సమంత అద్భుతమైన నటి.. అన్నది ఎవరో తెలుసా! | Actress Bhumika praises Samantha | Sakshi
Sakshi News home page

Sep 12 2018 8:26 PM | Updated on Jul 14 2019 4:41 PM

Actress Bhumika praises Samantha  - Sakshi

సాక్షి, తమిళసినిమా: నటి సమంత అద్భుతమైన నటి.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా.. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన భూమిక. వివాహానంతరం కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించిన ఆమె.. ఆ తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చారు. నటనకు అవకాశమున్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె తాజా చిత్రం యూటర్న్‌..  సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గురువారం తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై రెండు భాషల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించిన భూమిక తన అనుభవాలను పంచుకున్నారు. ‘కళాకారులెవరైనా వైవిధ్యమైన, చాలెంజ్‌తోకూడిన పాత్రల్లో నటించినప్పుడే గుర్తింపు పొందుతారు. ఆత్మసంతృప్తి దొరుకుతుంది. ‘యూటర్న్‌’ చిత్రంలో నేను ఇంతవరకూ చేయని విభిన్నమైన పాత్రలో నటించాను. నా పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ఆమె తెలిపారు. ఇక, యూటర్న్‌లో ప్రధాన పాత్ర పోషించిన సమంతను భూమిక ప్రశంసల్లో ముంచెత్తారు. సమంత బ్రహ్మాండమైన నటి కితాబిచ్చారు. షూటింగ్‌లో చాలా చలాకీగా ఉంటారని, ఈ చిత్రంలో తను చాలా బాగా నటించారని అన్నారు. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల గురించి స్పందిస్తూ ఇంతకుముందు కూడా తాను ఈ తరహా చిత్రాల్లో నటించానని, ఇకముందు కూడా నాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తానని చెప్పారు.

తమిళంలోనూ తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని, మంచి కథ, పాత్ర బాగుంటే నటిస్తానని, అలాంటి చిత్రాలే ప్రేక్షకుల మధ్యకు చేరతాయన్నారు. తాను 1999లో నటిగా పరిచయం అయ్యానని, సినీ రంగంలోకి వచ్చి సుమారు 20 ఏళ్లు అవుతుందని భూమిక తెలిపారు. జయాపజయాలను ఎలా జీర్ణించుకోవాలో తన తల్లిదండ్రులు నేర్పించారని, కాబట్టి అవి తనను బాధించవని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement