న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మరో పుస్తకాస్త్రాన్ని సంధిస్తోంది. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన పలు హామీలు, వాటిల్లో యూటర్న్ తీసుకున్న అంశాలతో కూడిన బుక్‌లెట్‌ను సోమవారం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో నల్లధనం సహా 24 అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న యూటర్న్‌లు ఉంటాయని తెలిసింది.