హిమాయత్‌నగర్: ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి 60 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన మేరకు.. నగరానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఓ లింక్ వచి్చంది. ఆన్‌లైన్ ట్రేడింగ్, ఐపీఓలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో బాధితుడు తన ఆధార్, పాన్ కార్డ్ వివరాలతో ట్రేడింగ్ అకౌంట్‌ను తెరిచాడు. మొదటగా సైబర్ కేటుగాళ్లు చెప్పిన విధంగా రూ.50,000 డిపాజిట్ చేశాడు. నకిలీ ట్రేడింగ్ ఖాతాలో లాభాలు వచి్చనట్లు చూపించారు.
అది నమ్మిన బాధితుడు బల్క్ ట్రేడింగ్‌లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. 30 రోజులు స్టాక్స్ కలిగి ఉంటే, మంచి లాభాలు వస్తాయని మరోసారి నమ్మించారు. 30 రోజుల అనంతరం బాధితుడు లాభాలు కలిపి మొత్తం రూ.79 లక్షలు చూపించారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రయత్నం చేయడంతో సాధ్యం కాలేదు.విత్ డ్రా చేసుకోవాలంటే మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని, కమీషన్ ఇతర చార్జీల పేరుతో మరింత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఒత్తిడి చేశారు.
అప్పటికే బాధితుడు మొత్తం రూ.20,75,000 పంపిచడంతో ఇంకా డబ్బు పంపిచడం వీలుకాదని తేల్చిచెప్పడంతో కేటుగాళ్లు బాధితుడి ట్రేడింగ్ ఖాతాను కూడా బ్లాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment