సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి పండుగలోగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానంగా నల్లగొండలో జెన్‌కో, ఎన్టీపీసీ సంస్థలు ఏర్పాటు చేయనున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం అటవీ భూమిని బదిలీ చేయాలని కోరడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు.
ఈ విద్యుత్ ప్రాజెక్టులకు అనువైన స్థలాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేలో పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇక్కడ దాదాపు పదివేల ఎకరాలకు పైగా భూమిని నల్లగొండ జిల్లా అధికారులు సర్వే కూడా పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో అక్కడ అటవీ భూములను పరిశ్రమలకు కేటాయిస్తే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపిస్తామని సీఎం వివరించనున్నట్లు సమాచారం.
కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర జల వనరుల మంత్రి ఉమా భారతి, ఇంధన మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కూడా కేసీఆర్ కలవనున్నట్టు తెలిసింది. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ మాత్రం ఇంకా సీఎం కార్యాలయం కోరలేదని సమాచారం.
సంక్రాంతిలోగా ఢిల్లీకి సీఎం!
Published Thu, Jan 8 2015 2:26 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement