగ్గు నిల్వలు పెంచుతాయి. ఈ వేసవిలో రాష్ట్రంలో 225 మిలియన్ యూనిట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా. కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచితే తప్ప వేసవి అవసరాల నుంచి బయటపడలేం. గతేడాది బొగ్గు కొరత ఏర్పడినప్పటి నుంచి కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతోపాటు కోల్, రైల్వే అధికారులు కమిటీగా ఏర్పడి బొగ్గు కేటాయింపులు చేస్తున్నారు. ప్రస్తుతం కోల్ ఇండియా నుంచి రాష్ట్రానికి రోజువారీ అవసరాలకు మాత్రమే బొగ్గు కేటాయింపు జరుగుతోంది. సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్ నుంచి రావాల్సినంత బొగ్గు రావడం లేదు. వేసవి కోసం బొగ్గు నిల్వ చేయడానికి రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. ఆ మేరకు కూడా ఇవ్వడం లేదు. కేవలం 10 నుంచి 12 ర్యాక్‌లు మాత్రమే వస్తున్నాయి. ఏపీ జెన్కో నుంచి 45 శాతం విద్యుత్ రాష్ట్రంలో ప్రస్తుతం 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. మనకు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటినుంచి 85 మిలియన్ యూనిట్లు, హైడల్ 8.5 మిలియన్ యూనిట్లు, సోలార్ 2.4 మిలియన్ యూనిట్ల చొప్పున 97 మిలియన్ యూనిట్ల మేర రోజు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో అంతర్గత వినియోగం పోనూ 92 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు వెళుతోంది. అంటే మొత్తం డిమాండ్‌లో 45 శాతం ఏపీ జెన్కో ద్వారా సమకూరుతోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీపీసీ, కృష్ణపట్నం, ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు నాలుగు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. ఎంతైనా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ జెన్కో సిద్ధంగా ఉన్నాయి. కానీ కేంద్రం నుంచి కేటాయింపులు రావడం లేదు. – బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్కో -
కరెంట్ కోతల్లేకుండా చర్యలు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆయన చర్చించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా దానిని తెప్పించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఇందుకు ఎలాంటి నిధుల కొరతలేదని సీఎం స్పష్టంచేశారు. ఇప్పుడున్న థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారు. కృష్ణపట్నం, ఎన్‌టీటీపీఎస్‌ల్లోని కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అలాగే.. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలని ఆయన సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాదంలో 112 థర్మల్ కేంద్రాలు ఇక బొగ్గు కొరతతో దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 112 కేంద్రాలు ప్రమాదంలో పడ్డాయి. ఇందులో 17 ప్లాంట్లు ఇప్పటికే ఉత్పత్తి నిలిపివేయగా, 27 ప్లాంట్లలో ఒకరోజు, 20 ప్లాంట్లలో రెండు రోజులు, 14 ప్లాంట్లలో మూడు, మరో 14 ప్లాంట్లలో నాలుగు, 12 ప్లాంట్లలో ఐదు, ఏడు ప్లాంట్లలో ఆరు, ఒక ప్లాంటులో ఏడు రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో థర్మల్ ప్లాంట్లను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు.. బొగ్గు కొరత కారణంగా కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) విద్యుత్ సంస్థలకు మినహా మిగిలిన అందరికీ బొగ్గు సరఫరాను పూర్తిగా నిలిపేసింది. అయితే, ఇది తాత్కాలికమేనని, నిల్వలు మామూలు స్థాయికి వచ్చేవరకూ ప్రాధాన్యాన్ని బట్టి సరఫరా చేయాలన్నది కంపెనీ నిర్ణయమని అధికార వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే.. విద్యుత్ ప్లాంట్లు మినహా మిగిలిన ఏ ఇతర సంస్థల్నీ బొగ్గు ఈ–ఆక్షన్‌లోకి కూడా అనుమతించవద్దని కోల్ ఇండియా తన అనుబంధ సంస్థలకు గురువారం ఆదేశాలిచ్చింది. మరోవైపు.. దసరా తర్వాత కార్మికులు సెలవుల నుండి తిరిగి రాగానే ఉత్పత్తిని పెంచాలని సీఐఎల్ భావిస్తోంది. ఏపీలో బొగ్గు నిల్వలు మెరుగు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ బుధవారం నాటి రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో 65,400 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇది ఐదు రోజుల వరకూ సరిపోతుంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 20,900 మెట్రిక్ టన్నులు ఉంది. ఇది ఒక రోజుకు వస్తుంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌కి 75,700 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండటంతో ఇది కూడా ఐదు రోజులు విద్యుత్ ఉత్పత్తికి సరిపోతుంది. సింహాద్రిలో ఉన్న 21,300 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక రోజుకు ఉపయోగపడుతుంది. అయితే, మంగళవారంతో పోలిస్తే బుధవారానికి రాష్ట్రంలో బొగ్గు నిల్వలు కొంతమేర పెరిగాయి. ఇక రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనిచేయాలంటే రోజుకి 42 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. బుధవారం 14 ర్యాకులలో 53,245 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా అయ్యిందని ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో జలవిద్యుత్ వినియోగం మరోవైపు.. జల విద్యుత్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. దీంతో జెన్కోకు జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి రోజూ 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు కాలువపై 770 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు యూనిట్ల ద్వారా 15 మిలియన్ యూనిట్లు, సీలేరు నుంచి 8 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు. మిగతా కేంద్రాల నుంచి మరో రెండు మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరుగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో ప్రస్తుతం 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. కేవలం 3.34 మిలియన్ యూనిట్ల మేర మాత్రమే లోటు ఏర్పడింది. -
తెలంగాణలో బొగ్గు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 5 రోజుల కు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం లేదని సింగరేణి బొగ్గు గనుల సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్ స్పష్టంచేశారు. సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాల మేరకు బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం ఇక్కడి సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన చర్యలు, వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్దేశిత లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించే విషయంలో దిశానిర్దేశం చేశారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచడంలో ఏరియాలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై డెరైక్టర్లు అన్ని ఏరియాల జీఎంలకు మార్గనిర్దేశం చేశారు. ఒప్పందం ఉన్న ప్లాంట్లకు సరఫరా.. సింగరేణితో ఒప్పందం చేసుకున్న తెలంగాణ జెన్కో థర్మల్ ప్లాంట్లతో పాటు ముద్దనూరు(ఏపీ జెన్కో), పర్లీ(మహారాష్ట్ర జెన్కో) రాయచూర్ కేపీసీఎల్ (కర్ణాటక), మెట్టూర్ టాన్ జెడ్కో (తమిళనాడు), రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి రోజూ ఉత్పత్తి చేసే బొగ్గు లో 1.5 లక్షల టన్నులను (86 శాతం) థర్మల్ కేంద్రాలకే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. -
ముసురుకుంటున్న చీకట్లు!
కరెంట్ కోత, లైట్లు లేక కొవ్వత్తులతో కాలక్షేపం... ఒకప్పుడు నిత్యానుభవం. కొన్నేళ్ళుగా దూరమైన ఆ అనుభవం త్వరలోనే మళ్ళీ దేశమంతటా ఎదురుకాక తప్పేలా లేదు. వస్తున్న వార్తలను బట్టి చూస్తే, ఒకప్పటిలా మళ్ళీ విద్యుత్ కోతలు దేశమంతటా నిత్యకృత్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గాయి. సొంతంగా విద్యుదుత్పత్తి చేద్దామంటే బొగ్గు కొరత. థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతపడే పరిస్థితి. పోనీ... ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తే కొందామంటే, అనూహ్యమైన విద్యుత్ కొనుగోలు రేట్ల మోత. యూనిట్‌కు పాతిక రూపాయలు పెట్టినా, విద్యుత్ లభించని దుఃస్థితి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అందుకే, గృహావసర విద్యుత్ వినియోగం తగ్గించుకొని, విద్యుత్ ఆదా చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వాలూ ప్రజలను అభ్యర్థించాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజలకు విద్యుత్ కోతలు తప్పవన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యం ఇది. మన దేశంలో 135 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అవన్నీ మునుపెన్నడూ లేనంత బొగ్గు నిల్వల కొరతను ఎదుర్కొంటున్నాయనీ, విద్యుత్ కొరత తప్పదనీ సాక్షాత్తూ ‘భారతీయ కేంద్ర విద్యుత్ అథారిటీ’ డేటాయే స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా అవసరమైన విద్యుత్తులో 70 శాతాన్ని ఇవే ఉత్పత్తి చేస్తాయి. కానీ, బొగ్గు నిల్వల తీవ్ర కొరత కారణంగా ఈ 135 థర్మల్ ప్లాంట్లలో 106, అంటే దాదాపు 80 శాతం ప్లాంట్లు సంక్షోభ, లేదా అతి తీవ్ర సంక్షోభ స్థితిలో ఉన్నాయి. సాధారణంగా 14 రోజులకు సరిపడా నిల్వలుండాలని భారత ప్రభుత్వం మాట. కానీ, ఇప్పుడు రెండు రోజులకు మించి లేవు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లలోని బొగ్గు, లిగ్నైట్ గనులున్న ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్ల బొగ్గు రవాణాకు చిక్కులొచ్చాయి. వర్షాకాలానికి ముందే తగినంత బొగ్గు నిల్వలు చేసుకొనే దూరదృష్టి లేకుండా పోయింది. మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలు సైతం చతికిలబడ్డాయి. షిప్పింగ్ ఆలస్యాల కారణంగా అంతర్జాతీయ గొలుసుకట్టు సరఫరా దెబ్బతింది. అంతర్జాతీయ బొగ్గు రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 40 శాతం మేర బొగ్గు ధరలు పెరిగినట్టు లెక్క. కొన్నిచోట్ల ఒక టన్ను 60 డాలర్లుండేది ఇప్పుడు దాదాపు 120 డాలర్లు అయిందని కథనం. దాంతో, అవసరమైన అంతర్జాతీయ బొగ్గును కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆ రేట్లకు కొనలేక, తమ సామర్థ్యంలో సగం కన్నా తక్కువ విద్యుత్తునే ఆ కేంద్రాలు ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి. కేరళలో 4, మహారాష్ట్రలో 13 థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతబడ్డాయి. పంజాబ్‌లో దాదాపు సగం థర్మల్ విద్యుత్కేంద్రాలు ఆగిపోయాయి. ఇక, దక్షిణాదినా పలు విద్యుత్కేంద్రాలు మూతబడే పరిస్థితి. ఇప్పటికే రాజస్థాన్‌లో రోజుకో గంట, పంజాబ్‌లో 3 గంటలు, ఢిల్లీలో విడతల వారీగా విద్యుత్ కోత నడుస్తోంది. అలాగే, కేరళ, గుజరాత్, తమిళనాడు, అతి తీవ్రమైన బొగ్గు కొరత ఉన్న జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు సైతం పవర్ కట్ బాటలోకి వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ విద్యుత్ సంక్షోభంపై ఇప్పటికే కేంద్రానికి వివరంగా లేఖ రాశారు. కోవిడ్ తర్వాత విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందనీ, రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ కొనాలన్నా అందుబాటులో లేదనీ వాస్తవాల్ని వివరించారు. 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయింపు సహా అనేక తక్షణ పరిష్కారాలూ సూచించారు. ఢిల్లీ సహా కొందరు ఇతర ముఖ్యమంత్రులూ తమ కష్టాలు కేంద్రానికి విన్నవించారు. కానీ, సంక్షోభ పరిష్కారానికి కేంద్రం మీనమేషాలు లెక్కించింది. చైనా లాంటి చోట్ల ఇప్పటికే విద్యుత్ సంక్షోభం కనిపిస్తున్నా, మన పాలకులు అంతా బాగుందన్నారు. సమాచార లోపం వల్లే అనవసర భయాలన్నారు. ఎట్టకేలకు సోమవారం కేంద్ర హోమ్‌మంత్రి సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరపాల్సి వచ్చింది. నిజానికి, విద్యుత్ లాంటి విషయాల్లో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేసే బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ పని సమర్థంగా చేస్తున్నట్టు కనిపించదు. రాష్ట్రాలు విద్యుత్ కోసం అధిక రేట్లకైనా సరే ప్రైవేట్ సంస్థల వద్దకు పరిగెత్తాల్సిన పరిస్థితి కల్పించే కుట్ర ఈ కొరతకు కారణమని కొందరి వాదన. 1957 నాటి చట్టంలో తేనున్న సవరణలతో అరణ్యాలు, గిరిజన భూముల్ని కేంద్రం సేకరించి, బొగ్గు గనుల తవ్వకాలకు ప్రైవేట్ వారికి కట్ట బెట్టడానికే ఇదంతా అని ఆరోపిస్తున్నవారూ లేకపోలేదు. వాటిలో నిజానిజాలు ఏమైనా, కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న వేళ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలపై అజాగ్రత్త స్వయంకృతమే. పాలకులు ‘ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో సరిపెట్టకుండా, బొగ్గు, చమురు, సహజవాయువుల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు తగిన పరిస్థితులు కల్పించాలి. ఇవాళ మంచినీటి లానే విద్యుత్ కూడా! విద్యుత్ లేకపోతే నాగరక జీవి మనుగడే కష్టం. అందుకే, విద్యుత్ రంగంలోనూ ఆచరణవాదంతో సంస్కరణలు తేవడమూ ముఖ్యం. మన దేశ విద్యుత్ అవసరాల్లో 90 శాతం శిలాజ ఇంధనాల నుంచి తీర్చుకుంటున్నాం. భవిష్యత్తుకు ఇది సరి కాదు. ఎక్కడైనా బొగ్గు నిల్వలు శాశ్వతంగా ఉండవు కాబట్టి, ఎప్పటికైనా పునర్వినియోగ విద్యుత్ వైపు మళ్ళాల్సిందే. దేశవ్యాప్తంగా సౌరశక్తి అనే ఉచిత, సహజ వనరును సమర్థంగా ఉపయోగించుకొని, సోలార్ పవర్ ఉత్పత్తి పెంచుకుంటే, సమస్యలుండవు. పవన విద్యుదుత్పత్తి పైనా గట్టిగా దృష్టి పెట్టక తప్పదు. ఆ మధ్య ఆక్సిజన్ కొరత... ఇప్పుడు బొగ్గు కొరత. కళ్ళ ముందున్నా సరే... సమస్యను గుర్తించడానికి నిరాకరిస్తే, కాలం గడిచేకొద్దీ కష్టమే! -
అవన్నీ అనవసరమైన భయాందోళనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వస్తుందని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పలు రాష్ట్రాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సంక్షోభ నివారణకు కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా అవసరమైన అన్ని వనరులు వినియోగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.కె.సింగ్ ఎన్టీపీసీ, రిలయెన్స్ ఎనర్జీ సహా వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సరఫరా కంపెనీలు, విద్యుత్ అధికారులతో ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్‌కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు. సమాచార లోపమే కారణం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), ఢిల్లీలోని డిస్కమ్‌ల మధ్య సమాచార లోపం వల్లే అనవసర ఆందోళనలు తలెత్తాయని చెప్పారు. ఢిల్లీ డిస్కమ్‌లకి, గెయిల్‌కి మధ్య కాంట్రాక్టు పూర్తి అయిపోవడంతో ఇక గ్యాస్ సప్లయ్ చేయలేమని గెయిల్ రాసిన లేఖతో విద్యుత్ ప్రమాదం ముంచుకొస్తోందన్న భయం తలెత్తి ఉండవచ్చునని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖపై లెఫ్ట్‌నెంట్ జనరల్ నాతో మాట్లాడారు. అలాంటి పరిస్థితి రాదని వాళ్లకి చెప్పాను. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే గ్యాస్ సరఫరా చేయమని గెయిల్ సీఎండీని ఆదేశించాం. సరఫరా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు’అని మంత్రి తెలిపారు. బొగ్గు గనులున్న ప్రాంతాల్లో భారీ వర్షాలతో తవ్వకాలు నిలిచిపోవడం, సరఫరా మందగించడం, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరగడంతో భరించలేని కంపెనీలు ఉత్పత్తిపై చేతులెత్తేస్తున్నాయి. గుజరాత్లో టాటా పవర్ ఉత్పత్తి నిలిపివేత విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపైనే ఆధారపడిన టాటా పవర్ అధిక ధరలకు బొగ్గు కొనలేక గుజరాత్‌లోని ముంద్రా ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపేసింది. ఈ ప్లాంటు ద్వారా గుజరాత్‌కు 1,850 మెగావాట్లు, పంజాబ్‌కు 475, రాజస్తాన్‌కు 380, మహారాష్ట్రకు 760, హరియాణాకు 380 మెగావాట్లు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయంటే.. బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ, క్యాప్టివ్ కోల్‌మైన్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అన్నీ కలుపుకుంటే అక్టోబర్ 9న మొత్తంగా 19.2 లక్షల టన్నులు సరఫరా చేస్తే , విద్యుత్ ప్లాంట్లలో 18.7 లక్షల టన్నులు వినియోగించారు. అంటే వినియోగానికి మించి సరఫరా ఉందని, కొన్ని రోజులు గడిస్తే బొగ్గు నిల్వలు పెరుగుతాయని విద్యుత్ శాఖ వెల్లడించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా 72 లక్షల టన్నులున్నాయని, ఇవి నాలుగు రోజులకి సరిపోతాయని పేర్కొంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) దగ్గర 400 లక్షల టన్నుల స్టాకు ఉందని, విద్యుత్ ప్లాంట్లకు దానిని సరఫరా చేస్తున్నట్టుగా వివరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకి రోజుకి 18.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం రోజుకి 17.5 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నామని, వర్షాల కారణంగా పంపిణీ కాస్త నెమ్మదించిందని అంగీకరించింది. గత ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు దేశీయంగా లభించే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి 24 శాతం పెరిగిందని వివరించింది. అప్పట్లో ఆక్సిజన్‌కూ కొరత లేదన్నారు: సిసోడియా కేంద్రం ప్రతీ సమస్యని తేలిగ్గా తీసుకుంటోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. బొగ్గు సంక్షోభం తరుముకొస్తున్నా ఏమీ లేదని అంటోందని మండిపడ్డారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆస్పత్రులు, డాక్టర్లు ఆక్సిజన్‌కి కొరత ఉందని మొరపెట్టుకున్నా అలాంటిదేమీ లేదని మభ్యపెట్టిందని, ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసరంగా లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే. సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో సిసోడియా విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర విద్యుత్ మంత్రి బొగ్గుకి కొరత లేదని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధానికి అలా లేఖ రాసి ఉండకూడదని కూడా అన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఆయన చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’’అని సిసోడియా అన్నారు. సమస్య నుంచి పారిపోవాలని కేంద్రం భావిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతని, ఇప్పటి బొగ్గు సమస్యతో పోలుస్తూ కేంద్రంపై సిసోడియా విరుచుకుపడ్డారు. -
బొగ్గు సంక్షోభంలో భారత్
సాక్షి, అమరావతి : దేశంలో బొగ్గు సంక్షోభం ఏర్పడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం భారత్‌పైనా, మన రాష్ట్రంపైనా పడుతోంది. దేశవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. పారిశ్రామిక, గృహ అవసరాల కోసం దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సింహభాగం థర్మల్ కేంద్రాల నుంచే వస్తోంది. ఎన్టీపీసీ, టాటా పవర్, టొరెంట్ పవర్ ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చిన్నా పెద్దా అన్నీ కలిపి 135 థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉండగా అవన్నీ ఇప్పుడు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. అసలు దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి చేసే కేంద్రాల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా 70శాతం. వీటిలో ఇప్పటికే 16 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అయిపోయి మూతపడ్డాయి. అంటే 16,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 30 ప్లాంట్లలోని నిల్వలు కేవలం ఒక రోజులో అయిపోతాయి. దీంతో 37,345 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. 18 ప్లాంట్లు రెండు రోజుల్లోనూ, 19 ప్లాంట్లు 3 రోజుల్లోనూ, 9 ప్లాంట్లు నాలుగు రోజుల్లోనూ, 6 ప్లాంట్లు 5 రోజుల్లోనూ, 10 ప్లాంట్లు ఆరు రోజుల్లోనూ, ఒక ప్లాంటు ఏడు రోజుల్లోనూ బొగ్గు సరఫరా జరగకపోతే మూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ మూతపడితే దేశవ్యాప్తంగా 1,36,159 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. చదవండి: (కేంద్రమే అప్పుల ఊబిలో.. రాష్ట్రానికి ఏమిస్తది?) బొగ్గు ధరలకు రెక్కలు కరోనా సెకండ్ వేవ్ తరువాత, దేశంలోని పారిశ్రామిక రంగంలో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు రికార్డు స్థాయిలో అంటే దాదాపు నలభై శాతం పెరిగాయి. ఇక దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో 80శాతం వాటా కలిగిన కోల్ ఇండియా.. ప్రపంచ బొగ్గు ధరల్లో పెరుగుదల కారణంగా, దేశీయ బొగ్గు ఉత్పత్తిపై తాము ఆధారపడాల్సి వస్తోందని వెల్లడించింది. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో టాప్–2 దేశాలైన భారత్, చైనాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొద్దిరోజుల్లోనే మన దేశం అసాధారణ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయం. అదే జరిగితే విద్యుత్‌తో ముడిపడి ఉన్న అన్ని రకాల వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాక.. విద్యుత్ అంతరాయాలు ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. బొగ్గు ఉత్పత్తిని కనీసం 10–18 శాతానికి పెంచాలని కోల్ ఇండియా నిర్ణయించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. రాష్ఠ్రంలో తగ్గిన బొగ్గు నిల్వలు.. పెరిగిన విద్యుత్ కొనుగోలు ధరలు ఒకసారి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి మొదలుపెడితే కనీసం వారం రోజులైనా ఆపకుండా నడపాలి. కానీ ఏపీలోని థర్మల్ కేంద్రాల్లో అందుకు తగినట్టు నిల్వల్లేవని సాక్షాత్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రధాన థర్మల్ కేంద్రాలైన డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ), శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డీఎస్‌టిపీఎస్–కృష్ణపట్నం)లు మొత్తం 5,010 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. వీటిలో.. విజయవాడ ఎన్టీటీపీఎస్కు రోజుకి 24,600 టన్నుల బొగ్గు కావాలి. ప్రస్తుతం ఇక్కడ 13,600 టన్నులే నిల్వ ఉంది. ఆర్టీపీపీకి రోజుకు 16,800 టన్నులు అవసరం కాగా, ఇక్కడ 69,100 టన్నుల నిల్వ (4 రోజులకు సరిపడా) మాత్రమే ఉంది. ఇక దామోదరం సంజీవయ్య పవర్ స్టేషన్‌కి రోజుకు 13,600 టన్నులు కావాలి. ఇక్కడ మాత్రమే 89,200 టన్నులు (7 రోజులకు సరిపడా) నిల్వ ఉంది. ఇలా బొగ్గు కొరత ఏర్పడడంతో మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు అమాంతం పెరిగాయి. కేవలం రూ.4 లేదా రూ.5కు వచ్చే యూనిట్ విద్యుత్‌కు ఇప్పుడు దాదాపు రూ.6 నుంచి పీక్ అవర్స్‌లో రూ.20 వరకూ వెచ్చించాల్సి వస్తోంది. చదవండి: (కోస్తాంధ్రకు మరో తుపాను!) గుదిబండలా బకాయిలు పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి మొదలుపెడితే రోజంతా దాని నుంచి విద్యుత్ తీసుకోవాలి. కానీ, మనకు రోజంతా అవసరం ఉండదు. అలాగని ఉత్పత్తి ఆపేయాలంటే దానికి 18 గంటలు సమయం పడుతుంది. అందుకే ఒకసారి మొదలుపెడితే కనీసం వారం రోజులు నడపాలి. దానికి సరిపడా బొగ్గులేదు. ఇక ఏపీ జెన్కోకు బకాయిలు గుదిబండగా మారాయి. తెలంగాణ నుంచే రూ.6,200 కోట్లు ఏపీ జెన్కోకు రావాలి. బొగ్గు సరఫరా చేస్తున్న మైనింగ్ సంస్థలకు మన జెన్కో రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించాలి. అదంతా కడితే తప్ప వారు పూర్తిస్థాయిలో సరఫరా చేయరు. దీనికి తోడు ఇప్పుడు బొగ్గు కొరత ఏర్పడింది. – నాగులాపల్లి శ్రీకాంత్, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి -
థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుకు ఎన్టీపీసీ టెండర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ, ఎన్టీపీసీ..భారత్‌లో థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లను కొనుగోలు చేయనున్నది. ఏప్రిల్ 1, 2014 తర్వాత కార్యకలాపాలు ప్రారంభించిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను కొనుగోలు చేయనున్నామని ఎన్టీపీసీ తెలిపింది. ఈ మేరకు టెండర్లను పిలిచినట్లు పేర్కొంది. ఏప్రిల్ 1, 2014 తర్వాత కార్యకలాపాలు ప్రారంభించిన 12 గిగావాట్ల, రూ.56,000 కోట్ల విలువైన విద్యుత్ ప్లాంట్లకు మాత్రమే అర్హత ఉంటుందని వివరించింది. ఒక్కో ప్లాంట్‌కు కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉండాలని, సబ్‌క్రిటికల్, సూపర్‌క్రిటికల్ పవర్ ప్లాంట్లను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపింది. వంద శాతం దేశీయ బొగ్గుతోనే పనిచేసేట్లుగా ఈ ప్లాంట్ల డిజైన్ ఉండాలని సూచించింది. 85 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) సాధించడానికి సరిపడే బొగ్గు నిల్వలు ఉండి తీరాలని పేర్కొంది. దరఖాస్తు చేసిన అన్ని ప్లాంట్లను పరిశీలించి తాము కొనుగోలు చేయడానికి తగిన ప్లాంట్లను షార్ట్‌లిస్ట్ చేస్తామని వివరించింది. ఎవరైనా ప్రమోటర్/రుణ దాత/ఆర్థిక సంస్థలు/డెవలపర్లు/ఇండిపెండెంట్ విద్యుదుత్పత్తి సంస్థలు తమ తమ విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఆఫర్ చేయవచ్చని ఎన్టీపీసీ పేర్కొంది. ఎన్టీపీసీ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 51,708 మెగావాట్లుగా ఉంది. మొత్తం 28 థర్మల్ ప్లాంట్లు, 8 గ్యాస్/లిక్విడ్ ఇంధన విద్యుదుత్పత్తి ప్లాంట్లు, 13 నవీకరణ (జల, పవన, సౌర)విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎన్టీపీసీ మరిన్ని థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. -
పోర్టులో బొగ్గు దిగుమతి
ముత్తుకూరు : కృష్ణపట్నం పోర్టు ద్వారా మండలంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లకు అవసరమైన బొగ్గు పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా యూకేకి చెందిన ఎంవీ అలికీ పెర్రోటిస్ అనే నౌక ద్వారా 59,310 టన్నుల బొగ్గు దిగుమతి జరుగుతోంది. పనామాకు చెందిన జియోలాండ్ అల్మైర్ నౌక నుంచి 56 వేల టన్నుల బొగ్గు దిగుమతి చేస్తున్నారు. 74,121 టన్నుల బొగ్గు దిగుమతి జరిపేందుకు హాంగ్‌కాంగ్‌కు చెందిన డెక్కన్ ప్రైడ్ నౌక శుక్రవారం లంగరు వేయనుంది. మరో భారీ నౌక కేప్ బ్రాజిల్లా ద్వారా 1.64 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేయనున్నారు. ఈ నౌక శనివారం పోర్టులో లంగరు వేయనుంది. -
మంత్రికి అంత మోజెందుకు
► కోష్ట భూములపైనా కన్నేసిన ప్రభుత్వం ► కొవ్వాడ భూసేకరణకు రూ.500 కోట్లు ► ఇవి కేంద్రం నుంచి రావాలంటున్న మంత్రి ప్రజలు వద్దంటున్నా పర్యావరణానికి ముప్పున్న విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం అమితాశక్తి చూపుతోంది. జనం ఏమైతే మాకేంటి.. వారి ఆందోళనతో పనేంటి అన్న చందంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. అందులోనూ జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడే ప్రజల ఆవేదనను కాదని ప్రాణాంతక పరిశ్రమలను ఆహ్వానిస్తూ సాక్షాత్తూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఎన్నో ఏళ్లుగా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంపై ప్రజల నుంచి వ్యతిరే కత వ్యక్తమవుతుండగా, తాజాగా ‘కోష్ట’ ప్రాంత భూముల్లో మరో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించడంతో ప్రజల్లో మళ్లీ అలజడి మొదలైంది. శ్రీకాకుళం టౌన్: జిల్లాలో సముద్రతీరం వెంబడి నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్కేంద్రాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలై సోంపేటలో ముగ్గురు, కాకరాపల్లిలో మరో ముగ్గురు పోలీసుల తూటాలకు బలయ్యారు. అప్పటి నుంచి జిల్లాలో థర్మల్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఆరంభమైంది. అంతకుముందే కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడంతో రణస్థలం ప్రాంతంలో కూడా ఉద్యమాలు మొదలై వ్యతిరేకతను వినిపించారు. అధికారంలోని వస్తే అణువిద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని నిలిపివేస్తామని చంద్రబాబు నాడు ప్రకటించారు. ఇది నమ్మి జనం ఆ పార్టీకి నియోజకవర్గంలో పట్టం కట్టారు. ఇదిలాఉంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీలతో భూగర్భజలాలు కలుషితమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గంలోని కేంద్రం కొవ్వాడ ప్రాంతంలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటకు చురుగ్గా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ప్రజలు వద్దన్నా నిర్మాణం ఆగదని మంత్రులు చెబుతున్న మాటలతో ఈ ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 2074 ఎకరాల భూమిని గుర్తించిన అధికారులు 509 ఎకరాల ప్రైవేట్ భూమిని రైతుల నుంచి స్వీకరించడానికి రూ.500 కోట్లు అవసరం ఉన్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. శాసనమండలిలో ఎంవీవీఎస్ మూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ రామచంద్రాపురం, టెక్కలి, కోటపాలెం, జీరుకొవ్వాడ, గూడెం, గ్రామాల్లో 7960 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించామని చెప్పుకొచ్చారు. ఇది కాకుండా రణస్థలం, పైడి బీమవరం మధ్య గల కోష్ట ప్రాంతంలో మరో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు మంత్రి ప్రకటించడంతో ప్రజల్లో మళ్లీ అణుకుంపటి రాజుకుంటోంది. ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవడం లేదు అణు విద్యుత్ ప్లాంటు అంతకంటే పర్యావరణ ముప్పు వాటిల్లే ప్లాంటుగా ప్రపంచ దేశాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో దేశానికి ఆహ్వానించి ప్రజల గుండెల మీద కుంపటి పెట్టడం దారుణం. మంత్రి మాటలు ప్రజల ఆవేదనను పట్టనట్టుగా ఉన్నాయి. ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ముందుంటాం. -చౌదరి తేజేశ్వరరావు, సీపీఎం నేత అంత మోజెందుకు? అణువిద్యుత్ వల్ల పొంచి ఉన్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచదేశాలు వద్దనుకుం టున్నాయి. అలాంటి ప్రమాదాన్ని తెచ్చి శ్రీకాకుళం ప్రజల నెత్తిన పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్త్తున్నాయి. అందులో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజల అభిమతాన్ని గౌరవించకుండా మరో అణు విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడే నిర్మిస్తామని చెప్పడం గర్హనీయం. - భవిరి కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి -
సంక్రాంతిలోగా ఢిల్లీకి సీఎం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి పండుగలోగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానంగా నల్లగొండలో జెన్కో, ఎన్టీపీసీ సంస్థలు ఏర్పాటు చేయనున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం అటవీ భూమిని బదిలీ చేయాలని కోరడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ విద్యుత్ ప్రాజెక్టులకు అనువైన స్థలాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేలో పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇక్కడ దాదాపు పదివేల ఎకరాలకు పైగా భూమిని నల్లగొండ జిల్లా అధికారులు సర్వే కూడా పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో అక్కడ అటవీ భూములను పరిశ్రమలకు కేటాయిస్తే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపిస్తామని సీఎం వివరించనున్నట్లు సమాచారం. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర జల వనరుల మంత్రి ఉమా భారతి, ఇంధన మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కూడా కేసీఆర్ కలవనున్నట్టు తెలిసింది. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ మాత్రం ఇంకా సీఎం కార్యాలయం కోరలేదని సమాచారం. -
రైలు వ్యాగన్లలో బొగ్గు కల్తీ
* మండలిలో మంత్రి హరీశ్‌రావు * కల్తీని నిరోధించేందుకు విజిలెన్స్ దాడులు నిర్వహిస్తాం * బొగ్గు అక్రమాలను ప్రస్తావించిన పొంగులేటి సాక్షి, హైదరాబాద్: సింగరేణి నుంచి బొగ్గును తరలించే క్రమంలో రైలు వ్యాగన్లలో బొగ్గును కల్తీ చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. దీన్ని నియంత్రించేందుకు విజిలెన్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం శాసన మండలిలో లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి హరీశ్ పై విధంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు, బొగ్గు అక్రమాలపై పొంగులేటితో పాటు ఇతర కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలపై సుమారు గంటన్నర పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అంతకుముందు పొంగులేటి మాట్లాడుతూ.. నాణ్యత లేని నాసిరకం బొగ్గును రాష్ట్రంలోని విద్యుదుత్పాదన ప్లాంట్లకు అంటగట్టి కోట్ల రూపాయలను కొల్లగొట్టుతున్నారని ఆరోపించారు. దీనిలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల హస్తముందన్నారు. నాణ్యత లేని బొగ్గు వల్లే తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందన్నారు. విదేశాల నుంచి నాసిరకం బొగ్గుతో వైజాగ్ పోర్టుకు తరలివచ్చిన ఎంవీ-ఫుల్బియా అనే నౌకను నవంబర్ 1న అధికారులు పట్టుకున్న విషయాన్ని పొంగులేటి ప్రస్తావించారు. దీనిపై మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి రాష్ట్రానికి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయించుకుంటున్నామని తెలిపారు. విదేశాల నుంచి బొగ్గును రాష్ట్రానికి దిగుమతి చేసుకోవడం లేదని స్పష్టంచేశారు. మూడేళ్లలో మిగులు విద్యుత్: హరీశ్ రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికలను ఆయన సభలో వెల్లడించారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన 4 వేల మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతూ ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్రంలో ప్రధాని, విద్యుత్ మంత్రి, ఎన్టీపీసీ చైర్మన్లను కలిశారని గుర్తుచేశారు. కేవలం నాలుగు నెలల కాలంలో ఏ ప్రభుత్వం సాధించలేని పురోగతిని ఎన్టీపీసీ ప్రాజెక్టుల విషయంలో సాధించామని వివరించారు. తమ పార్టీ అధినేత్రి సోనియా తెలంగాణకు కేటాయించిన ఎన్టీపీసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చొరవచూపడం లేదని కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ అనడంతో మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా కోరుతూ ఇటీవలే టెండర్లు పిలిచామని, పలు ప్రైవేటు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని మంత్రి చెప్పారు. యూనిట్‌కు రూ.6.45 నుంచి రూ.6.99తో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థల బిడ్లను పరిశీలించే యోచనలో ఉన్నామన్నారు. 45 నిమిషాలు కావాలి.. ‘సుమారు 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉండగా.. వ్యవసాయానికి 7 గంటల కరెంట్ సరఫరా చేసే అవకాశమున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? రాష్ట్రంలో 400 మంది రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎందుకు కారణమైంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి అడిగిన ప్రశ్న సభలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. గత కాంగ్రెస్ పాలకుల పాపాల వల్లే రైతు ఆత్మహత్యలు జరిగాయని.. రైతులను ఎవరు చంపిండ్రు.. చంపడానికి కారణాలేమిటీ.. ఈ విషయాలపై సమాధానమివ్వడానికి కనీసం 45 నిమిషాల సమయం పడుతుందంటూ మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజనులకు అన్యాయం: ఎమ్మెల్సీ రాములు నాయక్ సమైక్య రాష్ట్రంలో గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను అమ్ముకునే స్థితికి గిరిజనుల స్థితిగతులు దిగజారాయన్నారు. సినిమాల్లో అందంగా చూపించడానికి, బిల్ క్లింటన్ లాంటి విదేశీ అతిథుల పర్యటన సందర్భంగా వారి మెప్పు కోసమే గిరిజన ఆడపడుచులతో సంప్రదాయ నృత్యాలు చేయించారని వ్యాఖ్యానించారు. గిరిజన సంస్కృతి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలపాలంటూ బుధవారం ఆయన శాసన మండలిలో ప్రశ్నించారు. ‘ఓ లంబాడోళ్ల పిల్ల.. ఎంత బాగున్నావ్’ అంటూ కించపరిచే రీతిలో గిరిజన యువతులపై సినిమా తీశారని వాపోయారు. అదే గిరిజన యువతులను సినిమాల్లో హీరోయిన్గా అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపించారన్నారు. గిరిజన యువతులకు సినిమాల్లో అవకాశమిస్తే మేకప్ ఆర్టిస్టులతో పని ఉండదని, దీంతో వారంతా ఉపాధిని కోల్పోతారని ఓ సినీ దర్శకుడు తనతో చెప్పాడని రాములు నాయక్ పేర్కొన్నారు. గిరిజన తండాల్లో ప్రతి ఇంట్లో సినీ హీరోలాగా అందమైన ఓ యువకుడు ఉంటాడని పేర్కొన్నారు. సంస్కృతిని పరిరక్షిస్తాం: ఈటెల గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు హైదరాబాద్ నెహ్రూ శతాబ్ది గిరిజన మ్యూజియం, మన్ననూర్(మహబూబ్‌నగర్)లో చెంచులక్ష్మీ మ్యూజియంలను ఏర్పాటు చేశామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. త్వరలో వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క సారక్క మ్యూజియం, ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌లో కొమురం భీం మ్యూజియం, భద్రాచలంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. దీపం పథకం కింద సాచురేషన్ విధానంలో ఆడపడుచులందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక తయారు చేస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమరవీరులకు అరకొర నిధులా: అరికెల మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ జరిగింది. ప్రభుత్వం బడ్జెట్లో అమరవీరుల కుటుంబాలకు అరకొర నిధులు కేటాయించిందని టీడీపీ సభ్యుడు అరికెల నర్సారెడ్డి ఆక్షేపించారు. అమరుల సంఖ్యను 450కు కుదించడం శోచనీయమన్నారు. రెండు పడక గదుల ఇళ్లు, ఇరిగేషన్ విభాగాలకు అరకొరగా కేటాయించారన్నారు. ఎంఐఎం సభ్యుడు సయ్యద్ అల్తాఫ్ మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయాలని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని, ఆ శాఖను ఏపీ, తెలంగాణ విభాగాలుగా విభజించాలని కోరారు. తెలంగాణ ద్రోహుల పార్టీ: నాయిని అరికెల తన ప్రసంగంలో ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిసారీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కల్పించుకొని తనదైన శైలిలో చమక్కులు విసిరారు. తమది నాలుగు నెలల శిశువు లాంటి సర్కారు అని, అప్పుడే డ్యాన్స్ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని, వారికి అమరుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి అసువులు బాసిన అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు గండం!
ఏ రోజుకారోజు నెట్టుకొస్తున్న థర్మల్ కేంద్రాలు ఇప్పటికే ఆర్టీపీపీలో మూడు యూనిట్ల మూత ఇతర కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఎన్టీటీపీఎస్లో 10 వేల టన్నులకు పడిపోయిన నిల్వలు బొగ్గు సరఫరా పెంచాలని కేంద్రానికి ఏపీ సర్కారు మొర హైదరాబాద్: ఆంధప్రదేశ్పైకి కారుచీకట్లు కమ్ముకొస్తున్నాయి! కరెంటు కటకటలు మరింత తీవ్రమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ర్టంలోని కీలకమైన థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఒక్కొక్కటిగా మూతపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు యూనిట్లలో ఉత్పత్తి క్రమంగా నిలిచిపోతోంది. దీనికంతటికీ కారణం బొగ్గు కొరత. రోజువారీ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు లేక విద్యుత్ కేంద్రాలన్నీ విలవిల్లాడుతున్నాయి. ఏ రోజుకారోజు అతి కష్టంమీద నెట్టుకొస్తున్నాయి. వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)లో బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. కనీసం ఒక్క టన్ను కూడా నిల్వ లేదు. దీంతో వచ్చిన బొగ్గును వచ్చినట్టే బాయిలర్‌లోకి పంపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అదీ సరిపోక ఇప్పటికే 1, 2, 3వ యూనిట్లను పూర్తిగా నిలిపేశారు. ఫలితంగా 660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. మిగిలిన రెండు యూనిట్ల(ఒక్కోటి 210 మెగావాట్ల సామర్థ్యం) పరిస్థితి కూడా దారుణంగా ఉంది. బొగ్గు వస్తేనే ఉత్పత్తి జరుగుతోంది. ఏ క్షణమైనా అవి మూతపడే ప్రమాదంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీపీపీలో దిగుమతి చేసుకున్న బొగ్గు ఐదు వేల టన్నులు మాత్రమే ఉందని ఆర్టీపీపీ ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ దేవేంద్రనాయక్ తెలిపారు. బంకర్లలో ఉన్న బొగ్గుతో కొన్ని యూనిట్లను.. అది కూడా తక్కువ సామర్థ్యంతో నడుపుతున్నట్లు చెప్పారు. వార్షిక మరమ్మతుల వల్ల మరో 15 రోజుల పాటు ఒకటో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. అంటే అప్పటివరకు 210 మెగావాట్ల విద్యుత్‌ను కోల్పోవాల్సి వస్తుందన్నమాట! విజయవాడలోని నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)లో ఇప్పటికే ఒక యూనిట్లో 210 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కేంద్రంలో 10 వేల టన్నులకు బొగ్గు నిల్వలు పడిపోయాయి. వాస్తవానికి ఎన్టీటీపీఎస్లోని అన్ని యూనిట్లు నడవాలంటే రోజుకు 28 వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతమున్న సరకు సగం రోజుకు కూడా సరిపోదన్నమాట! ఈ నేపథ్యంలో బొగ్గు సరఫరాను తక్షణం పెంచాలని రాష్ర్ట ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఒప్పందం మేరకు మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్) నుంచి బొగ్గును పంపాలని కేంద్రానికి మొరపెట్టుకుంటోంది. ప్రస్తుతం ఎంసీఎల్ నుంచి రోజుకు 15 వేల టన్నుల బొగ్గు మాత్రమే వస్తోందని.. దీనిని ఒప్పందం మేరకు 30 వేల టన్నులకు పెంచాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు శనివారం లేఖ రాశారు. ఆర్టీపీపీకి విద్యుదుత్పత్తి గండం ఎర్రగుంట్ల: రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)కు బొగ్గు గండం ఏర్పడింది. బొగ్గు లేని కారణంగా అదివారం 2,3 యూనిట్లను నిలిపి వేశారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో బొగ్గు నిల్వ లేదు. బంకర్లలో ఉన్న బొగ్గుతోనే 1,4,5 యూనిట్లు రన్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి బొగ్గు రాక పోతే విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆర్టీపీపీలో బొగ్గు కొరత కొన్ని నెలలుగా పట్టిపీడిస్తున్నా ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. దీంతో ఆర్టీపీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటడంతో అధికారులు చేసేది లేక 2,3 యూనిట్లను ఆపివేశారు. 1,4,5 యూనిట్లలో లోడ్ తగ్గించి రన్ చేస్తున్నారు. మూడు యూనిట్లకు కలిపి 360 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ఈ విషయంపై ఆర్టీపీపీ ఇన్చార్జి సీఈ దేవేంద్రనాయక్‌ను వివరణ కొరగా బొగ్గు నిల్వలు లేవని అన్నారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో ఇంపోర్టు కోల్ ఐదువేల టన్నులు మాత్రం ఉందని అన్నారు. బొగ్గు రేక్‌లు వస్తే యూనిట్లు నడుపుతామన్నారు. విద్యుత్ రంగంలో స్వయం వృద్ధి: బాబు విద్యుత్ రంగంలో స్వయం వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. పదేళ్లలో గాడితప్పిన విద్యుత్ రంగాన్ని సమూలంగా సంస్కరించి తిరిగి పట్టాలపైకి తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇంధనశాఖ అధికారులతో ఆయన ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమలకు, గృహాలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. -
ఖా‘కీచకపర్వం’..!
పచ్చని బతుకులు బుగ్గిపాలవుతాయని, భావితరాల జీవనం అంధకారమవుతుందని..ప్రజా పోరాటం ఓ వైపు.. ముడుపులు..ప్యాకేజీలకు తలొగ్గి..ప్రజా పోరును నీరు గార్చే ప్రయత్నం మరోవైపు.. మధ్యలో ఖాకీల క్రౌర్యం..వెరసి థర్మల్ ఉద్యమ గ్రామాలు అట్టుడికిపోతున్నాయి. పోలీసుల దాష్టీకానికి సమిథలవుతున్నాయి.. బూటు చప్పుళ్లతో నిద్రకు దూరమవుతున్నాయి. తుపాకీ తూటాలు దూసుకుపోయి.. ఉద్యమకారులు నేలకొరిగినా.. ఖాకీల కఠిన హృదయాలు కరగడం లేదు. తాము కూడా మనుషులమేనన్న సంగతే మరిచిపోయారు. మృగాల్లా ప్రవరిస్తూ.. నిశిరాత్రి బీభత్సం సృష్టించారు. ఆదమరిచి నిద్రిస్తున్న వారిపై..దాడులకు తెగబడ్డారు. అడ్డుపడిన మహిళలపై కూడా కనికరం చూపకుండా..బలవంతపు అరెస్టులకు పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: థర్మల్ విద్యుత్ ప్లాం ట్ల నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష టీడీపీ థర్మల్ యాజమాన్యానికి అమ్ముడుపోయింద న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కక్ష సాధింపే ధ్యేయంగా ముందుకు సాగుతు న్నారు. ఇదే అదనుగా పోలీసులు రెచ్చిపోయి.. ఆందోళన కారులను బూట్ల కింద నలిపెయ్యాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి థర్మల్ వ్యతిరేక గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు. రెండు గంటల ప్రాంతంలో హనుమంతనాయుడిపేట, ఆకాశలక్కవరం, పాలనాయుడిపేటల్లో ఏడుగురిని అరెస్ట్ చేశా రు. ఇళ్లల్లో నిద్రిస్తున్న వారిని లేపి, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసి, అరెస్ట్ చే శారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 1231 రోజులుగా ఉద్యమం థర్మల్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మంగళవారం నాటికి 1231వ రోజుకు చేరుకుంది. 1108 జీవోను రద్దుచేయాలని కోరుతూ ఈ ఉద్యమం సాగుతోంది. ప్లాంట్‌కు 3333 ఎకరాల కేటాయింపు కాకరాపల్లి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ప్రభుత్వం 3333 ఎకరాల తంపర భూములను కేటాయించింది. గరీబులగెడ్డ, మాలపాటి గెడ్డ, ఏనుగులగెడ్డ, వంశధార, మహేంద్ర తనయ నదుల నుంచి తుపానులు, భారీ వర్షాలు కురిసినప్పుడు తంపర భూముల్లోకి నీరు చేరుతుంది. ఈ నీరు సముద్రంలోకి ఈ పొలాల్లో మీదుగానే వెళుతుంది. అయితే ఈ భూములను ప్రభుత్వం విద్యుత్ ప్లాంట్‌కు కేటాయించడంతో.. సంబంధిత యాజమాన్యం15 అడుగుల ఎత్తు పెంచింది. దీంతో తంపర భూ ములు మునిగిపోతున్నాయి.. ఆరు వేల మంది మత్స్యకారుల విలవిల భావనపాడు నుంచి విమలాడ వరకు సముద్రతీరంలో ఒడిశా నుంచి గతంలో వలస వచ్చిన సుమారు ఆరువేల మంది స్వదేశీ మత్స్యకారులు ఉన్నారు. లక్ష మంది వరకు జనం ఈ తీర ప్రాంతంలో నివశిస్తున్నారు. 25వేల ఎకరాల్లో రైతులు, రైతు కూలీలు జీవనం సాగిస్తున్నారు. ఇంతమందికి విఘాతంగా మారిన ప్లాంట్ వద్దంటూ ఐదేళ్లుగా 59 గ్రామాలకు చెందిన ప్రజలు పోరాటం చేస్తున్నారు. బాధితుల పక్షాన వైఎస్ఆర్సీపీ కాకరాపల్లి థర్మల్ బాధితుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం సాగిస్తోంది. పార్టీ టెక్కలి ని యోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించడం లో ముందున్నారు. దీనిని జీర్ణించుకోలేని అధికార పార్టీ వారు 2011 ఫిబ్రవరి 25న ఆయనను ముందుగా అరెస్ట్ చేయిం చా రు. అనంతరం 28వ తేదీన పోలీ సులు ఉద్యమ కారులపై కాల్పులకు తెగబ డ్డారు. ఈ మారణకాండలో జీరు నా గేశ్వరావు, బత్తిని బారికయ్య, ఎర్రయ్యలు మరణించారు. 1600 మందిపై కేసులు నమోదు చేశారు. 89 ఏళ్ల చంద్ర మ్మ, లక్షిలపై కేసులతో పాటు రౌడీషీట్లు ఓపెన్ చేశారు. ప్లాంట్ వారితో టీడీపీ కుమ్మక్కు థర్మల్ విద్యుత్ ప్లాంట్ వారితో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నా యి. ఇటీవల ఎచ్చెర్ల వద్ద కొనసాగుతున్న థర్మల్ వ్యతిరేక పోరాట దీక్షా శిబిరాన్ని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎత్తివేయించారు. ఉద్యమాన్ని నీరుగార్చే విషయంలో భారీగా టీడీపీ వారికి నజరానాలు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ దాష్టీకం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిపై అధికార పార్టీ దాష్టీకం ఎక్కువైంది. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తనదైన శైలిలో బాధితులపై పోలీసులతో దాడులు చేయించారణ ఆరోపణలు లేకపోలేదు. అర్ధ రాత్రి అరెస్టులు వెనుక ఆమె హస్తం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దువ్వాడ నేతృత్వంలో ఆందోళన.. వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ నాయకత్వంలో హెచ్ఎన్ పేట వద్ద సహాయ నిరాకరణోద్యమ (80 టన్నుల బరువుకు మిం చిన వాహనాలను గ్రామాల్లో నుంచి రాకుండా అడ్డుకోవడం) శిబిరాన్ని 17 రోజుల క్రితం తాజా మాజీ ఎమ్మె ల్యే, శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు పిరియా సాయిరాజ్ ప్రారంభించారు. ఉద్యమాన్ని నీరు గార్చి.. ఆందోళన కారుల్లో భయాందోళనలు వచ్చే విధంగా చేయాలనే ఆలోచనతో అధికార పార్టీ ఆదేశాల మేరకు సోమవారం తెల్లవారు జామున పోలీసులు వందల సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి.. భయోత్పాతం సృష్టించారు. నిశిరాత్రి బీభత్సం..! సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: థర్మల్ గ్రామాల్లో పోలీసులు సోమవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇళ్లలోకి దూరి ఉద్యమకారులను అరెస్టు చేశారు. వాహనాలను అడ్డుకుంటున్నారన్న థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు చడీ చప్పుడు లేకుండా..హెచ్.ఎన్.పేట, ఆకాశలక్కవరం, పాలనాయుడుపేట గ్రామాలకు వెళ్లి..ఇళ్లల్లో పడుకున్న ఉద్యమకారులను ఈడ్చుకుంటూ.. తీసుకువెళ్లి..అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సీఐ, ఎస్సైలు, వందలాది మంది సిబ్బంది కీచకపర్వాన్ని కొనసాగించా రు. అడ్డుపడిన మహిళలను సైతం పక్కకు తోసేసి.. ఉద్యమకారులైన సీరపు నర్సింహమూర్తి, దల్లి చిన్నఎర్రయ్య, కొయ్య ప్రసాద్‌రెడ్డి, నీలాపు అప్పలస్వామి, కప్ప గవర్రజు, లింగూడు నాగేశ్వరరావు, బొంగు తేజారావులను తీసుకువెల్లి అరెస్టు చేశారు. ఆ తర్వాత నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుంచి పవర్‌ప్లాంటు మెయిన్ గేటు వరకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అప్పటి వరకు ఈ రూట్లో థర్మల్ వాహనాలను నడపడానికి వెనుకంజ వేసిన యాజమాన్యం మంగళవారం వేకువ జాము నుంచి నిర్భయంగా పోలీసుల సహకారంతో నడిపించారు. విషయం తెలుసుకుని జర్నలిస్టుల బృందం ఆయా గ్రామాల్లో పర్యటించగా.. బాధిత కు టుంబాలు..పోలీసుల దౌర్జన్యాన్ని వివరించా యి. తమ ఆవేదనను వెల్లగక్కాయి. మహిళలని చూడకుండా..పక్కకు తోసేసి..తమ వారిని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని పరపటి రాజేశ్వరి, దల్లి సీత మ్మ, సీరపు జ్యోతితో పాటు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.