ఈ వారం ప్రభావిత అంశాలు కరవు...
డాలర్ ఇండెక్స్, బాండ్ల ఈల్డ్స్ కీలకం
విదేశీ ఇన్వెస్టర్ల తీరుపై ఇన్వెస్టర్ల దృష్టి
ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం
స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌పై విశ్లేషకులు
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో బలహీనతలు కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రభావితం చేయగల కీలక అంశాలు కొరవడటంతో విదేశీ ఇన్వెస్టర్ల తీరుపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఇటీవల మరోసారి ఎఫ్‌పీఐలు కొనుగోళ్లను వీడి అమ్మకాల బాట పట్టడంతో సెంటిమెంటు దెబ్బతిన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. అయితే గత వారం భారీ అమ్మకాల కారణంగా ఈ వారం కొంతమేర కొనుగోళ్లకూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఉన్నట్టుండి ఎఫ్‌పీఐలు భారీ అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు.
విదేశీ అంశాలు...
బుధవారం క్రిస్మస్ సందర్భంగా దేశీ స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. దీంతో మార్కెట్లలో విదేశీ అంశాలు కీలకంగా నిలవనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు. విదేశీ పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్ల తీరు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని అంచనా వేశారు. వీటికితోడు డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో ఆటుపోట్లకు అవకాశమున్నట్లు తెలియజేశారు.
దేశీయంగా ప్రస్తావించదగ్గ ప్రధాన అంశాలు కొరవడటంతో యూఎస్ నిరుద్యోగ గణాంకాలు, కొత్త గృహాల విక్రయాలు, బాండ్ల ఈల్డ్స్, డాలరు ఇండెక్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగితే మార్కెట్లు మరింత నీరసించవచ్చని విజయకుమార్, గౌర్ తెలియజేశారు. డాలరుతో రూపాయి మారకం, ముడిచమురు ధరల కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేíÙంచారు. అయితే విదేశీ మార్కెట్లలోనూ క్రిస్మస్ సెలవుల కారణంగా యాక్టివిటీ తగ్గే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.
గత వారమిలా...
విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు డీలా పడ్డాయి. బీఎస్‌ఈ సెన్సె క్స్ 4,092 పాయింట్లు (5 శాతం) పతనమైంది. 82, 000 పాయింట్ల నుంచి 78,042కు దిగజారింది. ఇక ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్ నిఫ్టీ సైతం 1,181 పాయింట్లు (4.8 శాతం) కోల్పోయి 23,588 వద్ద ముగిసింది.
ఎఫ్‌పీఐల యూటర్న్..
గత రెండు వారాలుగా దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వచి్చన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గత వారం అమ్మకాల యూటర్న్ తీసుకున్నారు. తొలి రెండు రోజుల్లో రూ. 3,126 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు చివరి మూడు ట్రేడింగ్ సెషన్లలో రూ. 4,102 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దీంతో గత వారం నికరంగా రూ. 976 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయ్యింది. ప్రధానంగా ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడటానికితోడు 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ పుంజుకోవడం ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం దాదాపు 5 శాతం పడిపోయిన విషయం విదితమే. గత వారం ఎఫ్‌వోఎంసీ వడ్డీ రేట్లను అంచనాలకు అనుగుణంగా 0.25 శాతం తగ్గించినప్పటికీ 2025లో ద్రవ్యోల్బణ అదుపునకు వీలుగా కఠిన పరపతి విధానాలు అవలంబించనున్నట్లు ఫెడ్ చైర్మన్ పావెల్ పేర్కొనడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. అంతేకాకుండా దేశీ కార్పొరేట్ ఫలితాలు నిరాశపరచడం, జీడీపీ వృద్ధి నెమ్మదించడం తదితర అంశాలు జత కలసినట్లు జియోజిత్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment