Portfolio Investment
-
ఎఫ్‌పీఐల స్పీడ్
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా అమ్మకాల బాటలో సాగిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు. దేశీ స్టాక్స్‌లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. వెరసి ఈ నెల తొలి వారంలో ఎఫ్‌పీఐలు రూ. 24,454 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అక్టోబర్‌లో కొత్త రికార్డుకు తెరతీస్తూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లో కొంత వెనకడుగు వేసి రూ. 21,612 కోట్ల అమ్మకాలకు పరిమితమయ్యారు. అయితే సెపె్టంబర్లో అంతక్రితం 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇకపై యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు, వడ్డీ రేట్లు, రాజకీయ భౌగోళిక అంశాల ఆధారంగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు నమోదుకానున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. -
ఈక్విటీల్లో ఫండ్స్ పెట్టుబడులు రూ.2,400 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మే నెలలో ఈక్విటీల్లో కొనుగోళ్ల బాట పట్టాయి. ఏప్రిల్ నెలలో నికరంగా రూ.4,553 కోట్లను ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) వెనక్కి తీసుకోగా, మే నెలలో రూ.2,446 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడం, జీడీపీ వృద్ధి బలంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు చెబుతున్నారు. మే నెలలో ఈక్విటీ పెట్టుబడుల విషయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), దేశీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య చాలా అంతరం నెలకొంది. ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.43,838 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, మ్యూచువల్ ఫండ్స్ రూ.2,446 కోట్ల పెట్టుబడులకే పరిమితమైనట్టు సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్‌లోనూ ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో రూ.11,631 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ తాత్కాలిక మార్పు ఈక్విటీలకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు భావిస్తున్నారు. ‘‘స్థిరమైన జీడీపీ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, ఇన్వెస్టర్‌కు అనుకూలమైన విధానాలు మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తోడ్పడ్డాయి. ఎఫ్‌పీఐలు, మ్యూచువల్ ఫండ్స్ ఒకరికొకరు సమతుల్యంగా వ్యవహరించారు. ఎఫ్‌పీఐలు విక్రయించినప్పుడు దేశీ ఇనిస్టిట్యూషన్స్ (మ్యూచువల్ ఫండ్స్ సహా) కొనుగోళ్లకు ముందుకు వచ్చాయి’’అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ఎఫ్‌పీఐలు, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ గడిచిన 11 నెలలుగా మార్కెట్లు మొత్తం మీద సానుకూలంగా ట్రేడ్ అవుతుండడం గమనార్హం. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనంపై ఆందోళనలు నెలకొనగా, దీర్ఘకాలంలో భారత్‌కు మెరుగైన వృద్ధి అవకాశాలు ఉన్న విషయాన్ని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు గుర్తు చేశారు. -
ఎఫ్‌పీఐ పెట్టుబడుల విలువ డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల విలువ 2022 డిసెంబర్‌కల్లా 11 శాతం క్షీణించింది. మార్నింగ్‌స్టార్ నివేదిక ప్రకారం 584 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఈ విలువ 2021 డిసెంబర్లో 654 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందుకు ప్రధానంగా దేశీ స్టాక్ మార్కెట్ల రిటర్నులు నీరసించడం, ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లడం వంటి అంశాలు ప్రభావం చూపాయి. అయితే త్రైమాసికవారీగా చూస్తే ఎఫ్‌పీఐల పెట్టుబడులు 3 శాతం బలపడ్డాయి. 2022 సెప్టెంబర్‌కల్లా 566 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా.. డిసెంబర్‌కల్లా 584 బిలియన్ డాలర్లకు పుంజుకున్నాయి. కాగా.. దేశీ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల వాటా సెప్టెంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌కల్లా 16.97 శాతం నుంచి 17.12 శాతానికి మెరుగుపడింది. 2020, 2021 కేలండర్ ఏడాదుల్లో వృద్ధి చూపిన గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు 2022లో కుదుపులు చవిచూసిన విషయం విదితమే. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఈ బాటలో దేశీయంగానూ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. అయినప్పటికీ ప్రపంచంలోనే దేశీ మార్కెట్లు సానుకూల రిటర్నులు ఇచ్చిన జాబితాలో నిలవడం గమనార్హం! 4.5 శాతం ప్లస్ బీఎస్ఈ సెన్సెక్స్ 4.5 శాతం లాభపడగా.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం పుంజుకుంది. అయితే స్మాల్ క్యాప్ 1.8% నష్టపోయింది. 2022లో పలు ప్రతికూలతల నడుమ దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోయాయి. -
ఈక్విటీలపై ఎఫ్‌పీఐల ఆసక్తి
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల(డిసెంబర్)లో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలో నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. అనిశ్చుతులలోనూ రూ. 11,557 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కోవిడ్ ఆందోళనల నేపథ్యంలోనూ దేశీ ఈక్విటీలపట్ల ఆసక్తి చూపారు. అయితే సమీప భవిష్యత్‌లో యూఎస్ స్థూల ఆర్థిక గణాంకాలు, కోవిడ్ పరిస్థితులు ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ప్రభావం చూపనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం డిసెంబర్ 1–23 మధ్య ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 11,557 కోట్ల విలవైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. కాగా.. గత నెల(నవంబర్)లో ఎఫ్‌పీఐలు మరింత అధికంగా రూ. 36,200 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! ఇందుకు యూఎస్ డాలరు బలహీనపడటం, స్థూల ఆర్థిక పరిస్థితుల సానుకూలత దోహదం చేశాయి. అయితే అంతకుముందు అంటే అక్టోబర్‌లో నామమాత్రంగా రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. సెప్టెంబర్‌లో రూ. 7,624 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
పోర్ట్‌ఫోలియో ఇలా అయితే బెటర్!
కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించి ఇప్పటికే ఒక మాసం ముగిసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించాయి. ప్రధాన సూచీలు 70 శాతం ర్యాలీ చేయగా.. ఎస్అండ్పీ బీఎస్ఈ 500 సూచీలో 200కు పైగా స్టాక్స్ రెట్టింపునకు పైగా పెరిగాయి. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లోనూ అదే మాదిరి లాభాలు ఆశించడం అత్యాశే అవుతుంది. పెట్టుబడులంటే ఒక్క లాభాలే కాదు. మీ పెట్టుబడికి రక్షణ కూడా అవసరం. ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైనా అధిగమించే విధంగా పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఉండాలి. ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళికకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకానీ, ఈక్విటీల్లో అధిక రాబడులను చూసి లేదా బిట్‌కాయిన్ పరుగులు చూసి భారీగా రిస్క్ తీసుకోవడం మంచిది కాదంటున్నారు. ఈక్విటీలతో పాటు ఇతరత్రా సాధనాలకు ఇన్వెస్టర్లు ఏ మేరకు పెట్టుబడులను కేటాయించుకోవాలన్న అంశంపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి... ఎకానమీ పుంజుకుంటుంది ప్రతీ ఇన్వెస్టర్ జీవితంలో ఏ దశలో ఉన్నారు.. లక్ష్యాలు, వాటికి ఎంత వ్యవధి ఉందనే అంశాల ఆధారంగా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. కరోనా రెండో విడత వల్ల తాత్కాలిక అవరోధాలు ఏర్పడినప్పటికీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోనుంది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి చక్రంలోకి భారత్ ప్రవేశించనుంది. కంపెనీలు బలమైన లాభాల ఆర్జనకు ఇది వీలు కల్పిస్తుంది. మార్కెట్లు మంచి పనితీరు చూపించేందుకు మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల లాభాలు పెరగనున్నాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ఈక్విటీలు సా«ధారణం కంటే ఎక్కువే రాబడులను ఇస్తాయి. కరోనా సెకండ్‌వేవ్ సవాళ్లు విసురుతున్నప్పటికీ, వాటిని భారత్ తట్టుకోగలదన్న విశ్వాసం ఉంది. – నీరజ్ కుమార్ ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్స్ /ఈటీఎఫ్‌లు మెరుగైనవి.. 2020 మార్చిలో క్లిష్ట పరిస్థితుల తర్వాత ఏడాది కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ 78 శాతం ర్యాలీ చేసింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఈక్విటీల పరిమాణం పెరిగి ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి సంపదను సమకూర్చుకునేందుకు సరైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఎంతో అవసరం. పెట్టుబడుల లక్ష్యాలకు ఇది కీలకం. ఆయా అంశాలను పరిశీలిస్తే... ► ఈక్విటీలు: మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం వల్ల తక్కువ వ్యయాలకే మార్కెట్ ఆధారిత రాబడులను అందుకోవచ్చు. ► స్థిరాదాయం: స్థిరమైన, మంచి వృద్ధికి అవకాశం ఉన్న ఎన్సీడీలు ఇప్పటికీ ఉన్నాయి. మార్కెట్ అస్థిరతలను తట్టుకునేందుకు, పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులకు హెడ్జింగ్ కోసం ఈ విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈక్విటీలు: దేశీయ మార్కెట్లలో ఉండే అస్థిరతలకు హెడ్జ్ (రక్షణగా)గా అంతర్జాతీయ ఈక్విటీలు ఉపయోగపడతాయి. అంతేకాదు బలమైన వృద్ధి అవకాశాలున్న అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది. ► బంగారం: ఈక్విటీ మార్కెట్ల తీరు ప్రతికూలంగా మారిన సందర్భాల్లో బంగారం పథకాల్లో పెట్టుబడులు.. స్థిరత్వాన్నిస్తాయి. పెట్టుబడుల కేటాయింపులు.. ► ఈక్విటీలు: 70 శాతం (నేరుగా స్టాక్స్‌లో 40 శాతం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు 20 శాతం, ఈఎస్జీ మ్యూచువల్ ఫండ్స్‌కు 10 శాతం) ► ఫిక్స్డ్ ఇన్కమ్: 15 శాతం (డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు 10 శాతం, ఏఏఏ రేటెడ్ కార్పొరేట్ ఎన్‌సీడీలకు 5 శాతం). డెట్ ఫండ్స్‌లో అల్ట్రా షార్ట్ టర్మ్ లేదా లో డ్యురేషన్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్ లేదా డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈక్విటీలు: 10 శాతం (ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌కు 5 శాతం, ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్‌కు 5 శాతం) ► బంగారం: 5 శాతం (గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లు) – దినేష్ రోహిరా, 5నాన్స్ డాట్‌కామ్ సీఈవో ఇక ముందూ ఈక్విటీల ర్యాలీ 2021–22లో అంతర్జాతీయంగా అధిక ద్రవ్య లభ్యత కొనసాగుతుంది. ఇది ఈక్విటీ మార్కెట్ల ర్యాలీకి, ప్రధానంగా భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది. దేశీయ ఈక్విటీలకు 50–60 శాతం మధ్య, అంతర్జాతీయ ఈక్విటీలకు 20–30 శాతం మధ్య కేటాయించుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నాం. వ్యాల్యూ స్టాక్స్‌పై దృష్టి సారించాలి. ఎందుకంటే వచ్చే ఏడాది కాలంలో ఇవి మంచి పనితీరు చూపిస్తాయి. బంగారం, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు 10 శాతం చొప్పున కేటాయించుకోవాలి. నిపుణుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలి. కేటాయింపులు.. ► బంగారం, ఫిక్స్డ్ఇన్కమ్: 10 శాతం ► అంతర్జాతీయ ఈక్విటీలు: 20–30% దేశీయ ఈక్విటీలు: 50–60% – దివమ్ శర్మ, గ్రీన్ పోర్ట్‌ఫోలియో సర్వీసెస్ 60/40 ఫార్ములా.. ఇన్వెస్టర్ వ్యక్తిగత రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. సాధారణంగా 60/40 సూత్రాన్ని మేము సూచిస్తుంటాం. అంటే 60 శాతం కేటాయింపులు ఈక్విటీలకు, మిగిలిన 40 శాతం స్థిరాదాయాన్నిచ్చే సాధనాలు, బంగారం కలయికగా ఉండాలి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు భారీ ర్యాలీ చేసినప్పటికీ 2021–22లోనూ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే అధిక రాబడులను ఇస్తాయని భావిస్తున్నాం. తక్కువ వడ్డీ రేట్లు, సరిపడా ద్రవ్యలభ్యత, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానం, కార్పొరేట్ లాభాలు పుంజుకోవడం వచ్చే రెండేళ్ల పాటు కొనసాగుతుంది. వచ్చే రెండేళ్లపాటు ఈక్విటీలు రెండంకెల రాబడులను ఇస్తాయన్నది అంచనా. కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని దేశం అధిగమించడానికి తగిన అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఇది ఈక్విటీలకు సానుకూల అంశం. కేటాయింపులు ► ఫిక్స్డ్ ఇన్కమ్: 40 శాతం (ఇందులో బంగారం, వడ్డీ ఆదాయాన్నిచ్చేవి, స్థిరాదాయాన్నిచ్చే సాధనాలు ఉండాలి) ► ఈక్విటీలు: 60 శాతం కేటాయించుకోవాలి. – గౌరవ్‌దువా, షేర్‌ఖాన్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ హెడ్ -
ఎఫ్‌పీఐ పెట్టుబడులు.. భళా
ముంబై: కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను దేశీ క్యాపిటల్ మార్కెట్లు విశేషంగా ఆకర్షిస్తూ వస్తున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) విదేశీ పెట్టుబడుల రీత్యా మార్కెట్లు రికార్డులు సాధించే వీలుంది. ఏప్రిల్ నుంచి ఈ నెల 15వరకూ చూస్తే ఎఫ్‌పీఐలు అటు ఈక్విటీలు, ఇటు రుణ సాధనాలలో కలిపి ఏకంగా 33.8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. డాలరుతో మారకంలో ప్రస్తుత రూపాయి విలువ(72.65) ప్రకారం వీటి విలువ రూ. 2.45 లక్షల కోట్లకుపైమాటే. ఇంతక్రితం 2014–15లో మాత్రమే ఎఫ్‌పీఐలు ఇంతకంటే అధికంగా అంటే 46 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. వెరసి దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్‌పీఐల మొత్తం పెట్టుబడుల విలువ 592.5 బిలియన్ డాలర్లను తాకింది. వీటిలో ఈక్విటీ పెట్టుబడుల విలువ 537.4 బిలియన్ డాలర్లుకాగా.. రుణ సాధనాలలో 51.38 బిలియన్ డాలర్లను పంప్ చేశారు. దేశీ దిగ్గజం కేర్ రేటింగ్స్ రూపొందించిన గణాంకాలివి. ఫైనాన్షియల్ జోరు: ఎఫ్‌పీఐల పెట్టుబడులు(హోల్డింగ్స్) అత్యధికంగా ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో (191.3 బిలియన్ డాలర్లు) నమోదుకాగా.. సాఫ్ట్వేర్ 76 బిలియన్ డాలర్లను ఆకట్టుకుంది. ఆయిల్, గ్యాస్‌లో 50 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్స్, కాంపోనెంట్స్‌లో 27 బిలియన్ డాలర్లు, బయోటెక్నాలజీలో దాదాపు 23 బిలియన్ డాలర్లు, సావరిన్ డెట్‌లో 21.7 బిలియన్ డాలర్లు చొప్పున ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. వ్యక్తిగత ఉత్పత్తులు, క్యాపిటల్ గూడ్స్, ఆహారం, పానీయాలు, బీమా రంగాలు సైతం 20–13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పొందాయి. 10 ప్రధాన రంగాలు ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో 78% వాటాను ఆక్రమిస్తున్నాయి. డిసెంబర్లో..: ఈ ఏడాది లభించిన దాదాపు 34 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడుల్లో 8.4 బిలియన్ డాలర్లు ఒక్క డిసెంబర్లోనే లభించడం విశేషం! అయితే కేర్ గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో దేశీ క్యాపిటల్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ప్రతికూలంగా నమోదయ్యాయి. 2019–20లో ఎఫ్‌పీఐలు నికరంగా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. దేశీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న విదేశాలలో యూఎస్ వాటా 34 శాతంకాగా.. మారిషస్ 11 శాతం, సింగపూర్ 8.8 శాతం, లగ్జెమ్‌బర్గ్ 8.6 శాతం, బ్రిటన్ 5.3 శాతం, ఐర్లాండ్ 4%, కెనడా 3.4 శాతం, జపాన్ 2.8 శాతం చొప్పున వాటాను ఆక్రమిస్తున్నాయి. నెదర్లాండ్స్, నార్వే సైతం 2.4% వాటాను కలిగి ఉన్నాయి. -
ఆశిష్ కచోలియా షేర్లు.. రేసు గుర్రాలే..!
కోవిడ్-19 ఆందోళనల నుంచి బయటపడిన దేశీ స్టాక్ మార్కెట్ల బాటలో ప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియో సైతం దూకుడు చూపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ చివరివరకూ చూస్తే.. మిడ్, స్మాల్ క్యాప్స్‌తో కూడిన ఆశిష్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 100 శాతంపైగా ర్యాలీ చేసింది. ఇదే కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 29 శాతమే పుంజుకుంది. తద్వారా మార్కెట్లను మించిన రిటర్నులను ఆశిష్ చిన్న షేర్ల పోర్ట్‌ఫోలియో సాధిస్తోంది. వివరాలు చూద్దాం.. పలు స్మాల్ క్యాప్స్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని మధ్య, చిన్నతరహా కౌంటర్లలో మజెస్కో, పౌషక్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, విష్ణు కెమికల్స్ 100 శాతంపైగా ర్యాలీ చేశాయి. సుమారు 12 మిడ్, స్మాల్ క్యాప్స్‌లో ఆశిష్‌కు 1 శాతంపైగా వాటాలున్నాయి. ఇలాంటి 16 స్టాక్స్‌లో జూన్ చివరికల్లా 13 కౌంటర్లు భారీగా లాభపడగా.. సఫారీ ఇండస్ట్రీస్, డీఎఫ్ఎం ఫుడ్స్, ఎన్ఐఐటీ మాత్రం నీరసించాయి. 90 శాతం ఆశిష్ స్టాక్స్‌లో హెచ్ఎల్ఈ గ్లాస్‌కోట్, కేపీఐటీ టెక్నాలజీస్, బిర్లాసాఫ్ట్ 90 శాతం దూసుకెళ్లగా.. అపోలో ట్రైకోట్, షాయిలీ ఇంజినీరింగ్, పాలీ మెడిక్యూర్, వైభవ్ గ్లోబల్ 87-70 శాతం మధ్య ఎగశాయి. ఈ 16 స్టాక్స్‌లో ఆశిష్ నెట్‌వర్త్ గత నాలుగు నెలల్లో 66 శాతం జంప్‌చేసి రూ. 494 కోట్లను తాకింది. మార్చికల్లా ఈ పోర్ట్‌ఫోలియో విలువ రూ. 298 కోట్లుగా నమోదైంది. పౌషక్ స్పీడ్ ఏప్రిల్ నుంచి చూస్తే స్పెషాలిటీ కెమికల్ కంపెనీ పౌషక్ అత్యధికంగా 137 శాతం లాభపడింది. ఈ కంపెనీలో ఆశిష్‌కు 1.39 శాతం వాటా ఉంది. ఇక 3.1 శాతం వాటా కలిగిన ఐటీ సేవల కంపెనీ మజెస్కో 101 శాతం ర్యాలీ చేసింది. ఈ రెండు షేర్లూ నేటి ట్రేడింగ్‌లో 52 వారాల గరిష్టాలను తాకడం విశేషం! గత వారం యూఎస్ అనుబంధ సంస్థను పీఈ కంపెనీ థోమా బ్రావోకు విక్రయించనున్నట్లు వెల్లడించడంతో వరుసగా 7వ సెషన్లోనూ మజెస్కో షేరు అప్పర్ సర్క్యూట్‌కు చేరడం గమనార్హం! యూఎస్ అనుబంధ సంస్థ విక్రయంతో మజెస్కో పన్నుల తదుపరి నికరంగా రూ. 2555 కోట్ల నగదును పొందనున్నట్లు తెలుస్తోంది. దీంతో నగదు నిల్వలు పెరగడం ద్వారా బ్యాలన్స్‌షీట్ మరింత బలపడనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
భారత్‌కు అనుకూలించిన అంతర్జాతీయ వాతావరణం
సింగపూర్: భారత ఆర్థిక వ్యవస్థ 2019లో అంతర్జాతీయంగా ఉన్న సానుకూల వాతావరణంతో ప్రయోజనం పొందిందని, ఈక్విటీ, డెట్ విభాగాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కొన్నేళ్ల గరిష్ట స్థాయికి చేరాయని సింగపూర్‌కు చెందిన బ్యాంకింగ్ గ్రూపు డీబీఎస్ ఓ నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి నిలకడగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం లభిస్తుందని తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా అధిక లిక్విడిటీ (పెట్టుబడులు), చమురు ధరలు నిలకడగా ఉండడం వంటివి సానుకూలించినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2019–20లో ఇప్పటి వరకు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సగటున 65 డాలర్లుగా ఉందని, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 70 డాలర్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. -
ఎఫ్‌పీఐల డార్లింగ్.. బీమా!
న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగంలో ఉన్న అపార అవకాశాలు విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) బాగా ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా వారు ఈ రంగంలోని లిస్టెడ్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో... అంటే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బీమా కంపెనీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి రికార్డు స్థాయిలో రూ.16,976 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,331 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 13 రెట్లు అధికం. సాధారణంగా ఎఫ్‌పీఐలు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీరు బీమా రంగ కంపెనీల్లో అదే పనిగా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే.. ఈ రంగంలోని వృద్ధి అవకాశాల పట్ల వారు ఎంతో బుల్లిష్‌గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఈ ఏడాది ఏప్రిల్– ఆగస్ట్ మధ్య కాలంలో మన ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఈ కాలంలో వారు రూ.30,011 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. అయినా, ఇదే కాలంలో బీమా రంగ కంపెనీల్లో నికరంగా రూ.5,203 కోట్లను వారు ఇన్వెస్ట్ చేశారు. జీవిత, సాధారణ బీమా విభాగంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ లిస్టయిన ప్రముఖ కంపెనీలు. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ ప్రభుత్వరంగ సంస్థ. సెబీ నిబంధనలు అనుకూలం... ‘‘గత 4–6 త్రైమాసికాలుగా ఎఫ్‌పీఐలు, దేశీయ ఇన్స్టిట్యూషన్లు బీమా కంపెనీల షేర్లను భారీగా కొంటున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ముందస్తు కమీషన్ల చెల్లింపులను నిషేధిస్తూ సెబీ తెచ్చిన నిబంధనలు బీమా రంగ కంపెనీలకు అనుకూలంగా మారాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ పరిశోధన విభాగం అధిపతి దీపక్ జసాని విశ్లేషించారు. అంటే బీమా కంపెనీల కమీషన్ల చెల్లింపులపై ఇటువంటి ఆంక్షలేమీ లేకపోవడం సానుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది 10 నెలల కాలంలో ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది బీమా రంగమే. 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఎఫ్‌పీఐలు రూ.24,714 కోట్లను వీటిల్లో ఇన్వెస్ట్ చేశారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రైవేటు బీమా రంగ కంపెనీల్లో ఎఫ్‌ఫీఐల వాటా ఏడాది క్రితం ఉన్న 3 శాతం నుంచి అక్టోబర్ చివరికి 12 శాతానికి చేరుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. అందుకే ఏడాది క్రితం ఈ కంపెనీలో 4.45 శాతంగా ఉన్న ఎఫ్‌పీఐల వాటా ఏకంగా 23.72 శాతానికి పెరిగిపోయింది. దీర్ఘకాలంలో భారీ అవకాశాలు ‘‘మారుతున్న జీవనశైలి పరిస్థితులు, అధిక రక్షణ అవసరమన్న అవగాహన విస్తృతం అవుతుండడం (ముఖ్యంగా యువతరంలో) బీమా కంపెనీలకు వ్యాపార అవకాశాలను పెంచుతోంది. ఫలితంగా వాటి మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. బీమా రక్షణ అంతరం అత్యధికంగా మన దేశంలో 92 శాతంగా ఉంది. బీమా అన్నది దీర్ఘకాలానికి సంబంధించినది. ఈ రంగం వృద్ధి అవకాశాలు ఎఫ్‌పీఐలను ఆకర్షించాయి’’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. మరోవైపు బీమా రంగ కంపెనీల రెండో త్రైమాసిక వ్యాపారంలో వృద్ధి స్వల్పంగానే నమోదైంది. ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య ఆరునెలల కాలానికి చూస్తే మాత్రం నూతన వ్యాపార ప్రీమియంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎస్బీఐ లైఫ్ నూతన వ్యాపార విలువలో 33 శాతం వృద్ధిని ఏప్రిల్ – సెప్టెంబర్ కాలంలో చూపించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నూతన వ్యాపార విలువ ఇదే కాలంలో 20 శాతం పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. -
ఫెడ్ నిర్ణయం, క్యూ4పై మార్కెట్ దృష్టి
ముంబై: లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఈ క్రమంలో సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే మూడు దశలు పూర్తవగా.. నేడు జరిగే పోలింగ్...ఎన్నికల చివరి అంకానికి దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ఉత్కంఠ మార్కెట్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు ఒడిదుడుకులు కూడా మరింత పెరుగుతాయి’ అని అన్నారయన. కొనసాగుతున్న పోలింగ్, కార్పొరేట్ కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు ఈవారంలో మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇకపై వెల్లడికానున్న కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండి.. ఇదే సమయంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే మాత్రం సమీపకాలంలోనే మన మార్కెట్లు అవుట్పెర్ఫార్మ్ చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి అంబుజా సిమెంట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కెన్ ఫిన్ హోమ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సర(2018–19) చివరి త్రైమాసిక ఫలితాలను మంగళవారం (30న) ప్రకటించనున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలైన బ్రిటానియా (బుధవారం), డాబర్ (గురు), హిందూస్తాన్ యూనిలివర్ (శుక్ర) ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఇదేవారంలో రిజల్స్ ప్రకటించనున్న ఇతర ప్రధాన కంపెనీల్లో.. టాటా కెమికల్స్, టాటా పవర్, ఫెడరల్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అజంతా ఫార్మా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనా¯Œ్స, రేమండ్, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌కు అత్యంత కీలకంకానున్నాయని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. ఫెడ్ సమావేశంపై మార్కెట్ ఫోకస్ వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈవారంలోనే సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో ఫెడరల్ ఓపె¯Œ మార్కెట్ కమిటీ ఈ అంశంపై చర్చించనుండగా.. ఈ సమావేశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం ప్రకటించనున్నారు. భారీ ఒడిదుడుకుల మధ్య క్రూడాయిల్ గతవారంలో 75 డాలర్లకు సమీపించి మార్కెట్‌కు ప్రతికూలంగా మారిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. వారాంతాన దిగొచ్చింది. శుక్రవారం 71.63 డాలర్ల వద్ద ముగిసింది. ఈ అంశం ఆధారంగా డాలరుతో రూపాయి మారకం విలువ 69.50–70.30 శ్రేణిలో ఉండేందుకు అవకాశం ఉందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా విశ్లేషించారు. ఈ వారంలో ట్రేడింగ్ 3 రోజులే.. ముంబైలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ఉన్న కారణంగా సోమవారం(29న) స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. ఆ తరువాత రోజైన మంగళవారం యథావిధిగా మార్కెట్ కొనసాగనుంది. అయితే, మళ్లీ బుధవారం(1న) మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఈ, ఎ¯Œ ఎస్ఈలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా ఈ వారంలో మార్కెట్లో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 1–26 కాలంలోనూ రూ.17,219 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
విదేశీ పెట్టుబడుల పరిమితులపై నోటిఫికేషన్
న్యూఢిల్లీ : బ్యాంకింగ్, రక్షణ మినహా వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులపై సంయుక్త పరిమితులకు సంబంధించి చేసిన మార్పులు, చేర్పులపై కేంద్రం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం కమోడిటీ ఎక్స్చేంజీలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, పవర్ ఎక్స్చేంజీలు మొదలైన వాటిల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడుల విషయంలో ఉప-పరిమితులేమీ ఉండవు. ఆయా రంగాల్లో పోర్ట్‌ఫోలియో లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అన్నింటికీ కలిపి ఒకే పరిమితి ఉంటుంది. అయితే, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌లో మాత్రం మొత్తం విదేశీ పెట్టుబడుల పరిమితి 74 శాతంగా ఉండగా, ఇందులో పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉప-పరిమితి 49 శాతంగా ఉంటుంది. అలాగే రక్షణ రంగంలోనూ ఆటోమేటిక్ మార్గంలో వచ్చే పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల పరిమితి 24 శాతంగా ఉంటుంది. ఇప్పటికే ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం దాకా విదేశీ పెట్టుబడులకు అనుమతులున్న రంగాలపై ఈ కొత్త పరిమితుల ప్రభావం ఉండబోదని పేర్కొంది.