
సాక్షి, శ్రీకాకుళం : చిరు ఉద్యోగులకు జీతాలు పెంచి లక్షలాది కుటుంబాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం నింపారన్నారు వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ మంత్రివర్గ కూర్పు దేశానికే ఆదర్శం అన్నారు. జగన్ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాల వారికి సమాన ప్రాధాన్యత కల్పించడం హర్షణీయం అన్నారు. చంద్రబాబు తన మంత్రి వర్గంలో మైనార్టీ, గిరిజనులకు స్థానం కల్పించకుండా వాళ్లని అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఎస్ విధానం రద్దు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న జగన్ ఆలోచన అభినందనీయం అన్నారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం రైతాంగానికి పెద్ద ఊరట అని ఆమె ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment