నాకు ఇష్టమైన ప్లేస్‌ అదే | thamanna answers on twitter fans | Sakshi
Sakshi News home page

నాకు ఇష్టమైన ప్లేస్‌ అదే

Published Sun, Jul 29 2018 12:06 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

thamanna answers on twitter fans - Sakshi

ఫ్యాన్స్‌ అంటే సమంతకు చాలా అభిమానం. అందుకే వీలు కుదిరినప్పుడల్లా తనతో మాట్లాడే అవకాశం ఇస్తుంటారు. వీకెండ్‌లో ఫ్యాన్స్‌కి అలాంటి ఫీస్ట్‌నే ఇచ్చారు. మీరేం అడిగినా ఆన్సర్‌ ఇవ్వడానికి నేను రెడీ అంటూ ట్వీటర్‌ ద్వారా ప్రశ్నలు సంధించే చాన్స్‌ ఫ్యాన్స్‌కి ఇచ్చారు. వాటిలో కొన్ని...

► ‘యు టర్న్‌’ సినిమాలో మీ పాత్ర పేరు?
రచన
► ఈ పాత్ర కోసం మళ్లీ ముక్కు కుట్టించుకున్నారా ?
లేదు. అది కేవలం పెట్టుడు నోస్‌ రింగ్‌ మాత్రమే.
► ఆదివారాలు మీ ప్రోగ్రామ్‌ ఏంటి?
ఏం లేదు. హ్యాపీగా ఇంట్లో ఉండటమే.
► ‘యు టర్న్‌’  సినిమా ఒప్పుకోవడానికి ముఖ్య కారణం?
దర్శకుడు పవన్‌ కుమార్‌. అతను తీసిన కన్నడ ‘లూసియా’ చూసి అతనికి పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను.
► ఈ సినిమాలో మీ పాత్రకు మీరే డబ్బింగ్‌ చెప్పుకున్నారా?
అవును.
► వరుసగా అద్భుతమైన పాత్రలు, సినిమాలు చేస్తున్నారు. ఎలా కుదురుతోంది?
మంచి పాత్రల కోసం వెతకడం, కొన్ని వాటంతట అవే రావడం. రెండూ జరుగుతున్నాయి.
► ఫ్యూచర్‌లో కూడా ఇలానే కొత్త కొత్త పాత్రలు చేయండి.
థ్యాంక్యూ. తప్పకుండా.
► సినిమా సినిమాకి డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది ?
వండర్‌ఫుల్‌. ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు దేవుడికి రుణపడి ఉంటాను.
► సెలబ్రిటీ అయ్యాక కామన్‌ ఉమెన్‌గా ఉండడం మిస్‌ అవుతున్నారా ?
నా లైఫ్‌ ఎప్పుడూ సింపుల్‌గానే ఉంటుంది. అలాగే కంటిన్యూ చేస్తాను.
► మీ లైఫ్‌లో పెద్ద యు టర్న్‌  మూమెంట్‌ ఏంటి?
సినిమాల్లోకి రావాలనుకోవడం.
► సూపర్‌ హీరోస్‌లో ఎవరంటే ఇష్టం? అవెంజెర్స్‌ లేదా జస్టిస్‌ లీగ్‌?
అవెంజర్స్‌.
► జుట్టు షార్ట్‌గా కట్‌ చేశారు. ఫీల్‌ అయ్యారా?
అస్సలు లేదు. క్యారెక్టర్‌ కోసం అలా చేయడం నాకు భలే ఇష్టం
► అటు ఫ్యామిలీ, ఇటు ప్రొఫెషన్‌.. రెంటినీ ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారు?
ఫ్యామిలీ, వర్కే మన మేంటో తెలియజేస్తాయి. మిగతావేవీ కాదు. అందుకే పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్‌ చేసుకుంటాను.
► మీకు బాగా ఇష్టమైన ప్లేస్‌?
ఇల్లు
► మీరు పోషించిన వాటిలో బెస్ట్‌ రోల్‌ ఏంటి?
ఇంకా లేదు. మంచి క్యారెక్టర్స్‌ చేయాలని అత్యాశ ఎక్కువ. అందుకే అలా అంటున్నాను.
► మీ మామ నాగార్జున గారి గురించి ఒక్క మాటలో చెప్పండి..
స్పూర్తి కలిగించే వ్యక్తి.
► హీరోయిన్స్‌లో ఎవరైనా మీకు కాంపిటీషన్‌ అని ఫీల్‌ అవుతారా?
హీరోయిన్స్‌ అందరూ కలసికట్టుగా ఉండాలి. ఒకరిని ఒకరు సపోర్ట్‌ చేసుకుంటూ, ఎంకరేజ్‌ చేసుకోవాలి. కలసి ఉంటేనే కదా బలం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement