హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు బుధవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు వచ్చే వాటా ఎంతో తేల్చాకే.. ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కేసీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న నూతన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిబంధనలకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను తేల్చాలని కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు.
కేంద్రమంత్రికి కేసీఆర్ లేఖ
Published Wed, Jun 1 2016 4:51 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement