domestic stocks
-
2 నెలల్లో లక్ష కోట్లు ఉఫ్!
కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తెగబడుతుండడంతో మార్కెట్లు పతనబాట పట్టాయి. 2024 అక్టోబర్ లో మొదలైన ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ నిరవధికంగా సాగుతోంది. దీంతో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఇండెక్సుల్లో భారీ కరెక్షన్ జరుగుతోంది.. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలు కొత్త గరిష్టస్థాయిల నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి. సుమారు మూడేళ్లపాటు సాగిన స్టాక్ మార్కెట్ బుల్ పరుగు గత ఏడాది చివరి త్రైమాసికం నుంచి స్పీడు తగ్గింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెంటిమెంట్ బలహీనపడి మార్కెట్లు లాభాల బాట నుంచి యూటర్న్ తీసుకుని నష్టాల ప్రయాణం మొదలు పెట్టాయి. దీంతో 2024 సెపె్టంబర్ 27న చరిత్రాత్మక గరిష్టాలను తాకిన నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా తగ్గుతూ ఇప్పటివరకూ 14 శాతం పతనమయ్యాయి. బేర్ ట్రెండ్‌వైపు మళ్లాయి! కారణాలు ఇవీ...మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్‌తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది. అధికారం చేపట్టాక భారత్‌సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్‌తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్‌పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు. నేలచూపుల తీరిదీ బీఎస్ఈ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ గత సెపె్టంబర్ 27న 85,978 వద్ద స్థిరపడింది. ఇదే రోజు నిఫ్టీ 26,277కు నిలిచింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. ఈ స్థాయి నుంచి నిఫ్టీ 3,730 పాయింట్లు(14 శాతం) పతనమైంది. సెన్సెక్స్ 11,376 పాయింట్లు(13 శాతం) కోల్పోయింది. వెరసి గతేడాది అక్టోబర్ నుంచి మార్కెట్లు బేర్ ట్రెండ్‌లో సాగుతున్నాయి. గత అక్టోబర్ మొదలు అమ్మకాలు కొనసాగిస్తున్న ఎఫ్‌పీఐలు కొత్త ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఫలితంగా ఈ జనవరి మొదలు ఇప్పటివరకూ సెన్సెక్స్ 3,537 పాయింట్లు(4.5 శాతం) పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ 1,097 పాయింట్లు(4.6 శాతం) వెనకడుగు వేసింది.నిపుణుల అంచనాలు నిజానికి మార్కెట్లలో నెలకొన్న దిద్దుబాటు పలు అంశాల కలయికతో జరుగుతుందని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. అధిక శాతం బ్లూచిప్ కంపెనీలు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. వీటికితోడు ట్రంప్ టారిఫ్ భయాలు, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమవుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ వివరించారు. దీంతో మార్కెట్లు సాంకేతికంగా బలహీనపడినట్లు చెప్పారు. చైనాతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఖరీదుగా ఉండటంతో ఎఫ్‌పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ పేర్కొన్నారు. భారీగా పుంజుకుంటున్న డాలరు, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి క్షీణత, ఖరీదుగా మారిన దేశీ ఈక్విటీలు ఎఫ్‌పీఐల అమ్మకాలకు కారణమనేది విశ్లేషకులు అభిప్రాయం.భారత్ బేర్ వర్ధమాన మార్కెట్లలో చూస్తే ప్రధానంగా ఆసియా దేశాలలో భారత్ నుంచే ఎఫ్‌పీఐలు అత్యధిక శాతం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, మలేసియా తదితర మార్కెట్లతో పోలిస్తే 2025 తొలి రెండు నెలల్లో దేశీ స్టాక్స్‌లో భారీగా విక్రయాలు చేపట్టారు. ఆసియా దేశాలను పరిగణిస్తే ఫిలిప్పీన్స్‌లో అతితక్కువ అమ్మకాలు నమోదుకాగా.. భారత్‌లో అత్యధిక విక్రయాలకు తెరతీశారు. నిజానికి గత మూడేళ్లలో ఎఫ్‌పీఐలను అత్యధికంగా ఆకట్టుకున్న భారత్ ఇటీవల పలు కారణాలతో పెట్టుబడులను కోల్పోతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఆసియాలో మెటల్స్ ఎగుమతులతో చైనా, ఎల్రక్టానిక్స్‌లో వియత్నాం వంటి దేశాలు ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లను అధికంగా ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ అంశంలో భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ తదితర పలు ఇతర కారణాలతో ఎఫ్‌పీఐలు విక్రయాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నేలచూపులు కొనసాగవచ్చు
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో బలహీనతలు కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రభావితం చేయగల కీలక అంశాలు కొరవడటంతో విదేశీ ఇన్వెస్టర్ల తీరుపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఇటీవల మరోసారి ఎఫ్‌పీఐలు కొనుగోళ్లను వీడి అమ్మకాల బాట పట్టడంతో సెంటిమెంటు దెబ్బతిన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. అయితే గత వారం భారీ అమ్మకాల కారణంగా ఈ వారం కొంతమేర కొనుగోళ్లకూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఉన్నట్టుండి ఎఫ్‌పీఐలు భారీ అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. విదేశీ అంశాలు... బుధవారం క్రిస్మస్ సందర్భంగా దేశీ స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. దీంతో మార్కెట్లలో విదేశీ అంశాలు కీలకంగా నిలవనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు. విదేశీ పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్ల తీరు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని అంచనా వేశారు. వీటికితోడు డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో ఆటుపోట్లకు అవకాశమున్నట్లు తెలియజేశారు.దేశీయంగా ప్రస్తావించదగ్గ ప్రధాన అంశాలు కొరవడటంతో యూఎస్ నిరుద్యోగ గణాంకాలు, కొత్త గృహాల విక్రయాలు, బాండ్ల ఈల్డ్స్, డాలరు ఇండెక్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగితే మార్కెట్లు మరింత నీరసించవచ్చని విజయకుమార్, గౌర్ తెలియజేశారు. డాలరుతో రూపాయి మారకం, ముడిచమురు ధరల కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేíÙంచారు. అయితే విదేశీ మార్కెట్లలోనూ క్రిస్మస్ సెలవుల కారణంగా యాక్టివిటీ తగ్గే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. గత వారమిలా... విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సె క్స్ 4,092 పాయింట్లు (5 శాతం) పతనమైంది. 82, 000 పాయింట్ల నుంచి 78,042కు దిగజారింది. ఇక ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ సైతం 1,181 పాయింట్లు (4.8 శాతం) కోల్పోయి 23,588 వద్ద ముగిసింది.ఎఫ్‌పీఐల యూటర్న్..గత రెండు వారాలుగా దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వచి్చన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గత వారం అమ్మకాల యూటర్న్ తీసుకున్నారు. తొలి రెండు రోజుల్లో రూ. 3,126 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు చివరి మూడు ట్రేడింగ్ సెషన్లలో రూ. 4,102 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దీంతో గత వారం నికరంగా రూ. 976 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయ్యింది. ప్రధానంగా ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడటానికితోడు 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ పుంజుకోవడం ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం దాదాపు 5 శాతం పడిపోయిన విషయం విదితమే. గత వారం ఎఫ్‌వోఎంసీ వడ్డీ రేట్లను అంచనాలకు అనుగుణంగా 0.25 శాతం తగ్గించినప్పటికీ 2025లో ద్రవ్యోల్బణ అదుపునకు వీలుగా కఠిన పరపతి విధానాలు అవలంబించనున్నట్లు ఫెడ్ చైర్మన్ పావెల్ పేర్కొనడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. అంతేకాకుండా దేశీ కార్పొరేట్ ఫలితాలు నిరాశపరచడం, జీడీపీ వృద్ధి నెమ్మదించడం తదితర అంశాలు జత కలసినట్లు జియోజిత్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ వివరించారు. -
కొనుగోళ్లకే ఎఫ్‌పీఐల ఓటు
గత నెలలో దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల(డిసెంబర్)లోనూ కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు రూ. 22,766 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నారు. ఇందుకు ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు ప్రభావం చూపుతున్నాయి. కాగా.. అక్టోబర్‌లో మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,017 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లోనూ నికరంగా 21,612 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెపె్టంబర్లో గత 9 నెలల్లోనే అధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
ఎఫ్‌పీఐల స్పీడ్
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా అమ్మకాల బాటలో సాగిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు. దేశీ స్టాక్స్‌లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. వెరసి ఈ నెల తొలి వారంలో ఎఫ్‌పీఐలు రూ. 24,454 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అక్టోబర్‌లో కొత్త రికార్డుకు తెరతీస్తూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లో కొంత వెనకడుగు వేసి రూ. 21,612 కోట్ల అమ్మకాలకు పరిమితమయ్యారు. అయితే సెపె్టంబర్లో అంతక్రితం 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇకపై యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు, వడ్డీ రేట్లు, రాజకీయ భౌగోళిక అంశాల ఆధారంగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు నమోదుకానున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. -
నిఫ్టీ–500 స్టాక్స్‌లో డీఐఐల వాటా డౌన్
ముంబై: దేశీ స్టాక్స్‌లో ఓవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులకు దిగుతుంటే.. మరోపక్క దేశీ ఫండ్స్(డీఐఐలు) అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో గతేడాది (2020– 21) చివరి త్రైమాసికంలో నిఫ్టీ–500 ఇండెక్సులో భాగమైన కంపెనీలలో ఎఫ్‌పీఐల వాటా పుంజుకోగా.. డీఐఐల వాటా డీలా పడింది. వెరసి జనవరి–మార్చి(క్యూ4)లో డీఐఐల వాటా 0.5 శాతం క్షీణించి 14.2 శాతానికి పరిమితమైంది. ఇది గత 7 త్రైమాసికాలలో కనిష్టంకావడం గమనార్హం. ఇక ఇదే కాలంలో ఎఫ్‌పీఐల వాటా 1.6 శాతం బలపడి 22.3 శాతానికి చేరింది. బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్రోడీకరించిన గణాంకాలివి. ఇతర వివరాలు చూద్దాం.. క్యూ3తో పోలిస్తే వార్షికంగా చూస్తే నిఫ్టీ–500 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా 20.7 శాతం నుంచి 1.6 శాతం పుంజుకోగా.. డీఐఐల వాటా 14.7 శాతం నుంచి 0.5 శాతం క్షీణించింది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్) తో పోలిస్తే ఎఫ్‌పీఐల వాటా 0.2 శాతం వెనకడుగు వేయగా.. డీఐఐల వాటా సైతం 0.1 శాతం నీరసించింది. క్యూ4లో ఎఫ్‌పీఐలు 7.3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో డీఐఐలు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. రంగాల వారీగా గత రెండు త్రైమాసికాలలో ఎఫ్‌పీఐలు టెలికం, మెటల్స్, కన్జూమర్ డ్యురబుల్స్, రియల్టీ, సిమెంట్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వగా.. డీఐఐలు ఈ రంగాలలో అధిక అమ్మకాలు చేపట్టాయి. కన్జూమర్, హెల్త్‌కేర్, ప్రభుత్వ బ్యాంకులను పెట్టుబడులకు ఎంచుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్చికల్లా ఎఫ్‌పీఐల వాటా 22.3 శాతానికి ఎగసింది. ఇది కోవిడ్–19 తలెత్తకముందు స్థాయికావడం గమనార్హం! గతేడాది ద్వితీయార్థంలో ఎఫ్‌పీఐలు నిఫ్టీ–500 ఇండెక్స్‌లోని 286 కంపెనీలలో వాటాలు పెంచుకున్నాయి. నిఫ్టీ–50లో 32 కంపెనీలున్నాయి. ఈ బాటలో డీఐఐలు 203–18(నిఫ్టీ) స్టాక్స్‌లో వాటాలు కొనుగోలు చేశాయి. ఇదే కాలంలో ఎఫ్‌పీఐలు 203–18 కంపెనీలలో వాటాలు తగ్గించుకోగా.. డీఐఐలు 271–31 స్టాక్స్ పెట్టుబడుల్లో వెనకడుగు వేశాయి. విలువ రీత్యా నిఫ్టీ–500 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా విలువ 593 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రయివేట్ బ్యాంక్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 139 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు డీఐఐల వాటాల విలువ 378 బిలియన్ డాలర్లకు చేరగా.. ప్రయివేట్ బ్యాంక్స్‌లో పెట్టుబడులు 59 డాలర్లుగా నమోదయ్యాయి. ఈ బాటలో టెక్నాలజీ స్టాక్స్ వాటా విలువ 43 బిలియన్ డాలర్లను తాకగా, కన్జూమర్ విభాగంలో 40 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ప్రయివేట్ బ్యాంక్స్‌లో ఎఫ్‌పీఐలు 47.9% ఓనర్‌షిప్‌ను కలిగి ఉన్నారు. ఈ బాటలో ఎన్బీఎఫ్సీలలో 32.9 శాతం, ఆయిల్, గ్యాస్‌లో 23.1 %, బీమాలో 22.2 శాతం, రియల్టీలో 21.5% ఓనర్‌షిప్‌ను పొందారు. డీఐఐలు క్యాపిటల్ గూడ్స్ (21.9%), ప్రయివేట్ బ్యాంక్స్(20.4%), మెటల్స్ (18.3%), కన్జూమర్ డ్యురబుల్స్ (17.8%), పీఎస్బీ(17.6%)లలో ఓనర్‌షిప్‌ను కలిగి ఉన్నాయి. ఇటీవల డీఐఐలు అత్యధికంగా(1 శాతానికిపైగా) వాటా పెంచుకున్న కంపెనీల జాబితాలో బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేరాయి. -
కొరతను అధిగమిస్తేనే.. భవిత
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్టీ మార్కెట్ మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది. మౌలిక, గృహ నిర్మాణ రంగాల్లో నైపుణ్యమున్న సిబ్బంది దొరకడం గగనమవుతోంది. దీంతో ప్రధాన నగరాల్లో భారీ నిర్మాణాలు 12–18 నెలలు ఆలస్యమవుతున్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు వంటివారి కొరత సుమారు 30 శాతం దాకా ఉందని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ, నగరాల్లో పనిచేసే యువత మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడట్లేదు. దీంతో ఒడిశా, బిహార్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారిని మౌలిక, నిర్మాణ రంగాల్లో నియమించుకోక తప్పని పరిస్థితి. అయితే బిహార్ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ జీడీపీ పెరిగితే గనుక.. వీరంతా స్వస్థలాలకు వెళ్లిపోయే అవకాశముంది. వివిధ ప్రభుత్వ పథకాల కారణంగా కార్మికుల కొరత అధికమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరేం చేయాలి.. మానవ వనరుల కొరతను అధిగమించడానికి సాంకేతిక పరిజ్ఞానం వైపు వేగంగా అడుగులు వేయాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా నిర్మాణాల్ని చేపట్టేవారికి ప్రభుత్వం పన్ను రాయితీలను, ప్రోత్సాహకాలను అందించాలి. మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం తీసుకుంటే.. సుమారు 40 కిలోలుగా ఉంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 150–200 కిలోలుగా ఉంటుంది. ఉక్కు నిర్మాణాల్ని కడితే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ బెండర్ల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. కేంద్రం, ఉక్కు తయారీ సంస్థలు, నిపుణులు కలసి ఈ తరహా నిర్మాణాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. నిపుణుల వ్యత్యాసం ఎంతంటే.. ప్రస్తుతం మౌలిక, నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది పనివారు అందుబాటులో ఉండగా.. వీరిలో కేవలం 2 కోట్ల మందికే నైపుణ్యం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా సివిల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్ల విషయానికొస్తే గిరాకీ, సరఫరా మధ్య వ్యత్యాసం 82–86 శాతంగా ఉంది. వచ్చే పదేళ్లలో 40 లక్షల మంది సివిల్ ఇంజినీర్లు అవసరముంటుంది. ఇందుకుగాను ప్రస్తుతం 6.42 లక్షల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. 3.96 లక్షల మంది ఆర్కిటెక్ట్‌ల స్థానంలో 65 వేల మంది, 1.19 లక్షల మంది ప్లానర్ల స్థానంలో 18 వేల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. నిపుణుల కొరతతో పాటు గిరాకీ పెరుగుతూనే ఉంది. మొత్తానికి 2020 నాటికి 45 లక్షల మంది నిపుణులు అవసరముంది. గిరాకీ–సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తగ్గించకపోతే ఆర్ధిక అభివృద్ధి క్షీణిస్తుంది. ఫలితంగా అధిక సొమ్ము చెల్లించి విదేశాల నుంచి నిపుణుల్ని దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. -
మార్కెట్ ఇంకా పెరుగుతుందా!
దేశీ స్టాక్‌మార్కెట్ల వేల్యుయేషన్ అధికంగా ఉందా లేక తక్కువగా ఉందా అన్నది పక్కనపెడితే గత కొన్నాళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తుంటే మార్కెట్లు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలతో భారీ సంస్కరణలపై ఆశలు మొలకెత్తాయి. ద్రవ్యోల్బణం, రుతుపవనాలు, ప్రాజెక్టుల అమలు వంటి కొంత మేర ప్రతికూలాంశాలతో ఇన్వెస్టర్లలో ఊగిసలాట ధోరణి ఉన్నప్పటికీ మొత్తం మీద సానుకూల పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ బుల్ మార్కెట్ ప్రారంభ దశలో ఉండే సంకేతాలే. ఇన్వెస్ట్మెంట్కి అవకాశాలే. పరిశీలించి చూడగా కొన్ని అంశాలు దీనికి ఊతమిస్తున్నాయి. మొదటి అంశం విషయానికొస్తే.. మార్కెట్లు చక్రీయ నమూనా రికవరీ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నాయి. ఇలాంటప్పుడు ఒత్తిడిలో ఉన్న రంగాల కంపెనీల ఆదాయార్జనా సామర్ధ్యాలను విశ్లేషకులు పూర్తి స్థాయిలో అంచనా వేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే, అంచనాలకు భిన్నంగా క్రమక్రమంగా ఈ తరహా సంస్థలు మెరుగైన ఆదాయాలను ఆర్జించడం మొదలవుతుంది. రుణభారం తగ్గించుకుంటూ మెల్లగా ఈక్విటీ విలువను గణనీయంగా పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. సాధారణంగా ఇలాంటి పరిణామాలను మార్కెట్లు పూర్తి స్థాయిలో అంచనా వేయలేవు. మరోవైపు, ద్రవ్యోల్బణ కట్టడిపరంగా ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల ఫలితాలు ఇప్పటికే కనిపించడం మొదలైంది. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత తగ్గగలదు. ఫలితంగా మార్కెట్లు ఊహిస్తున్న దానికంటే వేగంగా వడ్డీ రేట్లు తగ్గొచ్చు. సాధారణంగా మార్కెట్ విశ్లేషకులు ఇటువంటి పరిణామాలను దీర్ఘకాలిక దృష్టితో కాకుండా తాత్కాలిక కోణంలో మాత్రమే చూస్తుంటారు. అలా కాకుండా కాస్త మెలకువగా వ్యవహరిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశాలు లభించగలవు. ఇవే కాకుండా టెక్నాలజీ రాకతో భారత్‌లో కొంగొత్త వ్యాపారాలు పుట్టుకురానున్నాయి. ఇవి ప్రారంభ దశలో ఉన్నప్పుడే సరైన వ్యాపారాన్ని గుర్తిస్తే మెరుగైన లాభాలను కూడా గడించవచ్చు. ఇటు సంపన్న, అటు వర్ధమాన దేశాలన్నీ చూసినా కూడా పెట్టుబడులను పెట్టేందుకు అనువైన దేశాల్లో ప్రస్తుతం భారత్‌ను మించి మరొకటి కనిపించడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే డాలరు మారకం విలువ బలపడి, రూపాయి క్షీణించినా.. ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా భారత మార్కెట్ల నుంచి విదేశీ నిధులు తరలి వెళ్లిపోకపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు, దేశీ మార్కెట్లు మరింత ఎగసేందుకు పుష్కలంగా అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.