కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. టెక్కిలిలో కృపారాణి నివాసాన్ని సమైక్యవాదులు శనివారం ముట్టడించారు.
శ్రీకాకుళం : కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. టెక్కిలిలో కృపారాణి నివాసాన్ని సమైక్యవాదులు శనివారం ముట్టడించారు. స్పీకర్ ఫార్మెట్లో కృపారాణి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆమె ఇంటి ఎదుట బైఠాయించిన సుమారు వందమంది సమైక్యవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మంత్రి కొండ్రు మురళి ఇంటిని కూడా సమైక్యవాదులు ముట్టడించి, నిరసన తెలిపారు. అలాగే తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా సమైక్యవాదులు పాతపట్నం వద్ద రైల్ రోకో నిర్వహించారు. పూరీ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు.
మరోవైపు తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా సింహద్వారం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వరదు కళ్యాణి ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో రెండరోజు కూడా స్వచ్చందంగా బంద్ కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. కాగా జగన్ దీక్షకు మద్దతుగా ఆముదాలవలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు.