
సమంత లవ్ స్టోరీ!
టాప్ హీరోయిన్ సమంత లవ్ స్టోరీ ఇది అంటూ అప్పుడప్పుడు వదంతులు వినిపిస్తూనే ఉంటాయి. వాటిని ఆమె కొట్టిపారేయడం పరిపాటిగా మారింది. ఆమె లవ్ స్టోరీ ఏమైనా బయటకు లీకైందా అన్న అనుమానం తలెత్తకమానదు. అయితే ఈ లవ్ స్టోరీలో ఆమె ప్రేమలో పడింది ఏ వ్యక్తితోనూ కాదు. ఎందుకంటే సమంతా లవ్ స్టోరీలో కథానాయకుడు జిమ్ అని తెలిసి అశర్చపోనక్కర్లేదు. ఎందుకంటే జిమ్ లో కసరత్తులు చేస్తున్న సందర్భంగా ఓ ఫొటో దిగిన సమంత ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 'మై లవ్ స్టోరీ విత్ జిమ్' అని ట్విట్ లో పేర్కొంది. ఈ ఫొటో, వివరాలు గమనించినట్లయితే వారంలో కొన్ని గంటలు జిమ్ లో కచ్చితంగా గడుపుతన్నట్లు కనిపిస్తుంది.
టాలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ముద్దుగుమ్మలు నాజూకుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో హీరోలతో పోటీపడుతూ జిమ్ వర్కవుట్స్, యోగా, ఇలా రకరకాల పద్ధతులను అందాలభామలు ఫాలో అవుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ లలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన హీరోయిన్లలో సమంత ఒకరని చెప్పవచ్చు. సమంతా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి బొద్దుగా అవ్వకుండా ఉండేందుకు ఫిట్ నెస్ ఫార్ములాస్ వాడుతోంది. శ్రీయ, పరిణీతి చోప్రా, ఇలా చెప్పుకుంటేపోతే చాలామంది హీరోయిన్లు జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇటీవల కాలంలో వార్తల్లో కెక్కిన విషయం తెలిసిందే.